ఓ..కాంత ..ఏకాంత గాధ.."తన్హాయి"
"ప్రేమయన నొక పంచభూతముల సమాహారమ్ము!అందు కలయికొక్కటేను,ప్రేమికుల ముందున్న దారి!!" అని సాఖీ గీతం. ఇదేమిటి ..వీరు ఇలా విడిపోయారు అన్న బాధ కల్గింది.కన్నీళ్లు వచ్చాయిమన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం అదే! ప్రేమ లేకపోయినా పెళ్లి జరిగాక శారీరకమైన సంబంధం ద్వారా పురుషుడు స్త్రీతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబందాన్ని బలోపేతం చేసుకుంటాడు.ఒకవేళ పురుషుడు వేరొక ఆకర్షణలో పడినా కూడా స్త్రీలు తప్పని సరి అయి సర్దుకుని ఉండే వారు కావడం వల్ల వివాహ వ్యవస్థకి భంగం వాటిల్లలేదు..
ఇలా నేను చేసిన సమీక్ష ..ఇది.
చూడండి..ఈ లింక్ లో
3 కామెంట్లు:
“ప్రేమ .. ఒక భావ ఉద్వేగం,కొన్ని అనుభూతుల పుష్ప గుచ్చం.
పెళ్లి ..ఒక భాద్యత తో కూడిన ఆలోచనా స్రవంతి.”
వనజవనమాలి గారూ.. “తన్హాయి” నవలను గురించి మీ సమీక్ష చాలా బాగుందండీ..
తప్పకుండా చదవాలి అనిపించింది.
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు థాంక్యూ..
"కౌశిక్ అనుకుంటాడు..కల్హార మనసు నాది. ఆమె పూర్తిగా నా సొంతం. ఆమెని నాతొ కలసి జీవించడానికి ఒప్పించి నా భార్యకి తెలియకుండా.. ఆమెతో.. కలసి ఉండటం ని సాధ్యం చేసుకోవాలి."
-- ఈ వాక్యం నిజమే అయితే కౌశిక్ భావనని ప్రేమ అని ఎలా అనగలరు? అదే విధమైన భావన కల్హారకూ ఉందా? లేకపోతే కౌశిక్ భావన తెలిసినా ఎలా ఒప్పుకోగలిగింది? ఒకవేళ ఒప్పుకుంటే తనూ అదే పని చేయడానికి అభ్యంతరం దేనికి?
చివరికి, తాను అంతకు ముందు ఉంటూ ఉన్న విధంలోనే ఉండిపోడం వల్ల కల్హార ఏం సాధించింది? కొన్ని మానసిక ప్రకంపనలూ, తర్వాత వాటిని నియంత్రించుకునే ప్రయత్నమూనా? అలాంటప్పుడు చెప్పుకోడానికి మిగిలిందేమిటి? ఓపెన్నెస్ సాధించి, తన భర్తతో తన వివాహానంతర ప్రేమ భావనలను చెప్పగలగడం మాత్రమేనా? నేటి సమాజం ఇంకా అక్కడే ఆగిపోయి ఉందని రచయిత్రి భావన అనుకోవచ్చా?
మనసులో వెల్లువవుతున్న ప్రేమ(!) భావనలపై స్వీయ నియంత్రణ సాధించాలి అన్నదే రచయిత్రి ఉద్దేశమైతే ఇంక, తనను కాముక దృష్టితో మాత్రమే చూసిన కౌశిక్‌ని ప్రేమించేలా కల్హారను ఎందుకంత కష్టపెట్టడం.
లేక... మగాళ్ళందరూ ఆడవాళ్ళను పక్క లోకి లాక్కునే దృష్టితోనే చూస్తారు. ఐనా అలాంటి వాళ్ళను ప్రేమించడం స్త్రీకి సాధ్యమే అని నిరూపించే ప్రయత్నమా ఇది?
ఎక్కడో ఏదో తేడా ఉంది. ( నవల చదివి తెలుసుకోండి అంటారా :) )
పురాణపండ ఫణి గారు.. ప్రేమ పేరిట ఆకర్షణ పేరిట..గడప దాటాలనుకునే వారికి కల్హారలో ని వివేకమంతమైన ఆలోచన ని మాత్రమే చూడండి అనే సందేశం కూడా కావచ్చును కదండీ!
ఇలాటి పరిస్థితి అంటూ వస్తే..తమని తాము..అలాంటి మొహం లో చిక్కు కోకుండా కాపాడుకోవడం ఎలా గో..కూడా ఆలోచించమని కూడా చెపుతుంది.. అని కూడా అనుకోవచ్చును.కదండీ!
స్త్రీలు అందరు "కల్హార" లు కాకండి. ఒకవేళ అలాటి స్థితి వస్తే.. కల్హార లా కాకపోయినా.. మీలా మీరు ఉండండి. అని నేను చెపుతాను. అంతే..నండీ!
మీ పాయింట్ అఫ్ వ్యూకి అభినందనలు.
@ రాజీ.. ప్రేమ అనేది ఒక అనుభూతి. ఆ అనుభూతి అనుభవం లోకి రావాలంటే.. మనకున్న చాలా అభ్యంతరాలని దాటేసే దైర్యం అన్నా ఉండాలి..లేదా చాలా ఉన్న ఆంక్షలకి లోబడి.. అనుభూతులని మనసులో దాచేసి..దాచుకుని బ్రతకాలి. 'తన్హాయి" అదే చెప్పింది.
థాంక్ యు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి