24, నవంబర్ 2014, సోమవారం

A Mother Wish



చిన్ని..! బంగారం.. !!  

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..

చైతన్యవంతమైన జీవన గమనం తో.. 
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ.. 
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో 
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ.. 

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ... 
హృదయపూర్వక శుభాకాంక్షలు .. ప్రేమతో  "అమ్మ "





11, నవంబర్ 2014, మంగళవారం

పార్టీషన్స్ Vs పార్టనర్



భారతీయ స్త్రీల ప్రేమలో పార్టీషన్స్ ఉంటాయి కానీ పార్టనర్స్  (ఉండరు) ఉంటారా?  


స్త్రీ ప్రకృతి కి మరో రూపం . మనో బాహ్య పర్యావరణం అంతా ప్రేమ మయం .  పురుషుడిలో ఆమె సహ భాగం అదే అర్ధనారీశ్వర తత్త్వం . ఈ ఆకళింపు తోనే వాస్తవ పరిస్థితులను బట్టి ఈ పోస్ట్ వ్రాయాలనిపించింది 


నేను "ఆరెంజ్"  చిత్రం బాగా బాగా నచ్చిందని చెపితే కొందరు నన్ను విచిత్రంగా చూసారు . మరి కొందరు "మాకంతగా బాగా  అనిపించలేదే !? అంటూనే మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూస్తాం" అన్నారు .

 

ప్రేమ ఎప్పుడూ శాశ్వతంగా, స్థిరంగా ఒకరి పైనే ఉండటం సాధ్యం కాదు . ఈ కాన్సెప్ట్  అందరికి అర్ధమైనా అందరూ ఒప్పుకోరు కదా! 

కేవలం ఒకరే ఒకరిని శాశ్వతంగా ప్రేమించడం అనేది సాధ్యం కానిపని. అలా అని చెప్పారంటే అది అతిశయం అన్నా కావాలి లేక మోసం చేసుకుంటున్నారని అయినా అనుకోవాలి.  అన్నీ నిజాలు మాట్లాడే "ఆరెంజ్ " హీరో నచ్చాడు .  ఆఖరికి అదే హీరో  సినిమా ఆఖరిలో వివాహానికి  కట్టుబడి ఉండటానికి ఒప్పుకోవడం నచ్చింది  


ఇందాకనే "చిన్నారి పెళ్ళి కూతురు " చూసి కనులు చెమర్చాయి . అనుబంధాలు ఎంత సున్నితమైనవి . ఒక చోట తెగి పోయి మరొక చోట పెనవేసుకుంటాయి . 


ఒంటె కి  కడుపులో నాలుగు భాగాలు ఉంటాయట. అలాగే స్త్రీ జీవితంలో (ప్రేమలో ) కూడా అనేక భాగాలు  ఉంటాయి 

జన్మనిచ్చిన  తల్లిదండ్రులని, తోబుట్టువులని, ఇంటిని, తువ్వాయిలని , పువ్వులని అన్నింటిని ఎంతగానో ప్రేమిస్తారు . మూడుముళ్ళు పడగానే భర్తని ప్రేమిస్తారు. అత్తింట్లో అడుగుపెట్టాక అందరిని తనవారిగా భావిస్తూ అనుబంధం పెంచుకుంటారు . తర్వాత పుట్టిన బిడ్డలని ప్రాణప్రదంగా ప్రేమిస్తారు . తర్వాత బిడ్డలా బిడ్డలని ప్రేమిస్తారు . స్త్రీ ప్రేమ ఇలా రూపాంతరాలు చెందుతూ  వృద్దిలో ఉంటుంది. 


అందుకే  స్త్రీ లైఫ్  లో పార్టీషన్ ఉంటాయి కానీ పార్టనర్స్ ఉండరు . " పార్టనర్స్ "  ఉండటానికి లైఫ్ ఏమి బిజినెస్ ఎగ్రిమెంట్ కాదు కదా ! 

అందుకే .. లైఫ్ పార్టనర్ అంటారు . పురుషుడికి కూడా లైఫ్ పార్టనర్ "యే"  ఉండాలి "లు " కాదు ఉండాలంటే ఉతికి ఆరేసేయాలి 

మనభారతీయ సంప్రదాయం "ధర్మేచ, అర్ధేచ , కామేచ,  త్య యేషా  నాతి చరితవ్యా , నాతి  చరామి" అర్ధం కూడా ఇదే కదా ! 


