21, జూన్ 2011, మంగళవారం

భారతీయ సంగీతపు ఆత్మ గా...వాయులీనం...

బ్లాగ్ మిత్రులందరికీ, సంగీత కారులకి,సంగీత  ప్రియులందరికీ ... ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. కులం,జాతి,మతం.బాష,దేశం.. బేధాలు లేకుండా.. ఎల్లలు మార్చి,హద్దులు చెరిపేసి..ఖండాంతరాలు..ధాటి ప్రవహించేది..సంగీతం. "పశుర్వేత్తి,శిశుర్వేత్తి గాన రస ఫణి "  అన్నారు అందుకే.. 

ప్రపంచ సంగీతం లో..మన భారతీయ సంగీతానికి..యెనలేని ప్రాముఖ్యత ఉంది.నాలుగు వేదాలలోని..సామవేదం..సంగీతం కి..సంబంధించినది. భారతీయ సంగీతం  లో.. రెండు  ప్రధాన స్రవంతులు..  హిందుస్తానీ,కర్నాటక సంగీతం.  వింధ్య పర్వతాలకి..ఈవల కర్ణాటక  సంగీతం లో..భక్తి సంగీతం కి...ప్రాధాన్యం గా త్యాగయ్య,అన్నమయ్య,రామదాసు..బాణీలు కట్టి..స్వయంగా పాడే వారు..కనుక.. మనకి..భక్తి  సంగీతపు ఒరవడి..లో.. అట్టే శతాబ్దాలు గడచి  పోయాయి..

భారతీయ సంగీతపు ఆత్మ గా..స్వరం,తంత్రీ, వాయులీనం, డోలక్..ఇలా నాలుగు  విధాలు
వివిధ ప్రాంతాలలో ..వివిధ రక పరికరాలతో..ప్రపంచాన్ని ఉరూత లూగించే..సంగీత సృష్టి..కి..మన భారతీయ సంగీతం మిళితమై .. మనకి అన్ని ప్రయోగాలలోను..గర్వకారణం గా నిలుస్తుంది.

నిత్య జీవితంలో..సమస్యలతో,చికాకులతో..అతలాకుతలం అయిపోతున్న మనిషికి..ఆహ్లాదం ని ఇచ్చి..మనసుకి సేద దీర్చే  శక్తి.. సంగీతానికి తప్ప వేరోకదానికి లేదు.అందుకే  ..నాదం లోనే మోదం ఉంది..అంటారు..కదా.. .

 మన భారతీయ  సంగీతంలో.. వీనులవిందైన సంగీతంలో..వాయువు..పూరించి..పలికించే రస రమ్య గమకాలతో..అలరించి..ఆహ్లాద పరిచేది.."వేణు గానం" ఆ వేణు గానానికి.. పరవశించని వారు ఎవరు ఉండరు.




వేణు గానం అనగానే..మనకి..ముందుగా..స్పురించేది..నల్లనయ్య ముగ్ధ మనహోర  రూపం.
యమునా తీరాన ..పొన్న చెట్టు  నీడన  కుడికాలుని అడ్డంగా  నిలిపి.. ఎడమ పాదం బొటనవేలిని చిద్విలాసం గ..ఆన్చి..  తన్మయత్మం తో..మురళిని పెదవులపై..ఆన్చి.. సర్వజీవులని  ..మైమరి పింపజేసే   వేణుగానం స్పురిస్తుంది..  అందుకే   కౌమార దశలో.. వేణువు ధరించని.. కృషుడిని  ని మనం  చిత్ర పటం లో..సైతం ఆమోదించ లేము.  

మంద్రమైన స్తాయిలో విన్న వేణు  గానం  మనిషిని మరోలోకం లోకి..ప్రయాణింపజేస్తుంది.
వెంటాడే  లక్షణం వేణు గానంది..అందుకే రాదమ్మ కూడా వావి  వరుసలు,వయో భేదములు మరచి.. నల్లనయ్య  కోసం పరువు తీస్తూ..వచ్చేదట. అలాగే వేన వెల్ గోపికలు..,గోపాలురు,గోవులు ..అంతా ఆనందముగా ఉండేవారట. 
వెదురు పొదలలో..జొరబడ్డ గాలి..వింతగా ధ్వనించడం  చూసిన మనిషి  .తన ఊహలకి..రూప కల్పన జేసి..  వెదురును వేణువుగా మార్చాడట. ఆ గానములో..జగమే..తూలియాడగా.. కొన్ని పాటలు.. గుర్తు చేసుకుంటూ.. సినీ సంగీతంలో.. వేణువు స్వరాలూ..ఊదగా..












ప్లుట్ మ్యూజిక్  ఫ్లూట్  మ్యూజిక్ ఇక్కడే 

సిల్సిలా  చిత్రంలో.. పండిట్ హరి ప్రసాద్ చౌరాసియా ప్లుట్  వినండి..ఇక్కడ    

  సిల్సిలా  చిత్రం ప్రారంభ సంగీతం...ఇక్కడ వినండి..  ఇక్కడ 

ఇవి..కొన్ని మాత్రమె!!! వినాల్సినవి..చేంతాడంత లిస్టు ఉన్నాయి.. సమయాభావం వాళ్ళ లింక్ ఇవ్వ లేకపోతున్నాను.

