29, ఏప్రిల్ 2012, ఆదివారం

మహిళ ల "పవర్" వృధాయే..నా!?


మహిళ లకి చట్ట సభలలో..౩౩ % రిజర్వేషన్ లభించాలని బిల్లు ప్రవేశపెట్టి 16 సంవత్సరాలు అయినప్పటికీ ఆ బిల్లుకి ఆమోదం ఎప్పుడు కల్గుతుందో చెప్పలేం కానీ ..స్థానిక సంస్థలలో ప్రజా ప్రతినిధులుగా మహిళలకి లభించిన అవకాశం పుణ్యమా అని ..చాలా మంది స్త్రీలు.. గృహ సామ్రాజ్యాన్ని దాటి గ్రామ సామ్రాజ్యం లోకి అడుగిడి వారి పరిధిని కాస్త పెంచుకునే అవకాశం కల్గినందుకు సంతోషించాలి.

అలా రిజర్వేషన్ పుణ్యమా అని లభించిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడం మహిళలకి కట్టి మీద సాము లాటిది. ఎందుకంటె..రిజర్వేషన్ ప్రాతి పాదిక పైన లభించే స్థానాల్లో మహిళలు పోటీ చేయడం జరిగినప్పుడు..అనేక ఇబ్బందులు ఉన్నాయి . ముఖ్యంగా మహిళలకి తగిన చదువు లేకపోవడం ,రెండు రాజకీయ అవగాహన లేకపోవడం,అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు గడప దాటాక పోవడం వల్ల ప్రపంచ జ్ఞానం లేక.. వారికి లభించిన అవకాశం మేర..వారు ప్రజా ప్రతినిధులుగా పోటీ చేయడం దగ్గర నుండి,ఎన్నికల ప్రచారం,గెలుపు ఓటమిల అవకాశాలు గురించి తెలుసుకునే వరకు ప్రతి విషయం అంతవరకు గ్రామంలో మాజీ ప్రతినిధుల చేతుల్లోకి,ముఖ్యమైన నాయకుల చేలలోకి వెళ్ళిపోతుంది.

అసలు సిసలైన ప్రజా ప్రతినిధులు అయిన వీరే డమ్మీ ప్రతినిధులుగా మిగిలిపోతారు. మహిళా ప్రజా ప్రతినిధుల పవర్ ని తమ చేతుల్లోకి తీసుకుని.. మెన్ పవర్ లేదా మనీ పవర్ అధికారం చెలాయిస్తారు. వీరు.. మాత్రం ఓ..ఆటోగ్రాఫ్ ఇచ్చిన రీతిలో లేదా అంతకన్నాహీనంగా చెప్పాలంటే నిశాని గానో మిగిలిపోతారు.

ఓ..అయిదేళ్ళ కాల పరిమితిలో వీరికి తృణమో,ఫలమో ముట్టజెప్పి.. రాజకీయ నాయకుల హవా యధాతధంగా కొనసాగుతూ ఉంటుంది. ఇది గ్రామ స్వరాజ్యం. మహిళ లకి లభించిన పవర్.

మా మండలంలో మండల ప్రజా పరిషత్ స్థాయిలో ఎమ్.పి.టి.సి లు ,సర్పంచ్లు గాను మా మండలంలో ఎక్కువ మంది మహిళలకి అవకాశం లభించాయి.

మా మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పదవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది. విపరీతమైన స్టేజ్ ఫియర్. ప్రత్యర్ధి వర్గం లో ఉన్న జిల్లా స్థాయి నాయకురాలు ని ఓడించే ప్రక్రియలో..ఈమెకి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అవకాశం లభించింది. ఆమె భర్త.. ఓ..ప్రముఖ రాజకీయ నాయకుడి అనునూయుడు.

ఇక ఏడు గ్రామాల లోను వీరి హవాకి తిరుగులేదు. ఆమె మాత్రం రోజు ఒక సరి క్రొత్త చీర కట్టుకుని..మీటింగ్ లకి హాజరై..రెండు ముక్కలు గడ గడ వణుకుతూ..మాట్లాడి వచ్చేసేది.
ఆమెకి ప్రతి రోజు మీటింగ్ ఏమో కానీ..నాకు మాత్రం మా మండలం గురించిన ప్రతి చిన్న విషయంలోనూ..పూర్తి అవగాహన వచ్చేసింది.
ప్రతి రోజు టంచనుగా వనజ గారు..మీటింగ్ ఉంది అని చెప్పి . దీని గురించి క్లియర్గా చెప్పరా.. మీటింగ్ లో ఏం మాట్లాడాలో అన్నది స్క్రిప్ట్ వ్రాసి ఇవ్వరా అని వచ్చేది. ఆమె భర్తకి పెద్దగా ఏమి తెలియదు. కానీ వెనుక ఉన్న రాజకీయ వర్గం మాత్రం..రాష్ట్రంలో నే బెజవాడ అంటే టక్కున గుర్తుకు వచ్చే నాయకుడు. నేను అయితే..రోజూ.. నాకు ఈ శిక్ష ఏమిటి భగవంతుడా ! అనుకుని విరక్తి చెందే దాన్ని. పోనీ..నావల్ల కాదండీ అని చేపుదామంటే నోరు వచ్చేది కాదు. ఆమె దిగులు ముఖం చూసి జాలితో సరే అనేదాన్ని. అలా అయిదు ఏళ్ళు..ఆమెకి వెనుక ఉండి ఆమెని అలా ముందుకు నెట్టే దానిని.

ఒక రోజు మీ ప్రజా ప్రతినిధులు అని చెబుతున్నాను. ప్రజా ప్రతినిధులు అంటే ఏమిటి అని అడిగారు ఆవిడ.నేను స్టన్ అయిపోయాను.మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు గా ఆమె ఉన్నప్పుడు ఇసుక సీనరీల విషయంలో కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయి. ఆమె మాత్రం నామ్ కే వాస్తే! ఆ పవర్ కి విలువ వచ్చింది ఎక్కడ ..ఆమెకి ఇచ్చింది ఎక్కడ అనిపించింది నాకు.

ఇక మా వూరి సర్పంచ్..మహిళా మణి . నాకు బాగానే పరిచయం. అక్కా అంటూ గౌరవంగా మాట్లాడుతుంది ఆప్యాయంగా మాట్లాడుకుంటాము. ఆమెకి పెద్దగా గ్రామ పరిపాలన గురించి వారికి ఉన్న అధికారుల గురించి పెద్దగా అవగాహనలేదు.నేను మాత్రం అప్పుడప్పుడు దోమల సమస్య గురించి,మురుగు నీటి సమస్య గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడల్లా..తన కి ఉన్న పేస్ వాల్యూ గురించి.. తన పవర్ గురించి చెప్పి భాదపడి పోతూ ఉండేది. గత ఏడాది పంచాయితీ పాలక వర్గ పాలన ముగిసి.. అసలు పవర్ చెలాయించే..వారి కబంధ హస్తాల నుండి బయట పడి..ఇప్పుడు రైతు బజార్ అనబడే కూరగాయల షాప్ నిర్వహించుకుంటుంది.

మొన్ననే కూరగాయలు కొనుక్కోడానికి వెళ్లి నప్పుడు.. గ్రౌండ్ వాటర్ లెవల్స్ తగ్గడం వల్ల మంచి నీళ్ళ సరపరాలో తలెత్తే సమస్య గురించి మాట్లాడితే.. వాటి గురించి ఎవరికి పడుతుంది. రెండు పార్టీల నాయకులకి మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి అని నిజం చెప్పుకొచ్చారు ఆవిడ. పచ్చదనం పరిశుబ్రత , ఇంకుడు గుంటలు,వాటర్ రీసోర్సెస్, వాల్టా చట్టం,విద్యా కమిటీలు వీటి గురించి మాట్లాడుతూ ఉంటే.. చాలా మంది కూరలు కొనుక్కోడానికి వచ్చిన పురుషులు..మా సంభాషణ వింటున్నారు.

