15, జూన్ 2011, బుధవారం

లిఫ్ట్..ఇవ్వాలంటే భయం


నాకు ఈ..మద్య ఒక భయం పట్టుకుంది. ..లిఫ్ట్..ఇవ్వాలంటే భయం!తీసుకోవాలంటే భయం.? ఏం చేద్దాం? పరిస్థితులు అలా ఉన్నాయి. 

మొన్నటికి మొన్న మా "అత్తమ్మని" ..ఒక కుర్రాడి  బండిపై..కూర్చుని ప్రయాణించి రావమ్మా..అంటే.. నడచయినా వస్తాను కానీ.. ఎవరో..అబ్బాయితో  ..కలసి రావడమే.? కుదరదు కాక కుదరదు అంటే.. చేతిలో పని ప్రక్కన పడేసి నేనే వెళ్ళాల్సి వచ్చింది..మనుమడి వయసున్న ఆ అబ్బాయితో..ప్రయాణించాల్సి రావడానికే .. ఒప్పుకోని   ఆమె.. ఒకవేళ నేనలా రావాల్సి వస్తే.. ఆమోదిస్త్హారా?..నాలో..ఓ..సందేహం జనియించింది.. 

నాదంతా.. ముక్కుసూటిదనం. అప్పటికప్పుడే..అడిగేశాను.. వెంటనే..ఆమె.. అలా..బాగోదు..అన్నారు.." ఏం" అన్నాను.. "అది అంతే.." మన కుటుంబాలలో.. అలా లేదు. అన్నారు.. అలా లేనివి  మన కుటుంబాలలో  చాలా..వచ్చాయి.. అందామనుకుని.. నోరు నోక్కేసుకుని.. ఇదిగో..ఇక్కడ కక్కేస్తున్నాను. ..

ఒకోసారి.. అత్యవసర   సమయాలలో, సందర్భాల్లో కూడా .. స్రీలు..  లిఫ్ట్  అడిగి తీసుకోవడం అదేదో.పెద్ద తప్పులా భావిస్తారు.. కారణం మన సమాజంలో.. భార్య -భర్త ..లేదా..సమీప బంధువుల తోడి మాత్రమే..వాహనంలో..కలసి ప్రయాణించడం అలవాటుగా..ఉంది. 

మన మద్య కి ఎన్నో కొత్త అలవాట్లు  పుట్టగొడుగుల్లా  ..పుట్టుకొచ్చాయి .వాటికి..మొదట్లో..మనమేమన్నా.. రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికామా..ఏమిటి? ఎంత మందో..వాచలకుల  నోళ్ళల్లో పడి..నాని నాని.. చిరిగి పీలికలై..పిపీలికమై.పోయి.. ఇంకొక క్రొత్తది వచ్చాక కానీ.. ఆ..విషయం మరుగున పడేది.. కాలం మారింది మారక చస్తామా? అనుకునే.. సందర్భాలు వేరు వేరుగా..ఉంటాయి కొన్నిటికి..మినహాయింపు..ఉంటాయి.. వాటికి ఉదహరణ గమనించండి.

ఒక.యువకుడు.. తన భార్య ఫేంట్-షర్ట్ వేసుకుంటే.. ఆమోధించినంత  తేలికగా  ఆమె.. వేరొకరి టూవీలర్ పైనో.. వెహికల్ పైనో..(పురుషుడి) లిఫ్ట్ అడిగి..ఇంటికి వస్తే.. అభ్యంతరం  చెబుతారు.  చెప్ప లేదు అనుకుంటే.. మనం చాలా నాగరికులమైపోయామని అర్ధం.

ఈ..పోస్ట్ ఉద్దేశ్యం ఏమిటంటే.. స్త్రీలు లిఫ్ట్ ఇవ్వడమో..లేదా తీసుకోవడం లో..అభ్యంతరములు ఉన్నాయా..? ఉంటె.. అవి ఎవరికి.. ఎందుకు.. అని.. అడగాలి అనిపించింది.. ఇక్కడ వ్రాయాలి అనిపించింది. 