 ఆ వేణు గానమన్న నాకెంతో ఇష్టం  కాబట్టి ఈ..పూట ఈ పాటలు ... తో.. అందరు..మధుర  సంగీతాన్ని ఆస్వాదించి.. ఆనంద డోలికల్లో..ఊగి తేలియాడాలని..ఆశిస్తూ..    (వనమాలి కి..మధుర భక్తి తో..) వనజ.   

10 కామెంట్‌లు:

gangadhar చెప్పారు...

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.

gangadhar.

రాజేష్ జి చెప్పారు...

$వనజ గారు

ఆహా.. చాలాబాగా రాసారు. సంగీతానికీ ఓరోజు ఉందని తెలీదు. లేకపొతే బ్లాగుల్లో కచేరీ పెట్టేవాడిని ;).

నాకూ సంగీతం అంటే మహాఇష్టం. అదీ ఇదీ అని తేడాలేకుండా అన్నీ వినేస్తుంటా..ప్రస్తుతం మనదైన సుస్వర భారతీయం సంగీతమే వింటున్నాలెండి :)

మనదైన సంగీతం గురించి వివరించడమే కాక చాలా కష్టపడి మంచిపాటలు కూడా అందించారు. మీకు ధన్యవాదాలు. మీకు వీలున్నప్పుడు నా బజ్జు చూడగలరు..https://mail.google.com/mail/?shva=1#buzz/100083344333484778077

ఇక్కడ మంచిమంచి పాటలన్నీ పెడుతూఉంటాను.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

మీరు ఇచ్చిన వేణువుపాటల జాబితాలో అన్ని అద్భుతమైన పాటలే. మీకుకూడా సంగీతదినోత్సవ శుభాకాంక్షలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

గంగాధర్ గారు.. ధన్యవాదములు.
రాజేష్.జి..మీ బ్లాగ్ తప్పకుండా..చూస్తానండీ.. మంచి పాటని..ఆస్వాదించడమే..నాకిష్టమైన వ్యాపకం.
భాస్కర్ గారు.. ఇంకా.. చాలా పాటలు..ఉన్నాయి.. అవి తర్వాత.మీకు ఈ..పోస్ట్ నచ్చినందుకు..ధన్యవాదములు

కొత్త పాళీ చెప్పారు...

తెలుగు సినిమాల్లో వీణపాటల గురించి చాలా సార్లు ఆలోచించా గానీ వేణువు పాటల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు - చాలా బాగా రాశారు.
టపా శీర్షికలో వాయులీనం అని ఉండి, టపా అంతా వేనువు గురించి ఉండడంతో కొంచెం అయోమయానికి లోనయ్యాను. మనవాళ్ళు పాశ్చాత్య వాద్యమైన వయొలిన్‌కి దేశవాళీగా వాయులీనం అని నామకరణం చేసి చెలామణి చేశారు.

కొత్త పాళీ చెప్పారు...

ఇంకో మాట చెప్పడం మరిచాను. ముళ్ళపూడి వారి కథానిక ఒకటున్నది - పేరు "కానుక" అనుకుంటా. చాలా బావుంటుంది. One of his best.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొత్త పాళీ గారు..ధన్యవాదములు.. మన భారతీయ సంగీత వాయిద్యములలో వాయువు పూరించి నాదం ని వినిపించే పరికరాలు అన్నింటిని..వాయులీనం అనే అంటారని సంగీత సరిత కార్యక్రమలో.విన్నాను. అందుకే.. నాలుగు కేటగిరిలను..చెప్పాను. వేణువుని బాన్సురి లేదా బాసురి కూడా అంటారు..అని వింటున్నాం.ఇది నాకు తెలిసిన విషయమండీ..ఏమైనా తప్పులు ఉంటె..దయచేసి క్షమించండి..తప్పులు సరిచేయమని మనవి.నాకు వినడమే బాగా తెలుసు. అలాగే రమేష్ నాయుడు గారు,ఎమ్.ఎమ్ కీరవాణి గారి పాటలలో..వేణువు దే..సింహ స్వరం.అందుకే వారి స్వరకల్పన జనరంజకం అనుకుంటాను..నేను. ఈ పోస్ట్ కి వ్రాసిన స్క్రిప్ట్ విజయవాడ ఆకాశవాణి .. వివిధభారతి విభాగంలో..జనప్రియ కార్యక్రమంలో..ప్రసారమైనది కూడా. మీకు రిప్లై ఇస్తూ..మరిన్ని విషయాలు. చెపుతున్నందుకు..సంతోషం.మీకు ధన్యవాదములు.

కొత్త పాళీ చెప్పారు...

బాగున్నదండీ. ఆకాశవాణిలో ప్రసారమైనందుకు అభినందనలు. వేణువుకి సంస్కృతంలో వంశీ అని ఉంది. బాంసురీ అనే హిందీ పదం బహుశా దాని అపభ్రంశరూపం కావచ్చు.
అచ్చతెలుగు పేరు పిల్లనగ్రోవి.

జ్యోతి చెప్పారు...

భలే.. వనజగారు సంగీత దినోత్సవ సంధర్భంగా మీరు వేణువును వాయిస్తే నేను వీణ వాయించాను. రెండింటిలో దేనికదే సాటి..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతి గారు..ధన్యవాదములు. చాలా మందికి.. చాలా విషయాల పరిచయానికి.. పునాది రాయి వేసేది మీరే..