3, జులై 2012, మంగళవారం

ఈ శుభలేఖ చూడండి..







తుమ్మెద మంత్రం చదువుతూ ఉంటే.. కోయిల మేళం వాయిస్తుంటే.. చిలకమ్మా పెళ్లి కూతురాయేనే..గోరింక పెళ్లి కొడుకాయెనే..
అంటూ .. ఓ.. ఆత్మీయ ఆహ్వానం అందుకున్నాను.






ఈ శుభలేఖ చూడండి..ఎంత బాగుందో..!! నాకు బాగా నచ్చింది.
చక్కని వాతావరణం ఆత్మీయమైన కుశల ప్రశ్నలు, ప్రేమ పూర్వక ఆహ్వానం..





అలాగే.. శుభలేఖ వెనుకవైపున ..
మన వంశ అభివృద్దికి మూలమైన పెద్దవారిని స్మరించుకుంటూ..
మంచి.. పద్యమును.. అందించారు.
ఎంత చక్కని అర్ధం ఉన్న పద్యమో..!

".........ప్రేమ
పెన్నిదిగాని, ఇంటను నేర్ప
రీ కళ, ఒజ్జలెవ్వరు లేరు
శాస్త్రము లిందు గూరిచి తాల్చే
మౌనము.."
" ...సతుల సౌరను
కమలవనమునకు పతుల ప్రేమయే
నే వెలుగు ప్రేమ కలుగక బ్రతుకు
చీకటి"
(ప్రేమ విద్దెకు వోనమాలిని)

"మరులు ప్రేమని మది దలంచకు
మరులు మరులును వయసు తోడనే
మాయామర్మంలేని నేస్తము
మగువలకు మగవారికి కొక్కటే
బతుకు సుకమునకు రాజమార్గము
ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును
ప్రేమ నిలిచిన ప్రేమ నిలుచును.

(గురజాడ అప్పారావు గారు)

2, జులై 2012, సోమవారం

ఆశ్చర్యం !!?



వేయి పడగల మీద కోటి మడుగుల నేల మోసి అలసిన స్వామి ..మోపిదేవి స్వామి..
హరుని కంఠం వీడి హరిని నిదుర లేపి కదలిరా..

అన్నది మన తెలుగు పాట..

పై చిత్రం లో చూసిన బహుముఖ నాగరాజులని అప్పుడప్పుడు.. యూ ట్యూబ్ లో చూస్తుంటాను.

అవన్నీ మనిషి కల్పిత చిత్రాలు అనుకున్నాను. వివరంగా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు.

ఈ రోజు ఈ చిత్రం చూసి ఆశ్చర్య పోయాను. నమ్మలేకపోయాను. కానీ ఇంత స్పష్టమైన ఆధారాలు కనబడుతుంటే నమ్మాలి కదా!

శ్రీశైలం ఘాట్ రోడ్ లో .. కనిపించిన ఈ నాగరాజుని ఆసక్తిగాను,ఆశ్చర్యం గాను చూడటానికి, కెమెరాలలో బంధించడానికి
ఇంత మంది ప్రత్యక్ష్య సాక్ష్యం కనబడుతుంటే!

మాకు తెలిసిన వారి మిత్రులు ఇటీవల "శ్రీశైలం"వెళ్ళినప్పుడు కనబడిన విశేషం ఇది.
వారు కెమెరాలో బంధించి తీసుకుని వచ్చిన చిత్రం ని .. ఇలా షేర్ చేసుకుంటున్నాను.
శ్రీశైల శిఖరం అంతా శివమయం.

ఆ నాగా భరుణుడి కంఠం వీడి.. ఆ భుజంగ భూషణుడి..దేహమును వీడి.. నన్ను చూడండీ అంటూ.. జనులకు దర్శన భాగ్యం కల్గించావా.. నాగ రాజా.. !? అన్నట్లు లేదు. ఈ పిక్ లో నిజమెంతో..అబద్దమేంతో..నాకు తెలియదు కాని.. చాలా ఆసక్తిగా ఉంది.

ఇలా షేర్ చేసుకోవడం కూడా ఆ ఆసక్తిలో భాగమే! మన మిత్రులెవరైనా.. ఇలాటి నాగ జాతుల గురించి చెపుతారేమో..చూద్దాం.


1, జులై 2012, ఆదివారం

" హేమంత" కోసం..



మా (అప్పు) "హేమంత" కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మా అప్పు సీనియర్ ఇంటర్ చదువుతుంది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మి కూడా.. అప్పు మా చెల్లి కూతురు. సమానస్థాయి ఆలోచనలు కల మా ఇద్దరి మధ్య ఘన సమయాలు దొర్లిపోతుంటాయి.

నేను "నలిగే దారి " కవిత వ్రాసి బ్లాగ్లో పోస్ట్ చేసినప్పుడు.. ఇదేమిటి ..పెద్దమ్మా.. నువ్వు రాబర్ట్ ఫ్రోస్ట్ లాగా "ది రోడ్ నాట్ టేకెన్ " గురించి వ్రాయాలి కాని..అని కామెంట్ చేసింది.

అలాగే ఖలిల్ గిబ్రాన్ ఆన్ చిల్డ్రన్స్ గురించి చెప్పినప్పుడు.. ఫ్రెండ్ షిప్ గురించి చెప్పింది.

మా బంగారు తల్లి "చదువుల సరస్వతి " విజ్ఞాన ఖని.

నేను ఇంటర్ మీడియట్ తర్వాత బ్లాగ్ వ్రాస్తానని.. చెప్పింది. అందుకే "నిగమ " బ్లాగ్ మా పిల్లల కోసమే ఓపెన్ చేసాను.

మా అప్పు నిండు నూరేళ్ళు ఆయువారోగ్యములతో... నిత్య సుఖ సంతోషాలతో.. యశస్వి భవగా .. వర్ధిల్లాలని కోరుకుంటూ.. ప్రేమతో,దీవెనలతో.. హృదయపూర్వకంగా తెలుపుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు.

మా బంగారు తల్లికి మంచి మనసులున్న మీ అందరి దీవెనలు లభించాలని .. ఈ పోస్ట్.