ఒక బ్లాగర్ గా నా అనుభవాలు..వ్రాయాలని అనిపించింది. అసలు.. నేను ఏ రకం బ్లాగర్ని..అని నాకు బోలెడు సందేహం వచ్చింది. అందుకే.. ఈ ఆత్మ సమీక్ష. బ్లాగ్ (నా బ్లాగ్ ) సమీక్ష.
నే ను వ్యక్తిగతంగా..ఎవరిని నొప్పించను. నొప్పించిన దాఖలు లేవు. అలాగే అసలు కామెంట్స్ కోసం నేను ఎదురు చూడను. నా మనసుకు నచ్చినట్లు వ్రాసుకుంటాను. అది నా ధోరణి.
ఈ బ్లాగ్ లోకం లోకి వచ్చి న తర్వాత ఇక్కడ కొన్ని పోస్ట్ లు extra - ordinary గా నేను వ్రాసినప్పుడు.. గాని.. కథా విశ్లేషణలో నాకు ప్రధమ బహుమతి వచ్చినప్పుడు కానీ.. చాలా మంది చూసి చూడనట్లు పోయారు. కనీస మర్యాద తో కూడా నన్ను విష్ చేయలేదు. అది నాకు బాధ కల్గించింది అని చెప్పను కానీ .. ఒక నిర్లక్ష్యం గమనించాను. నాకు ఆ అర్హత లేదా అని అనుకున్నాను.
ఉదాహరణకి..ఒకటి చెపుతాను.."ఉడాన్" పోస్ట్ నేను కాకుండా ఎవరైనా వ్రాసి ఉంటే.. దానిపై.. ఓ..పెద్ద చర్చ పెట్టి ఉండేవారు. నా దృష్టిలో.. "ఉడాన్" చాలా మంచి కథ. ఎయిర్ పోర్ట్ లోపరిచయమై మూడేళ్ళ తర్వాత పెళ్లి చూపుల్లో కలిసే కథ కన్నా కూడా చాలా చాలా మంచి కథ.
"దేహాన్ని కప్పండి " నువ్వు వదిలేసినా కాడితో.", "అమ్మ మనసు" "సరస్సు" "ఒక మౌనం వెనుక" వారు వారే "లాంటి కవితలు ఎన్నో ప్రశంసలు పొందిన కవితలు ఉన్నాయి. కనీసం ఒక్క రన్నా ఒక కామెంట్ కూడా ఇవ్వలేదు. అంతెందుకు.. ఈ మధ్య "విహంగ" లో వచ్చిన కవిత.. "దేహ క్రీడలో తెగిన సగం" ..ఆ కవితకి కూడా ఎవరు స్పందించ లేదు. అయినా నేను బ్లాగ్ రాసుకోవడం మానేసానా? లేక అందరిని నా బ్లాగ్ చదవండి అని ఒత్తిడి పెట్టనూ లేదు.
ఇంకొకటి.. జాజిమల్లి బ్లాగ్ లో.. మల్లీశ్వరి గారు.. బ్లాగ్ లలో బ్లాగ్ ల కోసమే వ్రాస్తున్న వారిలో.. మంచి రచనలు ఎవరు వ్రాస్తారో సూచించమంటే.. కేవలం ఒక్కరు కూడా..నా పేరు సూచించలేదు. అంటే.. నాబ్లాగ్ ని ఎవరు గమనించలేదా? గమనించనిదే ఎవరు నా బ్లాగ్ ని చూడనిదే.. కు 45 000 పైగా హిట్స్ ఎలా వచ్చాయి ?
నేను కూడా.. నేను బ్లాగ్ కోసం రాస్తాను.. అని మల్లీశ్వరి గారికి తెలుపనూ లేదు. నేను బ్లాగ్ వ్రాయడం మొదలెట్టి.. 16 నెలలు అయింది. మొదటి నాలుగు నెలలు..నా కవితలు,పాటలే పోస్ట్ చేసాను. అప్పుడు నాకు మామూలు హిట్స్ కూడా లేవు. తర్వాత తర్వాత నా బ్లాగ్ అందరి దృష్టిలోకి వచ్చింది.
మన బ్లాగర్స్ అందరికి ప్రతి రోజు.. బ్లాగ్స్ అన్నీ చూడటం..మంచి పోస్ట్ కనబడితే..స్పందిస్తే.. ఒక కామెంట్ పెట్టడం సాధ్యం కాకపోవచ్చు కూడా. అసలు మన దృష్టికి రాని..మన దృష్టిలో పడని బ్లాగ్స్ ఉండవచ్చును. మొన్న మొన్ననే నేను "నీహారిక" గారి బ్లాగ్ చూసాను.. అలాగే కొన్ని బ్లాగ్ లు అందరు చూడకపోవచ్చును కూడా.అది నేను ఒప్పుకుంటాను. ఎవరి ఒత్తిడులు,ఎవరి అనుభవాలు వారివి. స్పందించనంత మాత్రాన వారిని ద్వేషించ వలసిన పని లేదు.
అయితే.. నేను గమనించిన ఒక విషయం ఏమంటే..లైవ్ ట్రాఫిక్ ఫీడ్ ద్వారా..ఎవరు మన బ్లాగ్ చూస్తున్నారో.. మనకి అర్ధమయి పోతుంది. ఎవరు నా బ్లాగ్ చూస్తున్నారో కూడా నాకు తెలుస్తూనే ఉంటుంది. కాని వాళ్ళు సంవత్సరం కాలంలో ఒక కామెంట్ కూడా ఇవ్వలేదు . ఎందుకంటే ఈ బ్లాగ్ లోకం లోకి నేను రాగానే వాళ్ళకి నేను ఫాలోయెర్ గా మారలేదు కాబట్టి అని అర్ధం చేసుకున్నాను.
ఒక కొత్త బ్లాగర్ వచ్చి ఒక పోస్ట్ వేయగానే.. ఆహా..ఓహొ..అంటూ.. కామెంట్ ఇచ్చే పెద్ద పెద్ద బ్లాగర్లు ఫాలోయర్ గా వెళ్ళే బ్లాగర్ లు 16 నెలల కాలంలో నా బ్లాగ్ ని చూడలేదంటే.. నేను ఎలా నమ్మేది. ? ఒక కామెంట్ ఇవ్వడానికి సంవత్సరం సమయం తీసుకోవడం ఆశ్చర్యం కాదా?
కొంతమంది ఫాలోయర్ గా వచ్చి బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను మొదటి నుండి ఫాలోయర్ గా ఉండటానికి ఇష్టపడలేదు. అలాగే..నన్ను ఫాలో అవమని నేను అడగనూ లేదు. అందుకే..ఆ గాడ్జెట్ తీసి పడేసాను.
నేను అప్పుడు అర్ధం చేసుకున్నాను. "దటీజ్ ..గ్రూపిజం." గ్రూపిజం గుప్పిటలో మరి కొందరు.
పిల్లల టాయిలెట్ హాబిట్ పైన కూడా పోస్ట్ లు వ్రాసుకుని..ఆహా ఓహొ.. అనే భట్రాజు పొగడ్తలకి అలవాటు అయిపోయిన గ్రూపిజం వారికి నిరసనతో..ధన్యవాదములు చెప్పుకోవడం మంచిదే కదా అనుకున్నాను.
ఒక ఆమె అయితే.. నేను ఆమె లో ఉన్న మంచి పరిణితి చెందిన రచనా శైలిని ఇష్టపడతాను. ఒక మంచి విషయం చెపుతూ పోస్ట్ పెట్టగానే.. మొట్ట మొదటగా ఆమెకి నేనే కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ ఆమె ప్రచురించనేలేదు. నా తర్వాత పెట్టిన కామెంట్స్ అన్నీ వచ్చాయి.అప్పుడు నేను యెంత హర్ట్ అయ్యానో! ఆమె రచనకి సంబందించి చాలా పోస్ట్ లు వచ్చాయి. కానీ నేను చక్కగా చదివాను. రచనలు ఇష్టం కాబట్టి. కానీ వ్యాఖ్యానం చేయలేదు. ఆమె అప్పటి ధోరణి ముల్లులా గుచ్చుకుంటుంటే.. నేను ఎలా మరచి పోగలను?
పాపం ఏ గ్రూప్ లు లేని వాళ్ళు మరి కొందరు ఉన్నారు. వారు అన్ని చోట్లా కనబడతారు. వారికి హృదయ పూర్వక నమస్సులు.
ఇంతకీ నేను చెప్పేది ఏమంటే..ఎవరు మెచ్చుకున్నా..మెచ్చుకోక పోయినా వచ్చిన నష్టం ఏమి లేదు. ఒక చిన్న ప్రశంస..మరింత బాగా నిరూపించుకోవడానికి, ఒక సద్విమర్శ లోపాలు దిద్దుకుని.. మరింత బాగా ఎదగడానికి దోహదపడుతుంది.
అది అందిస్తే ..సంతోషంగా స్వీకరించడం ..వీలయితే..సమయం కేటాయించుకుని.. కృతజ్ఞతలు చెప్పడం కనీస సంస్కారం. అలాంటి సంస్కారం లేనివారిని ఈ బ్లాగ్ లోకంలో చాలా మందిని చూసాను. వీళ్ళ కామెంట్ నాకొక లెక్కా ..అన్న అహం కనబడుతూ ఉన్నట్లు ఉంటుంది కూడా!
చదువులు,హొదాలు,స్థాయి బేధాలు .. ఇవి కాదు కావాల్సింది.
నేను ఎప్పుడో..చదివిన నాకు నచ్చిన నాలుగు మాటలు
"జ్ఞానం ఆర్జించిన వాళ్ళు పండితులు అవుతారు.
ఇతరులకి బోధించినవారు.. గురువులు అవుతారు.
ఇవి లేకున్నా హృదయ సంస్కారం ఉన్న వారు.. మంచి మనుషులు అవుతారు.
PS : నాకు వ్యక్తిగతం గా ఎవరి పైనా ద్వేషం గాని కోపం గాని లేవు. నేను ఎవరిని ఉద్దేశ్య పూర్వకంగా నొప్పించనూ లేదు.
బ్లాగర్ గా నా అనుభవాలు వ్రాసుకున్నాను. ఎవరినైనా ఉద్దేశించినట్లు అనిపిస్తే.. ఒక అభిప్రాయం చెప్పడానికే చెప్పాను తప్ప వారిని అవమానించాలని మాత్రం కాదు అని గమనించ మనవి.
నే ను వ్యక్తిగతంగా..ఎవరిని నొప్పించను. నొప్పించిన దాఖలు లేవు. అలాగే అసలు కామెంట్స్ కోసం నేను ఎదురు చూడను. నా మనసుకు నచ్చినట్లు వ్రాసుకుంటాను. అది నా ధోరణి.
ఈ బ్లాగ్ లోకం లోకి వచ్చి న తర్వాత ఇక్కడ కొన్ని పోస్ట్ లు extra - ordinary గా నేను వ్రాసినప్పుడు.. గాని.. కథా విశ్లేషణలో నాకు ప్రధమ బహుమతి వచ్చినప్పుడు కానీ.. చాలా మంది చూసి చూడనట్లు పోయారు. కనీస మర్యాద తో కూడా నన్ను విష్ చేయలేదు. అది నాకు బాధ కల్గించింది అని చెప్పను కానీ .. ఒక నిర్లక్ష్యం గమనించాను. నాకు ఆ అర్హత లేదా అని అనుకున్నాను.
