1, ఆగస్టు 2011, సోమవారం

ఆడవారికి మాత్రమే ప్రత్యేకం..

గత కొన్ని రోజుల క్రితం  మహిళలు  వస్త్రధారణ పై తమకి స్వేచ్చ ఉండాలని..పురుషుల అణచివేతని సహించ జాలమని ...  మగువలకి  ఇష్టమైన రీతిలో.. వస్ర ధారణ చేసుకుని మరీ ప్రదర్శనలు చేసారు.అప్పుడే నాకు మన సంప్రదాయ మైన చీర గుర్తుకు వచ్చింది.ఈ పాటా గుర్తుకు వచ్చింది    . . 



చీరలోని గొప్పదనం తెలుసుకో..ఆ చీర కట్టి ఆడ తనం పెంచుకో.. చంద్రబోస్ గారు చీర గొప్పదనాన్ని పదాలలో..చెపితే..  కీరవాణి గారు స్వీయ స్వర కల్పనలో..పాడి అంత గోప్పభావం ని..పెంచే భావం.. కల్గించారు.ఈ చిత్రానికి..చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్ర బోస్..దర్శ కత్వం.. వహించారు. రాఘవేంద్ర రావు గారి పర్యవేక్షణ లో.. వారి మార్కు చిత్రమే ఇది. 

పల్లకిలో పెళ్లి కూతురు ..లో..చీర పాట  మాత్రమే..వింటూ..మన  దక్షిణాది తారా మణులు కట్టిన చీర్లని చూడండి.  సోదరి మణుల్  ల్లారా!  ..ఆ చీరల అందాలు చూసి సొంతం చేసుకోవాలని షాపింగ్ కి వెళ్లి.. పర్సు బరువు దించుకుని.. ఆనక తిట్లు,మందలింపులు, ఏడుపులు,చీదుళ్ళు..వగైరాల  తర్వాత నన్ను తిట్టుకోకండి.

ఒక టాప్ సీక్రెట్ ఏమిటంటే.. కంజీవరం, ఉప్పాడ చీరలు..  ఖరీదైనవి.  ఎంబ్రాయిడరీ శారీస్ ... యాక్ ఇప్పుడు..అవుట్ అఫ్ ప్యాషన్.

పోలకం బుటీస్ శారీస్..(జార్జెట్) ప్యాషన్.తేలికైనవి,మన్నికైనవి. వయసుని..అయిదారేళ్ళు తగ్గించి,మంచి లుక్ తో..ఉండే శారీస్.. ఖరీదు ఎక్కువే.. వీడియోలో..మొదట వచ్చే చీర..టైపు..అన్న మాట.అలాటి చీరని కొనుక్కోండి. సరేనా !! 

పనిలో పనిగా.. చీర కట్టు ఫై నాకున్న గౌరవం ..అలాగే..చీర..విలువ తెలియని వారి కోసం నేను వ్రాసిన కవిత .. (అవార్డ్ కవిత ) ఈ లింక్ లో..చూడండి.  వనజవనమాలి: దేహాన్ని కప్పండి!!.                 

ఈ పోస్ట్ ఆడవారికి మాత్రమే ప్రత్యేకం. అఫ్కోర్స్ .. పురుషులకి కూడా.. అనుకోండి. 
     

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వనజగారూ,
స్త్రీ స్వేచ్ఛ అంటూ బయలుదేరేవారికి సరైన టపా. పండ్లు ఉన్న చెట్టుకు రాళ్ళదెబ్బలు ఎలా పడుతాయో అలాగే సౌందర్యమున్నచోటే ప్రమాదాలూ ఉంటాయి. కేవలం స్త్రీగా పుట్టినంత మాత్రాన స్త్రీత్వం ఏ స్త్రీకి రాదని నా అభిప్రాయం. ప్రతీ స్త్రీ తన అణకువ, వినయం, కరుణ, మాతృత్వాల ద్వారా స్త్రీత్వాన్ని సంపాదించుకోవాలి. ఆధునికత పేరు చెప్పి విచ్చలవిడితనానికి స్వేచ్చగా ముసుగు తొడిగేస్తే చెల్లిపోతుందనుకున్నంతకాలం అవాంఛనీయ ఘటనలు జరుగుతూనే ఉంటాయి.

కాస్త మొరటుగా చెబితే కాసులపేరు మీద కళ్ళుబడతాయిగానీ చూపించినా కాకిరెట్ట జోలికిపోరు జనం. అందువల్ల మహిళ తన స్వేచ్చకి గల పరిమితులు వాటి అర్థాలు అంతరార్థాలూ తెలుసుకుని సరైన వస్త్రధారణ, అణకువతో మసలుకున్నట్లయితే నేటి మన సమాజములో జరుగుతున్న అనేక దాడులకు వేరు తెంపినవారమవుతామని నా భావన.

మాగంటి వంశీ మోహన్ చెప్పారు...

వనజ గారు

కాకతాళీయమో ఏమో కానీ, నేను ఇప్పుడే తాడేపల్లి గారు వ్రాసిన "లైంగిక నేఱాల నిరోధానికి సభ్యదుస్తుల దోహదం!!" టపా చదివి "అగ్రిగేటర్" వైపు వద్దును కదా, మీ పోష్టు....

ఆయన వ్రాసిన టపా లంకె ఇదిగో

http://kalagooragampa.blogspot.com/2011/06/blog-post_23.html


ఆయన అన్ని పాయింట్లు , ఎప్పటిలానే చాలా బాగా వ్రాసుకొచ్చారు. ఈ పాయింట్ల మీదే నేనొక డ్రాఫ్టు వ్రాసి పెట్టుకున్నాను అప్పుడెప్పుడో...కానీ ఎలా "ప్రెజంట్" చెయ్యాలో తెలియక సతమతమయ్యి మధ్యలోనే వదిలేసా....ఇప్పుడు మళ్ళీ ఆయన వ్రాసిన ఈ టపా చూసి బోల్డు సంబరపడ్డాను....అమూల్యమైన ఆ టపాల మీద కామెంటు వ్రాసే అవకాశం లేకపోయినందుకు, కోల్పోయినందుకు ఒక పక్క చింతిస్తూ , ఇంకోపక్క మీలాటి వారు ఆ అసభ్య వస్త్రధారణ మీద దండెత్తిన కారణానికీ, ఆ పైన సభ్యసమాజానికి ఊతంగా నిలవడానికి చేస్తున్న ప్రయత్నం చూసి సంతోషపడుతూ ..........

అజ్ఞాత చెప్పారు...

లైంగిక నేఱాల నిరోధానికి సభ్యదుస్తుల దోహదం

http://kalagooragampa.blogspot.com/2011/06/blog-post_23.htmlb

అజ్ఞాత చెప్పారు...

మీ పోస్ట్ నాకు భలే నచ్చిందండీ ! నాకు చీరలపిచ్చి ఎక్కువేలెండి . సర్వకాల సర్వావస్థలలోనూ నేను ధరించే వస్త్రవిశేషం అదొక్కటే. నాకు సూపర్నెట్ చీరలు చాలా నచ్చుతాయి. మన్నిక తక్కువేకానీ హుందాగ తేలిగ్గా వుంటాయి . ఘర్షణ సినిమాలో అసిన్ కట్టింది కో _ఆప్టెక్స్ చీరలు అనుకుంటాను కదండీ