ఈ..కాలపు అమ్మాయిలకి..ఉద్యోగినులకి.. అందరికి.. ప్రత్యేకించి వాహనం ఉండటం తప్పని సరి  అయింది. ఒక వేళ వాహనం   లేకున్నా.. ఇంటికొక టూ వీలర్ ఉండనే ఉంటుంది.. ఒక వేళ అలా లేకున్నా.. బస్ ప్రయాణం అయినా తప్పదు కదా.. ! మహిళలు  ..ఏదయినా పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడో.. చదువుల కొరకు కళాశాలలకి  ..వెళ్ళినప్పుడో.. సడన్గా.. ఏ..వానో రావచ్చ్గు.. బస్సు చెడిపోనో  వచ్చు.. ట్రాఫిక్  జామ్ లో చిక్కుకోనో వచ్చు.  అనారోగ్యం తో.. హాస్పిటల్కి.. వెళ్ళవలసి  రావచ్చు.పరీక్ష కి టైం  సమీపిస్తుండవచ్చు.. అలాటి  సమయాలలో..  వేరొకరి   వాహనం పై వెళ్ళడానికి.. సంకోచిస్తూ ..ఉంటారు.. వెళ్ళవలసిన పని ఎంత అత్యవసరం అయినప్పటికీ...ఎలాగో..తంటాలు  పడి  చెమటలు క్రక్కుకుంటూ..నడచి.. లేదా..ఆటో లు పట్టుకుని.. సమయానికి.. చేరలేక అవస్థలు పడుతుంటారు. అదే పురుషుడు అయితే.. నిరభ్యంతరంగా  వెళ్లిపోతు ఉంటారు. 

ఆడ పుట్టుక పుట్టినందుకు ఎన్ని ఇబ్బందులు. 

" ఆలస్యం అయినా..నడిచి అయినా రా.. ఎవరనా లిఫ్ట్  ఇస్తానన్న తీసుకోకు.."అని అమ్మాయిలని.. అమ్మలు హెచ్చరిచడం మామూలే!."నాకైతే..అభ్యంతరం ఏం లేదు..కానీ.. చూసేవాళ్ళని దృష్టిలో..ఉంచుకోవాలి కదా.." అని ఓ..భర్తా.., "ఎవరి బండి పడితే..వాళ్ళ బండి ఎక్కి..రావడమేనా.. హద్దు-అదుపు లేకుండా" అనే..ఓ.. బామ్మ.. "ఎవరతను.. మీరు అతనితో కలసి వచ్చారు?" అని ఇరుగు-పొరుగు ఆరాలు.. ఇన్నిటికి సమాధానం ..ఓ..ప్రయాణికురాలు .ఓ..ప్రయాణికుడి సాయం అందుకుని.. కలసి ప్రయాణం చేసినందువల్ల ఉత్పన్నమయ్యే ప్రశ్నలు.. జాగ్రత్తలు,హెచ్చరికలు.

 ముఖ్యంగా.. స్త్రీలకి..ఒక అపరిచిత వ్యక్తి తోనో..లేదా..కొద్దిపాటి పరిచయం వ్యక్తితోనో.. కలసి.. ప్రయాణించాల్సి రావడం అనేది.. చాలా ఇబ్బందికరమని .. అప్పటికప్పుడు  ఏర్పడిన అవసరం  దృష్ట్యా  అనిపించదు  . కానీ.. చూసే వారి దృష్టిలో..అది.. నేరం. అది బరితెగించిన తనం.. మనలో.. చాలా మందికి.. మనవాళ్ళు కాని  వ్యక్తులతో..ప్రయాణించి రావడం అనేది.. చాలా సందర్ఫ్హాలలో  తప్పు.   ఎందుకంటే శరీరాలు తగిలి అపవిత్రం అయిపోతాయన్న భావన. కావచ్చు..లేదా.. ప్రమాదాలు ముంచుకొస్తాయని కావచ్చు.  

విదేశాలలో అయితే.. అవసర పడినప్పుడు   నిస్సంకోచంగా.. లిఫ్ట్ అడిగి తీసుకుని..ప్రయాణించడం కద్దు. మన  భారతీయ  సంస్కృతిలో  అలా ప్రయాణించడం అనేది అరుదు. మన స్త్రీల గౌరవం, శీలం (?) అనే వాటికి అత్యంత విలువ నివ్వడం మూలంగా  ..నేమో..ఇంకా. ఈ..ప్రయాణం కి..అభ్యంతరాలు అనుకుంటాను.   ఇక ఇలాటి ప్రయాణాలలో..ప్రమాదాలు పొంచి ఉంటాయనే  భయం కావచ్చు..