ఉదాహరణకి..ఒకటి చెపుతాను.."ఉడాన్" పోస్ట్ నేను కాకుండా ఎవరైనా వ్రాసి ఉంటే.. దానిపై.. ఓ..పెద్ద చర్చ పెట్టి ఉండేవారు. నా దృష్టిలో.. "ఉడాన్" చాలా మంచి కథ. ఎయిర్ పోర్ట్ లోపరిచయమై మూడేళ్ళ తర్వాత పెళ్లి చూపుల్లో కలిసే కథ కన్నా కూడా చాలా చాలా మంచి కథ.
"దేహాన్ని కప్పండి " నువ్వు వదిలేసినా కాడితో.", "అమ్మ మనసు" "సరస్సు" "ఒక మౌనం వెనుక" వారు వారే "లాంటి కవితలు ఎన్నో ప్రశంసలు పొందిన కవితలు ఉన్నాయి. కనీసం ఒక్క రన్నా ఒక కామెంట్ కూడా ఇవ్వలేదు. అంతెందుకు.. ఈ మధ్య "విహంగ" లో వచ్చిన కవిత.. "దేహ క్రీడలో తెగిన సగం" ..ఆ కవితకి కూడా ఎవరు స్పందించ లేదు. అయినా నేను బ్లాగ్ రాసుకోవడం మానేసానా? లేక అందరిని నా బ్లాగ్ చదవండి అని ఒత్తిడి పెట్టనూ లేదు.
ఇంకొకటి.. జాజిమల్లి బ్లాగ్ లో.. మల్లీశ్వరి గారు.. బ్లాగ్ లలో బ్లాగ్ ల కోసమే వ్రాస్తున్న వారిలో.. మంచి రచనలు ఎవరు వ్రాస్తారో సూచించమంటే.. కేవలం ఒక్కరు కూడా..నా పేరు సూచించలేదు. అంటే.. నాబ్లాగ్ ని ఎవరు గమనించలేదా? గమనించనిదే ఎవరు నా బ్లాగ్ ని చూడనిదే.. కు 45 000 పైగా హిట్స్ ఎలా వచ్చాయి ?
నేను కూడా.. నేను బ్లాగ్ కోసం రాస్తాను.. అని మల్లీశ్వరి గారికి తెలుపనూ లేదు. నేను బ్లాగ్ వ్రాయడం మొదలెట్టి.. 16 నెలలు అయింది. మొదటి నాలుగు నెలలు..నా కవితలు,పాటలే పోస్ట్ చేసాను. అప్పుడు నాకు మామూలు హిట్స్ కూడా లేవు. తర్వాత తర్వాత నా బ్లాగ్ అందరి దృష్టిలోకి వచ్చింది.
మన బ్లాగర్స్ అందరికి ప్రతి రోజు.. బ్లాగ్స్ అన్నీ చూడటం..మంచి పోస్ట్ కనబడితే..స్పందిస్తే.. ఒక కామెంట్ పెట్టడం సాధ్యం కాకపోవచ్చు కూడా. అసలు మన దృష్టికి రాని..మన దృష్టిలో పడని బ్లాగ్స్ ఉండవచ్చును. మొన్న మొన్ననే నేను "నీహారిక" గారి బ్లాగ్ చూసాను.. అలాగే కొన్ని బ్లాగ్ లు అందరు చూడకపోవచ్చును కూడా.అది నేను ఒప్పుకుంటాను. ఎవరి ఒత్తిడులు,ఎవరి అనుభవాలు వారివి. స్పందించనంత మాత్రాన వారిని ద్వేషించ వలసిన పని లేదు.
అయితే.. నేను గమనించిన ఒక విషయం ఏమంటే..లైవ్ ట్రాఫిక్ ఫీడ్ ద్వారా..ఎవరు మన బ్లాగ్ చూస్తున్నారో.. మనకి అర్ధమయి పోతుంది. ఎవరు నా బ్లాగ్ చూస్తున్నారో కూడా నాకు తెలుస్తూనే ఉంటుంది. కాని వాళ్ళు సంవత్సరం కాలంలో ఒక కామెంట్ కూడా ఇవ్వలేదు . ఎందుకంటే ఈ బ్లాగ్ లోకం లోకి నేను రాగానే వాళ్ళకి నేను ఫాలోయెర్ గా మారలేదు కాబట్టి అని అర్ధం చేసుకున్నాను.
ఒక కొత్త బ్లాగర్ వచ్చి ఒక పోస్ట్ వేయగానే.. ఆహా..ఓహొ..అంటూ.. కామెంట్ ఇచ్చే పెద్ద పెద్ద బ్లాగర్లు ఫాలోయర్ గా వెళ్ళే బ్లాగర్ లు 16 నెలల కాలంలో నా బ్లాగ్ ని చూడలేదంటే.. నేను ఎలా నమ్మేది. ? ఒక కామెంట్ ఇవ్వడానికి సంవత్సరం సమయం తీసుకోవడం ఆశ్చర్యం కాదా?
కొంతమంది ఫాలోయర్ గా వచ్చి బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను మొదటి నుండి ఫాలోయర్ గా ఉండటానికి ఇష్టపడలేదు. అలాగే..నన్ను ఫాలో అవమని నేను అడగనూ లేదు. అందుకే..ఆ గాడ్జెట్ తీసి పడేసాను.
నేను అప్పుడు అర్ధం చేసుకున్నాను. "దటీజ్ ..గ్రూపిజం." గ్రూపిజం గుప్పిటలో మరి కొందరు.
పిల్లల టాయిలెట్ హాబిట్ పైన కూడా పోస్ట్ లు వ్రాసుకుని..ఆహా ఓహొ.. అనే భట్రాజు పొగడ్తలకి అలవాటు అయిపోయిన గ్రూపిజం వారికి నిరసనతో..ధన్యవాదములు చెప్పుకోవడం మంచిదే కదా అనుకున్నాను.
ఒక ఆమె అయితే.. నేను ఆమె లో ఉన్న మంచి పరిణితి చెందిన రచనా శైలిని ఇష్టపడతాను. ఒక మంచి విషయం చెపుతూ పోస్ట్ పెట్టగానే.. మొట్ట మొదటగా ఆమెకి నేనే కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ ఆమె ప్రచురించనేలేదు. నా తర్వాత పెట్టిన కామెంట్స్ అన్నీ వచ్చాయి.అప్పుడు నేను యెంత హర్ట్ అయ్యానో! ఆమె రచనకి సంబందించి చాలా పోస్ట్ లు వచ్చాయి. కానీ నేను చక్కగా చదివాను. రచనలు ఇష్టం కాబట్టి. కానీ వ్యాఖ్యానం చేయలేదు. ఆమె అప్పటి ధోరణి ముల్లులా గుచ్చుకుంటుంటే.. నేను ఎలా మరచి పోగలను?
పాపం ఏ గ్రూప్ లు లేని వాళ్ళు మరి కొందరు ఉన్నారు. వారు అన్ని చోట్లా కనబడతారు. వారికి హృదయ పూర్వక నమస్సులు.
ఇంతకీ నేను చెప్పేది ఏమంటే..ఎవరు మెచ్చుకున్నా..మెచ్చుకోక పోయినా వచ్చిన నష్టం ఏమి లేదు. ఒక చిన్న ప్రశంస..మరింత బాగా నిరూపించుకోవడానికి, ఒక సద్విమర్శ లోపాలు దిద్దుకుని.. మరింత బాగా ఎదగడానికి దోహదపడుతుంది.
అది అందిస్తే ..సంతోషంగా స్వీకరించడం ..వీలయితే..సమయం కేటాయించుకుని.. కృతజ్ఞతలు చెప్పడం కనీస సంస్కారం. అలాంటి సంస్కారం లేనివారిని ఈ బ్లాగ్ లోకంలో చాలా మందిని చూసాను. వీళ్ళ కామెంట్ నాకొక లెక్కా ..అన్న అహం కనబడుతూ ఉన్నట్లు ఉంటుంది కూడా!
చదువులు,హొదాలు,స్థాయి బేధాలు .. ఇవి కాదు కావాల్సింది.
నేను ఎప్పుడో..చదివిన నాకు నచ్చిన నాలుగు మాటలు
"జ్ఞానం ఆర్జించిన వాళ్ళు పండితులు అవుతారు.
ఇతరులకి బోధించినవారు.. గురువులు అవుతారు.
ఇవి లేకున్నా హృదయ సంస్కారం ఉన్న వారు.. మంచి మనుషులు అవుతారు.
PS : నాకు వ్యక్తిగతం గా ఎవరి పైనా ద్వేషం గాని కోపం గాని లేవు. నేను ఎవరిని ఉద్దేశ్య పూర్వకంగా నొప్పించనూ లేదు.
బ్లాగర్ గా నా అనుభవాలు వ్రాసుకున్నాను. ఎవరినైనా ఉద్దేశించినట్లు అనిపిస్తే.. ఒక అభిప్రాయం చెప్పడానికే చెప్పాను తప్ప వారిని అవమానించాలని మాత్రం కాదు అని గమనించ మనవి.
63 కామెంట్లు:
"హృదయ సంస్కారం ఉన్న వారు.. మంచి మనుషులు అవుతారు"
మంచిమాట
తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గ్రూపిజం అక్కడుంటుంది...ఆఖరుకు బ్లాగుల్లోకూడా.. ఏం చేస్తాం సర్దుకు పోదాం
తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గ్రూపిజం అక్కడుంటుంది...ఆఖరుకు బ్లాగుల్లోకూడా.. ఏం చేస్తాం సర్దుకు పోదాంవాళ్ళని పట్టించుకు పోకుండా మన త్రుప్తి కోసమే బ్లాగింగ్ చేయండి
మన జీవితాలే రకరకాల అనుభవాల మయం కదండి. నేనైతే పూర్తిగా చదివిన ఏ పొస్ట్ కైనా తప్పక కామెంట్ చేస్తాను. కథలు చదివే అలవాటు నాకు చాలా చాలా తక్కువ. నాకు ఇప్పటికీ చాలా బ్లాగ్ లు తెలియవు. ఎన్నో విషయాలు చర్చించే మీ బ్లాగ్ నాకు ఇష్టమే. మీరు ఇంకా ఎన్నో విషయాలు చర్చించల్సిందే...మేము చదవాల్సిందే...
వనజవనమాలి గారూ ...
మీ బ్లాగ్ సమీక్ష (ఆత్మ సమీక్ష )ను చక్కగా తెలియచేశారండీ..
మీకెదురైన అనుభవాల్లో చాలా నాకు కూడా అనిపించాయి...
నేను కూడా ఎవరి కామెంట్స్ కోసం బ్లాగ్ రాయలేదు ఎలాగో బ్లాగుల్లోకి వచ్చేశాను ఇంక ఆపటం ఎందుకు అని నాకు నచ్చినవి రాసుకుంటూ ఉంటాను..
