18, ఏప్రిల్ 2012, బుధవారం

ప్రేమ అన్నది ఒక కల

 సర్వాంతర్యామి ప్రేమ .. 

చెప్పా పెట్టకుండా వచ్చి జీవితాలని అతలాకుతలం చేసి వెళ్ళిపోతుంది.  

పాము కాటుకు చిక్కుకున్న వాళ్ళు బతికి బట్ట కట్టవచ్చునట. ప్రేమ కాటుకి బలైన వారు బతికి బట్ట కట్టలేరని..ఓ..కవి వ్రాసినట్లు..
ఎక్కడ చూసినా ప్రేమ జాడలే!  
ఏముంది !? అందులో అనుకుంటూనే ..ఎప్పుడో ఒకప్పుడు టక్కున అగాధం లాంటి ఆ ప్రేమలో జారి పడుతుంటారు.
ప్రేమ గాధలు,బాధలు వినే వారికి బాగా లోకువైపోయిన రోజులివి. ఎక్కడ వినగలం చెప్పండి.అన్నీ అవే కదా! 
పార్కుల్లో ప్రేమలు పోయి మొబైల్ ప్రేమలు నరకం రా బాబు.. అనుకోవడం తప్ప ఇక వినడానికి ఏముంది. !? 
మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లేదా ఒక అబ్బాయి.. 
"వేరొకరి మాజీ ప్రేమికుడు లేదా మాజీ ప్రేమికురాలు " 
వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం. కాలక్షేపపు ప్రేమలు.. విలాసాల కోసం ప్రేమలు ..ఎక్కువై ..నిజమైన ప్రేమ ఎక్కడుందో..అని అనుమాన పడుతూనే ఉంటాం. 
ఈ ప్రేమ గురించి యెంత చెప్పినా తక్కువే! కొంత చెప్పినా ఎక్కువే!  ప్రేమ అనే కలలలో పోద్దస్తమాను తేలియాడకుండా, ఆ మాయదారి వలలో చిక్కుకోకుండా కాస్త మనసుని అదుపు ఆజ్ఞాలలో ఉండనీయండి. 
"ప్రేమ ఉద్భవం ఎదను చిగిర్చే వసంతం - ప్రేమ విఫలం వ్యధను రగిల్చే గ్రీష్మం"   బి కేర్ పుల్ !
 అందుకే..విషయానికి బై బై ..చెప్పేసి ఒక పాట. 
నూటికి నూరు శాతం.." ప్రేమ" గురించి చెప్పే పాట 
ప్రేమ "బ్రహ్మముడి" వరకు దారితీయక పోయినా సరే బ్రహ్మ పదార్ధం లాంటి వస్తువని అనుకుంటూ..ఎంతో మంది ప్రేమికులి పెదవుల పై చిరునవ్వులని చెరిపేసే ప్రేమ...



ప్రేమ ..గురించి..ఈ పాట.
 కే.జే.యేసు దాస్  గళం ఒలికించిన ఈ పాటకి 
సాహిత్యం: దాసరి నారాయణరావు గారు.
సంగీతం: చంద్ర శేఖర్. . 
సాహిత్యం..
 ఓ..ఓ...ఓ..ఓ...ఓ..
ప్రేమ అన్నది ఒక కల.. కల .. కల
చిక్కు కుంటే అది వల... వల.. వల 
మొదట  సాగుతుంది నావలా
పరుగు పెడుతుంది లేడిలా 
పిదప ఎదిరిపోతుంది కాకిలా 
కడకు విడిచిపోతుంది ఏకాకిలా (ప్రే)

మనసు  అనే మల్లె మొక్క  పై ఆశ అనే తుమ్మెదల్లె
వాలుతుంది రసవంతంగా, చేరుతుంది బలవంతంగా  
చేరి మొగ్గపై మొగ్గలేస్తుంది అది ముక్కలైతే యెగిరి పోతుంది
మరో మొక్క పై వాలుతుంది కొత్తగా..కొత్తగా 

ప్రేమ అన్నది ఒక కల.. కల . కల
చిక్కు కుంటే అది వల... వల   వల 
మొదట  సాగుతుంది నావలా
పరుగు పెడుతుంది లేడిలా 
పిదప ఎదిరిపోతుంది కాకిలా 
కడకు విడిచిపోతుంది ఏకాకిలా

వయసు అనే పూల  బండి పై 
పెళ్లి అనే గూడును  కట్టి ఆపుతుంది నెమ్మదిగా ...
ఎక్కుతుంది ఆనందంగా....  
ఎక్కి బండినే పడ దోస్తుంది అది పడుతుంటే పారిపోతుంది
మరో బండి పై ఎక్కుతుంది కొత్తగా ..కొత్తగా

ప్రేమ అన్నది ఒక కల.. కల . కల
చిక్కు కుంటే అది వల... వల   వల 
మొదట  సాగుతుంది నావలా
పరుగు పెడుతుంది లేడిలా 
పిదప ఎదిరిపోతుంది కాకిలా 
కడకు విడిచిపోతుంది ఏకాకిలా (ప్రే)
 


12 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

బాగుంది అండి పాట ప్రతి అక్షరం నిజం అండి మంచి పాటను పరిచయం చేశారు ధన్యవాదములు

మానస.. చెప్పారు...

