15, మే 2012, మంగళవారం

నారి

నారి అంటే.. ఏమిటో తెలుసా!?

ఇదిగో చూడండి. .. నా కవితా.."   నారి "
మమతానురాగాల చలువపందిరి
అలసిన మనసులను సేద దీర్చే అమృతాధారి
ఆవేదనతో,ఆక్రోశంతో అలమటించే అశ్రుధారి
దుర్నీతిని ధునుమాడే రుధిర ధారి
సమానత్వంకై పోరాడిన సాధికారి
ప్రగతిపదంలో ఆమె దారి రహదారి
విశ్వ జనీన విల్లుని ఎక్కుపెట్టిన నారి
నిరంతర విజయాలకై
మ్రోగించెను భేరి
జీవనయానంలో అలుపెరగని బాటసారి

21 వ్యాఖ్యలు:

జలతారువెన్నెల చెప్పారు...

మూర్ఖులను, అహంబావులను చిరునవ్వుతో క్షమించే మనసున్న నారి కదా నాకు తెలిసిన ఈ నారి! చాలా బాగుంది వనజ గారు.

శ్రీనివాసరావు చెప్పారు...

వనజవనమాలి గారు
బాగుందండి కవిత
ఓర్పులో భూదేవంతటిది నారి

రాజి చెప్పారు...

"జీవనయానంలో అలుపెరగని బాటసారి"
వనజవనమాలి గారూ ..
మీ "కవితా నారి" చాలా బాగుందండీ...

C.ఉమాదేవి చెప్పారు...

అనుబంధాలను పెనవేయు అమ్మగామారి, సంప్రదింపులు సలహాలలో మంత్రిగా అలరారి,అన్యాయాన్ని ఎదిరించ సంధించు వింటినారి.మీ కవిత స్ఫూర్తిదాయకంగా ఉంది.అభినందనలు వనజగారు.

వనజవనమాలి చెప్పారు...

జలతారు వెన్నెల గారు.. మీ ప్రేమపూర్వక స్పందనకి ధన్య వాదములు.
అవినేని భాస్కర్ గారు.. నారి ..సారి ..యించిన వైనం .. మీకు నచ్చినందుకు ధన్యవాదములు.
నారి.. బాట "సారి" మీ కోణంలో అర్ధవంతం.
@శ్రీనివాసరావు గారు.. నారి ..మీ అభిమానం గెలుచుకున్నందుకు ధన్యవాదములు.
@రాజీ గారు.. "నారి" ని మెచ్చిన మీకు ధన్యవాదములు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

ఎంత పెద్ద పొరబాటు జరిగిందో! ఇందాక నేను ఈ కవితని ఫోన్ లో చదివి రాంగ్ గా అర్థం చేసుకుని కామెంట్ రాసేశాను. సిస్టంలో చూస్తే తెలిసింది ఎంత పొరబడ్డానో అని. ఐయాం సారి ఫర్ ద మిస్టేక్!

ఏదేమైనా "నారి" కవిత బాగుంది.

వనజవనమాలి చెప్పారు...

c .ఉమాదేవి గారు .. ధన్యవాదములు. "నారి" యెంత మంది నారి జన హృదయాలను దోచుకుంది. మీ కామెంట్ కవిత లా ఉంది. థాంక్ యు!
@భాస్కర్ .. మీరు పొర బడినా ..అర్ధం తడబడలేదు.. బాటసారి.."నారి " కి "సారి" ..సాయం అవసరం ,అందం కూడా!
థాంక్ యు వేరి మచ్.

శ్రీ చెప్పారు...

"విశ్వజనీయ విల్లంబులో ఎక్కుపెట్టిన నారి .."
కవిత చాలా బాగుందండీ!
కాకపొతే నాకు అలా అనిపించిందో లేక అదే సరియైనదో..
'విల్లంబులో' అంటే విల్లు +అంబు కదండీ!
'విల్లులో' అంటే సరిపోతుందంటారా?
@శ్రీ

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

అభినందనలు వనజా గారు....'నారి' గురించి చక్కగా చెప్పారు మరి! బాగుంది మీ కవితా ఝురి!