బ్లాగు రాసే కొత్తల్లో నా బ్లాగ్ కి ఒక్క కామెంట్ కూడా రాకపోవటం, మిగతా వాళ్ళ బ్లాగుల్లో బోలెడు కామెంట్లు ఉండటం చూసి మా అమ్మతొ చెప్పేదాన్ని అప్పుడు అమ్మ అనేది కామెంట్స్ కోసం రాయకు నీ మనసుకు నచ్చింది నువ్వు రాసుకో..
కొందరు పోస్ట్ బాగున్నా కామెంట్ ఇవ్వరు..
మిగతా వాళ్ళంటే ఎప్పటినుండో తెలిసిన వాళ్ళు..ఆన్లైన్ లో మాట్లాడుకునే వాళ్ళు అయివుంటారు నువ్వు కొత్త కదా నీకు కూడా ఫ్రెండ్స్ అవుతారులే అని చెప్పేది.
అమ్మ చెప్పినట్లే నాకు మీరు,ఇంకా కొందరు మంచి మిత్రులు పరిచయం అయ్యారు..
నేను మొదట్లో కొందరు సీనియర్ బ్లాగర్స్ కి కామెంట్స్, విషెస్ చెప్పేదాన్ని కానీ వాళ్ళు దానికి కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుండి నేను ఎవరికీ కామెంట్స్ ఇవ్వను..
ఏది ఏమైనా మీరన్నట్లు ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఎవరికీ వచ్చే నష్టం ఏమీ లేదు..
మన మనసే మన గురువు, ఫ్రెండ్ ,
అన్నీ అని నమ్ముతాను
వనజ గారూ... మన తృప్తికోసం రాసుకున్నంత కాలం అంతా శుభమే!
వనజ గారూ,
హుమ్మ్.. మీ పోస్టుని బట్టి చూస్తే మీ బ్లాగింగు అనుభవాల్లో మీరు నొచ్చుకున్నవి చాలానే ఉన్నాయని తెలుస్తోంది. నా అభిప్రాయం రెండు మాటలు చెప్తాను.
ప్రతీసారీ ఎక్కువ కామెంట్లు వచ్చిన పోస్ట్ చాలా గొప్పదనీ, తక్కువ కామెంట్లు ఉన్నంత మాత్రాన దాని నాణ్యత తక్కువనీ నేననుకోను. ఎక్కడి దాకానో ఎందుకు.. స్వయంగా నా బ్లాగులోనే నాకు నేను ఎక్కువ ఉత్తమమైనవని అనుకునే పోస్టులకి ఒకోసారి పెద్దగా స్పందనలే రావు.. నేనేదో చాలా మాములుగా రాసాననుకున్న వాటికి విపరీతమైన స్పందన వస్తుంటుంది ఒకోసారి. ఉదాహరణకి నా బ్లాగుని తీసుకుంటే, నేను దాదాపు మూడున్నరేళ్ళ నుంచీ రాస్తున్నాను కాబట్టి మరింత ఎక్కువమందికి నా బ్లాగుతో దీర్ఘ కాల పరిచయం ఉండటం వాళ్ళ స్పందించేవాళ్ళు ఎక్కువుండొచ్చేమో, కేవలం కామెంట్ల కారణంగా గొప్పదని అనలేం కదా.. కేవలం ఉదాహరణకి చెప్తున్నాను. సాక్షి పత్రికలో రాసే రాజిరెడ్డి గారి రచనలు అద్భుతంగా ఉంటాయి. ఎన్నో లక్షలమంది ప్రతీవారం చదివి అద్భుతం అనుకునే ఆయన బ్లాగులో కూడా ఎక్కువ కామెంట్లు ఉండవు. దాని అర్థం ఆయన రాసేవి అంత బాగోవని కాదు కదా.. ఒకరికొకరం పోల్చి చూసుకుని బాధ పడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. రకరకాల సందర్భాల్లో ఎవరెవరి వీలుని బట్టి కొన్ని కొన్ని బ్లాగులు చదువుతాం, కామెంట్లు రాస్తుంటాం. మనందరికీ బ్లాగింగు ఇతరతా బాధ్యల మధ్యన చిన్న ఆటవిడుపే తప్ప ఇదే ముఖ్యమైనది కాదు కదా.. కాకపోతే, ఒకటి ఒప్పుకుంటాను. ఇన్నేళ్ళ బ్లాగింగులో స్నేహితులైన వారు వేరేవన్నీ చూసే సమయం ఉన్నా లేకపోయినా వారి వారి స్నేహితుల బ్లాగులు మాత్రం తప్పక ఫాలో అవుతున్తారేమో, బహుశా అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. బ్లాగు మొదలెట్టిన మొదటి రోజున ప్రతీ ఒక్కరూ కొత్తవారే, అందరమూ మన రాతల్ని చూసి ఎవరైనా స్పందిస్తే ఆనందిన్చేవారమే, చదువరుల ప్రోత్సాహమే మనం మరింత బాగా రాయడానికి దోహదపడుతుంది. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని బేధాలేమీ ఉండవని, లేవని నా స్వాభిప్రాయం.
నిజానికి మీ బ్లాగు చూసినప్పుడు మీరు ఇన్నాళ్ళ నుంచీ బ్లాగు రాస్తున్నారా.. నాకు తెలీనే లేదే అని ఆశ్చర్యపోయాను నేను. మీ బ్లాగు 'మాలిక' లో వస్తుందా? నాకెప్పుడూ చూసిన గుర్తు లేదు. నేను తరచూ చూసేది మాలిక ఒక్కటే కావడంతో మీ బ్లాగుని మిస్సవుతున్నానని అనిపిస్తోంది. ఇప్పుడు కూడా మీ బ్లాగ్ వెతుక్కుంటూ వచ్చాను కాబట్టి తెలిసింది నాకు మీరొక కొత్త పోస్ట్ వేసారని. లేకపోతే మిస్సయ్యేదాన్ని. ఇలా.. ఒక్కొక్కరికీ ఒక్కో కారణం ఉండొచ్చు. ఇంకో మంచి విషయం ఏంటంటే, మనం ఒకసారి రాసిన రాతలు మన బ్లాగులో శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదువుతారని నా నమ్మకం.
ఎవరో మీ కామెంటు పబ్లిష్ చెయ్యలేదని రాసారు. ఒకోసారి కామెంట్లు ఎందుకో సరిగ్గా పోస్ట్ అవ్వవు. కొన్నిసార్లు స్పాం లోకి వెళ్ళిపోతుంటాయి. అందరివీ చేసి మీది మాత్రం చెయ్యలేదంతే ఇలాంటి కారణమేదైనా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మీరు మరోసారి ఆవిడని అడగడమో, ఏదైనా సమస్యేమో తెలుసుకోడానికి ప్రయత్నించడమో చేయాల్సిందేమో.. ఖచ్చితంగా కావాలనే బ్లాక్ చేసుంటారని అనుకునే ముందు ఒక్కసారి confirm చేసుకుంటే బావుంటుందనిపిస్తోంది. ఒకవేళ మీకు ఖచ్చితంగా తెలిసుంటే అలాంటి వాళ్ళ గురించి మనం మాత్రం ఎందుకు పట్టించుకోవాలి చెప్పండి.. మన మనసుని కూడా కష్టపెట్టుకుండా జస్ట్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తే నయం కదా.. ఏమంటారూ? :)
మీరు హాయిగా మీ మనసుకి నచ్చినట్టు రాసుకుంటూ సాగిపొండి. మీకు భవిష్యత్తులో బ్లాగింగులో చక్కటి అనుభవాలు ఎదురవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. సెలవు..
మీ బ్లాగు జీవితం లో ఎదురుపడ్డ పాజిటివ్ సంగతులు కూడా పంచుకుని ఉంటె బాగుండేది
థాంక్ యు
@ వనజవనమాలి గారికి ,
జ్ఞానం ఉండి బుద్ధి లేని పండితుల కంటే హృదయ సంస్కారం ఉన్న వారు బుద్ధిమంతులు. వాళ్లు ఎంత పండితులైనా పామరులతోనూ కలసి ఉండే శక్తినీ కలిగి ఉంటారు. ఎంత పామరులైనా పండితుల కంటే వినయంగా,విజ్ఞతతో,ఓరిమితో ఉండగలుగుతారు.
"ఒక చిన్న ప్రశంస..మరింత బాగా నిరూపించుకోవడానికి, ఒక సద్విమర్శ లోపాలు దిద్దుకుని.. మరింత బాగా ఎదగడానికి దోహదపడుతుంది"-ఇది 100% నిజం. భావాలు పంచుకునేది ఇందుకేగా.తెలుగు బ్లాగర్లలో గ్రూపిజం , ఇతరులను క్రిటిసైజ్ చేయడం , తాము మాత్రమే మేధావులమనుకోవడం(?), ఇతరులకు అదే మొతాదులో ఉచిత సలహాలు ఇవ్వడం - తమను తాము పొగుడుకోవడం లాంటివి కనబడుతున్నా, తెలుగు బ్లాగర్లలో మంచి టపాలు వ్రాయగలిగే వారు- పదిమందినీ ఆలోచింపజేయగలిగిన వారు చాలామందే ఉన్నారు. ప్రతి ఒక్కరు పునరాలోచించుకుని నూతన సంవత్సరాది ఉగాది నుండి తెలుగువారంతా మరింత ఐక్యతను పెంచుకునేందుకు కృషి చేయాలని, వనజ గారిలా ఆత్మావలోకనం చేసుకోవాలనీ ఆశిస్తున్నాను. ఎవరికీ అన్ని విషయాలు ఎప్పటికీ తెలియవు. జీవితాంతం ప్రతి ఒక్కరూ విద్యార్ధి - ఉపాధ్యాయుడుగా ఉండాల్సిదే. ఒకరు ఎక్కువా - ఒకరు తక్కువా అనుకునేవారు అజ్ఞానులే.
వనజగారు, మీ బ్లాగ్ అంటే నాకు మాత్రం భలే ఇష్ట్టం.ఒక్కటి మాత్రం నిజం. రాసిన పోస్ట్స్ కి కామెంట్ వస్తే మాత్రం ఉత్సాహంగా ఉంటుంది. నాకు నచ్చిన పోస్ట్ లు ఏ బ్లాగ్ లో చదివినా పెద్దగా విష్లేసించడం రాకపోయినా బాగుంది అని మాత్రం తప్పక కమెంట్ చేస్తాను. అలా అని చదివినవారందరు వారి అభిప్రాయాన్ని తప్పక వ్యక్తపరచాలని కాదు. మీరు మీ అనుభవాలను మాతో పంచుకునందుకు ధన్యవాదాలు.
వనజ గారూ అరుణ్ గారి మాటే నామాటానూ. మనల్ని ఎవరైనా వ్యాఖ్యతో పలకరిస్తే ఆ ఆనందం వేరు. లేకపోయినా ఏదో వ్రాశామన్న తృప్తి ఉంటుంది, అది చాలు. మీ టపా ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఎక్కడ మంచి రచన చూసినా వ్యాఖ్య పెడితే వారిని ప్రోత్సహించిన వారమవుతాము...
