30, ఏప్రిల్ 2012, సోమవారం

అంటరానితనం - ఒంటరితనం

మనుషుల్లో అంతరాలని పెంచే కుల భావన ..నానాటికి మితిమీరిపోతుందని  అనిపిస్తుంది.
ఇవాళ సమాజంలో కులం పేరుతొ.. తిట్టుకోవడం తరచూ కనబడుతుంది. అన్ని కులాలను తిట్టుకోవడం అంత పట్టింపు కాదేమోకాని ..కొన్ని కులాల పేర్లు ఉదహరించి కించపరిచే రీతిని నిరోదించేందుకు..కొన్ని చట్టాలు కూడా ఏర్పడ్డాయి

Prevention of attrocities act 1989

ఆ చట్టం రావడం వలన ఎస్ టి / ఎస్.సి వారి పై, దూషణ అవమాన కర వ్యాఖ్యలు తగ్గుతాయని ఆశించడం జరిగి ఉంటుంది. .కొన్ని చట్టాలు ఏర్పాటు చేసినప్పుడు..కొన్ని కేసులలో పారదర్శకత లోపించి.. అన్యాయంగా శిక్ష నెదుర్కుంటూ ఉన్నారు. ఒకవిధంగా కొన్ని కులాల వారితో మాట్లాడక పోవడమే మంచిదనిపించేలా ఉంది. atrocity కేసులు పరిష్కరించేందుకు  ప్రత్యేక కోర్ట్లు కూడా ఏర్పాటు కాబడ్డాయి అంటే.. ఎంతగా కులపరంగా అవమానం జరుగుతుందో కదా అననిపిస్తూ ఉంటుంది. కానీ అలాంటి ఆరోపణలతో నమోదు కాబడ్డ కేసులు అన్నీ  నిజాలు కావన్నదానికి నిదర్శనంగా ..
ఈ మధ్యనే .. అంటే ఓ..మూడు నెలల క్రితం జరిగిన యదార్ధ సంఘటన..ఒకటి.
విజయ్ అనే ఒక యువకుడు అగ్ర కులానికి  చెందినవాడు. అతను వారి ఇంటికి సమీపంలో రోడ్డుపై నిలబడి ఉన్నాడు. అంతలో.. బుల్ హారన్ మ్రోగించుకుంటూ..ఓ..మోటార్ వెహికల్ పై (బుల్లెట్)ముగ్గురు కలసి వెళుతూ వారి ఇంటి సమీపంలోకి వెళ్ళినప్పుడు పదే పదే హారన్ మ్రోగిస్తూ మితిమీరిన వేగంతో వెళ్ళారు. విజయ్ కి ఆ ముగ్గురు పరిచయమే!వారు ఓ..వాడకి చెందిన పిల్లలు.(తప్పని సరి అయి ఉదహరించాల్సి వస్తుంది) వారు పని గట్టుకుని చేసే విపరీతమైన శబ్దం వల్ల..ఇంట్లో అనారోగ్యం గా ఉండి పడుకున్న విజయ్ తాత గారికి చాలా విసుగు కల్గుతుంది అనే ఉద్దేశ్యం తో.. "మీరు ఇటువైపు రాకండి. ఏమిటి ఆ మోత? అని కోపంగా అన్నాడు.
వెంటనే.. ఆ ముగ్గురు ..వారు వెళుతున్న బైక్ ని సడన్గా ఆపి వెనక్కి తిరిగి వచ్చి విజయ్ తో వాదనకి దిగారు. ఏం..రోడ్డు ఏమన్నా మీ బాబుదా!? నీకేనా బుల్లెట్ లు ఉండేది.మా దగ్గర డబ్బుంది.మేము కొనుక్కుని తిరుగుతాము. ఇక్కడ తిరగవద్దని చెప్పడానికి నీకేమైనా అధికారం ఉందా అని .. అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటే.. దానికి వాదనగా అన్నట్టు  ఇతను మీరసలు ఈ ఊర్లోకి రావద్దు. మీ హరిజనవాడకి వేరే దారి ఉంది..అటువైపు వెళ్ళండి ..అని అన్నాడు విజయ్. ఇక అక్కడ మాట మాట పెరిగి..అమ్మలు,అక్కలని, ఆలిని  ఇష్టం వచ్చినంతసేపు ఆరేసి..ఇరువైపులవారు కొట్టుకునే అంత స్థాయికి వెళ్ళిందీ  విషయం.