మహిళలకి గ్రామ సమస్యలపై అవగాహన ఉంటుంది,నిజమైన అధికారం వాళ్ళు ఉపయోగించి గ్రామ అభివృద్దికి పాటు పడే అవకాశాలని ధనవంతులు,బలవంతులు లాక్కుంటుంటే.. ఇక మహిళ రిజర్వేషన్ వల్ల ఒరిగే లాభం ఏమిటో.. అందరు ఆలోచించాలి అని అనేసి వచ్చేసాను. అక్కా..అనవసరంగా మీరు ఇప్పుడు అందరి దృష్టిలో పడతారు..వదిలేయండి అని మా మాజీ గ్రామ సర్పంచ్ వారించ బోయింది. నాకు దైర్యం ఎక్కువే లెండి. ఎవరు ఏమి అనుకున్నా లెక్క చేయను.

ఇక మా మండలం లోనే ఒక గ్రామ సర్పంచ్ మహిళా మణి.
ఆ గ్రామం ఆంద్ర ప్రదేశ్ లోనే..ఇంటి పన్నుల ద్వారా లభించే ఆదాయంలో రెండవ స్థానంలో ఉన్న గ్రామం. ఆమె కట్నం ఎక్కువ తేలేదు అని కోడలిని నానా రకాలుగా హింస కి గురి చేసారని వార్తలలోకి ఎక్కారు. నిజం పై వాడికి ఎరుక. ఆదర్శాలు అందరు చెబుతారు. అంబేద్కర్ జయంతి రోజు ఆదర్శంగా మీటింగ్ చెప్పి ..వేదిక దిగి వచ్చాక .. అవహేళన చేసే వారిని చూసాను.

ఇవండీ... నేను చూసిన మహిళా ప్రజా ప్రతినిధుల అవకాశాలు,అధికారాలు,దుర్వినియోగాలు, మర బొమ్మతనాలు..అలంకార ప్రాయమైన పదవులు. ఎవరిని ఉద్దరించడానికి అనుకుంటాను.

మాకు బాగా దగ్గర అయిన వాళ్ళు ఈ సారి నువ్వు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదూ అని మునగ చెట్టు ఎక్కిస్తారు. ఆ రొచ్చు నాకుఎందుకు అని అనలేను కానీ.. అవకాశం దొరికితే రిజర్వేషన్ కేటగిరీలో..అవకాశం లభిస్తే..పోటీ చేయడానికి నేను రెడీ. కానీ..ఎన్నికల సమయంలో కాన్వాస్ చేసుకుంటూ నా వెంట నలుగురు వస్తున్నా వారికి కాఫీ,టీలు,కూల్ డ్రింక్స్ కూడా ఇప్పించ లేనే !? నిధులు సమకూర్చడం ఎలాగబ్బా! అన్నాను అనుకోండి.
నువ్వు ఊ.. అంటే.. ప్రధాన పార్టీలు అవే చూసుకుంటాయి. నువ్వు..అప్పుడప్పుడు..ఆటో గ్రాఫ్ లు ఇవ్వడమే..అని నాకు వరుసకు తమ్ముడు అయ్యే ఒక యువనేత నాకు అభయం ఇచ్చేసాడు.
ఏమిటో నండీ.. అదంతా సాద్యమేనంటారా!? ఎందుకంటె..ఇదంతా వింటున్న మా అత్తగారు ..ఈ రాజకీయాలు మా ఇంటా-వంటా లేవు అని అల్టిమేట్ చేసేసారు. అవకాశాలు దొరకడం లేదని నానా యాగి చేస్తుంటే.. అవకాశం ఉన్నప్పుడు.. ప్రయత్నం చేస్తే తప్పు ఏమిటి? మా తమ్ముడు యువనేత ఆర్గ్యూ..

నిజంగా ఇప్పుడు రాజకీయాలు ఉన్న నీచ స్థితిలో..మహిళలు నెగ్గుకు రాగలరా? నిబద్దత,సేవాధర్మం ఉన్నవాళ్ళు కూడా వెనుకంజ వేయవలసిన భ్రష్టు రాజకీయాలను ప్రక్షాళనం చేసుకుని గ్రామ,మండల రాజకీయాలను ప్రభావితం చేసుకునే శక్తి కాని,యుక్తి కానీ మహిళలకి ఉన్నాయంటారా!? గ్రామ అభివృద్ధి చేసుకోగల స్థాయి అయినా మహిళలకి ఉందంటారా!? వీది వీధి కి ఉన్నమద్యం షాప్ లని మూసి వేయించ గల్గితే.. మొట్ట మొదటి విజయం సాధించి నట్లే నని..నా వంద శాతం నమ్మకం. అలాగే.. సర్పంచ్ పదవి కోసం ..ఓ..అర కోటి రూపాయలు ఖర్చు పెట్టకుండా.. ఓ.. పది లక్షలు అయినా ఖర్చు పెట్టగలిగి .. గెలుపు లభిస్తే..అదే పండుగ అనుకుంటాను.