ఏ గ్రూపుకీ చెందని బ్లాగరుని నేను. మీ బ్లాగుని క్రమం తప్పకుండా ఫాలో అవుతుంటాను. క్యారీ ఆన్, మేడమ్.
వనజా వనమాలీ,
మీరు రాసిన ఈ పోస్ట్ లోని అంశాలతో నేను ఏకీభవించలేకపోయినా మీ బాధ నిజం....మీకు ఎంత ఆవేదన కలగకపోతే ఇది రాసి ఉంటారు అనుకోగానే మీ మీద ప్రేమేసింది.
మధురవాణి చెప్పింది నిజమే...
బ్లాగింగ్ ని సీరియస్ ఔట్లెట్ గా తీసుకోవద్దని నా సలహా.ఒక వేళ తీసుకున్నా..దాన్నుంచి బయటకొచ్చే డిటాచ్డ్ నేచర్ కూడా ఉండాలి...
బ్లాగ్ లో ఏవన్నా రాసుకోవడం ద్వారా మనల్ని చాలా మెరుగు పర్చుకోవచ్చు...అంత వరకే...
నా బ్లాగ్ లో ప్రకటన ఇవ్వడం మూలంగా పరోక్షంగా మీకు నేనూ బాధ పెట్టినట్టున్నాను.యిపుడు కూడా మిత్రులెవరో మెయిల్ పెడితే వచ్చి చూసాను.
కామెంట్స్ గురించి, మన బ్లాగ్ ని ప్రస్తావించక పోవడం గురించి ఎక్కువ ఆలోచించ వద్దు.
వనజా....హృదయం కదిలించేలా మనం రాయగలిగితే...స్పందించకుండా ఉండడం మనుషులకి చేతకాదు...
మనుషుల్ని నమ్మడం అంటే మనల్ని మనం నమ్మడం అంతే...
ప్రేమతో
మల్లీశ్వరి.
ఔరా, మీ వ్రాతల వెనుక ఇన్ని చేదు అనుభవాల జ్ఞాపకాలు ఉన్నాయా !
పోనీ లెద్దురు, రాబోయే ఉగాదికి ఉగాది పచ్చడి చేసేద్దాం, చేదు తీపీ కలిపి !
మీరన్నట్టు మన మానాన రాసుకు పోవట మే బెటరు !
సమయం వుంటే రాస్తాం. వీలైనప్పుడే రాస్తాం.
చీర్స్
జిలేబి.
తెలివి ఒకింతలేక కరి భంగి సర్వమున్ తెలిసితినంచు..........లోకం అలా ఉదండీ. ఏచేస్తాం. మిక్చర్ బండి వాళ్ళం కామెంటు పెట్టచ్చాండి.
చిలమకూరు విజయ మోహన్ గారు మంచి మాట నచ్చినందుకు ధన్యవాదములు.
@Dare2write ... గారు.. నిరశించడం మాత్రమే చేసాను.ఒకరిని బాధ పెట్టాలని కాదు. మా ఫ్రెండ్స్ మేము మేమే చదువుకుంటాం ..అభిప్రాయాలు చెప్పుకుంటాం అనుకుంటే.. వాళ్ళందరూ..గ్రూప్ బ్లాగింగ్ చేసుకోవాలి. సంకలినిలలో..వారి బ్లాగ్ ని జతపర్చుకోవడం ఎందుకు? ఇతరులని అవమానించడం ఎందుకు?
అందుకే సర్దుకు పోలేక.. అంతే నండీ! స్పందించినందుకు కృతజ్ఞతలు.
@రాజీ.. మన కోసమే మనం వ్రాసుకోవడం లేదు. మనలో ఉన్న భావాలని పంచుకోవాలనే..తపన + ఐడెంటీ క్రైసిస్ కోసమే వ్రాస్తారు. గుర్తింపు రాలేదని బాధపడటం కన్నా .. ఇతరులు కావాలని చేసే నిర్లక్ష్యం బాధ కదా! మన కోసమే మనం రాసుకోవాలనుకుంటే.. బ్లాగ్ లు ఎందుకు..డైరీ లు చాలు కదా! మన మనసే మనకి గురువు.. గుడ్ ప్రొసీడ్..
ధన్యవాదములు.
మధుర వాణి గారు... మిమ్మల్ని నొప్పించాలని నేను మీ కథని ఉదాహరణగా చెప్పలేదు. తోటి బ్లాగర్ల అదీ బాగా వ్రాయగలం,లేదా వ్రాస్తున్నాం అనుకునే.. బ్లాగర్ల వైఖరిని చెప్పడానికే మాత్రమే.. పోలిక చెప్పాను.
ఒక విషయం గమనించండి. కథా విశ్లేషణలో.. నాకు "కల్పన' కథ పై విశ్లేషణకి కాకుండా.. అప్సర్ ..గారి "గొరీమా " కథ పై విశ్లేషణకి బహుమతి లభించి ఉంటే.. అప్పుడు..నా బ్లాగ్ అందరికి కనబడేది. కామెంట్ ల వర్షం వెల్లువలా వచ్చి పాడేది. (అఫ్సర్ గారు మన్నించాలి. బ్లాగర్ల వైఖరి చెప్పడం కోసం ఇలా ప్రస్తావించవలసి వచ్చింది. సారీ సర్)
నేను బ్లాగ్ నాలో భావాలని పంచుకోవడానికి .. బ్లాగులని చదువుతూ.. చైతన్య వంతంగా ఉండానికి ,వీలయితే..చైతన్యవంతంగా ఆలోచింప జేయడానికే వచ్చాను. ఇక్కడ దోరణి లని సీరియస్ గా తీసుకోలేదు ..కాబట్టే ..ఇంకా వ్రాస్తున్నాను.
ఒకసారి ప్రవీణ్ గారు.. తూర్పు-పడమర బ్లాగ్ తప్ప తతిమా బ్లాగులు అన్నీ కుట్లు అల్లికలు వంటలు గురించి చెప్పుకునే బ్లాగ్ లు తప్ప మిగతావి బ్లాగులు కాదన్నట్లు వ్యాఖ్యానించారు.
కుట్లు అల్లికలు,వంటలు కూడా జీవితం లో భాగాలేనండీ. అవి బ్లాగ్లే కాదని వ్యాఖ్యానిస్తే ఎలా? సీనియర్ బ్లాగర్స్ ఇలాగేనా.. మాట్లాడేది.
మిమ్మల్ని నొప్పించాలని మాత్రం కాదని మరొకసారి మనవి. నొప్పించి ఉంటే.. క్షమించండి.
అచంగా..రోట్లో తల పెట్టి రోకలి పోట్లుకి భయపడటం అంటారు.. కదా! అలా నేను భయపడను. మన భావాలని స్వేచ్చగా.. వ్యక్తీకరిస్తాం. ఎందుకు? మన చుట్టూ ఉన్న సమాజంలో మన వైఖరిని తెలియజేయడానికి.
మన వైఖరి నచ్చితే ..స్నేహం చేస్తారు. నచ్చకపోతే మౌనంగా ఊరుకుంటారు. మన బ్లాగ్ లలో చాలా మందికి కొన్ని బ్లాగ్ లు నచ్చవు. నచ్చవు అని చెప్పరు ఎందుకని. అంటే.. వ్రాసుకునే స్వేచ్చ ఉందనేగా.. బడ్డీ కోట్లు,టీ కోట్లు,కుట్లు అల్లికలు,కాపీ ఫేస్ట్..ఇలాటి వ్యాఖ్యలు ఎందుకు?
ఇంతకీ నేను చాలా తృప్తి గానే వ్రాసుకుంటున్నాను.ధన్యవాదములు.
@ శేఖర్ గారు.. మీ సూచన మర్చిపోనండీ.. ముందుగా అలాగే పోస్ట్ వ్రాయాలనుకున్నాను. ఒకానొక సన్నివేశం తర్వాత .. బ్రద్దలవక తప్పలేదు. బ్లాగ్ లలో బోలెడు మంచి విశేషాలు ఉన్నాటి అండీ.. తప్పక వ్రాస్తాను. ధన్యవాదములు.
@ కొండలరావ్ గారు.. ధన్యవాదములు. బ్లాగ్ లలో సొంత విషయాలు వ్రాసుకున్నా.. అక్కడ కూడా..భాద్యత,చైతన్యం ఉండాలనుకునే మనిషిని నేను. భాద్యతగా బ్లాగ్ వ్రాస్తున్నదాన్ని..వ్రాసుకుంటున్న దానిని. ఇక్కడ నెలకొన్న ధోరణి లని సున్నితంగా చెప్పడమే నా ఉద్దేశ్యం. ఎవరిని నొప్పించాలని కాదు. మరొకమారు ధన్యవాదములు అండీ!
జలతారు వెన్నెల గారు..ధన్యవాదములు. (తక్కువేమో :))))). )
@ జ్యోతిర్మయి గారు..ధన్యవాదములు. ఒక చిన్న ప్రశంస -ఒక మంచి విమర్శ లేనిదే.. ఎవరూ గొప్పవారు కాలేరండి. అది తెలుసుకుంటే..చాలు.
@ కృష్ణ గారు .. చేదు అనుభవాలని అసలు పరిగణ న లోకి తీసుకోను.. చక్కగా వ్రాసుకున్తూనే ఉంటాను. ధన్యవాదములు .
కష్టే ఫలే..గారు..యెంత మాటండీ! నొప్పించే మాట నేను ఎప్పుడు మాటాడను అండీ! మీ రాక నాకు ఎంతో ఆనందం.ధన్యవాదములు.
జయ గారు.. మీకు మరీ మరీ ధన్యవాదములు. మన తెలుగు బ్లాగ్ లు అన్ని చూస్తూ ఉండండి. నా బ్లాగ్ మాత్రమే కాదు. అలాగే మీరు ఎక్కువగా వ్రాస్తూ ఉండాలి. అది నా కోరిక.
@ మల్లీశ్వరి గారు.. మీ వ్యాఖ్యకి .. మీ ప్రేమపూర్వకమైన మాటకి.. దుఃఖం వచ్చింది. ధన్యవాదములు.
బ్లాగ్ లలో.. మంచి సాహిత్యం,సమీక్షలువ్న్తాయని చెపితే..ఇందులో కాలు పెట్టాను.
ఇక్కడ కూడా.. అంతా భావ కాలుష్యమే!
ఎందుకండి..ఇలా.. !?
మీ అనుభవాలు బోలెడన్ని ఉండి ఉంటాయి. స్పందించడం,స్పందించకపోవడం కన్నా.. నిర్లక్ష్యం,చిన్న చూపు బాధ కదా..! అది బ్లాగ్ లోకంలో నాకు చాలా స్పష్టంగా కనబడింది.
మీకు సమయం దొరికితే..ఎప్పుడైనా నా బ్లాగ్ లో కొన్ని పోస్ట్ లు చదవండి చాలు.
ధన్యవాదములు మల్లీశ్వరి గారు.
జిలేబీ.. చీర్స్!!! ఉగాదికి.. చేదు,తీపి,వగరు..ఇలా అన్ని షడ్రుచులు..పచ్చడి చేసేద్దాం. ఓకే.. చీర్స్ !!!!
మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. సీరియస్ మూడ్ లో నుండి.. బయటకి తెప్పించి.. హాయి గొల్పే..మాట లు చెప్పినందుకు.
వనజ గారూ... మీ వ్యాఖ్యలో 'కాపీ-పేస్ట్' రాతల విషయములో మాత్రం విభేదిస్తున్నాను. అందులోవి ఇందులోవి ఏరుకొచ్చి వార్తలు గుమ్మరించేదానికి బ్లాగు అనవసరం. ఆ పనికి ఈనాడు వంటి పత్రికలున్నాయి. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరూ దాదాపు అన్ని పత్రికలూ చూస్తుంటారు కనుక ఈ డంపు అనవసరం. ఎవరైనా ఒక వార్తను బ్లాగులో ప్రచురించినప్పుడు దానిపైన ఆ బ్లాగరు (రచయిత) అభిప్రాయం ఏమిటన్నది నాకు ప్రధానం తప్పిస్తే వార్త కాదు ఎందుకంటే ఆ వార్త నేను అప్పటికే చూసేసి ఉంటాను. మరో విషయం ఏమంటే ఇలా ఎత్తుకుచ్చిన వార్తలకు కనీసం ఎక్కడనుంచి ఎత్తుకొచ్చారో కూడా చెప్పకుండా అదేదో తమ స్వంత జర్నలిజం అన్నట్టు ఫోజు పెట్టటం!!
హమ్మయ్యా! ఐతే మంచి మూడ్ లోకి వచ్చేసారన్నమాట..ఐనా అలాంటివేమీ పట్టించుకోకండి.మీ కోసం మేమున్నాం కదా..మీరు హ్యాపీగా వ్రాసేయండి. మేము హ్యాపీగా చదివిపెట్టేస్తాం :):)
సుభ..గారు..ధన్యవాదములు.
@ అరుణ్. నీ అభిప్రాయం తో.. నేను అంగీకరిస్తున్నాను. ధన్యవాదములు.
ఏంటండీ మీ నిఖిల్ ఫోను చెయ్యలేదా?అందుకే ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇవన్నీ మామూలే...మన మనసుకి నచ్చితే రాసుకోవడం లేదంటే ఇలా కామెంటడమే. Cheer up
ఒక మంచి మనిషి తన భావాలను పంచుకోవాలని ప్రయత్నించడం ఎంత సంతోషకరమో, వారికి తగినంత ఆదరణ లభించకపోవడం అంత దురదృష్టం.
నిజానికి interactiveness లోపించడం అంతర్జాలంలో ఉన్న అతి పెద్ద disadvantage అనిపిస్తుంది. రచయితకు చదువరులకు eye contact లేకపోవడం వల్ల స్పందన ఎలా ఉందొ అనే విషయం ఒక పట్టాన తెలీదు. మీ టపా నచ్చినవారు కూడా కొన్ని కారణాల వల్ల స్పందించకపోవచ్చు. ఇది మాధ్యమ లోపం మాత్రమె.
More power to your pen (er, keyboard)!
వనజమాలిగారూ నేను మీ బ్లోగుని చూడటం ఇదే మొదటిసారి. హారంలో కామెంట్ల విభాగానికి వెళ్ళి ఎవరేం రాసేరో చూడటం, ఎక్కువ కామెంట్లున్న బ్లోగ్ పోస్టుని అప్పుడప్పుడు వెళ్ళి చదవడం తప్పితే నేనెక్కువ బ్లోగులని చదవను.
కానీ ఆ ఎక్కువ కామెంట్లున్న బ్లోగ్ పోస్టులు నన్ను ప్రభావితం చేసేది అరుదు. అవి సామాన్యంగా తమకి ఉన్న awareness ని చాటుకునేవే.
కానీ బహుసా మీరు చెప్పేదాన్లో కూడా ఎంతో కొంత నిజం కనిపిస్తోంది.You rub my back and I rub your back attitude ఉందేమో అనుకుంటాను.
కొన్నిసార్లు ఏదో సినిమాల/పుస్తకాల సమీక్షలకి ఎక్కువ కామెంట్లు రావడం అవీ నేను కూడా గమనించేను. దాన్లో అభిప్రాయాలు పంచుకోవడంలో తప్పుందనను కానీ అవి ఏ వార్తాపత్రికలలోనైనా/వారపత్రికల్లో అయినా కనిపిస్తాయ్. ఒరిజినల్ కంటెంట్ ఎక్కువేమీ ఉండదు. కానీ కామెంట్లు పెట్టేవాళ్ళూ పోస్ట్ రాసేవాళ్ళు కూడా ఇంటెలెక్ట్యుల్ కోయెషెంట్ ఎవరికెక్కువా అని పోటీ పడుతున్నట్టుంది చూస్తే (ఇది నా అభిప్రాయయం మాత్రమే.)
ఎవరి బ్లోగులు వాళ్ళవి ఎవరి నాణ్యత వాళ్ళవి. అది ఇతరులెవరూ నిర్ణయించలేరు. మీరు బ్లోగుని మెప్పు పొందే ఉద్దేశ్యంతో ప్రారంభించలేదు కదా! మరి బాధెందుకు? ఇప్పుడు రాస్తున్నట్లే రాస్తూ ఉండండి.
వ్యక్తిగత పరిచయాలు స్నేహాలు ఉన్నప్పుడు ( అంటే అంతర్జాల స్నేహాలని కాదు) తప్పితే ఈ బ్లోగులూ వీట్లో ఉన్న సంబంధాలు నాకెక్కువ అర్థం అవవు.
మరైతే మీ కామెంటెందుకిక్కడ అని మాత్రం అడగవద్దు. చెప్పలేను. అయినా ఇప్పటికే కొన్ని రోజులుగా వీటి గురించిన చర్చ ఎక్కువవుతోందని గమనించేను.
క్రిష్ణవేణి
వనజ గారు ఈ రోజు మీ బ్లాగ్ లో పెట్టిన పోస్ట్ చూసి చాలా బాద కల్గింది . మీకు నేను బ్లాగ్ ని పరిచయం చేసి అనవసరంగా బాధని మిగిల్చానేమో అనిపిస్తుంది . మీ ఆవేదన చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఎన్నడు తొణకని మీరు డీలా పడిపోవడం,దుఖం కల్గిందని చెప్పడం బాధ కల్గించింది. విలువైన మీ కన్నీటిని అల్ప విషయాలకి రాల్చకండి.జానే దో..
అందరూ మీలా ఉండరని మాత్రం చెప్పగలను. మీరు ఇంకా బాగా వ్రాసి ఇన్స్పైర్ గా ఉండాలని నా కోరిక. నవ్వాలి మరి .చురకత్తి చురకత్తి లా ఉండాలి మరి.
వనజ గారూ,
బ్లాగుల్లో ఫలానా విషయాలు రాస్తేనే అవి మంచి బ్లాగులు. మిగతావి అనవసరం అనే అభిప్రాయంతో నేను కూడా విభేదిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరి అభిరుచులు, ఇష్టైష్టాలు వారికుంటాయి. మనకిష్టమైనవి మనం రాసుకుంటాం. నచ్చిన వాళ్ళు స్పందిస్తారు. లేనివాళ్ళు ఊరుకుంటారు. ఒకరికి రాజకీయాలు ఆసక్తి అయితే, మరొకరికి వంటల గురించి ఆసక్తి అయ్యుండొచ్చు. ఒకరికి సరదా కబుర్లంటే ఇష్టముంటే మరొకరికి పుస్తకాల మీద ఎక్కువ ఆసక్తి ఉండొచ్చు. మరొకరికి ఏ విధమైన ఇబ్బందీ కలిగించనంతవరకూ మనం ఏం రాసుకున్నా విమర్శించే హక్కు ఎవరికీ లేదనుకుంటాను.
"ఏంటండీ.. మీరెప్పుడూ ఫలానా విషయం మీదే రాస్తారా? అన్నీ ఒకేలా ఉంటున్నాయి, బొమ్మలు పెట్టుకోడం కోసమే పోస్టులు రాస్తున్నారా.." ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు నాకు ఎదురైనప్పుడు నేను ఒకటే సమాధానం చెప్పాను. నాకు తోచింది, చేతనయింది నేను రాసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే దయ చేసి నా బ్లాగు చూడటం మానెయ్యండి అని.. నిష్కారణంగా నిరుత్సాహపరిచేవారూ, పుల్లవిరుపు మాటలతో నొప్పించేవారూ ప్రతీచోటా ఉన్నట్టే బ్లాగుల్లోనూ ఉంటారు. కానీ, అవన్నీ విస్మరించి మనల్ని ప్రోత్సహించే వారినీ, సద్విమర్శలతో మన రాతల్ని మెరుగుపరచుకునే అవకాశం కలిగించేవారినీ, మనం ఇక్కడ పొందిన చక్కటి అనుభూతుల్ని, అనుభవాల్ని మాత్రం గుర్తుంచుకుని మన పద్ధతిలో మనం సాగిపోవాలి. ఇది నేను నేర్చుకున్న పాఠం.
క్షమించడం అన్నంత పెద్ద మాటలు అసలే వద్దండి. నేనేం సీరియస్ గా తీసుకోలేదండి.. అన్నీ రకాల కోణాలు మీకు చెప్పాలనే ఉద్దేశ్యంతోనే ఆ మాట చెప్పాను. ఇందులో మనసు బాధ పెట్టుకున్నది ఏం లేదు. అందరం మన ఆలోచనలు, అభిప్రాయాలూ పంచుకుంటూ కలిసిమెలిసి హాయిగా ఉంటూ బ్లాగింగుని ఒక చక్కటి అనుభవంగా మార్చుకోవాలన్నదే నా ఆకాంక్ష.
ఓ చిన్న సలహా.. ఎంచేతనో మీ బ్లాగు మాలిక లో కనిపించట్లేదు. మీ బ్లాగుని మాలికలో చేరిస్తే మరింతమందికి మీ బ్లాగుని చేరడం సౌకర్యంగా ఉంటుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు.
Happy Blogging! :)
వనజవనమాలి గార్కి,
మీ పోస్ట్ లు క్రమం తప్పకుండా చదువుతాను... అని నాకు చాలా బాగా నచ్చుతాయి కూడా..
కామెంటు పెట్టడం ద్వారానే నాకా పోస్ట్ నచ్చిందని నేననుకోవడం లేదు....
కొన్ని కొన్ని అంతేనండి... హృదయానికి హత్తుకుంటాయి... కాని స్పందన తెలుపలేము...
మీ అర్టికల్స్ అన్నీ హృదయానికి హత్తుకొనేలా ఉంటాయి..... మీ అర్టికల్స్ మనసుపడి చదవగలిగే వారున్నప్పుడు,
మిగతా విషయాలు ఎందుకండీ(సారీ అండీ.. కొద్దిగా చనువు తీసుకున్నట్టున్నాను
వనజగారూ..
మీరు ఎంతగా నొచ్చుకున్నారో, మా పోస్టు చూస్తుంటే అర్థమవుతోంది. ఐయామ్ వెరీ సారీ అండీ. ఎవరి బ్లాగు చూసినా తప్పకుండా కామెంట్ పెడతానండీ. అలాగని కామెంట్లు పెట్టని పోస్టులు బాగలేవని కాదు కదా.. నేను బ్లాగు మొదలెట్టిన కొత్తల్లో 3 నాలుగు కామెంట్లు రావటమే గొప్ప. అయినా వాటిని పట్టించుకునేదాన్ని కాను...
మిమ్మల్ని నొప్పించిన లిస్టులో నేను కూడా ఉన్నట్లయితే ఈసారికి క్షమించేసేయరూ... తప్పకుండా మీ బ్లాగును ఫాలో అవుతాను. కొన్ని కొన్ని పోస్టులు తప్ప, పూర్తిగా చూడలేదు.. అందుకు పనుల ఒత్తిడి, వ్యక్తిగత బాధ్యతలు కారణమే అయినా... ఇకపై వీలుచూసుకుని తప్పకుండా చూస్తాను.
అన్యద భావించకపోతే ఇంకొక విషయము...
ఎక్కువ కామెంట్లు ఉంటే అది మంచి పోస్ట్ లాగా,
తక్కువ కామెంట్లు ఉంటే అది చెత్త పోస్ట్ లాగా వర్గీకరించలేము....
బాగున్న అర్టికల్ ఎక్కడ, ఎవరికి చేరాలో వారికి తప్పకుండా చేరుతుంది...
నేనైతే నా బ్లాగులో ఆర్టికల్స్ కేవలం నా కోసమే రాసుకుంటాను.... వేరొకరి కోసము కాదు...
nenu telugu blogs anni follow avutanu.I like ur blog very much.Kani comment veyadaniki time vundadu.
లైట్ తీసుకో.. మేడం.., లైట్ తీసుకో..
మీరు భలేవారండి...
మనకి బాగా తెలిసిన బంధుమిత్రులే ఒకోసారి మనల్ని అర్థం చేసుకోరు.
ఇక ముక్కూ, మొగం తెలియని బ్లాగర్లు అర్థం చేసుకోపోవడంలో ఆశ్చర్యమేముంది.
వనజ గారూ, మీరెప్పుడూ నా బ్లాగులో కానీ నా వెబ్సైట్లో కానీ వ్యాఖ్యానించలేదు :(
చదివితే తృప్తిగా అనిపించే పోస్టులు చాలా ఉంటాయి. గుర్తు తెచ్చుకుని మళ్ళీ మళ్ళీ చదువుకుంటుంటాను. మరీ ఉండబట్టలేనప్పుడు ఒక వ్యాఖ్య వ్రాస్తాను. నిజమే బ్లాగు ఎంత స్వంత వ్యవహారమైనా వ్రాసేది నలుగురితో కనెక్ట్ అవ్వడానికే. అందుకని వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. అవి పొగడ్తలే కానక్కర్లేదు. సద్విమర్శలు కావచ్చు. లేదా పోస్టులో ఉన్న విషయానికి ఇంకేమైనా add చెయ్యవచ్చు, చర్చించవచ్చు. ఐనా నచ్చినచోటల్లా వ్యాఖ్య పెట్టడం కష్టం. నా వైపునుంచి ఒక ఉదాహరణ.నాకు ప్రియరాగాలు బ్లాగులో చాలా పోస్టులు నచ్చాయి. నేను ఎప్పుడూ ఇష్టంగా చదివే, అప్పుడప్పుడూ వ్యాఖ్యలు వ్రాసే ఇంకో బ్లాగు తరహాలోనే ఇక్కడి పోస్టులూ నచ్చాయి. కానీ ఇంతవరకూ వ్యాఖ్య వ్రాయలేదు. (ఇదంతా వ్రాస్తుంటే నాకేమంత సీను లేదని కూడా అనిపిస్తోంది. వ్యాఖ్యలు అంటే పాపులర్ బ్లాగర్లు వ్రాసిన వాటి విలువే వేరు కదా :) నేను వ్యాఖ్యలు వ్రాయకపోవడాన్ని ఎవరూ మిస్ అవుతారునుకోను :)) వ్యాఖ్యలు వ్రాయకపోయినా అలవాటుగా చదువుతూ ఉండడం వల్ల ఇక్కడ వ్రాసే వారందరూ పరిచయస్తులలానే అనిపిస్తారు. అందువల్ల ఒక రకమైన తృప్తి కలుగుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా, అంతర్జాలంలోనే, కలుసుకున్నప్పుడు, మీది ఫలానా బ్లాగు కదా, మీరు ఆ పోస్టు బలే వ్రాసారు అని చెప్పగలుగుతాం.
మీరు ఈ పోస్టు, మరీ ముఖ్యంగా మీ వ్యాఖ్యల ద్వారా ఎంతో మంది మన్సులో అనుకుని పైకి చెప్పలేని విషయాలు చెప్పుకునేలా చేశారు. అదీ సహృదయంతో అందరూ అర్థం చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ముందు ఇలా వ్రాసేశారేంటి అనిపించినా ఇప్పుడు దాని ప్రయోజనం బావుందనిపిస్తోంది.
రిషి.. :)))) నిఖిల్ కాల్ చేస్తున్నాడు. నిజమే ఎక్కువ ఆలోచిస్తున్నాను.. అనిపించిందా!? థాంక్ యు!
@ జై గొట్టిముక్కల ... చాలా సంతోషం. మీ లాంటి యువత కోసమే..నేను బ్లాగింగ్ మొదలెట్టాను. థాంక్ యు వేరి మచ్.. జై ...
@వైషూ... నిజంగా బాధ పడ్డాను. ఇప్పుడు తేరుకున్నాను. ఎందుకంటే.. పైన కనిపించారు.. చూడు ..అక్షరాలలో.. రిషి&జై& నువ్వు..మీ..కోసం..మీ అభిమానం కోసం..అయినా వ్రాసుకుంటాను.సరేనా!
నిజంగా..నువ్వు బ్లాగ్ ని పరిచయం చేయడం ..మంచి విషయమే! ఈ లోకాన్ని ఇంకా బాగా చూసే అవకాశం చూపావు. థాంక్ యు..వైషూ..
మధుర వాణి గారు..ధన్యవాదములు. అసలు మన బ్లాగర్స్ యెంత మంది ఉన్నారు.. అన్నది.. ఎవరైనా పరిచయం ఇచ్చారా? నేను ఈ రోజు.. రెండు మూడు కొత్త బ్లాగ్ లు చూసాను. అందరికి అన్ని బ్లాగ్ లు చూసే అవకాశం ఎలా ఉంటుంది..? అలాటి వీలుంటే కాస్త చెప్పండి..లేదా.. ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుంది..అనిపిస్తుంది.
రాజీవ్ రాఘవ్.. .. మీ అభిమానానికి ధన్యవాదములు. కామెంట్స్ కోసం చూడటం కాదు రాఘవ.. నా ఆవేదన అర్ధం చేసుకోండి. నా మధ్య రోజు సంచరించే బ్లాగర్ లే.. లేదా పెద్ద పెద్ద పేరున్న బ్లాగర్ లు కామెంట్ పెట్టాలి అని కాదు...
కొత్తవారి పట్ల నిర్లక్ష్యం..కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎందుకన్నది.. నా బాధ. థాంక్ యు వేరి మచ్..
@శోభ గారు..పని వత్తిడి అంటే ఏమిటో.. నాకు బాగా తెలుసు. నేను అర్ధం చేసుకోగలను. మీరు..కామెంట్ పెట్టలేదని నేను ఎప్పుడు బాధపడలేదు. అయ్యో.. సారీ ఎందుకండీ!.. ప్రతి పోస్ట్ చదివి.. కామెంట్ పెట్టాలని లేదు కదా! హప్పి బ్లాగింగ్..శోభ గారు. థాంక్ యు వేరి మచ్.
@ శ్రావ్య.. ఆర్ యూ..శ్రావ్య తులసి.. థాంక్ యు.. యార్. నీ క్లాసికల్ డాన్స్ గురించి..పరిచయం చేయాలని ఎప్పటి నుండో.. అనుకుంటున్నాను. Thank you.. Sraavya.
ఓ సారి నా బ్లాగులోని ఈ క్రింది కా'మెంటల్' సిరీస్ చదవండి :)
http://sarath-kaalam.blogspot.com/2010/07/1.html
http://sarath-kaalam.blogspot.com/2010/07/2_30.html
http://sarath-kaalam.blogspot.com/2010/07/3_30.html
bongiri. గారు ..లైట్ గా తీసుకుని లైట్ గానే ఉన్నానండీ! నిజంగానే.. అనిపిస్తుంది. మొత్తానికి.. నేను మనసు చెప్పిందే చేస్తాను అని ..ఇక్కడా చెప్పాను. మనసు..పిచ్చిది..కల్మషం లేనిది కదండీ! ఏమిటో..నేను చాలా నేర్చుకోవాలి. ధన్యవాదములు సార్:)))))))
lalitag ..గారు.. నేను ఈ రోజే మీ బ్లాగ్ చూసాను. బాల సాహిత్యం కదా!.. సరే..పెద్దవాళ్ళే.. ఎక్కువ చదవాలి అనుకోండి. మీ బ్లాగ్ బాగుంది. స్పందించినందుకు..ధన్యవాదములు.
మనసులో.. ఉన్న సందేహాలు తీరడానికి ఎవరో ఒకరు తెర లేపాలి కదా ! అలా అనుకోండి. థాంక్ యు.. అండీ!..
కృష్ణవేణి చారి గారు.. స్పందించినందుకు ధన్యవాదములు. బ్లాగ్ లలో..గ్రూప్ ఇజం లేదు అంటే..నేను చాలా సంతోషిస్తాను. ఉంది అంటే..అందరూ..విచారించాలి.
మీరన్నట్లు..ఏదైనా.. ఎక్కువ కాలం వివాదంగా నడవడం మంచిది కాదు. ధన్యవాదములు
శరత్ కాలమ్.. శరత్ ..గారు..మీరు ఇచ్చిన లింక్ లో పేజ్ ఓపెన్ కాలేదు. మరలా ట్రై చేసి చూస్తాను. థాంక్ యు వేరి మచ్ ,,అండీ!
idi maitrilatagaari plus nunDi copy chaesaanu.
చాందినీ రాత్ మే ఏక్ బార్ తుజ్హే దేఖా హై
నాకు చాలా ఇష్టమైన పాట, చాలా ఎక్కువ సార్లు వినే పాట. కనీసం వారానికి ఓ రెండు సార్లయినా వింటాను. ఈ పాటకి లిరిక్స్ , ట్యూన్ కూడా అద్భుతంగా కుదిరాయి అనిపిస్తుంది. జయప్రద అభిమానులకి అయితే "వేవేల కన్నుల్లో అందమే, వెండి వెన్నెల్లాంటి అందమే" :-)
ఎపుడో పురాతనకాలంలో బజ్‌లో వేసుకుంటే, సునీత గారొచ్చి చెప్పారు, ఇది తెలుగులో వయసు పిలిచింది సినిమాలో "ఇలాగే ఇలాగే సరాగమాడితే " అనే పాట సందర్భానికి హిందీ లో అని. అప్పటినుంచీ విన్నప్పుడల్లా సునీత, ఆ పాట రెండూ గుర్తొస్తాయి నాకు.
నిన్న వనజా వనమాలి గారి బ్లాగులో ఆవిడ ఈపాట గురించి రాసి, దానికి చాలా అందంగా తెలుగు అనువాదం కూడా రాసారు. అది చూసి సునీత, పద్మా, ఒకసారి ఇక్కడ చూడు.. నీపాట ఉంది అని మెయిల్ చేసారు. థాంక్స్ సునీతా, మీవల్ల అందమైన తెలుగుసేత కూడా చూడగలిగాను.
వనజ గారి టపా ఇక్కడ. తప్పకుండా ఆవిడ అనువాదం చూడండి.
http://vanajavanamali.blogspot.com/2012/01/blog-post_29.html
sunita.
ఆ లింక్స్ నాకు శుబ్బరంగా ఓపెన్ అవుతున్నాయే!
మీ టపా క్రింద రియాక్షన్స్ పెడితే నాలాంటి కామెంట్ బద్దకిస్టులకు సౌకర్యంగా వుంటుంది. నా బ్లాగు టపాలకి లాగా 'బావుంది, సో, సో, బాగోలేదు' లాంటి రియాక్షన్స్ పెడితే సింపుల్‌గా అవి స్పందించడానికి ఇతరులకు వీలవుతుంది. సమయభావం వల్ల, ఇతర భావాల వల్ల (?!) నేను టపాలు చదివినా కూడా తరచుగా కామెంటు వెయ్యను. ఒక్కోసారి కామెంటు వెయ్యాలన్నా ఎన్నో సాంకేతిక ఇబ్బందులు వచ్చి చిరాకు పుడుతుంది. అలాంటప్పుడు రియాక్షన్స్ వుంటే మాత్రం వీలయినంతంగా స్పందించేస్తుంటా.
నా బ్లాగులో కామెంటు వేసేంత గుండె ధైర్యం లేనివారు కూడా అలా నా బ్లాగులో స్పందించి వెళుతుంటారు :)
శరత్..గారు.. ధన్యవాదములు. మీరు మరొకసారి సలహా చెప్పారు. అప్పుడెప్పుడో..మీరు చెప్పిన సలహాని వెంటనే..పాటించాను. బ్లాగ్..డిజైన్ మార్చి..అందరికి చదవడానికి వీలుగా. మళ్ళీ ఇప్పుడు.ఇలా ..ఒన్స్ అగైన్..థాంక్ యు వేరి మచ్. .మీరు ఇచ్చిన లింక్ ఓపెన్ కాలేదు..:((((
సునీత గారు..అబ్బ..ఎంత ఇష్టమైన మాట చెప్పారు. చాలా చాలా సంతోషం. నాకు ఆ పాట యెంత ఇష్టమో..చెప్పలేను. నాలా మరొకరు,మరి కొందరు ఉన్నారన్నమాట.అయ్యో.. డాన్సు చేసేస్తున్నాను. యెంత అందమో..కదా..జయప్రద గారిది. పాట సాహిత్యం.. చంపేస్తుంది..అంతే..! మీ మిత్రురాల్ల అందరికి..సారీ..మన మిత్రురాల్లందరికి ధన్యవాదములు. ఈ రోజే..ఇంకో..పాట గూగుల్ + లో పెడతాను.. చూసేయండి. ఇంకా నచ్చాలని కోరుకుంటూ.. ధన్యవాదములు.
వనజగారూ ఉందో లేదో చెప్పేటందుకు నాకేం తెలియదండి.
అయినా మీరు చెప్పినట్టు లేకపోతేనే నయం కదా! చక్కగా అందరూ కలిసి మెలిసి ఉండొచ్చు. మరీ చర్చ గురించి నాకే అర్థం అయి ఉండదనుకుంటాను. కానీ నేను ముందు రాసినది వేరు.
కృష్ణవేణి చారి గారు..నిజంగా అలా జరిగితే..బాగుండును. అలా జరగాలని కోరుకుందాం. మళ్ళీ ఓపికగా వచ్చి మీ అభిలాషని చెప్పినందుకు..ధన్యవాదములు..
వనజ గారూ,
నేను బ్లాగుల్లోకి వచ్చిన కొత్తల్లో అంటే 2008 చివర్లోనే తెలుగు బ్లాగులు వందల్లో ఉన్నాయని విన్నాను. బహుశా ఇప్పుడైతే ఆ సంఖ్య వేలల్లోకి చేరి ఉండవచ్చనుకుంటాను. కూడలి, జల్లెడ, మాలిక, హారం, సంకలిని.. వంటి బ్లాగు సంకలినులన్నీటిల్లో చాలామంది తమ తమ బ్లాగుల్ని జత చేస్తుంటారు. మనందరికీ కొత్త కొత్త బ్లాగుల్ని పరిచయం చేసేది ఇలాంటి బ్లాగు ఎగ్రిగేటర్స్ అనే చెప్పుకోవాలి. అందుకే అసలు అగ్రిగేటర్స్ లో బ్లాగుల వర్గీకరణ అనే అంశం చర్చకి వచ్చింది. :)
అప్పుడప్పుడూ మనకి ఒకటీ అరా పరిచయమైనా మొత్తంగా అన్నీ బ్లాగుల గురించి తెలియడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి ప్రస్తుతం ఉన్న బ్లాగుల సంఖ్యని బట్టి చూస్తే.
ఇదివరకు కొంతమంది బ్లాగుల్ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. వాటిల్లో నాకు తెలిసిన కొన్ని లింక్స్ ఇస్తున్నాను. ఇవన్నీ చూస్తే మీకు బోలెడు మంచి బ్లాగులు పరిచయమౌతాయి. అయితే, ఇందులో ప్రస్తుతం రాయడం మానేసిన బ్లాగులు కూడా కొన్ని ఉన్నాయనుకుంటాను.
'సరిగమలు' బ్లాగర్ వరూధిని గారు బోలెడన్ని మహిళా బ్లాగుల్ని పరిచయం చేస్తూ, మహిళా బ్లాగుల గురించి ఆసక్తికరమైన అంశాలు చేర్చి చక్కటి చర్చని లేవనెత్తారు. కింద ఇచ్చిన లింక్స్ చూడండి.
http://vareesh.blogspot.in/2009/01/blog-post.html
http://vareesh.blogspot.in/2008/09/blog-post_10.html
http://vareesh.blogspot.in/2008/09/blog-post_21.html
'సాహితీ' బ్లాగర్ మాలా కుమార్ గారు కూడా మహిళా బ్లాగులన్నింటినీ ఓ చోట ఏరి కూర్చి చివర్లో e-పుస్తకంలా కూడా మలచారు.
http://sahiti-mala.blogspot.com/2010/05/blog-post_05.html
http://sahiti-mala.blogspot.com/2010/05/blog-post_07.html
http://sahiti-mala.blogspot.com/2010/05/blog-post_09.html
http://sahiti-mala.blogspot.com/2010/05/1.html
http://sahiti-mala.blogspot.de/2010/05/blog-post_13.html
కేవలం మహిళా బ్లాగుల గురించే కాకుండా అబ్బాయిల బ్లాగుల గురించి కూడా వ్రాశారు ఈ పోస్టులో..
http://sahiti-mala.blogspot.com/2010/06/blog-post_19.html
ఇదివరలో 'బ్లాగుసోదరి' అని ఒక బ్లాగు ఉండేది. ఆవిడ 'తెలుగు బ్లాగుల్లో మగమహారాజులు' అన్న సిరీస్ లో ఎన్నో బ్లాగుల్ని పరిచయం చేశారు. దురదృష్టవ శాతూ ఇప్పుడా బ్లాగుకి పబ్లిక్ access లేనందున ఇప్పుడు మనకి చూసే అవకాశం లేదు.
ఇవే కాకుండా 'మనసు పలికే' బ్లాగు రాస్తోన్న అపర్ణ కూడా కొన్ని బ్లాగుల్ని పరిచయం చేస్తూ రాసిన పోస్టులు చూడొచ్చు మీరు.
http://manasupalikey.blogspot.de/2011/09/blog-post.html
http://manasupalikey.blogspot.de/2011/10/2.html
వనజవనమాలి గారూ!
బ్లాగర్ గా మీరు పంచుకున్న మీ అనుభాలు అందరివీనూ...మీలా చాలా మంది బ్లాగర్లూ అనుకుంటూనే ఉంటారు. రాసిన ప్రతి పోస్ట్ కీ మంచి స్పందన రావాలని వస్తుందనీ ఎదురు చూస్తూ. , మీలా బయటపడి రాయలేక పోయారు అంతే తేడా... ఏ విషయమైనా నిర్భయంగా పంచుకోగలిగేదే బ్లాగ్. చదివిన వారు ఒక నిమిషం సమయం తీసుకుని స్పందిస్తే అది మంచి స్ఫూర్తి గా రాసిన వారికి మళ్ళీ కొత్త శక్తి ని ఇస్తుంది. ఆ విషయం చాలా మందికి తెలీకపోవచ్చు., కానీ బ్లాగర్స్ కి మాత్రం తెలుసు.
బ్లాగ్ ద్వారా ఎందరో కొత్త మితృలు , తోటి బ్లాగర్ల ప్రోత్సాహం ఇవన్నీ ఉత్సాహాన్ని ఉల్లాసాన్నీ ఇస్తాయి. ఇంకా బాలా రాయాలి అన్న స్ఫూర్తి నీ ఇస్తాయి. ప్రతి తీపి అనుభవం తోనూ కాస్త చేదు అనుభవాలు ఎప్పుడూ ఉంటాయి. మరిన్ని మంచి పోస్ట్ లు రాస్తూ చాలా తీపి జ్ఞాపకాలు మీ సొంతం కావాలని ఆశిస్తూ...
- చిట్టి, పండు.
శరత్ కాలం ..శరత్ గారు.. మీరు ఇచ్చిన బ్లాగ్ లింక్స్ చూసాను. మీరు ఆ పోస్ట్ పెట్టేపట్టప్పటికి నేను బ్లాగ్ లోకం లో అడుగు పెట్టలేదు..లెండి. లేకపోతే..నేను కామెంట్ పెట్టి ఉండేదాన్ని. :)))))))
మీ అనుభవం లో నేను తెలుసుకున్న విషయం ఏమంటే ..ఆకువేసుకుని కూర్చుని అడిగి పెట్టిన్చుకున్నట్లు ఉంది. :))))))
ధన్యవాదములు. .. అన్నట్లు మీ బ్లాగ్ నేను చదువుతాను. త్వరలో ఒక పోస్ట్ వ్రాస్తాను లెండి. ..