నలుగురొవచ్చి విడదీసాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
బైక్ పై తిరిగిన ముగ్గురు వ్యక్తులు  అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. "విజయ్ అనే వ్యక్తి..మమ్మల్ని కులం పేరున దూషించాడు.ఆ రోడ్డు పైన సంచరించ వద్దని ఆర్డర్ లు వేసాడు. వాళ్ళ కులం వారి సపోర్ట్ తో మమ్మల్ని అవమానించి మా ఇంటివాళ్ళని కూడా అవమానంగా మాట్లాడారు" అని రిపోర్ట్ ఇచ్చారు.
అంతే.. అర్ధరాత్రి సమయంలో.. నాన్ బెయిల్ అరెస్ట్ వారెంట్ తో పోలీసులు విజయ్ ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అది గమనించినతను..వేరే దారిన బయటపడి..తప్పించుకున్నాడు. అతనెళ్ళి ..మూడు రోజులు ఎక్కడో రహస్యంగా దాక్కుని ఉంటే..కేస్ లేకుండా చేయడానికి ..రాజీ మార్గాలు మొదలై.. కేస్ విత్ డ్రా..చేసుకోవడానికి దాదాపు మూడు లక్షలు రూపాయలు డిమాండ్ చేసారని ..తెలిసిన వారి ద్వారా బోగట్టా. ఆ రాజీ ప్రక్రియలు జరిగింది..సాక్షాత్ ఊరి మాజీ ప్రెసిడెంట్ సమక్షంలో .
బేరసారాలు కుదరక ..విజయ్ రహస్యంగా వెళ్లి పోలీసు స్టేషన్లో కాకుండా కోర్టులో లొంగిపోయాడు.
ఇక్కడ జరిగినదానికి చట్టం తన పని తానూ చేయడానికి మధ్య ఆర్ధిక లావాదేవీలా అవసరం ఏం వచ్చింది? నిజంగా కుల దూషణ వల్ల అవమానం, మానసిక హింస అనుభవిస్తే.. వారు శిక్ష పడాలని కోరుకోవాలి. అలా కాకుండా డబ్బు డిమాండ్ చేసి అడిగినంత ఇవ్వనందువల్ల కేస్ నడచి తమని తిట్టిన వ్యక్తికి శిక్ష పడాలనుకోవడంలో  ఏ మాత్రమైనా  పారదర్శకత  కనబడుతుందా!?
యెంత కావాలంటే అంత డబ్బు ఇచ్చి ..ఇష్టం వచ్చినట్లు తిట్టవచ్చా? అప్పుడు అవమానం అనిపించదా!?
అసలు కులం పేర తిట్టారో లేదో.. అన్న నిరూపణ కూడా లేకుండా ఒక కంప్లైంట్ ఆధారంగా.. వ్యక్తులని శిక్షించాలని అనుకోవడం కూడా సబబేనా!?
ఈ చట్టాన్ని  అడ్డు పెట్టుకుని అగ్ర కులస్తులని పని గట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఉన్నట్లు తోస్తుంది.
అగ్ర కులాల వారు అహంకారంగా ప్రవర్తిస్తూ , తిడుతూ వివక్ష చూపించే కాలం మారింది. ఇప్పుడు అందరూ సమానంగానే ఉంటున్నారు. ఉండాలనుకునే ప్రయత్నం చేస్తున్నారు.   కొన్ని చోట్ల  కొంత వివక్ష ఉండవచ్చు కూడా ! కాదనడం లేదు
కానీ చట్టం అండ ఉంది కదా ... అని అన్యాయంగా కేసులని మోపి.. వేధించడం కూడా బాధాకరమే కదా!
వ్యక్తిగతముగా కోప,ద్వేషాలు ఉంటే.. ఆ వ్యక్తి వరకే పరిమితం చేసుకుని ప్రదర్శించుకోవాలి. వారి వారి అభిప్రాయాలకి పరిమితం చేసుకోవాలి. కుటుంబంలోని స్త్రీలనందరిని  తిట్టే సంస్కారం,కులం పేర తిట్టే సంస్కారం ..మరి వారికి ఉండవచ్చా!?
అవమానం అన్నాక, హింస అన్నాక అందరికి ఉంటుంది కదా! కులం పేరు ఎత్తకుండా.. అభిప్రాయ బేధాలు వస్తే..వివరణతో చర్చించుకోవడం జరగాలి కాని..కులం పేరు ఎందుకు ? అన్యాయంగా కేసులు  పెట్టుకోవడం ఎందుకు ..అనిపించింది నాకు.
విజయ్ .. పదిహేను రోజులు రిమాండ్ ఖైదీగా ఉండి వచ్చి విచారణ కోసం ఎన్నోసార్లు  కోర్ట్లు చుట్టూ తిరుగుతూ ఉంటే.. అగ్రకులలవారికి భయం పట్టుకుంది.
కొంత మందిని చూస్తే..గాలి సోక నంత దూరంగా మెలగాలిసి వస్తుందేమో! అంటున్నారు కూడా!
ఇది ఒక అంటరానితనమే కదా! కాకపొతే.. ఇక్కడ ఇప్పుడు అగ్రవర్ణ వాడలకి..అనాలేమో!
(కుల వివక్ష,మత వివక్ష ,లింగ వివక్ష లేని సమసమాజం అన్నది సుదూర తీరం గానే తోస్తుంది.. అంటరానితనం - ఒంటరితనం అనాదిగా ఈ జాతికి అదే మూలధనం ..!? అన్న బాధతో..ఈ పోస్ట్.)

