![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgihey_gmryulHiCv7Qu8fJjpJKSvHixbAdWDmb9njuX5zYtgLrSQwcNlrQgqy1R2FwPmXQgeoyHdgEJGPHAFpzHLgMEe0StQu2qRtmfzNXDERUSbPGkYXHSFj4bpMwSOxWSvWBq-F3uOPe/s400/sarassu.jpg)
నేను సరస్సుని
నేనొక.. నిశ్చలమైన అందమైన సరస్సుని..
నింగినుండి కురిసిన చినుకులో చినుకునై ,
వరధనై..పరవళ్ళు..తొక్కాలని.. సందళ్ళు.చేయాలని.
నా..మది గదినిండా..ఎన్నో ఆశలు..ఆకాంక్షలు..
మన్ను మిన్నై నలుచెరుగులనుండి బాహుబందాలలో.. బంధించితే..
మరి నాకు ఏది గతి... ?
సఫలం కాలేని నా..కలలభారంతో ....విఫల మనస్కనై..
నే.. కార్చే.కన్నీరు నాలోనే ఇంకిపోయే నాకే సొంతమైన.. దుర్గతి
నాలో నేనే .. ఎన్నటికి నాలో నేనే..
నాలో నన్నే అంటిపెట్టుకున్న జీవరాశులు ఎప్పటికి..
తల్లి.. గర్భం నుండి బయట పడని బిడ్డల్లా.
వాటి చిరుకధలికలకి.. ఎంతో..పులకింత
నా ఒడ్డున పెరిగే గడ్డిపూవును, చెట్టుమానును..
ఒకేలా.. ప్రేమ పంచేస్తూ..ఒకే పరికింత
దారినపోయే ఏ కొంటెకోనంగి విసిరిన రాయితో..
అలజడి మొదలైతే కోపం ఇసుమంత
అద్దం లాంటి మనసుతో..
అద్దంలా.. భాసించే నాలో.. నేను
తొంగి చూసుకుంటుంటే సంతసం మరింత..
దాహార్తి తో .. వచ్చి దోసిళ్ళతో నింపుకుని తృప్తిపడి వెళుతుంటే..
తల్లినై.. స్తన్యాన్ని.. అందించిన సంతృప్తి కొండంత
నేను నేనే.. ఎన్నటికి నేను నేనే!
(పత్రిక 2008 మార్చి సంచికలో ప్రచురింపబడ్డ కవిత)
8 కామెంట్‌లు:
సరస్సు మీద కవిత .బాగుందండి.
నాలో నన్నే అంటిపెట్టుకున్న జీవరాశులు ఎప్పటికి..
తల్లి.. గర్భం నుండి బయట పడని బిడ్డల్లా.
వాటి చిరుకధలికలకి.. ఎంతో..పులకింత .మంచి భావం
జలధరము కురిసి విరిసిన
జలముల వనజములు పుట్టె , సరసీ రుహముల్
గళమున దాల్చిన కృష్ణుడు
వెలయగ వనమాలి యయ్యె వినుమో సరసీ !
----- సుజన-సృజన
"దాహార్తి తో .. వచ్చి దోసిళ్ళతో నింపుకుని తృప్తిపడి వెళుతుంటే..తల్లినై.. స్తన్యాన్ని.. అందించిన సంతృప్తి కొండంత!" చాలా బాగా రాసారు వనజ గారు... అభినందనలు!
సరసు మనసు మీకు తెలుసు....
సరస జనితాలు వనజనికి అవగాతాలు...
చాల బాగుంది వనజ గారూ!
@శ్రీ
నేను నేనే.. ఎన్నటికి నేను నేనే!
meere, meere eppatiki meere
bhaagundandi mee kavitha.
దాహార్తి తో .. వచ్చి దోసిళ్ళతో నింపుకుని తృప్తిపడి వెళుతుంటే..
తల్లినై.. స్తన్యాన్ని.. అందించిన సంతృప్తి కొండంత
యెంత చక్కగా వ్రాసారు.మీకు సాటి మీరే
రవి శేఖర్ గారు.. మీ స్పందనకి ధన్య వాదములు.
మీరు చేసే వ్యాఖ్యలు.. మళ్ళీ నేను వ్రాసిన ఆ భావాన్ని తరచి చూసుకునే టట్లు ఉంటాయి ధన్యవాదములు
@ వెంకట రాజ రావు గారు.. మీ ప్రశంస కి చాలా సంతోషం.మరీ ,మరీ ధన్యవాదములు.
@కాయల నాగేంద్ర గారు .. థాంక్ యు ..థాంక్ యు వేరి మచ్!!
@ శ్రీ గారు "సరస్సు " నా మనస్సుకి ప్రతి రూపం .కవిత లోని ఆంతర్యాన్ని గ్రహించారు.ధన్యవాదములు.
@ ది ట్రీ భాస్కర్ గారు.. :) థాంక్ యు వేరి మచ్!!
@శశికళ గారు థాంక్ యు వేరి మచ్!!
కవిత బాగుంది వనజ గారు.
అసలు ఒకటి చెప్పండి. ఇన్ని వైవిధ్యమైన టాపిక్స్ మీద కవితలు easy గా ఎలా రాయగలుగుతారు? అందులో ఇంత చక్కగా? అభినందనలు మీకు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి