25, మే 2012, శుక్రవారం

మొబైల్ ముచ్చట్లు - ఇక్కట్లు
మహిళలు మీ మొబైల్ నంబర్లు ని ఇతరులకి ఇచ్చేముందు కాస్త ఆలోచించండి. మధ్య నా ఫ్రెండ్ ఒకరు వాళ్ళ అమ్మాయిని ..కార్పోరేట్ కాలేజ్ లో జాయిన్ చేయడానికి అమ్మాయితో కలసి వెళ్ళారు అక్కడ అవసరం అయిన చోట పోన్ నంబర్స్ ఇవ్వవలసి రావడం అవసరం కదా! అలాగే నంబర్ ఇచ్చి వచ్చిన తర్వాత నుండి మొదలయ్యాయి తల్లికి ఇబ్బందులు.
హాయ్
..అన్న పలకరింపులు ఎస్.ఎమ్.ఎస్ రూపంలో ప్రత్యక్షం.ఆన్సర్ ఇవ్వకపోయినా సందేశాల ప్రవాహం తగ్గలేదు సరి కదా పోన్ కాల్స్ రావడం మొదలయింది.
"
అసలు నువ్వెవరు..ఎందుకు ఎస్ ఎమ్ ఎస్ లు పంపుతున్నావ్? మా యోగ క్షేమాలతో..నీకేమిటి అవసరం? అసలు నా నంబర్ ఎలా వచ్చింది?ఇలా ఇబ్బంది పెడితే.. నీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది" అని గట్టిగా మాట్లాడే సరికి ..ఆంటీ!.. నంబర్ నా పోన్ లో ఉంది..ఎవరో నాకు తెలిసినవారు అనుకుని చేసాను అని చెప్పాడు.కానీ నంబర్ ఎవరిదో.. అని కాస్త కష్ట పడి సేకరిస్తే తెలిసిన విషయం ఏమిటంటే.. కాలేజ్ అడ్మిషన్ అప్పుడు రాసి ఇచ్చిన వివరాలలోని మొబైల్ నంబర్ తీసుకుని..అలా ప్రవర్తించినది.. "డీన్" స్థానం లో ఉన్న  ఒక లెక్చరర్ అని తెలుసుకుని.. వీళ్ళకి ఏం వచ్చిందే ! ఇలా ప్రవర్తిస్తున్నారు ..వీళ్ళు అసలు గురువులు స్థానంలో ఉండాల్సిన వారేనా!?  వీళ్ళు పిల్లలతో  ఎలా ప్రవర్తిస్తారో తలుచుకుంటే భయం వేస్తుంది" అని చెప్పింది నా ఫ్రెండ్.
ఇక
వాళ్ళ అమ్మాయి ఇంకొక స్టన్నింగ్ న్యూస్ చెప్పింది. తను పదవ తరగతి చదువుతున్నప్పుడు.. కో-ఆర్డినేటర్ సార్ మా క్లాస్ మేట్ అమ్మాయి అంటే ఇంటరెస్ట్ చూపించేవాడు. స్టడీ అవర్స్ లో అమ్మాయి తో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. అమ్మాయి మాట్లాడక పొతే కోపాన్ని అకారణంగా మిగతా ఆడపిల్లల పై ప్రదర్శించి తన అక్కసు తీర్చుకునేవాడు.ఆడపిల్లలపై కంప్లైంట్స్ రాసి  తన కసి తీర్చుకునేవాడట.
