18, మే 2012, శుక్రవారం

ప్రేమ ఋతువు - ప్రేయసి వేంచేసిన వేళ

ఆరు ఋతువుల ఆమని లో..అంతా చైతన్యమే! ఎప్పటిలాగానే శిశిరాన్ని చీల్చుకుని వసంతం రానే వచ్చింది..వచ్చినట్లే వచ్చి తన జాడలని ఇంతో అంతో మిగిల్చిపోతుంది.

వసంతం వస్తుందంటే నాకు చప్పున గుర్తుకు వచ్చే హిందీ పాట ."సూరజ్" చిత్రంలో ఈ పాట

"
మహ్మద్ రఫీ" గళం పరిచయం ఉన్న హిందీ పాటల అభిమానుల అందరికి ఈ పాట తప్పకుండా తెలుస్తుంది.మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు.

హజ్రత్ జైపురి సాహిత్యం లో భావుకత మనసుని రసరమ్యం చేస్తుంది.

ఆ పాట చిత్రీకరణ చాలా అందంగా ఉంటుంది. "వైజయంతి మాల" ని పూల ఉయ్యాలపై ఊగించిన అందమైన దృశ్య రూపం మరవాలన్నా మరపు రానిది.
ఇంత చక్కని చిత్రీకరణ గల గీతాన్ని మనం  చాలా తక్కువగా  చూస్తుంటాం

పున్నమి వెన్నెల లో తన ప్రియురాలు తనని కలవడానికి వచ్చిన సందర్భంలో..ఓ.ప్రేమికుడు(రాజేంద్ర కుమార్) పాడిన భావగీతమే ఈ పాట.

ముందుగా హిందీలో మనకి వినిపించే సాహిత్యాన్ని మక్కీకి మక్కీగా పరిచయం చేస్తాను.

ఇది హిందీ సాహిత్యానికి  తెలుగు అనువాదం.

ఓ..ప్రకృతి పూల వర్షం కురిపించు
నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది.
.
ఓ..ప్రకృతి పూల వర్షం కురిపించు
నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది

ఓ గాలి...  రాగాలు ఆలపించు
నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది.

ఓ..పూల ఎర్ర రంగూ ..
నీ ఎర్రదనాన్ని (ఈమె)ఎఱ్ఱని చేతుల్లో గోరింటాకులా ఉండు.

ఓ దట్టమైన మేఘమా...  క్రిందికి దిగిరా
నీ నల్లని రంగు (నా ఈ )ప్రేయసి అందమైన కన్నులకు కాటుక అవ్వు

ఓ..నక్షత్రాల్లారా మీరు (ఈమె )పాపిటలో నిలవండి

నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది.
ఓ..ప్రకృతీ ..  పూల వర్షం కురిపించు
నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది

అన్ని వైపులా నుండి ప్రసరించే చూపులతో
తేజోవంతమైన ఈ రూపానికి మేలి ముసుగు వేయి

(చాలా సిగ్గు కల్గిన) మనసంతా సిగ్గు నిండుకుని
వెళ్ళిపోతుంది సిగ్గుపడుతూ..

కొంచెం నువ్వు ఆ మనసును ఆహ్లాద పరచు

నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది
ఓ..ప్రకృతి పూల వర్షం కురిపించు
నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది

యవ్వనం నిండి ఉన్న ఈ పూల మొగ్గలతో
అలంకరించబడిన ఈ పూల శయ్య.. ..

వీటికి తెలుసు .ఏదో ఒక రోజు ప్రేమ ఋతువు వస్తుందని

అలంకరించుకున్న ఓ..పూల దండా ..
నీ రంగులు వెదజల్లు

నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది

ఓ..ప్రకృతి పూల వర్షం కురిపించు
నా ప్రేయసి వచ్చింది.నా ప్రేయసి వచ్చింది

హిందీ సాహిత్యం ఇది..

Baharon phool barsao
Mera mehboob aaya hain
Mera mehboob aaya hain
Baharon phool barsao
Mera mehboob aaya hain
Mera mehboob aaya hain
Hawao ragani gaaon
Mera mehboob aaya hain
Mera mehboob aaya hain

Woh lali phool ki mehendi
Laga in gore haathon mein

Utar aa aye ghata ka jal
Laga in pyari aankhon mein

Sitaron maang bhar jao
Mera meheboob aaya hain
Mera meheboob aaya hain

Baharon phool barsao
Mera mehboob aaya hain
Mera mehboob aaya hain

Nazaron har taraf ab
Taan do ek noor ki chadar

Bada sharmila dilbar hain
Chala jaye na sharma kar

Zara tum dil ko behelao

Mera mehboob aaya hain
Mera mehboob aaya hain

Baharon phool barsao
Mera mehboob aaya hain
Mera mehboob aaya hain

Sajayi hain jawaan kaliyon ne
Ab yeh sej ulfat ki

Inhe maalum tha ayegi
Ek din rutt mohabbat ki
Kazao rang bikharao

Mera mehboob aaya hain
Mera mehboob aaya hain
Baharon phool barsao
Mera mehboob aaya hain7 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ..
ఒక మంచి పాటను పరిచయం చేస్తూ,
ప్రేమికుడి మనసులోని భావాలను చక్కగా వర్ణించారండీ..

హితైషి చెప్పారు...

మంచి పాట.రాత్రి సమయాలలో ఈ పాటని వివిధ భారతి లో వింటున్నప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది. టెలివిజన్ మాయాజాలంలో చిక్కు కుని మచి పాటలుని వినడం మానేశాము.
ఇక్కడ తెలుగులో అనువదించిన పాటని చూసి చాలా సంతోషం. మీ ఓపిక కి ఇచ్చుకోవచ్చు.యెంత శ్రద్ద గా చేసారు ఇది చూస్తుంటేనే మీకు ఈ పాట అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. బాగుంది అనడం చాలా చిన్న మాట.

శ్రీ చెప్పారు...

ప్రేయసి వచ్చినపుడు పూలవర్షం కురిపించమని అడగడం కంటే భావుకత్వం ఎక్కడ కనిపిస్తుందండీ??
మంచి సాహిత్యం...
మీ వివరణ కూడా బాగుంది.
@శ్రీ

raf raafsun చెప్పారు...

వనజక్కా...

ఎలా ఉన్నారు?? ఈ పాటా నాకు తెలుసు...చాలా మంచి పాటా...ఏంటి కామెంట్ల దగ్గర అంట భయంకర వార్నింగ్ ఇచ్చారు??

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి పాటను వినిపించినందుకు ధన్యవాదాలు వనజ గారు! ఈ పాటను రాత్రివేళ వింటుంటే మనసంతా తేలికై, హాయిగా నిద్రపడుతుంది.ఇలాంటి పాటలు ఇప్పుడొస్తున్నసినిమాలలో మచ్చుకైనా కనిపించవు.

వనజవనమాలి చెప్పారు...

raajee gaaru.. song nacchinanduku Thanks!!

Hithaishi.. Thank you !

@ Sree gaaru..Thank you very much.

@ Raffsun Bhaayee! baagunnaaraa?
nenu baagunnaanu. :)

@ kayala Nagendra gaaru Thank you very much!
nenu ippatiki alaage vintoo nidra potaahnu.

జలతారువెన్నెల చెప్పారు...

Lovely song andi!