వీధి చివర మద్యం షాప్ తీసేయమని చేసే ధర్నా కార్య క్రమంలోను కూడా పాల్గొనలేని హై క్లాస్స్ కుటుంబ స్త్రీని. మరియు పది లక్షలు ఖర్చు పెడితేనే గెలవగలను అని నమ్మకం లేని దాన్ని . నాకు ఎందుకండి ఈ.. ప్రజా ప్రతినిధుల ఎన్నికలు గురించి మాట్లాడటం అని ఉదాసీనంగా కూడా ఉండ లేను కాబట్టే ..ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. .

ఈ వ్యవస్థ మార్చడం ఎవరి తరం కాదా!? మహిళా రాజకీయాలని ప్రభావితం చేసే మహిళా మణి పూసలు ఎక్కడ? ఎవరు మహిళ లకి రోల్ మోడల్స్!? ఎందుకు ఈ బిల్లులు ,పోరాటాలు? ఈ పవర్ లు అనీ వృధా యేనా!?

ఒక పోస్ట్ కి కావాల్సిన సబ్జక్ట్ దొరికింది అన్న ఆనందం,మరి కొన్ని హిట్లు.. కొద్దిగా కామెంట్ లు కోసం మాత్రం కాదు.
చదువుతున్న దేశ విదేశాల లోని కొంత మంది కైనా ఆలోచన కలిగించాలని ఈ చిరు ప్రయత్నం.

అవకాశం లభిస్తే.. నేను గ్రామ స్థాయి లోనే ప్రజా ప్రతినిధిగా పోటీ చేసే ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఈ మిత్రులందరూ.. నా గెలుపుకి ఒట్టి నోటి మాట తోనే ప్రచారం చేయాలండి. మర్చి పోవద్దు. మీ తోటి బ్లాగర్ కి ఆ మాత్రం సాయం చేయరా చెప్పండి!? :)) ఇంత సేపు నా పైత్యం విన్నందుకు ఐ మీన్ చదివినందుకు ధన్యవాదములు.

(లో లోపల ఏదో చేయాలి అన్న ఆకాంక్ష తో.. వెలువరించిన ఈ మాటలు)

20 కామెంట్‌లు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

baagundi andi.. naa vote meekey

జలతారు వెన్నెల చెప్పారు...

చాలా విషయాలు తెలిపారు. అందులోను మహిళా ప్రజాప్రతినిధుల గురించి..
"ప్రజా ప్రతినిధులు అంటే ఏమిటి అని అడిగారు"..ఒక ప్రజా ప్రతినిధి అలా అడిగే స్టేజ్ లో ఉంది అంటే...ఇంక అలోచించండి!

Hima bindu చెప్పారు...

"వీధి చివర మద్యం షాప్ తీసేయమని చేసే ధర్నా కార్య క్రమంలో ను పాల్గొనలేని హై క్లాస్స్ కుటుంబ స్త్రీని. మరియు పది లక్షలు ఖర్చు పెడితేనే గెలవగలను అని నమ్మకం లేని దాన్ని"
ఒక వ్యవస్థని మార్చాలన్న సంస్కరణలు తేవాలన్న మనము హై క్లాస్స్ లో క్లాస్స్ అని ఆలోచించ కుడదేమో మన మనస్సుకి నచ్చినట్లు చేయడం బెటర్ .మహిళల పవర్ వృధా కాదు కొన్ని చోట్ల చక్కగా పాలన చేసే మహిళా మణులు వున్నారు గ్రామాల్లోను ,మండలాలలోను జిల్లా ప్రజపరిషతు లోను వున్నారు .
మన భారతీయ వ్యవస్థల్లో స్త్రీ కి వున్నా స్థానం తనకి వున్నా లిమిటేషన్స్ మన అందరికి తెలిసిందే వ్యవస్థలో తప్పక మార్పు వస్తుందండీ వృధా అయితే కాదు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Baalu gaaru.. Thank you very much. Meeru maa vooru vacchi Vote cheyaali mari. :)