 పార్టనర్స్ ని  మెయిన్ టైన్  చేసే మహానుభావలకి / మహాను భామిని లకి   ఈ అర్ధం తెలియక కాదు. ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు వారికి. అందుకోసం కట్టుకున్న దానిని / వాడిని నట్టేట్లోనూ ముంచేస్తారు. అవమానాల పాలు చేస్తారు . వీరిది ఆకర్షణ అనాలా !? మరి నిజమైన ప్రేమ అనాలా?  వీరిని ఆమోదించే తల్లిదండ్రులు వారి పరివారానికి ఆత్మ విమర్శ చేసుకుంటే ఈ సత్యాలు బోధపడకమానవు. 


అయినా "మన వాళ్ళు చేస్తే మనకి అసలు తప్పు కాదు " మన పిల్లలకి ఇలాంటి స్థితి వస్తే  ఇటివంటివి తప్పు.  ఎప్పుడు మారతారు రా బాబూ  ఈ జనం !?     


అసలైన ప్రేమ రూపం ఏమిటి ? ఇలా ప్రశ్నలు  వేసుకుని ఆలోచన చేసి  చూడండి.  ఒకే ఒక ప్రేమ ఎందుకు సాధ్యం కాదో కూడా తెలుస్తుంది   వివేకం తో  తన కుటుంబంతోనే ప్రేమని ఎలా విస్తరింప జేసుకోవాలో చెపుతుంది తప్ప తగని వ్యామోహాలకి, పైత్యాలకి   "ప్రేమ" అనే పేరు పెట్టుకోవద్దని చెపుతుంది. ప్రేమ అనేది ఎండమావి లాంటిదని  చెపుతుంది.


  "ఎన్నాళ్ళు ప్రేమిస్తానో తెలియదు, ఎప్పుడూ కలసి ఉంటానని చెప్పలేను" అనే నిజాయితీ పరుడు కూడా కమిట్ అయి పెళ్ళికి అంగీకరిస్తాడు . దటీజ్ మేరేజ్ కమిట్ మెంట్ అందుకే  "ఆరెంజ్ " చిత్రాన్ని ఇంకోసారి చూసేయండి.   :)  ఎందుకు నచ్చలేదో , నచ్చిందో మీలోనే దాచేసుకోండి . నా అభిప్రాయంతో ఏకీభవించక పోయినా పర్లేదు . 


29, అక్టోబర్ 2014, బుధవారం

ఏక్ దిల్ వాలాకి... దర్ద్



ఇది ఒక హిందీ చిత్రంలో పాట . (క్లూ .. ఇంత  వరకే ) 

*********************


ఈ పాట  పరిచయానికి ముందు .. క్రిందటి పోస్ట్  "ఓ .. గీతం వెనుక "    తర్వాత  ఈ వివరణ. నచ్చిన  పాట  పరిచయం.


చాలా కాలం తర్వాత  ఓ  పాట  నన్ను బ్లాగ్ లో ఓ  పోస్ట్  వ్రాయించింది ఆ పాట  ఎప్పుడూ  వింటూ ఉంటాను . ఎందుకో ఈ రోజు ఆ పాట  వింటూంటే .. చూస్తూంటే  భావేద్వేగంతో  కదిలిపోయాను . ప్రతి  గీత రచన వెనుక ఆ కవి భావేద్వేగం  ఉండకపోవచ్చు . ఆతను  సాధారణంగానే వ్రాసి ఉండవచ్చును. కానీ తెరపై ఆ గీతం కథకి  సంబంధించినదై .. చూస్తున్న ప్రేక్షకుడిని కదిలిస్తుందన్నది  నిజం.  ఈ పాట  చూస్తున్నప్పుడూ నేను అలాగే ఫీల్ అయ్యాను . కన్నులు చెమర్చాయి.  ప్రసంగంలో పాటలో  నటుడి నటన నభూతో  న భవిష్యత్.


