17, మార్చి 2012, శనివారం

సంప్రదాయం - సమానత్వం

నేను మార్చి 8  న ఒక వివాహానికి వెళ్లాను.
అక్కడ కొన్ని ఆసక్తి కర విశేషాలు.
మరీ అంత ఆసక్తికరం  కాదనుకోండి.
మీరు..సరదాగా చూసేయండి.



బుట్టలో పెళ్లి కూతుర్ని మేన మామలు .పెళ్లి  పీటల పైకి తీసుకుని రావడం చూసే వారికి  చాలా సరదా గా ఉంటుంది పాపం పెళ్లి కూతురు మాత్రం..ఆ బుట్టలో ఒదిగి కూర్చోవడానికి చాలా కష్టపడాలి కదా! కొన్ని సంప్రదాయాలు బాగుంటాయి.  నాకు మాత్రం జిలేబి గారి డైలాగ్ "బుట్టలో పడటం" గుర్తుకువచ్చేసింది. ..Lol :)))))))

6 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"నాకు మాత్రం జిలేబి గారి డైలాగ్ "బుట్టలో పడటం" గుర్తుకువచ్చేసింది..."
నిజమేనండీ.. కాకపోతే ఇది బుట్టలో కూర్చోవటం :)
"సంప్రదాయం - సమానత్వం" రెండూ బాగున్నాయి..

Zilebi చెప్పారు...

వనజ వనమాలీ గారు,

వావ్, పూర్వపు రోజులు గుర్తు కొచ్చేస్తున్నాయి.

ఇంతకీ, 'సన్నాసి' గారేక్కడండీ , అసలు కనిపించడం లేదు ? ఓన్లీ 'బుట్ట' బొమ్మ' కనిపిస్తున్నారు.

ఆ వాద్య కారులని చూస్తే, 'సన్నాసి' గారు 'బలికి తయారవుతున్న 'మేక' కి ఎదురు గా నిలబడి వాయిస్తున్న వారిలా వున్నారు !!

'మరో సన్నాసి బుట్టలో పడిన కార్యక్రమం వీక్షించినందులకు శుభాకాంక్షలు !!

చీర్స్
జిలేబి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు..ధన్యవాదములు.
@ జిలేబీ గారు.. వరుల వారి అనుమతి తీసుకోలేదు కాబట్టి వారి చిత్రం జతపరచలేదు. పెళ్లి కుమార్తె.. మహా మంచి అమ్మాయి. గట్టి అమ్మాయి. తల్లిదండ్రులు ఒప్పుకోక పోయినా మూడేళ్ళు పోరాడి ఒప్పించి.. సన్నాసి గారిని చేసుకుంది. అదన్నమాట విషయం.

Zilebi చెప్పారు...

అయ్య బాబోయ్,

అమ్మాయి మూడేళ్ళు పోరాడి ఒప్పించి చేసుకున్న సన్నాసి వారైతే, ఖచ్చితం గా ఆ సన్నాసి వారెవరో గాని మరీ పున్యాత్ములే అట్లాంటి బుట్ట బొమ్మ వారికి దక్కడం !

శుభాకాంక్షలు వారికి !

చీర్స్
జిలేబి.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

బుట్టలో పెళ్ళికుమార్తె బొమ్మలా ఉంది. దీవెనలు :-)

ఆడవాళ్ళు సన్నాయి వాయించడం ఇదివరకెక్కడా మీరు చూళ్ళేదండీ? మా వైపు పెళ్ళిళ్ళలో చాలా కామన్.

బుట్టలో పెళ్ళి కుమార్తెను తీసుకువచ్చే సాంప్రదాయం వెనుక పెద్ద కథే ఉంటుందేమోనండి.

నా పెళ్ళిలో ఇలాంటి బుట్టేమీలేదు; ఎంచక్కా నడిచొచ్చి కూర్చుంది నాటి పెళ్ళికూతురు ;-)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

భాస్కర్..గారు..ఇటువైపు సన్నాయి వాద్యకారులలో .."ఆమె" అంతగా కనబడదు. అందుకే..కొంచెం ఆసక్తి.
అలాగే..ఈ బుట్టలో కూర్చేపెట్టి తీసుకురావడం సంప్రదాయం సరదాగా ఉంటుంది. పూర్వం రోజుల్లో..బాల్య వివాహాలప్పుడు పర్కెడు కాని..ఇప్పుడు..అమ్మాయిలకి చాలా కష్టం సుమా..అలా కూర్చోవడం అనిపించింది. ..
ధన్యవాదములు.