@ Thank you very nuch.. Jalataaru vennela gaaru.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిన్ని గారు..నమస్తే! బాగున్నారా?
మీరు స్పందించిన విధంగానే స్పందన రావాలని నేను మనఃస్పూర్తిగా కోరు కుంటున్నాను. అది తప్పకుండా వస్తుందనే ఆశా భావం ఉంది కూడా.
మహిళలు -రాజకీయాలు అనే దృష్టి కాకుండా మహిళలు గ్రామీణ అభివృద్ధి దిశలో చాలా సుసాధ్యం.
దురదృష్టవ శాత్తు.. మహిళలు రాజకీయ రంగంలో ఉంటే.. విలువలు క్షీణించే దశ లో ఉన్నట్లు గోచరిస్తుంది. మేకప్ కిట్లు వెంటేసుకుని,రంగు రంగుల గాజులు వేసుకుని,వాచాలత్వం తోనూ, దురుసుగాను,కోస్తా,తిత్తి తెస్తా అంటూ బజారున పడ్డ రాజకీయ నాయకా మణులైతే ఆదర్శం కాదు కదండీ!బ్లాక్ మేయిలింగ్స్ ,మాట ప్రచారాలు..ఇవి ఆదర్శ రాజకీయాలు కాదండీ.
నా ఆవేదన ని కూడా గమనించండి. ఒక పవర్ లభించినప్పుడు..ఆ శక్తిని మనం స్వయంగా అమలుచేసే స్వేచ్చ ఇక్కడ రాజకీయాలలో ఉందంటారా!? కక్ష సాదిన్పులు,ఓటు బ్యాంకు రాజకీయాలు,అవినీతి,దేశ ప్రయోజనాలని తాకట్టు పెట్టె వారికి వంట పలకడం ఇవి.. మనకి కనబడుతున్నవి.
చాలా చాలా థాంక్స్ అండి

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ..
మీరు తప్పకుండా పోటీ చేయండి మేమంతా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము..
గ్రామస్థాయిలోనైనా రాజకీయాల్లో ఆలోచనాపరులు వస్తే బాగుంటుంది కదా..అందుకే మా వోట్లన్నీ మీకే :)

కమనీయం చెప్పారు...

మీరు రాసింది కొంతవరకే కరెక్టు.చాలా మంది మహిళలు,బాగా చదువుకోని వారు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేస్తు,బాధ్యతలను నిర్వహిస్తున్నారు.చట్టం చేసాక అది పూర్తిగా అమలులోకి వచ్చేందుకు సమయం పదుతుంది.వోటుహక్కు అందరూ సరిగా ఉపయోగించుకుంటున్నారా?అలాగని ఎన్నికలు వద్దంటామా?ప్రజాప్రాతినిధ్యం లో మహిళలకు చోటు కల్పించడం సరి ఐనదే.మొత్తం మీద సంతృప్తికరంగానే ఉన్నది .ముందుముందు ఇంకా బాగా ఉందవచ్చును.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కమనీయం గారు..నేను.. మహిళ లకి ప్రాతినిధ్యం ఇవ్వ వద్దని అనడం లేదు. లభించిన అవకాశాలని తప్పని సరి అయి..వేరొకరి కబంద హస్తాల లోకి ఇచ్చి.. పవర్ ని దువినియోగం చేసే అవకాశం కల్గిస్తున్నారు అని మాత్రమే చెప్పాను. అలా కాకుండా మరిన్ని అవగాహన తరగతులు ఇప్పించాలి . మంచి చురుకైన క్రియాశీల రాజకీయ నాయకురాళ్ళ అవసరం ఎంతైనా ఉంది అని మాత్రమే చెపుతున్నాను.
మీరు చెప్పినట్లు అవకాశాలని అందిపుచ్చుకుని..మునుపటి కన్నా వేగవంతంగా.. చురుకుగా పని చేచేస్తున్న వారు ఉన్నారు. వారికి అభినందనలు అందించాలి.
మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు..మీ అభిమానానికి ధన్యవాదములు.