వనజవనమాలి చెప్పారు...

శ్రీనివాస్ గారు ..అంబుల పొదిని పట్టి విల్లుని సారించిన నారి... అని భావన. విశ్వ జనీయ మనే భావనని పెపొందించడానికి విల్లంబుని సారించిన నారి అని అర్ధం తో వ్రాసాను.
థాంక్ యు వేరి మచ్.
@నిరంతరం వసంతం గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. "నారి" నచ్చినందుకు సంతోషం

శశి కళ చెప్పారు...

భువన గగనములు కవితకు అదిరి...
కామెంట్ పెడుతున్న మరి...))

A Homemaker's Utopia చెప్పారు...

చాలా బాగుందండీ ..:-)

వనజవనమాలి చెప్పారు...

A Homemaker's Utopia గారు ..

మీకు నారి నచ్చినందుకు .. ధన్యవాదములు.

@ శశికళ గారు .. " నారి" పై మీ అభిమానానికి ధన్యవాదములు..

కమనీయం చెప్పారు...

మేడం వనజగారూ,మీరేమీ అనుకోకుంటే ఒక విషయం చెప్పదలచుకొన్నాను.వచనకవితకు గణ,యతి,ప్రాసనియమాలు లేకపోయినా వ్యాకరణం, అర్థాన్వయం,ఔచిత్యం మొదలైనవి ఉండాలి.మీరు ఆవేశంలో వ్రాసినట్లు అనిపిస్తుంది.
అశ్రుదారి అంటే ఏమిటి?అశ్రు ధారి అనిమీ భావం అనుకొంటాను.అయితే ఒత్తు ధ ఉండాలి.
దుర్నీతిని ధునుమాడే కాదు ఒత్తులేని దునుమాడే అని ఉండాలి.
వింజామరి కాదు వింజామర అని ఉండాలి.
రుధిరమంజరి అంటే రక్తపు పువ్వుల గుత్తి అని అర్థం .మీ భావం అదేనా?
విశ్వజనీయ-విల్లంబులు దుష్టసమాసం.అలా సంస్కృత ,తెలుగు పదాలు కలిపి సమాసం చేయకూడదు.విశ్వజనీన అంటే ఇంకా మంచిది.
విల్లంబులు ఎక్కుపెట్టి కాదు విల్లును ఎక్కుపెట్టి అనాలి.
ఇది మీ future guidance కే.మరే ఉద్దేశమూ లేదు.

వనజవనమాలి చెప్పారు...

కమనీయం గారు.. ప్రాస కోసం ప్రాకులాటలో.. అర్ధం మారినది గమనించలేదు. సరి అయిన పదములు సూచించినందుకు ధన్యవాదములు.
వచన కవిత్వం సౌలభ్యంగా ఉంటుందనుకుని వ్రాస్తే. ఇలా ఉంటుందన్నది ఇప్పుడే తెలిసింది. మీరు శ్రద్ద తీసుకుని,సమయం తీసుకుని తప్పులని చెప్పినందుకు మనః పూర్వక ధన్యవాదములు.
ఈ సారి తప్పకుండా గమనించుకుని సరి చూసుకుని వ్రాసుకుంటాను. థాంక్ యు వేరి మచ్.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజా వనమాలీ...
బావుంది మీ కవితా ఝురి

oddula ravisekhar చెప్పారు...

బాగుందండి కవిత .

వనజవనమాలి చెప్పారు...

Jyothirmayi gaaru.. "Naari"
nacchinaduku dhanyavaadamulu. meeru maree nallapoosa ayipoyaaru. twaragaa vaccheyandee!

@ Ravi shekhar gaaru.. Thank you,Thank you very much.

Hari Podili చెప్పారు...

ననజవనమాలి గారు,
బాగుంది మీ నారీ భేరి
అందుకోండి నా జోహార్ల ఝురి.

వనజవనమాలి చెప్పారు...

Hari podili గారు .."నారి" నచ్చినందుకు ధన్యవాదములు.

హితైషి చెప్పారు...

SAMSAARA SAAGARAANIKI RAKSHAADHAARI