ఆ పాటకి ముందు సభని ఉద్దేశించి .. ఈ మాటలు ఉంటాయి . (అది ప్రసంగం కాదు అతని దృష్టిలో )


నేను ఒక నాయకుడు, రాజకీయవేత్త, సమాజ సేవకుడు ని కాదు ఇతరుల నుండి పేరు పొందటం  కోసం ఈ టికెట్ కొనడడానికి. నాకు నా ప్రతిభా పాటవాలని, నా గొప్పలు మీ మీద రుద్దబడ తాయని, చప్పట్లతో స్వాగతిస్తారని .పూలమాలతో అలంకరిస్తారని  తెలిస్తే బహుశా నేనెప్పటికీ  ఇక్కడికి వచ్చేవాడిని కాదు.


ఒక సోదరుడు ఇంకొక సోదరుడి కడుపు నింపుతాడు అంటే అతడు తన బాధ్యత నిలబెట్టు కుంటున్నట్టు. అది ఇతరులపై దయ చూపడం కాదు. నేను ఈ (అనాధ పిల్లలకి) నిరాశ్రయులకి కొంచెం ఇచ్చానంటే అది నా వారి కోసం, నా సోదరుల కోసం ఇచ్చినట్లు. ఎందుకంటే నేను కూడా వీరిలాగే  ఒక నిరాశ్రయుడినే.  ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ ఒడి లేదు, నాన్న నీడ లేదు, 

పుట్ పాత్  ఒడి, ఆకలి పేదరికమే తోడు నాకు.


నా ఒంటరితనం, తన్నులు, సమాజం నుండి ఛీత్కారాలు, ప్రజల తిట్లు, ఇలాంటి స్థితిలో నా బాధను పంచుకునే  వారు ఒకరు దొరికారు ‘. వారికి నా పరిస్థితి మీద జాలి కలిగింది. ప్రేమతో వారు నా తలపై చేయి వేసారు. నేను ఏడుస్తూ ఉండిపోయాను. వారు పాట  పాడి నా గాయపడిన హృదయానికి మందు పూసారు.  ఆ (ఓదార్పు ) మందు ప్రభావం వల్ల నేను  బతికి ఉన్నాను . లేదంటే ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని. ఆ పాట .. ఆ పాట  గాయపడిన  నా హృదయాంతరాలలో   ఇంకా వినిపిస్తూనే ఉంది. మరచి పోలేదు నేను.


నేనెప్పుడూ  ఆ పాటని గల్లీలోనూ , చౌరస్తాలలోనూ  పాడనూ  లేదు. కానీ అప్పుడప్పుడూ నేను పోగొట్టుకున్న వారు,నా బాధను పంచుకున్న వారు గుర్తు వచ్చినప్పుడు, జీవితం పట్ల విరక్తి కల్గినప్పుడూ అప్పుడప్పుడూ (కూనిరాగం ) పాడుకుంటాను . ఈ రోజు నేను అదే పాట  మీరు అనుమతి ఇచ్చినట్లయితే  మీ ముందు వుంచుతాను.


 మళ్ళీ  ఇక్కడ విషయం  ఆపేసి  బ్లాగర్ ని  మీ ముందుకు వచ్చేసానండోయ్!   ఇక్కడి దాకా వ్రాసానా..  😊ఇక్కడ ఒక చిలిపి ఆలోచన వచ్చింది . ఈ  సంభాషణ  ఏ పాటకి ముందు వుందో   ఏ చిత్రం లో ఉందొ .. ఊహించండి.


*********************


రెండో భాగంగా  పాట పరిచయం


నా కెంతో  ఇష్టమైన "muqaddar ka sikandar " చిత్రంలో   ఓ...సాతిరే  పాట


కళ్యాణ్  జీ - ఆనంద్ జీ  స్వరకల్పన  అమితాబ్ నటన ..పోటాపోటీగా ఉంటాయి.  పాట పదే  పదే  వెంటాడక మానదు


 ఈ పాట  స్వరకల్పన  పై ఒక వివాదాస్పద వ్యాఖ్య కూడా ఉంది .


 "నజరత్ పతే  ఆలీఖాన్ " దాతా పియా లిల్లహ్ కరమ్ ఆజ్ కర్దే  .. ట్యూన్  ఆధారంగా  స్వరకల్పన చేసారని .. 