ఇక నా ఫ్రెండ్ ఒకామె భర్త యాక్సిడెంట్ లో చనిపోయి ఇద్దరు మగ పిల్లలతో ఒంటరి పోరాటం చేస్తూ..ఇన్స్యూరెన్స్ డబ్బు కోసం కోర్ట్లు చుట్టూ తిరుగుతూ..ఒక సారి తన కేసు వాదించే లాయర్ కి కాల్ చేయాల్సి వచ్చింది  pపొరబాటుగా ఒక నంబర్ తప్పుతో వేరొక నంబర్ కి కాల్ చేయడం తో..ఆమెకి వచ్చి పడింది..పెద్ద ముప్పు.కాల్ చేయగానే లాయర్ కాకుండా వేరొకరు మాట్లాడటం తో..పొరబాటు తెలుసుకుని  "సారీచెప్పి లైన్ కట్ చేసిందట .
ఇక
ఆరోజు నుండి  ఆమె  పొరబాటుగా కాల్ చేసిన నంబరు నుండి అర్ధరాత్రుల్లు పోన్ చేసి ఆమెని ఎవరు మీరు ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నలు వేయడం మొదలయింది. పిల్లల ముందు రాంగ్ కాలర్ తో మాట్లాడాల్సి రావడం తో పాపం! ఆమె ఎన్ని అవస్థలు పడిందో!ఆఖరికి రాత్రుళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. అతను పగలు కూడా  పోన్ చేయడం మొదలు పెట్టాడు. ఇబ్బంది భరించలేక నాకు కాల్ చేసి విషయం చెప్పింది.
ఇక
నేను చూసుకుంటాను నువ్వు దిగులు పడకు అని చెప్పి.. నంబర్ కి కాల్ చేసి మా బంధువుల నంబర్ అన్నట్లు మాట్లాడి..సారీ చెప్పి పెట్టేయడం మరలా మర్నాడు చేయడం ..మళ్ళీ సారీ అనడం ఇలా వారం రోజులు టిట్ ఫర్ టాట్ రుచి చూపించినా అతను ..ఆమెకి పోన్ చేసి విసిగించడం మానలేదు. రోజుకి ఆరోజు పోన్స్ ద్వారా ఏం జరుగుతుందో.. తెలుసుకుంటూ.. రాంగ్ కాలర్ కి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుని. అర్ధ రాత్రి అతని నంబర్ కి కాల్ చేయడం ..అతను భార్య ముందు పోన్ లిఫ్ట్ చేయలేక, లిఫ్ట్ చేయకుండా ఉండటం ఎందుకో భార్యకి చెప్పలేక తెగ ఇబ్బంది పడిపోయాడు.  గడ్డి పరక అని భావించిన ఆడవాళ్ళు , నానారకాలుగా ఇబ్బందులకి గురి అయిన ఆడవాళ్ళు తలచుకుంటే ఎలా ఉంటుందో ..తెలుసుకుని.. బుద్ధి వచ్చింది తల్లుల్లారా! అని దణ్ణం పెట్టేసాడు. భయ పడితే,కాస్త మెత్తగా కనబడితే అలాగే ఇబ్బంది పెడతారు. భయపడటం ఎందుకు ? అంటాను నేను.
ఇంకో
రకం వాళ్ళు ఉంటారు లెండి. మిస్ కాల్ ఇస్తారో,లేదా కాల్ చేసి అబ్బే మేము అసలు మీ నంబర్ కి కాల్ చేయలేదు అంటారు.మొబైల్ పోన్ లో మిస్ కాల్స్ లిస్టు చూసి సంస్కారంతో తిరిగి ఆ  నంబర్ కి కాల్ చేసేవాళ్ళు విషయంలో బాగా ఇబ్బంది పడతారు అని నా అనుభవం కూడా  .

ఒకోసారి
బిజీ టైములో కాల్స్ అటెండ్ అవడం వీలవక మిస్ కాల్స్ చూసి నంబర్ కి కాల్ చేస్తే మీకు మేము  అసలు కాల్ చేయలేదు అంటారు. అప్పుడు ఒళ్ళు మండి పోతుంది చూడండి.!?

ఒక సారి నాకు అలాగే జరిగింది ఒక ల్యాండ్ లైన్ నంబర్ నుండి మిస్ కాల్ వచ్చింది నేను వెంటనే నంబర్ కి కాల్ చేసాను. అబ్బే! అసలు మేము చేయలేదండి. మీ నంబర్ అసలు మాకు తెలియదు అంటాడు. లేదండి ఇప్పుడే కదా కాల్ వచ్చింది అన్నాను. ఆడవాళ్ళకి కావాలని ఇలా చేయడం ఇదొక అలవాటు అయిపొయింది..అని పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకుంటూ..ఏదో అంటున్నాడు. పోన్ ఆఫ్ చేసి నంబర్ వివరం చూస్తే మా లోకల్ నంబరే ఎక్సేంజ్ కి వెళ్లి గారిని చెప్పి రిక్వెస్ట్ చేస్తే నంబర్ ఉన్న ఇంటి  అడ్రస్స్ ఇచ్చారు .
అడ్రెస్స్ కి వెళ్లి .. పిచ్చి పిచ్చిగా నోరు పారేసుకున్న ఆ ఇంటాయనని,ఆయన భార్యని కూడా బయటకి పిలిచి ..కాల్ రిజిస్టర్ లో ఉన్న వారి నంబర్ ని చూపించాను. ఆమెకి నీ భర్త ఇలా మాట్లాడుతున్నాడు.అది సంస్కారమేనా అని గట్టిగా అడిగి వచ్చాను. అతను చెట్టులా నిలబడ్డాడు కానీ కనీసం సారీ కూడా చెప్పలేదు. అతని బదులు ఆమె చేతులు పట్టుకుని సారీ చెప్పింది.

మహిళల్లో కొంత మంది అతను చెప్పినట్లు చేసేవారు ఉండవచ్చు. అలాంటి వారి ప్రవర్తన వల్ల ఇతరులని కూడా అలా అనుకుంటే ఎలా!? ఏమిటో కొందరి చెడు ప్రవర్తన కల్గిన ఆడవారి వల్ల అందరు ఆడవాళ్ళకి కల్గుతున్న ఇబ్బందులు ఇవి.
అయినా ఏదో పొరబాటున ఒక కాల్ వెళితే జరిగిన పొరబాటు గుర్తించి ఓ..సారి క్షమించ మని అడగడం నామోషి అనిపించుకుంటుందో,లేకపోతే ఇంకో విధంగా కావాలని వేదించడం ,పనిగా పెట్టుకుంటారో..కాని ఇలాంటి విషయాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి.

వీలైనంత వరకు అవసరమైన చోట ఇంట్లో ఉన్న మగవారి నంబర్స్ ఇవ్వడం శ్రేయస్కరం అనిపిస్తుంది. అప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. అలా అని ఇబ్బందులు వస్తున్నాయని భయపడటం కూడదు.
నా ప్రెండ్ విషయం లో చూస్తే ఎక్కడో దూర ప్రాంతం లో ఉన్న ఆమె భర్త నంబర్ ఇవ్వడం కన్న కాలేజ్ తో అనుసంధానం కోసం ఆమె మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పు కాదు. కానీ ఆ నంబర్ చూసి తీసుకుని కావాలని పరిచయం పెంచుకోవాలని,,ఇబ్బంది పెట్టాలని చూసిన "డీన్" స్థాయి వ్యక్తీ దగ్గర నుంచి.. అనాలోచితంగానో,లేక అహంకారం వల్లో ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకునే వారి వరకు మన మధ్యనే ఉన్నారు.

పోన్ కాల్స్ తో వేధించే వారి సంఖ్యా విపరీతం గా పెరిగిపోతుంది.వేదింపులని ఎదుర్కునేవారు దైర్యంగా ముందుకు వచ్చి తమకి కల్గిన ఇబ్బందిని చెపుతూ కంప్లైంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. అలా చేయడం వల్ల గౌరవం దెబ్బ తింటుందని దాచి పెట్టుకుంటే అనేక సమస్యలు వస్తాయి.

అలాగే అవసరం అయినప్పుడు బయట వ్యక్తులకి నంబర్ ఇవ్వాల్సి వస్తే ల్యాండ్ లైన్ నంబర్ ఉంటే ఆ నంబర్ ఇవ్వడం శ్రేయస్కరం. ఎందు కంటే ల్యాండ్ లైన్ కి ఎస్ ఏం ఎస్ లు గట్రా అవకాశం ఉండదు కదా!
లేదా అసలు పోనే వద్దనుకుంటే మరీ మంచిది.ఈ నవీన యుగంలో పోన్ ల వల్ల కలిగే ఇబ్బందికి భయపడటమా?
సమస్యలకి భయపడటం గురించి మీరు చెపుతున్నారా !? అని అనుకోవద్దు.

పోన్ లేకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.అవసరం అనుకుంటే ముఖ్యమైన వారికి మాత్రమే మన నంబర్ తెలిసి ఉండటం కొత్తవారికి మొబైల్ నంబర్ ఇవ్వకుండా ఉండటం మంచిదని నా అభిప్రాయం.. ఎందుకంటే మొబైల్ హెల్ అంటే మాటలు కాదు. నానా రకాల పైత్యాలని చూడాలి .
నా అనుభవం ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం తో ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. ఈ పోస్ట్ చదివినందుకు ధన్యవాదములు.

8 వ్యాఖ్యలు:

♛ ప్రిన్స్ ♛ చెప్పారు...

nijam andi ilanti edavalu chaalaa mandi unnaru... maaku kuda elane jarigindi evado teliyadu.. roju cal cheshevadu cheppi cheppi sivaraku visugu vachi stion daakaa vellalisi vachhindi...

Alapati Ramesh Babu చెప్పారు...

అందుకే అనుకుంటా ఈ మొబైల్స్ రాని రొజులలొనే వేటూరిగారు దుర్యొధన దుశ్శాసన దుర్వినీతి లోకములో అనే పాట కు అర్ధము ఈ నాటి కాముక రావణులు నిజము చేస్తున్నారు. ఎంత క్షొభ,ఎన్ని సంసారాలు వ్యధ,బాధ,కలతలు,రోడ్డునపడటాలు,విడాకులు ఇలా అన్ని ఈ ఛంఢాలుర హేయమయిన ప్రవర్తన వలనే అనే విషయములో ఎమాత్రము సందేహము వలదు. అమ్మలు! మీరే నడుంకట్టాలి మీరు పూనుకుంటే కానిది లేదు.

the tree చెప్పారు...

chaala pedda sunnithamaina samsya,
mobile gurinchi inka ekkovaga
charchinchalsina avasaram undi.
manchi article raasaaru,
thank you madem.

జలతారువెన్నెల చెప్పారు...

వనజ గారు, మీ మొబైల్ నంబర్ ఇస్తారా? ఒక మిస్స్ కాల్ ఇస్తాను. సరదాకి అన్నాను.
ఆశ్చర్యం గా అనిపించిది...మొబైల్ teasing కూడా ఉంటుందని విన్నాక.

oddula ravisekhar చెప్పారు...

ప్రస్తుతం తీవ్రంగా వున్న ఈ సమస్యను బాగా విశ్లేషించారు.

rajasekhar Dasari చెప్పారు...

పాటల వాళ్ళు కూడా చాలా విసికిస్తారు, టెలి మార్కెటింగ్ వాళ్ళు కూడా ఏంటో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు

వనజవనమాలి చెప్పారు...

ప్రిన్స్.. నిజంగా చాలా ఇబ్బంది ఉంది కదా! నేను వ్రాసినది కొద్ది మాత్రమే!ఇంకా చాలా ఉన్నాయి . మళ్ళీ ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను. థాంక్ యు!
@ రమేష్ బాబు గారు మీరు చెప్పినది నిజం. మొబైల్ చిచ్చువల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో! చాలా ఇబ్బందులు ఉన్నాయి. సమస్య ఉందని తెలిసినా అవసరం కోసం, సౌకర్యాలని వదల లేక పోతున్నాం . స్పందించి నందుకు ధన్యవాదములు.
@the tree గారు ధన్యవాదములు. మరి కొన్ని విషయాలు వ్రాయాల్సిన అవసరం ఉంది. స్పందించినందుకు ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. థాంక్ యు! మొబైల్ టీజింగ్ భయంకరం అండీ! మీకు తెలియదు కాబోల్సు . అదృష్టవంతులు.నా నెంబర్ ఇస్తాను.ఓకే..నా:)
@రవిశేఖర్ గారు థాంక్ యు! ఎవరి దృష్టికి ఈ విషయాలు వచ్చినా ఖండించాలి.! లేడీస్ కి వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయండి. నేను చెప్పినది కొద్దిగా మాత్రమే!
@రాజ శేఖర్ దాసరి గారు..అవి మరి కొన్ని కోణాలు. మొబైల్ వద్దురా ..బాబూ అనుకునే సమస్యలు అవి. థాంక్ యు అండీ!