27 కామెంట్‌లు:

Hari Podili చెప్పారు...

vava గారు!
మంచి విషయాన్ని పోస్ట్ చేసారు.అయితే ఇక్కడ ఇరువురు
దొందు దొందే.ఏదో ఒకటో రెండో కేసులు స్టేషన్ వరకు వెళుతున్నాయి గాని,వెళ్ళని కేసులు చాలానే ఉంటాయి.
మొన్నామధ్య హరీష్ రావు ఢిల్లీ APభవన్ లోని ఓ sc
ఉద్యోగిని చెంపలదర గొట్టాడు.మరక్కడ న్యాయము జరిగిందా?ఎవరికి ఎక్కడ బలముందో అక్కడ వారిదే పై చేయి.ఇక్కడ caste creed అనే సమస్యే లేదు.
కేవలము ఆడవి న్యాయమే.అంటే MIGHT IS RIGHT.కులమత బేధాలు పోవాలంటే-ఏకైక మార్గం-
కులాంతర వివాహాలే-ONLY INERT CASTE MARRIAGES అని నా ఉద్దేశ్యం.
మీ ఆవేదనకు,మీ ఆశయానికి నా ధన్య వాదాలు

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

బాగుంది అండి... వనజ గారు మీరు ఎలా వ్రాస్తారో గాని... మీకు మా కామెంట్స్ కూడా సరి పోవండి.... ఇంక ఏమైనా ఉంటె చెప్పండి అది చేస్తాం..

satya చెప్పారు...

మీరు ఆవేదనతో రాసారు ... కానీ ఈపుడు 90 % మంది అవకాశం వస్తే ఇతరులను ఎలా దోచుకున్ధమా అని ..ఆలోచిస్తున్నారు . ఇది చట్టానికి సంభందించింది .మనం ఏమి చేయలేము ..... అందరు సమానమే అని చెప్పటానికి ఈ చట్టం తెచ్చారు ... కానీ ఇదే చట్టం ఇపుడు ( ఆ పెద్దలు చెప్పినట్లుగా ) వాళ్ళని అంటారని వాళ్ళని చేసింది ... మన ఆలోచన విధానం మార్చుకోవాలి ... లేకపోతే ఇంకా ఈ రోజుల్లో కూడా అంటారని తనం ....!!!!??? నమ్మలేక పోతున్నాను .... thank you ...

అజ్ఞాత చెప్పారు...

అట్రాసిటీ చట్టాలు అవసరం వున్నచోట కన్నా దుర్వినీయోగం అవడానికే వున్నాయి. కులం మీద కేటాయింపులు, చట్టాలు వున్నతవరకూ, అవి కొనసాగాలని ఇంకా పెరగాలని ఆశించేవాళ్ళు వున్నంత వరకూ కులకలహాలు వుంటాయి.
ఇదే కాదు, గృహహింస చట్టాలు కూడా అంతే, కంప్లైంట్ ఇవ్వగానే నాన్ బెయిలబుల్ వారెంట్ వుండే ఏ చట్టమైనా పోలీసులను, కంప్లైంట్ ఇచ్చేవాళ్ళను మేపడానికి సాధనాలు, చట్టం నీడలో అక్రమ సంపాదనకు కల్పించబడ్డ మార్గాలు.

