10, మే 2012, గురువారం

ప్రేమని చంపేసే.."ఇగో"

ఇదిగిదిగో..ఒక అందమైన ద్వీపం.
అలల పలకరింపులతో..క్షణ క్షణం పులకరిస్తూ.. పచ్చని ప్రకృతి.. తివాచి పరచినట్లు ,సూరీడు నులివెచ్చని కిరణాలతో..జలకాలాడి, పండువెన్నెలలో..ఆటలాడుకుంటూ, మలయ మారుతాల తో..ఊరేగుతున్నట్లు ఉంటుంది. అంత అందమైన ద్వీపం అది.


ఆ ద్వీపంలో రక రకాల ఫీలింగ్స్,ఎమోషన్స్ కలసి జీవిస్తూ ఉంటాయి. ఎవరి త్రోవ వారిది. ఎవరి నైజం వారిది.
అయితే... ఆద్వీపంలో ...ఇదిగో ఈ ప్రేమ ఉంటుంది.
ఈ ప్రేమ మాత్రం అందరు తనవారు అనుకుని ఎక్కడ కావాలంటే అక్కడ ఇమిడిపోతూ..తలలో నాల్క లా ఉంటూ ఉంటుంది. ఆ ప్రేమ నైజం ఎలాటిదంటే... ఎవరైనా ఆహ్వానిస్తే..చటుక్కున అరచేతిలో అమరిపోతుంది.
హృదయం లో తిష్ట వేస్తుంది.


ఆ ద్వీపంలోనే "ఇగో' కూడా ఉంటుంది.

ఒక రోజు పెద్ద సునామి వచ్చే సూచనలు అందుతాయి. ఆ ద్వీపం ఖాళీ చేసి వెళ్ళా లనుకుంటారు.. త్వర త్వరగా అక్కడ నుండి బయట పడి ప్రాణాలు రక్షించు కోవాలని తాపత్రాయపడుతుంటాయి. ఎవరికి వారు..బొట్ లని చేజిక్కుంచుకుని..ఆ ద్వీపం వదలి వెళ్లి పోతుంటాయి. ప్రేమ మాత్రం అందరు వెళ్ళిపోతున్నారు.. కానీ "ఇగో" మాత్రం కనబడటం లేదనుకుని "ఇగో"ని వెతుకుతూ ఉంటుంది. "ఇగో"మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది..సముద్రంలో ఎగసి పడే అలలను చూస్తూ..వినోదంగా నవ్వుకుంటూ ఉంటుంది.

అప్పుడు ప్రేమ "ఇగో "ని సమీపించి.. అందరు ద్వీపం వదలి వెళ్ళిపోతున్నారు. మనం కూడా వెళ్లి పోదాం..రా.. అని  చేయి పట్టుకుని  అంటుంది.

"నేను ఇలాటి సునామి లు ఎన్నో చూసాను.అవి నన్నేమి చేయలేవు. నేను ఇక్కడే ఉంటాను..కావాలంటే నువ్వు కూడా వెళ్లి పో !" అని అంటుంది నిర్లక్ష్యంగా..

అప్పుడు..ప్రేమ "ఇగో" ని ఒంటరిగా వదిలి వెళ్ళలేక "ఇగో" తో పాటు ఉండి పోతుంది.

ఆ రాత్రికి ..పెద్ద సునామి వస్తుంది. ఆ తాకిడిలో ఇగో..ఆనవాలు కూడా లేకుండా..పోతుంది.

అలాగే ప్రేమ కూడా.. ఇగో తో కలసి సునామి తాకిడిలో నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతుంది.

తెల్లవారేటప్పటికి మళ్ళీ తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు.. సముద్రం మాములుగా ఎప్పటిలాగానే ఉంటుంది.

పాపం "ప్రేమ" "ఇగో" తో కలసి ఉండటం మూలంగా.. "ఇగో' తో పాటు నాశనం అయ్యింది.  ఫీలింగ్స్,ఎమోషన్స్.
తర్వాత అక్కడికి చేరుకున్న ప్పుడు ప్రేమ,ఇగో కనబడక పోవడంతో.. ప్రేమ అయినా మనతో పాటు వచ్చి ఉంటే.. బ్రతికి ఉండేది కదా!అనుకుంటాయి

ఈ కథ మా అమ్మాయి..డాక్టర్ .శిరీష ..చెప్పింది. ఒక ఐదారు ఏళ్ళు అయింది.

ప్రేమ ఏ ఫీలింగ్ తో నైనా కలసి ఉండవచ్చు కాని ..ఇగో తో కలసి ఉండకూడదు. "ఇగో" తను నాశనం అవడం తో పాటు ఇతరులని నాశనం చేస్తుంది. పాపం ప్రేమే..తెలియక "ఇగో' తో కలసి ఉంటుంది అందుకే.. ప్రేమ కూడా చచ్చిపోతుంది అని.

నిజం కదా! ఇగో .. ఇతరులతో తను కలవలేదు. ఇతరులు కలసినా తను కలవదు .  గొప్పగా ఊహించుకుని ఇతరుల నుండి తనని తానూ వెలివేసుకుంటుంది..అని అనిపించిది.

మీకేమి అనిపిస్తుంది!? నా కైతే .. ఇలా చెప్పాలనిపిస్తుంది..

ప్రేమని ఆహ్వానించండి. ప్రేమని ద్వేషించ కండి.

ప్రేమ అంటే..నేరమో..పాపమో కాదు.దాని విలువ తెలిస్తే..తెలుసుకుంటే.. మనని నడిపించే ఇందనం.. అనంత జీవన ప్రవాహ జీవం .

4 వ్యాఖ్యలు:

జలతారువెన్నెల చెప్పారు...

బాగుందండి. నిజమనైన ప్రేమ ఉన్న చోట ఇగో కి ఆస్కారమే లేదు, ఇగో ఉండదు.

రాజి చెప్పారు...

ఇంతకు ముందు జలతారువెన్నెల గారు
ప్రేమ - పిచ్చి ఎలా కలిశాయో చెప్పారండీ..
ఇప్పుడు మీరు ప్రేమ - ఇగో ల గురించి చెప్పిన కధ కూడా బాగుంది..

మీరు చెప్పింది నిజమేనండీ..
"ప్రేమ ఏ ఫెలింగ్ తో నైనా కలసి ఉండవచ్చు కాని ..ఇగో తో కలసి ఉండకూడదు. "
ఉండలేదేమో కూడా..

oddula ravisekhar చెప్పారు...

nice post.

Meraj Fathima చెప్పారు...

madam,prema o anirvichneeyamina bhavana ego ki chotu ledu chala bagundi me post