 ఏది ఏమైనా.. మనిషి పై..ఎదుట మనుషులకి.. నమ్మకం సన్నగిల్లి పోతుంది.. మా కాలనీ..లోపలకి ..నేను వెళుతూ.. ఒక కిలోమీటర్ చూరాన్ని బోలెడంత .. బరువులతో.. నడవలేక నడుచుకుంటూ..వెళ్ళే వారి  వద్ద ఆగి.. లోపలకి..వెళుతున్నాను..రండి.. అన్నా కానీ..అనుమానంగా..నా వంక చూస్తారు.. వివరంగా  .. నేను ఎవరో..చెప్పి..పర్లేదు..రండి అని..అన్నాక కానీ..వాళ్లకి..నమ్మకం కుదరదు..ఇవన్నీ..నీకు అవసరమా.. ?అన్న చీవాట్లు పడినా నేను ఊరుకోను..అదో..తృప్తి..  మనిషి అన్నాక అవసరపడినప్పుడు.. లేదా..ఎదుటి వారి అవసరం కళ్ళకి కనబడినప్పుడు..తనవంతు సాయం చేయడం అన్నది.. ఒక సంస్కారం.. అని నాకు..నేర్పిన  సంస్కారం. 

 అలాగే.. పరాయి పురుషుల వెంబడి.. ప్రయాణం చేసినంత మాత్రాన తప్పు కాదు.. అలా అని ఎల్లప్పుడు..అలా ప్రయాణం చేయడం మంచిది కాదు.. ఎవరికి వారు విజ్ఞతతో.. నడచుకోవాల్సిన..తీసుకోవాల్సిన నిర్ణయాలు  ఇవి. అవసరం అయినప్పుడు.. లిఫ్ట్ తీసుకోవడం తప్పని.. లేటు  గా   వెళితే.. మా బాస్.. మెమో..ఇస్తాడు..  దానికన్నా..ఇది నయం కదా..అంటుంది..ఒకామె.. అందుకే  ఎవరి ప్రయారిటీ.. ఏమిటనేది..వాళ్ళ అవసరం బట్టి  .ఉంటుంది .అని  అంటాను.

అర్ధరాత్రి  వర్షంలో తను వెళ్ళే రూట్ కాకపోయినా    ..20 కిలోమీటర్లు..ప్రయాణించి..వచ్చి.. ..  తనకి..జాగ్రత్తగా లిఫ్ట్ ఇచ్చినవారికి.. కనీసం  వాళ్ళ ఆయన చూస్తున్నాడు అన్న భయంతో థాంక్స్ కూడ..చెప్పలేక పోయిన నా స్నేహితురాలు..  అదే అంశం తో..ఒక కధ రాసి బహుమతి  పొందింది..  ఒక అమ్మాయి సమయానికి.. పరీక్షా స్థలంకి..వెళ్ళ లేనేమో  ..నన్న భయం తో.. ప్రక్కింటి అంకుల్ తో..కలసి.. వెళ్లి. చేదు అనుభవం ఎదుర్కున్నవాస్తవం తెలుసు..  ఏ విషయమైనా..మదిలో..దాచుకునే కంటే  మందిలో..పెడితే..ఇంకో నల్గురి అభిప్రాయాలు..తెలుస్తాయి అని నా ఆశ. లేశ మాత్రం ఆలోచించకుండా..వ్రాసిన ఈ..టపా.  మీ అభిప్రాయానికి ..ఆహ్వానం. 

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అపరిచితులతో లిఫ్ట్ అనేది ఇచ్చినా, తీసికున్నా కలిగే అనర్ధాలు, నా అనుభవం గురించి ఒక టపా ( ఇంగ్లీషులో) పెట్టాను. చదవండి.

http://bpb-phani.blogspot.com/2007/04/encounter-with-gay.html

అజ్ఞాత చెప్పారు...

విదేశాలలో అయితే.. అవసర పడినప్పుడు నిస్సంకోచంగా.. లిఫ్ట్ అడిగి తీసుకుని..ప్రయాణించడం కద్దు.

నిజమా? మీరెన్ని విదేశాలు చూసేరు మహాతల్లీ? ఆ మీరు చూసిన విదేశాలల్లో ఎంతమంది మీ బండి ఎక్కేరు తల్లీ? కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి.