అనంత సంగీతసృష్టిలో అనేకానేక స్వరాలూ కలగాపులగం కాకమానవు. కొంతమంది సృజనని అనుసృజని చేసి అంతకన్నా మంచి సంగీతాన్ని అందించిన తీరు జనులకి హర్షణీయమే కదా,  ఎందుకు ఈ వివాదాలు అనిపించింది. ఏది ఏమైనా పండిత పామరులను రంజింపజేసే సంగీతానికి అందరూ బానిసలమే కదా !


ఈ పాట  వింటున్నప్పుడు .. కిషోర్ కుమార్  గళం  భావాలు  ఒలికించిన  తీరు కి " ఫిదా " అయిపోయాను.


అంజాన్  గీత రచన గొప్పతనం తెలియాలంటే మూలమైన  హిందీ లోనే ఆ పాట సాహిత్యాన్ని ఆస్వాదించడం మంచిది. అంత మధురంగా ఉంటుంది .



ఇక ఈ పాట  సాహిత్యాన్ని  అనువదించే  ప్రయత్నం ఇది ..


ఓ  సహచరీ  (చెలియా) నీవు లేకుండా ఈ  జీవించడం అసలు జీవించడమేనా?


పూవుల్లో, మొగ్గల్లో, స్వప్న వీధుల్లో..

నీవు లేకుండా  ఎక్కడా ఏమీ లేదు

నీవు లేకుండా ఈ జీవించడం అసలు జీవించడమేనా?


ఓ  సహచరీ  (చెలియా)… నీవు లేకుండా ఈ  జీవించడం  జీవించడమేనా?


 ప్రతి గుండె చప్పుడు లో  నీ దాహం ఉంది 

ప్రతి శ్వాసలో నీ పరిమళమే నిండి ఉంది

ఈ భువి  నుండి ఆ ఆకాశం  వరకు

నా చూపుల్లో  (వీక్షణ లో )  నీవు మాత్రమే ఉన్నావు 

ఈ ప్రేమ ( పగిలిపోకూడదు) భగ్నమవరాదు

నువ్వు నా పై అలగకూడదు 

ఎప్పటికీ మన కలయిక విడిపోకూడదు 

నీవు లేకుండా ఈ  జీవించడం అసలు  జీవించడమేనా


ఓ  సహచరీ  (చెలియా)… నీవు లేకుండా ఈ  జీవించడం అసలు  జీవించడమేనా?.


నీవు లేని ఎన్నో రాత్రులు  వైరాగ్యంతోనూ  

నీవు లేని పగటి సమయాలలో  సంచారినై ,

నా జీవితం మండుతున్న కొలిమి 

నా కలలన్నీ కృశించిపోతున్నాయి

నీవు లేని నా జీవితం, నేను లేని నీ జీవితం,

జీవితమే కాదు

నీవు లేకుండా ఈ  జీవించడం అసలు  జీవించడమేనా?. 


ఓ  సహచరీ  (చెలియా) నీవు లేకుండా ఈ  జీవించడం అసలు  జీవించడమేనా?.


ओ साथी रे - 
Movie/Album: मुक़द्दर का सिकंदर (1978)
Music By: कल्याणजी आनंदजी
Lyrics By: अनजान
Performed By: किशोर कुमार

ओ साथी रे, तेरे बिना भी क्या जीना
फूलों में कलियों में, सपनों की गलियों में
तेरे बिना कुछ कहीं ना
तेरे बिना भी क्या जीना

जाने कैसे अनजाने ही, आन बसा कोई प्यासे मन में
अपना सब कुछ खो बैठे हैं, पागल मन के पागलपन में
दिल के अफसाने, मैं जानूँ तू जाने, और ये जाने कोई ना
तेरे बिना भी क्या जीना...

हर धड़कन में प्यास है तेरी, साँसों में तेरी खुश्बू है
इस धरती से उस अम्बर तक, मेरी नज़र में तू ही तू है
प्यार ये टूटे ना तू मुझसे रूठे ना, साथ ये छूटे कभी ना
तेरे बिना भी क्या जीना...

तुझ बिन जोगन मेरी रातें, तुझ बिन मेरे दिन बंजारे
मेरा जीवन जलती धूनी, बुझे-बुझे मेरे सपने सारे
तेरे बिना मेरी, मेरे बिना तेरी, ये जिंदगी जिंदगी ना
तेरे बिना भी क्या जीना...