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీరు పైసా ఖర్చు పెట్టకుండా నిజాయితీ కలిగిన పార్టీ ని ఎన్నుకోండి.మీ లక్ష్యాలు స్పష్టం గా వుంటే గెలుపు అదే వస్తుంది.ఆదివారం ఈనాడు పుస్తకం(29/4/2012) చదవండి.తమిళనాడు లో ఒక ఇంజినీర్ ఎలా సర్పంచ్ అయ్యి ఆ ఊరుని ఎలా!నిలిపాడో.మీ అభిరుచికి,ఆసక్తికి అభినందనలు.

Jai Gottimukkala చెప్పారు...

వనజ గారూ,

మీరు పోటీ చేయాలో వద్దో అనే విషయం కన్నా మీరు గెలిచాక గ్రామానికి ఏమి చేయగలరో ఆలోచించండి. తప్పక మంచి ఆలోచనలు & ప్రణాలికలు తడుతాయి.

మీ సహజమయిన పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని గెలిపిస్తుంది. గెలిచాననే ఆనందం కొద్ది రోజులే ఉండవచ్చు కానీ ఏదో మేలు చేస్తున్నానే సంతోషం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది.

All the best.

Praveen Mandangi చెప్పారు...

మహిళలకి రిజర్వేషన్‌లు ఇవ్వకపోయినా మన పాలకులకి వోట్లు పడతాయి. ఎందుకంటే స్త్రీ-పురుష సంబంధాల విషయంలో ఆడవాళ్ళకి కూడా జుగుప్సకరమైన నమ్మకాలు ఉన్నాయి. నాకు ఉద్యోగం లేదు. మా బంధువుల అమ్మాయి అయిన ఒక అమ్మాయి టీచర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెని నాకు ఇచ్చి పెళ్ళి చెయ్యాలని పెద్దవాళ్ళు అనుకుంటారు కానీ అది మా బంధువులలో కొంత మందికి నచ్చలేదు. ఉద్యోగం ఉన్న అమ్మాయిని ఉద్యోగం లేని అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చెయ్యడం ఏమిటి అనేది వాళ్ళ అభిప్రాయం. నాకు చెల్లెలు వరసైన ఒక అమ్మాయి నాకు ఒక జుగుప్సకరమైన ప్రశ్న అడిగింది "వదిన ఉద్యోగానికి వెళ్తే నువ్వేమి చేస్తావన్నయ్యా, పిల్లల ముడ్డి కడుగుతావా?" అని. ఆ ప్రశ్న అడిగిన అమ్మాయి ఏ చదువురాని అమ్మాయో కాదు. ఆమె ఒక డెంటిస్ట్. ఆడవాళ్ళకి ఉద్యోగాలలోనూ, చదువులలోనూ అవకాశాలు ఇస్తే సరిపోదు. ఆడ-మగ సంబంధాల విషయంలో భావజాలం మారనంత వరకు రిజర్వేషన్‌లు లాంటి ఎన్ని పైపై కబుర్లు చెప్పుకున్నా సమాజం ఇలాగే ఉంటుంది. మా కిందింటిలో అద్దెకి ఉండే DEO ఆఫీస్ ఉద్యోగి భార్య MSc చదివింది కానీ ఆమె ఉద్యోగానికి వెళ్ళకుండా పిల్లలని చూసుకుంటోంది. ఆడవాళ్ళకే ఉద్యోగాలు చెయ్యడం ఇష్టం లేనప్పుడు ఇక రిజర్వేషన్‌లు పెట్టి స్త్రీలకి ఇంత కోటా ఇచ్చాము అని చెప్పుకుంటే ఏమి లాభం? మగవాడు చదువుకున్నా ఉద్యోగం చెయ్యకపోతే అతన్ని పనికిమాలిన ఎదవ అంటారు కానీ ఆడది చదువుకున్నా ఉద్యోగం చెయ్యకపోతే ఆమెని మంచి ఇల్లాలు అంటారు. ఆధునికత పేరుతో ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సామాజిక భావజాలం ఇలాగే ఉంది.

Praveen Mandangi చెప్పారు...

ఆడవాళ్ళకి లోకజ్ఞానం లేకపోవడానికి కారణం గడపదాటకపోవడం కాదు, కొత్తగా గడప దాటి బయటకి రావడం కూడా కాదు. గడప దాటినా తాను తన భర్త యొక్క ఆస్తిని అనే అభిప్రాయం ఉండడం వల్ల ఆమెకి లోక జ్ఞానం ఉండడం లేదు. ఆడది గడప దాటకూడదు అనే రూల్ ఇప్పుడు ఎక్కడా లేదు. గడప దాటి బయట సంపాదించేవాళ్ళు కూడా ఇంటికి వచ్చిన తరువాత భర్త దగ్గర పాద సేవ చేస్తున్నారు.

Jai Gottimukkala చెప్పారు...

"లో లోపల ఏదో చేయాలి అన్న ఆకాంక్ష తో.. వెలువరించిన ఈ మాటలు"

ఈ భావనే స్పూర్తికి అంకురం. ఎందరికో ఆకాంక్ష ఉన్నా అవకాశం రాదు. వచ్చినా సరైన సమయంలో జంకుతాము.

మీకు అవకాశం రావడం చాలా సంతోషం. ఇంకో అడుగు ముందుకేసి గమ్యం చేరుకుంటారని ఆశిస్తాను.

"దురుసుగాను,కోస్తా,తిత్తి తెస్తా అంటూ బజారున పడ్డ రాజకీయ నాయకా మణులైతే ఆదర్శం కాదు"

నిజానికి వీళ్ళెవరూ రాజకీయనాయకులు కారు. మేము కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పార్టీలు చేసుకునే ప్రచారానికి పనికొచ్చే (tokenism) పావులు, టీవీ కామేరాల గ్లామరు "దాహం" తీర్చే "బొమ్మలు" మాత్రమె. మీరు ఉదాహరించిన మాట్లాడాలంటే వణికే మహిళది ఇదే కోవ.

అజ్ఞాత చెప్పారు...

వనజ గారూ...
మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నానని అనుకోకండి. మీరు స్త్రీయా పురుషుడా అని కాదు, మొత్తంగా రాజకీయాలు ప్రక్షాళన సాధ్యం కాని ఓ పెద్ద రొచ్చుగుంట. వెనక్కి తిరిగి రానీయని ఊబి. మహిళా సాధికారత పేరు చెప్పినా చేసే పనులు మీరు చూసినవే. ఇక ఆ మహిళ ఎస్సీయో ఎస్టీయో ఐతే ఆ సంగతి చెప్పనే అక్కర లేదు. అలా కాకుండా రాజకీయాల్లో పైకి వచ్చిన స్త్రీమూర్తులూ లేరనను, కానీ వాళ్ళు ఎలాంటివారో తెలీనిదా. ప్రతిభా పాటిల్ ప్రతిభ ఏమిటో చూశారు కదా. అత్యున్నత స్థానంలోనే కాదు, క్షేత్ర స్థాయిలోనూ అంతే. మీరు ఏదయినా చేయాలనుకుంటే వ్యక్తిగత స్థాయిలో సేవ చేసుకోడం ఉత్తమం. ఇది మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, ఎంతో ఆవేదనతో రాస్తున్న మాట.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జై గొట్టిముక్కల గారు.. మీ అభిమానానికి ధన్యవాదములు. నేను ప్రస్తుతానికి ఒక ఆలోచన మాత్రమే చెప్పాను. అవకాశం వచ్చినప్పుడు ఆలోచిస్తాను. మీ సూచన,సలహా కి కృతజ్ఞతలు.
@ ప్రవీణ్ గారు.. నేను వ్రాసిన ఈ పోస్ట్ కి మీ వ్యాఖ్యలకి సంభందం లేదనిపించింది. అయినప్పటి..మీ అభిప్రాయానికి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పురాణ పండ ఫణి గారు.. మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
నిజంగా చెప్పాలంటే.. మా గ్రామంలో రిజర్వేషన్ పద్దతిలో జనరల్ కేటగిరి మహిళ లకి వస్తే తప్ప అవకాశం రాదు. ఒకవేళ వచ్చినా.. రెండు ప్రధాన పార్టీల ధనబలం ముందు..పోటీ సామాన్యం కాదు.
మహిళలకి యెంత గౌరవం లభిస్తుందో.. చూస్తుంటే.. నిజంగానే వెనుకడుగు వేస్తాను.
ఒక ఆలోచన,ఆవేశం తోనే ..ఈ పోస్ట్ వ్రాసాను. చూద్దాం అవకాశం లభిస్తే అప్పుడు ఆలోచించడమే మంచిది .. అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పినందుకు మీకు మరీ మరీ ధన్యవాములు.

అజ్ఞాత చెప్పారు...

వనజ గారూ...
మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నానని అనుకోకండి. మీరు స్త్రీయా పురుషుడా అని కాదు, మొత్తంగా రాజకీయాలు ప్రక్షాళన సాధ్యం కాని ఓ పెద్ద రొచ్చుగుంట. వెనక్కి తిరిగి రానీయని ఊబి. మహిళా సాధికారత పేరు చెప్పినా చేసే పనులు మీరు చూసినవే. ఇక ఆ మహిళ ఎస్సీయో ఎస్టీయో ఐతే ఆ సంగతి చెప్పనే అక్కర లేదు. అలా కాకుండా రాజకీయాల్లో పైకి వచ్చిన స్త్రీమూర్తులూ లేరనను, కానీ వాళ్ళు ఎలాంటివారో తెలీనిదా. ప్రతిభా పాటిల్ ప్రతిభ ఏమిటో చూశారు కదా. అత్యున్నత స్థానంలోనే కాదు, క్షేత్ర స్థాయిలోనూ అంతే. మీరు ఏదయినా చేయాలనుకుంటే వ్యక్తిగత స్థాయిలో సేవ చేసుకోడం ఉత్తమం. ఇది మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, ఎంతో ఆవేదనతో రాస్తున్న మాట.

Praveen Mandangi చెప్పారు...

నా పరిస్థితి కూడా అంతే. బ్యాంక్ ఉద్యోగుల కోలనీలో ఉండే నేను దళితవాడకి వెళ్ళి కుల వ్యతిరేక పోరాటాలు చెయ్యమని మీటింగ్ పెడితే మా కోలనీలో ఎంత మంది నన్ను అర్థం చేసుకుంటారు? మీరు మద్యం షాప్‌లు ముయ్యించాలని వీధిలో ఉద్యమం నడిపితే మీ కుటుంబ సభ్యులు ఎలా అభ్యంతరం చెపుతారో, నేను దళితవాడకి వెళ్ళి మీటింగ్ పెడితే మా కుటుంబ సభ్యులు కూడా అలాగే "మన స్టేటస్ ఏమిటి, నువ్వు అక్కడ మీటింగ్ పెట్టడం ఏమిటి?" అని అడుగుతారు. ఇక్కడ మీకూ, నాకూ ఉన్న తేడా ఒకటే "మీరు స్త్రీ, మీరు చెయ్యాలనుకుంటున్నది స్త్రీల ఆత్మగౌరవ పోరాటం" & "నేను గిరిజనుణ్ణి, నేను చెయ్యాలనుకుంటున్నది అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాటం". ఇద్దరూ చెయ్యాలనుకుంటున్న దానికీ అడ్డు తగులుతున్నది కూడా ఒకటే. అది ఆర్థిక హోదా. మీరు డబ్బున్న స్త్రీ అయితే నేను డబ్బున్న గిరిజనుణ్ణి. వీధి చివర ఉన్న మద్యం షాప్ గురించి ఎవరికీ లేని దురద నీకు ఎందుకు అని మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎలా అడుగుతారో, కుల వివక్ష గురించి దళితవాడలో ఉండేవాళ్ళకే లేని దురద నీకెందుకు అని మా కుటుంబ సభ్యులు నన్ను కూడా అలాగే అడుగుతారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Ravishekhar.. gaaru.. Thank you very much..
mee comment nenu choosukoledu. ippude choosaanu. Thank you very much Once again.