14, మే 2012, సోమవారం

జల్, జమీన్, జంగల్ కోసం పోరాటం

మనిషి జీవితమే ఒక పోరాటం.

ఆ పోరాటం లో తమ అస్తిత్వం కొరకు పోరాడాల్సి రావడం ఈ ఆదివాసులకు క్రొత్త ఏమి కాదు. యిప్పుడు పోరాటం అయితే ప్రభుత్వం మీద.

నాగరిక కుటుంబాలలో పుట్టిన బిడ్డలకి అరచేతిలో ఉసిరిలా మంచి చదువుల అవకాశం ఉంది. పౌష్టిక ఆహారం ఉంది.మితిమీరిన ఒత్తిడి ఉంది.అనుకున్నది సాధించగల అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కానీ తర తరాలుగా మార్పుకి నోచుకోక వన అరణ్యాల చెంతనే మనుగడ సాగిస్తూ..అభివృద్ధి ఏమిటో తెలియని ఆది వాసులు గురించి పట్టించుకునే నాధుడే లేరు.

ప్రభుత్వ పధకాలు వారి దరి జేరవు సరికదా వారి జీవితాలని దోచిపెట్టడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నట్లు ఉంటాయి. వారికి చదువులు ఉండవు,వైద్యం అందుబాటులో ఉండదు.ఆఖరికి వారి ఉనికి కూడా కనుమరుగయ్యే స్థితిలో ఉన్నారు.

ఆర్ధిక మడళ్ళు పేరిట ..గత ఆరేడు ఏళ్ళల్లో అక్షరాలా నూటొక్క సెజ్ లు మన ఆంద్ర ప్రదేశ్ లో ఏర్పాటు అయి..ధనవంతుడికి దోచిపెట్టేన లంచగొండు ప్రభుత్వ పాలనలో..

చిన్న చితక రైతులు , ఆదివాసులు వారి వారి మూలాలను కోల్పోతూ ..అధిక శ్రమలో కూడా పూట గడవక పస్తులుండే కటిక దరిద్రం చాలా మంది నాగరికులకి తెలిసే అవకాశమే లేదు.

విదేశాలలో నానా అవస్తలతో..బయటకి చెప్పుకోలేని వెతలతో..బ్రతుకుతున్న వారికి మన దేశం లో ఏం జరుగుతుందో తెలియదు. పర్వాలేదు మనదేశం బాగానే ఉంది అనుకుంటారు.ఏమో కూడా. నిజంగా వాళ్ళు వస్తే ఇక్కడ వ్యవస్థని చూస్తే బెదిరిపోతారు అనిపిస్తూ ఉంటుంది నాకు.

మనం ఆర్ధికంగా అభివృద్ధి సాధించామా?నిరక్షరాస్యతని జయించామా? పేదరికం ని పార ద్రోలడం సాధ్య పడే పనేనా ? పైకి మెరుగ్గా కనిపించే మన అభివృద్ధి ఒట్టి డొల్ల యేనా? మారుమూల ప్రాంతాలలో మన జనుల దుస్థితి ఏమిటి..అని తెలియని వారి కోసం .. ఈ వ్యాస పరిచయం.
ప్రాంతాలు ఏవైనా బౌగోళిక పరిస్థితులు వేరైనా .. కొందరి బతుకులని స్వార్ధ రాజకీయ శక్తులు.పెట్టుబడి దారులు దోచుకుంటున్న వైనాన్ని హృదయాన్ని కదిలించే ఈ వ్యాసం లో చూడండి.

అభివృద్దికి కూత వేటు దూరంలో మన దేశం ఉంది అని చెప్పేది పై పై మెరుగులు మాత్రమే! గణాంకాలు నిజమైన అభివృద్దికి చిహ్నాలు కావు..

ఇంకా మన దేశం వర్ధమాన దేశం గానే ఉంది అనిపించక తప్పని.. ఆవేదనా భరితమైన జన జీవితాల వాస్తవ చిత్రాలు కోకొల్లలు.

నేను చదివిన ఈ వ్యాసం ని ఇక్కడ మిత్రులతో పంచుకోవాలి అనిపించింది అందులో అన్నీ నిజాలే ఉంటాయి ఎదుకంటే అవి జీవన చిత్రాలు. ఈ క్రింది లింక్లో వ్యాసం ని చూడండి.
ఆదివాసి అంతరంగం

3 కామెంట్‌లు:

హితైషి చెప్పారు...

kaThora satyaalu ee vyaasam lo vishayaalu. manchi spoorthidaayakamaina vyaasam.anni patrikalu chadavalenivaariki e-paper chadavam kudarinivaariki ilaaa sher cher cheyadam valla use full gaa untundi.Thanks Vanaja garu

Hari Podili చెప్పారు...

వనజవనమాలి గారు,
hats off to you.
ఇలాంటి పోస్టింగ్స్ గురించే నేను ఎదురు చూస్తూ ఉంటాను.
ఆదిమ వాసుల గురించి మంచిగా విశదీకరించారు.ఆదిమవాసుల గురించేకాదు,అసలు DOWNTRODDEN PEOPLE గురించి పట్టించుకునే నాదులే లేరు.
ఇలాంటి వాటి గూర్చి ఇంకా ఎన్నో మీ కలము నుండి
జాలువారాలని మనసారా కోరుకుంటున్నాను.
ANY WRITING THAT ENCOUNTERS THE EVIL IN THE SOCIETY WILL BOOSTS UP ME
ONCE AGAIN THANKS FOR THE POSTING.
ఈ విషయాలపై నేను "నయవంచన ప్రభుత్వాలు" అనే
పోస్టింగ్ పెట్టాను,చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Hari podili గారు.. మీ స్పందనకి చాలా సంతోషం. ఇలాటి పోస్ట్ లకి అంత స్పందన లేకపోవడం నాకు కొంచెం బాధ కల్గిస్తుంది.మన చుట్టూ ఏం జరుగుతుందో.. తెలుసుకోవాలంటే..సామాజిక అంశాలని ప్రతిబింబించే వ్యాసాలూ తప్పకుండా చదవాలి. మీ కు అభిప్రాయానికి ధన్యవాదములు. మీ మెయిల్ ఐ డి..నాకు తెలిపితే.. నేను చదివిన కొన్ని ఆర్టికల్స్ మీకు తెలియజేస్తాను. అన్ని వెతుక్కుని చదివే తీరిక ,ఓపిక ,శ్రద్ద ఉండక పోవడం తప్పేమీ కాదు. లైఫ్ స్టైల్ అలా ఉంటున్నాయి. థాంక్ యు వేరి మచ్ .
@ హితైషి..మీరు నా బ్లాగ్ చదవడమే గొప్ప విశేషం.మీ స్పందనకి ధన్యవాదములు.