:) బాగుందండీ.... మీ పోస్టు & పాట.

కాయల నాగేంద్ర చెప్పారు...

"ప్రేమ ఉద్భవం ఎదను చిగిర్చే వసంతం,
ప్రేమ విఫలం వ్యధను రగిల్చే గ్రీష్మం"
చాలా బాగుందండి! దేశంలో అన్నీ కలుషితం
అయినట్లే, ప్రేమ కూడా కలుషితం అయిపొయింది.
నిజమైన ప్రేమను ఎవ్వరూ నమ్మరు.

శేఖర్ (Sekhar) చెప్పారు...

:))

శ్రీ చెప్పారు...

బాగుందండీ,,,

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Baalu gaaru.. Thank you very much!!

@Manasa gaaru Thank you very much!

@ Nagendra gaaru.. Dhanyavaadamulu.

@ Shekhar gaaru..:) Thank you very much!

Sri gaaru Thank you very much!

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

ప్రేమ గురించి చిన్నప్పట్నించి సరిగా చెప్పక పోవటం వల్ల అందరు ప్రేమంటే స్త్రీ పురుష సంబంధమే అనుకుంటున్నారు.ఎంత లోతయిన భావం ,ఎంత విస్త్రుతార్థం వుంది దానికి !ప్రేమికుల రోజు ఫై నేను ఒక వ్యాసం వ్రాసాను .అది గమనించండి .మీరు చెప్పిన పాటకు ఒక సమాధానం అవుతుందేమో చూడండి .

పల్లా కొండల రావు చెప్పారు...

యువతీ యువకుల మధ్య ఉండే రొమాన్స్ మాత్రమే ప్రేమ అని భ్రమపడుతూ చాలామంది ఆ పేరు వినగానే అదే అంశం అనుకుంటూ ప్రేమ ని అపవిత్రం చేస్తున్నారు.

ప్రేమలో మాజీ ప్రేమలసలుండవు. అవును సర్వాంతర్యామి ప్రేమ .. సర్వాన్ని ప్రేమించవచ్చు పాజిటివ్ గా .

ఏదో ఒక టీ.వీ సీరియల్ లో చెప్పినట్లు ప్రే అంటే ప్రేమించడం .. మ అంటే మరచిపోవడం ... కాదు ప్రేమ అంటే.

ప్రేమ అనే పదం అర్ధం చాలా విస్తృతమైనది. కేవలం యువత దశకు రాగానే పుట్టేది ప్రేమ కాదు.

ప్రేమ అంటే ఆడా మగా మధ్యన మాత్రమే అవసరం కోసం మాత్రమే బందీగా ఉండేది ఎంతమాత్రమూ కాదు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రవి శేఖర్ ..గారు నిజమైన ప్రేమ గురించి అవగాహన కల్పించడం ..గురించి నా మాట

ప్రేమ అంటే ఏమిటో.. నాలుగేళ్ల ప్రాయం నుండే తెలుసుకునే టట్లు..మన మీడియా వేసే ప్రభావం నుండి..బిడ్డలని మళ్ళించి అవగాహన కల్పించడం యెంత వరకు సాధ్యం చెప్పండి. ? చదువు పేరిట బందీల దొడ్డిలో పిల్లలని పడేసి వాళ్ళ మానసిక వికాసం కి ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తున్న విద్యా విధానం ,తల్లిదండ్రులు..ఎవరు కారకులు చెప్పండి. ? ప్రతి ఇంట్లో వాళ్ళు కౌన్సిలింగ్ క్లాస్స్ లకి వెళ్ళ వలసిన అవసరం ఉంటుంది. న్యూక్లియర్ ఫామిలీస్ లో గతి ఇంతే!

మీరు వ్రాసిన పోస్ట్ తప్పక చూస్తాను. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పల్లా కొండలరావు గారు..నేను మీ ఈ వ్యాఖ చూడక ముందే.. యువతరం-నవతరం పోస్ట్ వ్రాసి పోస్ట్ చేసాను.

మళ్ళీ ఇంకో పోస్ట్ లో కొన్ని విషయాలు వ్రాస్తాను.

మీ అభిప్రాయానికి, నే వ్రాసిన ప్రతి పోస్ట్ కి మీరు తెలుపుతున్న స్పందనకి ధన్యవాదములు.

జలతారు వెన్నెల చెప్పారు...

బాగుంది వనజ గారు..మీ ఫొస్ట్ లు ఇన్ని మిస్స్ అయ్యనా నేను?

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Jalataaru vennela gaaru.. Ippudu vacchesaaru kadaa!
manasaina mee spandanaki Thank you very much!