/మరక్కడ న్యాయము జరిగిందా?ఎవరికి ఎక్కడ బలముందో అక్కడ వారిదే పై చేయి/
పోలీసులకు, బాధితుడికి, లాయర్లకు, బాగానే బాగానే (ఆర్థికంగా)న్యాయం జరిగేవుంటుంది అనుకుంటున్నా.

ఇవి బ్లాక్‌మెయిలింగ్ చట్టాలు.

Alapati Ramesh Babu చెప్పారు...

చట్టము ఉద్దేశ్యము ఓకటి. దానిని అంతులేని స్వార్థముతో ప్రక్కదారి అనేకన్నా అవకాశవేదికాగా మలచుకొని చట్టపరిధిలో నయా దౌర్జన్యాలకు దిగుతున్నారు.అసలు జరిగిన దానికి కులము రంగులద్ది వెరే రూపుమార్చి ఇలాంటి క్రియలకు వొడిగడతున్నారు.

అవసరము లేని ప్రతిదానికి అగ్రకుల రంగు అద్దుతున్నారు ఉదహరణకు ఇక్కడ నేను ఇచ్చే లింకులే సాక్ష్యము
http://subhadrakeerthi.blogspot.in/2012/04/blog-post_29.html

Praveen Mandangi చెప్పారు...

పల్లెటూర్లలో పేద దళితులపై దాడులు చేసేవాళ్ళకి శిక్షలు పడవు. ఆట్రోసిటీ కేసుల దుర్వినియోగం పట్టణాలలోనే ఎక్కువగా జరుగుతుంది. చదువుకుని చట్టాల గురించి తెలిసినవాళ్ళే వాటిని దుర్వినియోగం చెయ్యగలరు కదా.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ..
మంచి విషయాన్ని చర్చించారు..కొన్ని చట్టాలు నిజంగా అన్యాయం జరిగిన వాళ్ళ కోసమే ఐనా వాటి అసలు ఉద్దేశ్యం మాత్రం మారిపోతూ వస్తుంది...

చాలా మంచి చట్టాలన్నీ "SNKR" గారు చెప్పినట్లు "బ్లాక్‌మెయిలింగ్ చట్టాలు" గా మిగిలిపోతున్నాయి ప్రజల దృష్టిలో ..

Hari Podili చెప్పారు...

@ఎస్కేఎన్నార్ గారు,
మీరు చెప్పింది అక్షరాల నిజం.
ఈ దేశంలో చట్టాలున్నవి కేవలం అనామకులకి మరియు
బలహీనులకి మాత్రమే.బలవంతులను ఈదేశంలో ఎ చట్టాలు ఏమీ చేయలేవు.

కాయల నాగేంద్ర చెప్పారు...

ఈ చట్టాలు 'డబ్బున్నవారికి చుట్టాలు....పేదలకు కష్టాలు'.
'మా కులం పేరుతో మాట్లాడారు' అని గగ్గోలు పెట్టే కొందరు
వారి పేరు వెనుక కులం పేరు తగిలించుకోవడం ఎందుకో?
వనజ గారు! మీ వ్యాసం చాలా బాగుంది. ఇంత పెద్ద వ్యాసాలు ఎంతో ఓపిగ్గా వ్రాస్తున్నందుకు ధన్యవాదములు.

శ్రీ చెప్పారు...

మీరు వ్రాసిన సంఘటన చదివాక...
చెప్పాలనుకుంటున్నాను...
కుల దూషణ లాంటి అసత్యపు ఆరోపణలతో
చేస్తున్న జాబ్ పోగుట్టుకున్న నా మిత్రుడి వ్యథ తెలుసు నాకు...
అందరు ఆలోచించవలసిన విషయం ఇది.
@శ్రీ

శ్రీనివాసరావు చెప్పారు...