చిన్ని ఆశ..చిట్టి-పండు..మీ మనసులో మాటలు చెప్పి.. నాకు నా మాటకు బలం చేకూర్చారు. ధన్యవాదములు. గుర్తింపబడాలి అనే కోరిక లేకుంటే.. ఎందుకు బయట ప్రపంచంలో తమ ఆలోచనలు పంచుకుంటారు..చెప్పండి.? అందరు విశ్వనాధ సత్యనారాయణలు,శ్రీ శ్రీలు,రంగనాయకమ్మలు,ఓల్గా..లు అవరు. ఎవరి పరిణితి వారికి ఉంటుంది..అంతమాత్రాన చిన్న చూపు చూడాలా..ఏమిటీ..అంటాను నేను. ధన్యవాదములు.
నేనూ చాలాసార్లు మీ టపాలకు కామెంట్లు పెట్టలేదు.
పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు.
కానీ మీ పోస్ట్ లు చదివా ..
ఇది మిమ్మల్ని నొప్పించి ఉంటె క్షమించండి.
బ్లాగుల్లో ఆహా, ఓహో.. లు రావాలంటే చాలా "________" లు ఉండాలి.
ఏమైనా మన తృప్తి కోసం మనం వ్రాసుకోవటమే.
గౌరవాభిమానాలతో .....
అన్న
అజ్ఞాత గారు.. ధన్యవాదములు. మీరు..నాకు కామెంట్ పెట్టడం కోసమే..మరో పేరుతొ.".అసిధార " అన్న ఐ డి ..తో వచ్చినట్లు ఉన్నారు. మీ నిందారోపణ తో..కూడుకున్న సుదీర్ఘ కామెంట్స్.. కి ధన్యవాదములు.
నాకు విషయం చెప్పటానికే మొహం చాటేసిన మీ..కామెంట్స్ ని నేను ప్రచురించలేను.
మీరు అన్నట్లు.. నా బ్లాగ్ చెత్త బ్లాగే.. కానీ మీరు ఒక సూచన చేసారు. ఆ సూచనకి ధన్యవాదములు.
సాహిత్యానికి ప్రామాణికం ఉండదు..(పలానా వారు రాస్తేనే.. మంచి రచన అని నిర్దారించడం) ఎవరైనా వ్రాయవచ్చు. అది తెలుసుకోండి ముందు.
సున్నితంగా కూడా విమర్శ చేయవచ్చు. మీ వికృతమైన మనస్తత్వం ..మీ వ్యాఖ్యలలో కనబడింది. నేను బ్లాగ్ పెట్టిన తర్వాత..వచ్చిన కామెంట్స్ లో ప్రచురించకుండా డిలేట్ చేసిన కామెంట్స్ లో..మీవి..రెండు. మరొకరిది..ఒకటి.
ఇక్కడా నా మనసు చెప్పినట్లే చేసాను. ధన్యవాదములు.
వనజ వనమాలి గారు బాగుందండి మీ పోస్ట్ .. దాదాపు ఏడాది కాలం నుంచి బ్లాగ్స్ రోజూ చూస్తున్నాను.పలానా వారి రాతలే అద్భుతం ... అంటూ ఒక బృందం చేరి బృంద గానం చేయడం అన్ని చోట్ల ఉన్నదే .. దాన్ని సరదాగానే తీసుకోవాలి .. నరిశెట్టి ఇన్నయ్య ప్రాంతం, కులం , మతం వంటి వాటిని పట్టించుకోకుండా తాను అనుకున్నది రాస్తారు . బ్లాగ్స్ లో ఆయన బ్లాగ్ పెద్దగా పాపులర్ కాలేదు . అంత మాత్రాన ఆయన రచనలు తక్కువగా చూడలేము . నా దృష్టిలో మాత్రం రచనను చూడాలి తప్ప , కొత్త పాత , పాపులర్ పట్టించుకోవద్దు . సలహాలు పట్టించుకొనే మన రాతలను సమిక్షించుకుంటే తప్పు లేదు అలా చేయాలి కూడా . మన రచనలను మనమే నిష్పాక్ష పాతంగా సమిక్షించుకోవడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది . మీరు ఒక సారి విజయవాడలోని ఒక విద్యా సంస్థ లో కులం , గ్రూపుల వ్యవహారం పై చక్కని పోస్ట్ రాశారు . రాజకీయ అంశం లో బాగంగా ఇటివల కాలం లో నేను కులం అంశం పై దృష్టి sarinchanu ( రాజకీయాల్లో కులం పై కొంత అవగాహనా ఉంది ) కానీ మీ పోస్ట్ చూసేంత వరకు వ్యవహారం స్కూల్ స్థాయి వరకు ఉందని తెలియదు . ఈ పోస్ట్ గురించి నేను చాలా చోట్ల చర్చించాను . నేను ఆ కాలేజి నుంచే వచ్చాను అంటూ అదే అంశం గురించి టీవి జర్నలిస్ట్ అయిన ఒక అమ్మాయి మరిన్ని వివరాలు చెప్పారు . ఆ పోస్ట్ పై నేను కామెంట్ రాశానో లేదో గుర్తు లేదు . ఒక్కో సారి కామెంట్ రాస్తారు రాయరు . గతం లో జీవిత అనుభవాలు అంటే మహాత్మా గాంధీ జీవిత చరిత్రనో , నేహృదో చదవాలి అంతే .. దిన పత్రికల aadivaram అనుభందం లో వచ్చిన మార్పుల వాళ్ల మనం చూసిన ప్రముఖుల అనుభవాలు కూడా చదివే అవకాశం లభించింది . ఇక బ్లాగ్స్ వాళ్ల అందరి జీవిత అనుభవాలు తెలుసుకొనే అవకాశం లభించింది . నాకు బ్లాగ్స్ లో బాగా నచ్చిన అంశం ఇదే. ప్రతి ఒక్కరు దేశానికి స్వతంత్రం తెచ్చిన వారే కానవసరం లేదు అందరికీ జీవితం ఉంది, ఆ జివిథనీ అనుభవాలు ఉన్నాయి .వాటిని పంచుకోనేదుకు బ్లాగ్స్ ఉన్నాయి . కామెంట్స్ ఎలా ఉన్నాయి, ఉన్నయా లేదా వాటి మానాన వాటిని వదిలేయండి మీకు నచ్చింది మీరు రాయండి .
వనజ వనమాలి గారూ ! మీవరకు మీకు
బ్లాగు లోకాన చక్కటి వ్యాప్తి గలదు ,
మంచి తెలుగు , విస్ఫష్ట భావ సంచిత మగు
తమరి బ్లాగు మా కానంద దాయకమ్ము
బ్లాగు: సుజన-సృజన
ర్మ గారి బ్లాగ్ అనుకుంటా రోడ్ పక్కన పెసరట్టు అమ్ముకునే వ్యక్తి చల్లారింది నేను తినను, నేను తినంది మీకు ఎలా అమ్ముతాను అని చెప్పిన విషయం రాశారు ఇలాంటివి చదివి నేను టీవి లలో నాటిక విలువల గురించి మాట్లాడుతున్న పెద్ద మనుషుల పెద్దరికం తెలుసు కాబట్టి చిరాకేస్తుంది ఆలాంటి సమయం లో మరు మూల పల్లెల్లో ఇలా ఎవరికీ తెలియ కుండ ఉన్న మంచి వ్యక్తుల గురించి చదవడం బ్లాగ్స్ వల్లనే సాధ్యం .. ఆలాంటి పోస్ట్ లకు కామెంట్స్ సంగతి ఏమిటో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఆలాంటి అనుభవాలు చదవడమే ఇష్టం.
అన్నాం పెట్టమ్మ అనే కొడుకు కాకుండా అన్నాం తిందాం పదమ్మా అనే కొడుకు అని ఓ పోస్ట్ లో మీరు రాశారు యెంత బాగుంది . ప్రతి తల్లి అదే కోరుకుంటుంది. అలాంటివి చదివాక పిల్లలు కూడా అదే కోరుకున్తరేమో
వనజా వనమాలీ గారు
లోకో భిన్నరుచి !బ్లాగుల్లో ఫలానా విషయాలు రాస్తేనే అవి మంచి బ్లాగులు. మిగతావి అనవసరం అనే అభిప్రాయం పై ఇటీవల చర్చ జోరుగా సాగుతోంది . ప్రతి ఒక్కరికి అభిరుచులు, ఇష్ట ఇష్టాలు ఉంటాయి .మనకిష్టమైనవి మనం రాసుకుంటాం. నచ్చిన వాళ్ళు స్పందిస్తారు. లేనివాళ్ళు ఊరుకుంటారు. ఒకరికి రాజకీయాలు ఆసక్తి అయితే, మరొకరికి వంటల గురించి ఆసక్తి అయ్యుండొచ్చు. ఒకరికి సరదా కబుర్లంటే ఇష్టముంటే మరొకరికి పుస్తకాల మీద ఎక్కువ ఆసక్తి ఉండొచ్చు. మరొకరికి ఏ విధమైన ఇబ్బందీ కలిగించనంతవరకూ మనం ఏం రాసుకున్నా విమర్శించే హక్కు ఎవరికీ లేదు. విమర్శలు కూడా సున్నితం గా ఉంటె ఆస్వాదించగలం. ఇష్టమైతే చదువుతారు లేకుంటే లేదు . ..మీ పని మీరు చేస్తూ వెళ్ళండి గుడ్ లక్
ఆత్రేయ అన్న గారు... అయ్యో.. యెంత మాట...!కామెంట్ పెట్టక పోవడం వల్ల నేను భాదపడలేదు.వీళ్ళంటే ఎంతలే అన్న చిన్న చూపే ఎక్కువ బాధపెట్టింది.
అయినా ఈ ఆవేదన నా ఒక్కరిదే కాదు.చాలా మందిది అని నేను వెల్లడించాక అర్ధమైనది. ధన్యవాదములు.
అయినా ఈ కామెంట్స్ గోల ఈ రోజు ఒక్కరోజే లెండి.
బుద్ధా మురళీ గారు.. మీ అభిప్రాయాలకి ధన్యవాదములు.
@వెంకట రాజారావు లక్కాకుల గారు.. ధన్యవాదములు.
@కేఎన్ మూర్తి గారు..ధన్యవాదములు.
శ్రీనివాస్ గారు..నన్ను అభినందించినా,పొగిడినా,ఇంకా వర్గీకరించినా..కూడా మీ కామెంట్ ని పోస్ట్ చేయలేక పోయాను. మన్నించండి . ఎందుకంటె..మీ ప్రొఫైల్ వివరంగా లేనందువల్ల.సారీ..అండీ! .
మిత్రులందరికీ కృతజ్ఞలు... నేను.. ఈ రోజు నుండి..నా బ్లాగ్ లో కామెంట్..ఆప్షన్ ని తీసివేస్తున్నాను.
నేను కామెంట్స్ కోసం ఆశించి.. ఈ చర్చ లేవనెత్త లేదు. నా కు తోచినట్లు,నా భావాలకి అనుగుణంగా బ్లాగ్ వ్రాసుకుంటాను. ఒకరి పొగడ్త,లేదా విమర్శ .. లతో ప్రమేయం లేకుండా.. నా పోస్ట్‌లు నచ్చితే..చదువుతారు.,లేదా లేదు.
నా పట్ల అభిమానం చూపించి ..అలాగేనా అభిప్రాయాలని బలపరచిన అందరికి మనఃపూర్వక ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి