3, మే 2012, గురువారం

ఓ..హృదయం తెలుసా!


హృదయం 

ఏ పుట్టలో ఏ పాము ఉందొ..ఎవరికి తెలుసు.
ఏ మట్టిలో ఏ మొలక తలఎత్తునో ఎవరికి తెలుసు.
ఏ పడతి మనసులో ఏముందో ఎవరికి తెలుసు
ఏ నడక ఏ గమ్యం వైపు సాగునో ఎవరికి తెలుసు

అయినా వెంటాడే చూపులు
వేటాడే మాటల కత్తులు
దూసి పోసి, విద్వేషం రంగు పులిమి
దాగిన నిజం కుత్తుక నులిమి..
తాము ఆశించిన జవాబు కై..
వడేసి హృదయాన్ని పిండితే..
విల విల లాడే గుండె
గాయం గేయమైన  చోట


ఎద బరువెంతో ఎడబాసిన హృదయానికే తెలుసు..
చేజారిన చెలిమి విలువ చెలియ మనసుకే తెలుసు..
పాశం విలువ రక్తసంబంధం కన్నా మరెవరికి తెలుసు..
మనసుకి మనసుతో తప్ప  సంకెళ్ళు వేయలేరని తెలుసు..

16 వ్యాఖ్యలు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

సూపర్ అండి చాలా బాగుంది
మీరు చాలా బాగా వ్రాస్తారు అని మా అందరికి తెలుసు
ఆ మాట కాదు అనేవారు ఎవరు లేరు అని కూడా మాకు తెలుసు

జలతారువెన్నెల చెప్పారు...

కవిత బాగుంది. ఆఖరి నాలుగు లైన్లు చాలా బాగున్నాయి

రాజి చెప్పారు...

"ఎద బరువెంతో ఎడబాసిన హృదయానికే తెలుసు...
పాశం విలువ రక్తసంబంధం కన్నా మరెవరికి తెలుసు...
మనసుకి మనన్సుతో తప్ప ఎవరూ సంకెళ్ళు వేయలేరని తెలుసు.."

వనజవనమాలి.గారూ..
ఓ హృదయాన్ని ఇంత చక్కగా తెలుసుకోవటం,
తెలియచేయటం మీకు మాత్రమె తెలుసండీ..

సామాన్య చెప్పారు...

మీ సమీక్ష,కవిత అన్నీ బాగున్నాయి వనజ గారూ.

జ్యోతిర్మయి చెప్పారు...

కవితలో చివరి నాలుగు లైన్లు చాలా బావున్నాయి వనజగారూ....

Palla Kondala Rao చెప్పారు...

" ప్రతి రాయిలో ఒక 'శిల్పం' ఉన్నట్లే ప్రతి మనిషి లో ఓ 'మనీషి' వుంటాడు "
ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వివేకవంతులు మరింత శక్తివంతులుగా రాటుదేలతారనడానికి మీ కవితే ఒక నిదర్శనం వనజ గారూ !

వనజవనమాలి చెప్పారు...

బాలు గారు..మీ అభిమానం కి ధన్యవాదములు. మనమందరం భావ ప్రేమికులం.అందుకే.. మంచి భావాలు ని మనసు గుర్తిస్తుంది అని కూడా తెలుసు కదా!:)
@ జలతారు వెన్నెల గారు.. నేను ఎల్లప్పుడు కవిత్వం వ్రాయలేను. మనసు స్పందిన్చినప్పుడే వ్రాస్తాను.
అందులో అందుకే డీప్ ఫీల్ ఉంది. థాంక్ యు వేరి మచ్.

వనజవనమాలి చెప్పారు...

రాజీ గారు.. మీకు మరీ మరీ ధన్యవాదములు. రాత్రి కళ్ళు మూతపడుతుంటే.. బలవంతంగా రెప్పలు విప్పి వ్రాసుకున్న అక్షర రూపం అది. వేదనా భరితంగా మారిన హృదయం.. బాష అది.
మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

సామాన్య గారు.. మీరు చెప్పే ఈ మాట కోసం చకోరమై ఎదురు చూసాను.
మాటల తూటాల దాడికి మనసు విల విల లాడి.. గాయం గేయమైన కవితకి మీ ప్రశంసలు..పన్నీటి చిలకరింపులు.
ధన్యవాదములు.
మీరు వ్రాసిన "అల" నా కల్లోల మనః కడలిని తాక లేక పోయింది. ఒక విధంగా మైండ్ బ్లాంక్ . అందుకే స్పందించ లేక పోయాను.

వనజవనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి గారు.. ధన్యవాదములు. అప్పుడు అలా పోస్ట్ చేసేసి..మరలా ప్రొద్దునే అనుకున్నాను. పైన లైన్స్ ఇంకా బాగా రావాల్సింది అని. ఎనీ హౌ ...థాంక్ యు!

వనజవనమాలి చెప్పారు...

కొండల రావు గారు.. ధన్యవాదములు. థాంక్ యు వేరి మచ్!!ఒకోసారి..కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవు. ఇప్పుడు అదే స్థితి.

anrd చెప్పారు...

కవిత అంతా చాలా బావుందండి.

Rajesh Devabhaktuni చెప్పారు...

చాలా బాగుందండి... అంతకన్నా ఎమి చెప్పలేను....!

వనజవనమాలి చెప్పారు...

anrd.. gaaru.. Thank you very much..medam.

@Rajesh Devabhakthuni gaaru..Thank you very much!!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

చివరి నాలుగు పంక్తులు నాకు బాగా నచ్చాయి. హ్యాట్స్-ఆఫ్, వనజ గారు.

Raja Chandra చెప్పారు...

wow.. super andi..