వనజవనమాలి గారు
చాలా చక్కటి మరియు సున్నితమైన అంశాన్ని చాలా బాగా విశ్లేషించారు.
మీ పోస్ట్ చదివిన తర్వాత నాస్పందనని తెలియచేయాలనిపించింది.
మీరన్నట్లు మనదేశం లో ఎన్నో చట్టాలు ఎన్నో అవకాశాలు వున్నాయి.కాని లేనిది ఒకటే అదే బలవంతుడు బలహీనుడిని కబళించకుండా వుండటం. దానికి ఏ చట్టం లేదు వున్నా అనుసరించారు. మతం గురించి కొట్టుకుంటారు, ప్రాంతంగురించి కొట్టుకుంటారు, కులంగురించి కొట్టుకుంటారు,భాషగురించి కొట్టుకుంటారు కాని బలహీనుల బాగు గురించి ఎవరైనా కొట్టుకుంటారా మన దేశంలో? అదేవుంటే అత్యధిక స్విస్స్ బ్యాంకు ఖాతలుండవు మరియు తినడానికి ఏమీ లేక చచ్చిపోయే బ్రతుకులుండవు మనదేశంలో !!!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Hari podili gaaru.. Thank you very much!Mee abhipraayam chaalaa Baagundi.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Baalu gaaru Thank you very much!!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Satya gaaru.. mee Spandana ki Dhanyavaadamulu.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

SNKR gaaru ..meeru cheppinatlu Ivi blackmailing chattale! dhanyavaadamulu.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ramesh babu gaaru.. meeru gamaninchindi nijame! thank you very much. meeru icchina link inkaa choodaledu. tappaka choosthaanu.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Praveen gaaru .. ippudu pallela lo vaarikini avagaahana yerpadindi. vaallu miss use ke paalbadutunnaarani vere cheppanavasaram ledandi. nenu cheppina ee post Example.
Thank you very much!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Raajee gaaru & Sree gaaru & Nagendra gaaru..&sreenu gaaru ..
mee andariki mee spandanaki dhanyavaadamulu.

Jai Gottimukkala చెప్పారు...

"ఆ చట్టం రావడం వలన ఎస్ టి / ఎస్.సి వారి పై, దూషణ అవమాన కర వ్యాఖ్యలు తగ్గుతాయని ఆశించడం జరిగి ఉంటుంది"

ఎంత అమాయకులండి మీరు. "మిమ్మల్ని ఉద్దరిస్తున్నాము అందుకే ఒక చట్టం తీసుకొచ్చాము" అని ప్రచారం చేయడానికే ఏర్పడ్డ అనేక చట్టాలలో ఇదొకటి.

"ఇప్పుడు అందరూ సమానంగానే ఉంటున్నారు"

ఇది ప్రచారం తప్ప వాస్తవం కాదు. ఇదే నిజమయితే ----- వాడలు ఊరికి దూరంగా ఎందుకున్నాయి?

"కొంత వివక్ష ఉండవచ్చు కాదనడం లేదు"

మీరనే "కొంత వివక్ష" ముందు మీరు ఉదహరించే ఘటనలు, బ్లాక్ మెయిల్ వగైరాలు దిగదుడుపు.

"వారు శిక్ష పదాలనేగా కోరుకోవాలి. అలా కాకుండా డబ్బు డిమాండ్ చేసి అడిగినంత"

ఈ చట్టం కింద శిక్ష పడుతుందని కానీ, ఈ చట్టసభలలో పోలీసు స్టేషనులలో న్యాయం జరుగుతుందని దళితులకు నమ్మకం ఉందా? నమ్మకం లేనప్పుడు కనీసం సొమ్ము చేసుకుందామనుకున్నారో ఏమో?

"అంటరానితనం - ఒంటరితనం అనాదిగా ఈ జాతికి అదే మూలధనం"

ఏ సమస్యనయినా లోతు కెళ్ళి చూస్తె బాగుంటుంది. కుల వ్యవస్థ అనే భయంకరమయిన దీర్ఘకాల రోగానికి అస్పృశ్యత ఒక ఉదాహరణ మాత్రమె. వేలాది ఏళ్లుగా జరిగిన అనాచారం తొందరగా పోదు.

విజయ్ చేసిన తప్పు చిన్నదే కావచ్చు. ఇంతకంటే చిన్న తప్పుల వల్ల దళితులు మానప్రాణాలను పోగుట్టున్న ఘటనలు ఎన్నెన్నో ఉన్నాయనే విషయం కూడా గుర్తుంచుకుందాం. ఇదే విజయ్ దళితుడయ్యుంటే ఎన్ని ఘోరాలు జరిగేవో?

Hima bindu చెప్పారు...