Vineela చెప్పారు...

అలాంటివి మా ఇంట్లో కూడా చాలానే విన్నాను అండి..లిఫ్ట్ దాక ఎందుకు..నేను ఒక యోగ క్లాసు కి న ఫ్రెండ్ తో కలిసి వెళ్ళినందుకు ఎన్ని తిట్లు పడ్డాయో.. నేను ఏదో పబ్ కి వెళ్లినట్టు ఫీల్ అయ్యి అనేసారు. నాకు చాల బాధ వేసింది. పెళ్లి కావాల్సిన అమ్మాయి వి అల వెళ్ళచ అని..నాకు ఇప్పటికి నేను చేసిన దాన్లో తప్పేంటి అనీది అర్ధం కాదు.

MURALI చెప్పారు...

హైదరాబాద్‌లో పరిస్థితులు మరీ దారుణంగా లేవు. మా ఆఫీసులో పెళ్ళయిన, పెళ్ళికాని అమ్మాయిలు కూడా లిఫ్టు అడిగి కొండకచో "ఏరా ఎక్ష్‌ట్రాలు చెయ్యకుండా నన్ను దింపి వెళ్ళు" అని సున్నితంగా రిక్వెస్టు చేస్తారు. ఎవరితో వెళితే మంచిదో తెలుసుకునే విఙ్ఞత,పరిణతి ఉంటే చాలు. లిఫ్టు ఇచ్చేవాడికి కూడా ఇదే బుద్ది ఏడిస్తే మంచిది. లేకపోతేనే సమస్య.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మురళి గారు.. మీకు ధన్యవాదములు.బాగా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.

వినీల .. చాలా..మంది ఆడపిల్లలకి..ఇలాటి అవమానకర సంఘటనలు..ఎదురవుతాయి. ఇంట్లో వాళ్ళా , బయట వాళ్ళా అని కూడా..కాదు. వారి వారి ఆలోచనా విధానం. అంతే.. ధన్యవాదములు.

లక్ష్మి ఫణి గారు తప్పక చూస్తాను ధన్యవాదములు.
అజ్ఞాత గారు..
మనం చూస్తున్న చెపుతున్న విషయాలు.. ప్రతిది.. స్వీయాను భావం అయి ఉండదు.కొన్ని విని,కొన్ని కని.. కొన్ని తెలుసుకుని.. చేపుతుంటాం. నేను..విదేశాలకి.. ఇంకా వెళ్ళక పోయినా.. మా కుటుంబాలలో.. సభ్యులు స్నేహితుల్లో.. చాలా మంది అక్కడే ఉన్నారు. వారి అనుభవం విని చెప్పాను. మహా తల్లీ.. అన్నారు. ధన్యవాదములు .. విదేశాలలో.. ద్విచక్ర వాహనములు ఉండవు..ఉన్నా చాలా తక్కువ.
మా అబ్బాయి రోజు ఇలాటి విషయాలే చెపుతూ ఉంటాడు.
అజ్ఞాత గారు..ధన్యవాదములు..మీరు ఇచ్చిన లింక్లో.. విషయాన్ని చదివి.. తెలుసుకుంటాను.స్పందించిన మీకు ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

mukku moham teliyani vallanu lift adigekante nadichi or auto lo vellatame better..lift ichhinavadu manalni eto tesukuvellipoyadanukondi mana paristhitenti...andaru cheddavaru kadu kaani mana jagratha lo manam undali,, abbayile kadu ammayilu antelendi..vaari vastradharana,,varu bandi meeda kurchune vidhanalu chuste evaraina antevidham ga maripotaru,,,keedenchi melenchamannaru anduke lift adagatam avoid cheste better ani naa feeling...endukante ee hyderabad lo bandi meeda ammayilu kurchune vidhanam vese veshalu chusi visugu puttindi,,,naku anipinchina visham idi...

buddhamurali చెప్పారు...

వనజవనమాలి గారు బాగా రాశారు. నేను బైక్ పై వెళ్ళేప్పుడు లిఫ్ట్ అని చేయి చూపితే ఆగుతాను. అలా అని అమ్మాయిలు లిఫ్ట్ అడగడంలో తప్పులేదని వాదిస్తున్నానని అనుకోకండి . ఈ క్రింది ఉదాహరణ మీ పోస్ట్ కు సరిపోతుందేమో చూడండి నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో మెదక్ జిల్లో ఒక సామాజిక ఉద్యమ కారుడు ఉండే వారు . జిల్లా పోలీసు సుపరిండేంట్ సమక్షం లోనే అతన్ని కడిగి పారేస్తూ ఉపన్యసించే వారు. ఆతను నిజంగానే ఉద్యమ కారుడు. ఆ రోజుల్లో టివి లు ప్రతి ఇంటిలోనూ ఉండేవి కాడు. వీళ్ళ పక్కింటి లో టివి ఉండేది. అతనికి ఆడపిల్లలు. పక్కింటి వాళ్ళు టివి చూడడానికి మీ పిల్లలను రమ్మనండి పరవ లేదు . అంటే ఆతను నిర్మోహ మతంగా వద్దు అన్నాడు . ఉద్యమ కారులు అలా అనడం ఏమిటని అతన్ని అడిగితే ఆడపిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్లి కుఉర్చుంటే వల్ల అబ్బయిలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పాడు. మనం మంచివల్లమే కావచ్చి, ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు కావలనేముంది. ప్రమాదం కొని తెచ్చుకోవడం అవసరమా. ప్రమాదం లేదు అనే నమ్మకం ఉంటే పరవాలేదు. ఈ మధ్య హైదరాబాద్, బెంగళూరు లాలూ కాల్ సెంటర్లకు సంబందించిన టాక్సీ ద్రివార్లు చేసిన వ్యవహారాల గురించి తెలిసిందే కదా. రోజు కనిపించే టాక్సీ డ్రైవర్ లే అలా చేసినప్పుడు. పరిచయం లేని వారి నీ ఎలా నమ్మేది ..

మురళి చెప్పారు...

Interesting topic..

అజ్ఞాత చెప్పారు...

navvakandi, ee madhya Hyd lo homo gaallu ekkuvaipoyaaru, adakkunnaa kuda lift ichchi chilipi cheshtalu chesthunnaaru, okati rendu sarlu veella chetha baadhimpa badina taruvaatha, lift adagaalante bhayam vesthondi,

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అజ్ఞాత గారు.. మీ ఇబ్బంది చెప్పారు.. ఇలాటి వికృత వైపరిత్యాలకి ఎవరు గురి కాకూడదు..కూడా. మీ అభిప్రాయం కి..ధన్యవాదములు

Indian Minerva చెప్పారు...

నాకైతే కారణాలుగా ఈ రెండు అనిపిస్తాయండీ:
1) we'd got our concept of శీలం wrong and excessive importance to that wrong thing.
2) We'd like to teach our gilrs/women how to be cowards in the name of being carefull ratherthan how to be bold and facing the problem.

www.apuroopam.blogspot.com చెప్పారు...

నేను Indian Minerva గారితో పూర్తిగా ఏకీభవిస్తాను.మన సమాజంలో స్త్రీల శీలం పట్ల గల దృక్ఫథంలో చాలా మార్పు రావాలి.తమకు అవసరమైన ఫాషన్లు వంటి ఎన్నో విషయాలలో మన స్త్రీలు త్వరగా మారుతున్నారు గాని వారి జీవితాలలో స్వేఛ్చకి అత్యవసరమైన ఈ శీలం విషయంలో మార్పు కోసం వారు తీవ్రంగా ప్రయత్నించడం లేదని నా భావన.ఈ విషయంలో సహజంగానే మగవారిది ద్వంద వైఖరే.అది మారడానికి కొంత కేాలం పట్టవచ్చు. కాని స్త్ర్రీలు ఈ విషయంలో ఉద్యమ రూపంలో ముందుకు వస్తేనే గాని సమాజంలో మనకు కేావలసిన మార్పు రాదు.సమాజంలోే తమకు తామే ఎన్నో inhibitions ని స్త్రీలే కల్పించుకుంటు న్నారు. ఇంకా మన సమాజం పూర్తిగా నాగరిక సమాజంగా మార లేదు కనుక,
ఈ విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తూ అయినా స్త్రీలు ముందుకు వెళ్ళడానికి తమ ప్రయత్నం తాము చెయ్యాలి.