పదహారు రోజుల క్రిందట నేను మీ ఊరి వాడలో జరిగిన అంబేద్కర్ జయంతి పురస్కరించి అతిధిగా వచ్చానండీ అక్కడి యువత చెప్పినవిషయాలు విని ఆశ్చర్యపోయాను .వాళ్ళ పెద్దలు ఊర్లో అగ్ర వర్ణాల ముందు కనీసం సైకిల్ కూడా తొక్కని పరిస్థితి అట ఇప్పటి తరం దానిని వ్యతిరేకిస్తునారట సో సామాజిక న్యాయం కోసం పోరాటం అన్నమాట !.

అజ్ఞాత చెప్పారు...

చట్టాలను దుర్వినియోగ పరిచేవారు కొద్దిమందే ఉంటారు, అలాగని అదే అందరూ చేస్తున్నారు అనడం సరికాదేమో. గృహహింస, వరకట్నం గురించి కూడా వచ్చిన చట్టాలను కొందరూ దుర్వినియోగ పరుస్తున్న సంఘటనలు మనం రోజూ ఎన్నో చూస్తున్నాము అలాగని ఈ చట్టాన్ని అందరూ దుర్వినియోగ పరుస్తున్నారు అనలేము కదా!
మరొక విషయం మీరు ప్రస్తావించిన సంఘటనలో యువకులు అన్నారు మరి ఆవయస్సులో ఎ కులం యువకులైన అలాగే చేస్తారు స్పీడ్ గ బైక్ నడపడం హర్న్ మోగించడం అవయస్సుకి వారికి సరదా.

ఇంకొ ముఖ్యమైన విషయం ఎప్పుడైయిన ఎక్కడయిన ఏ ఇద్దరి వ్యక్తుల మద్య ఏదో గొడవ, సమస్య వస్తే ఆ సమస్యకూ బాధ్యులు వారే అవుతారు. ఇందులో ఒకరి తప్పు ఎక్కువగా ఉండవచ్చు ఇంకొకరిది తక్కువగా ఉండవచ్చు. ఆలాంటి సందర్భంలో ఆ ఇద్దరు భాద్యత వహించాలి అలాకాక భాద్యతను ఒకరిమీదనే మోపయడం న్యాయం, ధర్మం కాదు. కాని మీ విశ్లేషణ లో జరిగిందిదే, ఏ ఒక వ్యక్తీ అనవసరంగా ఇంకొకరిని కొట్టడమో భయపెట్టడమొ సామాన్యంగా జరగదు, ఒకవేళ అలా జరిగితే ఈ సమాజం లో ఎవరు బ్రతకరు. ఒకొకప్పుడు ఎదుటి వ్యక్తీ కవ్వింపు చర్యను బట్టి కూడా ఈ పరిస్థితులు రావచ్చు.

చివరగా ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించక తప్పదు మా మిత్రుడు ఒకరు తన పిల్లలు పస్తులుండగా మా ఊరి చౌక డిపో నడిపే నాయుడుని రేషన్ ఎప్పుడు వేస్తావని అడిగిన పాపానికి కొడితే యువకుడు కదా తను కూడా అడ్డుకొన్నారు. ఇదే విషయాన్ని పెద్దది చేసి ఊరిలో మద్దీసం (గ్రామ సభ ) వేసి ఈ నాయుడు గారు ఇచ్చిన తీర్పు ఆ దళిత కుర్రాడు అందరూ చూస్తుండగా నాయుడు కాళ్ళ మీద పడి మన్నించమని వేడుకోవాలి.ఇలాంటివి మేము మీడియాకి రిపోర్ట్ చేసిన పట్టించుకోరు అది మా దురదృష్టం అనుకోవాలా!

Kavanoor Dayalan చెప్పారు...

చట్టాలను దుర్వినియోగ పరిచేవారు కొద్దిమందే ఉంటారు, అలాగని అదే అందరూ చేస్తున్నారు అనడం సరికాదేమో. గృహహింస, వరకట్నం గురించి కూడా వచ్చిన చట్టాలను కొందరూ దుర్వినియోగ పరుస్తున్న సంఘటనలు మనం రోజూ ఎన్నో చూస్తున్నాము అలాగని ఈ చట్టాన్ని అందరూ దుర్వినియోగ పరుస్తున్నారు అనలేము కదా!
మరొక విషయం మీరు ప్రస్తావించిన సంఘటనలో యువకులు అన్నారు మరి ఆవయస్సులో ఎ కులం యువకులైన అలాగే చేస్తారు స్పీడ్ గ బైక్ నడపడం హర్న్ మోగించడం అవయస్సుకి వారికి సరదా.

ఇంకొ ముఖ్యమైన విషయం ఎప్పుడైయిన ఎక్కడయిన ఏ ఇద్దరి వ్యక్తుల మద్య ఏదో గొడవ, సమస్య వస్తే ఆ సమస్యకూ బాధ్యులు వారే అవుతారు. ఇందులో ఒకరి తప్పు ఎక్కువగా ఉండవచ్చు ఇంకొకరిది తక్కువగా ఉండవచ్చు. ఆలాంటి సందర్భంలో ఆ ఇద్దరు భాద్యత వహించాలి అలాకాక భాద్యతను ఒకరిమీదనే మోపయడం న్యాయం, ధర్మం కాదు. కాని మీ విశ్లేషణ లో జరిగిందిదే, ఏ ఒక వ్యక్తీ అనవసరంగా ఇంకొకరిని కొట్టడమో భయపెట్టడమొ సామాన్యంగా జరగదు, ఒకవేళ అలా జరిగితే ఈ సమాజం లో ఎవరు బ్రతకరు. ఒకొకప్పుడు ఎదుటి వ్యక్తీ కవ్వింపు చర్యను బట్టి కూడా ఈ పరిస్థితులు రావచ్చు.

చివరగా ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించక తప్పదు మా మిత్రుడు ఒకరు తన పిల్లలు పస్తులుండగా మా ఊరి చౌక డిపో నడిపే నాయుడుని రేషన్ ఎప్పుడు వేస్తావని అడిగిన పాపానికి కొడితే యువకుడు కదా తను కూడా అడ్డుకొన్నారు. ఇదే విషయాన్ని పెద్దది చేసి ఊరిలో మద్దీసం (గ్రామ సభ ) వేసి ఈ నాయుడు గారు ఇచ్చిన తీర్పు ఆ దళిత కుర్రాడు అందరూ చూస్తుండగా నాయుడు కాళ్ళ మీద పడి మన్నించమని వేడుకోవాలి.ఇలాంటివి మేము మీడియాకి రిపోర్ట్ చేసిన పట్టించుకోరు అది మా దురదృష్టం అనుకోవాలా!

అజ్ఞాత చెప్పారు...

*వేలాది ఏళ్లుగా జరిగిన అనాచారం తొందరగా పోదు*

@జై,

వేలాది ఏళ్లుగా అని అంట్టున్నారు తమరికి తెలుసో లేదొ కమ్మ,రెడ్డి మొద|| కులాలు ఈ మధ్య ఎర్పడ్డవి, వాటి చరిత్ర 500సం|| మించి లేదు అని కొ.కు. రాసిన వ్యాసంలో చదివినట్లు గుర్తు. వేలాది సం|| అన్యాం జరిగిందని నువ్వు చూసినట్లు మాట్లాడకు. మీరు అధికారం కావలను కొని ప్రజలను రెచ్చగొట్టటానికి చరిత్రను ఇష్ట్టమొచ్చినట్లు వక్రికారిస్తరని తెలియదా? ఇదే కాదు ఇంతక్రితం తమరు మహీళల తరపున చాలా పేద్ద మనసు చేసుకొని మద్దతు ఇస్తూ వ్యఖ్యాలు రాస్తుంటె, చరిత్రలో మగవారు అనుభవించిన సుఖాలు ఎమీటని? అడిగితే మీరు ఇప్పటివరకు సమాధానం ఎక్కడా చెప్పలేదు.
_______________________________

వనజ గారు,

చాలా కాలం తరువాత ఆంధ్రకి వస్తే ప్రజల సైకాలజి లో విపరీతమైన మార్పులు వచ్చినట్లు అనిపించండి. మీరు చెప్పిన సంఘటనలు నాకు ఎదురయ్యాయి. మాఇంటి పక్కింటికి ఎవరో వచ్చి కారు మాఇంటిముందాపి ఒకటే హారన్ కొట్టటం మొదలు పెట్టాడు. నేను ఆశబ్ద్దానికి భరించలేక అభ్యంతరం చెపితే అర్థం చేసుకోవలసింది పోయి తగవుకి వచ్చాడు. ఇతనికి 40సం|| వయసుంట్టుంది. ఇక పిల్లలు చూస్తే అంతకన్నా చెత్త సరకు, స్పీడ్ గా రోడ్లలో బైక్ తోలటం, అంతే స్పీడ్దగ్గరకి వచ్చి సడంగా బ్రేక్ వేయటం, మనం రాష్ డ్రివింగ్ అని ప్రశ్నిస్తే సినేమాలో రవితేజాని అనుకరిస్తూ మాట్లాడారు.

అజ్ఞాత చెప్పారు...

/ఈ చట్టం కింద శిక్ష పడుతుందని కానీ, ఈ చట్టసభలలో పోలీసు స్టేషనులలో న్యాయం జరుగుతుందని దళితులకు నమ్మకం ఉందా? నమ్మకం లేనప్పుడు కనీసం సొమ్ము చేసుకుందామనుకున్నారో ఏమో?/

ఎక్కడ ఏది ఎలా ఎంత సొమ్ముచేసుకోవాలో బాగా నమ్మకము/గురి వుందన్న మాట! మనకిచ్చవచ్చిన నమ్మకాలు చేసుకునే వెసులుబాటు వున్న చట్టాలు వున్నాయి కాబట్టే టివిలను వెంటేసుకుని AP Bhavanలో దంచుడే చేసినా, అక్కడే తిహార్ దర్శనం కాకుండా తప్పించుకున్నారు మీ దొరలు. హూ.. మా బాగ సెప్పారండి, జై గొట్టిముక్కల గారు. దరమ పెభువులు కేసు విత్‌డ్రా చేసుకుని మంచిగ బేరమాడుకుని సొమ్ముచేసుకునే సక్కటి సట్టాలు తెచ్చారు. :)
మా...మాటల్లేవ్.. నోరు పడిపోనాది. :D

Praveen Mandangi చెప్పారు...

శ్రీనివాస్‌గారు, రెడ్డి కులం 1100 సంవత్సరాల క్రితం ఏర్పడింది. అయినా దోచుకునేవాడు కులం చూసి దోచుకోడు, దానం చేసేవాడు తన కులంవాళ్ళకే దానం చెయ్యాలనుకోడు అనేది నిజం.

Jai Gottimukkala చెప్పారు...

@Srinivas:

వేలాది సంవత్సరాలు కాదు వందలాదే అంటారా, అలాగే మీ ఇష్టం.

"అన్యాం జరిగిందని నువ్వు చూసినట్లు మాట్లాడకు."

మీరు (నా సంస్కారం ఏకవచనం చేయనివ్వడం లేదు) చెప్పేవన్నీ స్వయంగా చూసినవేనా?

"చరిత్రలో మగవారు అనుభవించిన సుఖాలు ఎమీటని? అడిగితే మీరు ఇప్పటివరకు సమాధానం ఎక్కడా చెప్పలేదు"

I must have missed seeing your question.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిన్ని గారు.. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నవారిని.. ఎప్పుడు నిరుత్సాహ పరచకూడదు. వారి అనుభవాలని విందాం అండీ! మీ స్పందనకి ధన్యవాదములు
@ aravam గారు ..మీ అనుభవాలు బాధాకరం అండీ! పంచుకోవడంలో ఇతరులకి సత్యాలు తెలుస్తాయి. థాంక్ యు!
@kavnoor Dayalan మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
@శ్రీనివాస్ గారు..మార్పులు మనిషిలోని పరిపక్వతకి చిహ్నంగా తోచాలి. దురదృష్టవశాత్తు..కక్ష సాధింపు గా అయితే..ఆటవిక యుగంలోనే ఉన్నట్టు ఉంటుంది. మీ అభిప్రాయానికి ధన్యవాదములు.
@శంకర్ గారు,@ప్రవీణ్ గారు,@జై గొట్టిముక్కల గారు..
మీ అందరి అభిప్రాయములు చూస్తున్నాను.
అభిప్రాయముల వల్ల సానుకూల ధోరణి రావాలని కోరుకుంటాను తప్ప ఒకరిని నిరోధించి ఇంకొకరిని..అనుకూలంగా మోసి..మాత్రం కాదు.
నేను ఈ పోస్ట్ వ్రాసిన ఉద్దేశ్యం.. చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి.. అని చెప్పడం మాత్రమే!
Thank you all!