ఒక వ్యాఖ్య : ఇటువంటి నవలని మీరు సమర్ధిస్తున్నారంటే దానికి కారణం నేను అర్ధం చేసుకోగలను.
రెండవ వ్యాఖ్య:భారతీయ సంస్కృతి, కట్టుబాట్లు, భార్యాభర్తల అనుబంధాలు వంటి విషయాలు హద్దులు దాటుతున్నయనే విషయం గుర్తెరగాలి.
ఈ రెండు వ్యాఖ్యలకి ..నా స్పందన.
సాహిత్యం లో స్త్రీల పాత్ర చిత్రీకరణల వల్లనే.. ఇవన్ని జరుగుతున్నాయా!?
ఇక తతిమా వేటి ప్రభావం .. లేదంటారా!?
వివాహం అయిన తర్వాత కూడా.. ఇరువురు స్త్రీపురుషుల మధ్య ఏర్పడిన ఆకర్షణలు.. సమాజం లో ఇప్పుడే కొత్తగా మొదలయ్యాయా!?
సాహిత్యంలో చలం వందేళ్ళ ముందే.. "మైదానం '' రచించారు. మైదానం ని యెంత మంది చదివారు. చదివిన వాళ్ళు అందరు.. రాజేశ్వరిని అనుకరించారా!? చదవని వాళ్ళలో రాజేశ్వరిలు లేరా?
తన్హాయి" సమీక్ష పై స్పందించే తీరులొ నన్ను కించపరిచిన వారికి,ఇంకా కొంత మంది
అతి తీవ్ర భావజాలం ప్రదర్శించేవారికి.. నేను ఇంకా కొన్ని సమాజాన్ని పెడదారి పట్టించే దోరణులను లని పరిచయం చేస్తాను. వాటి మీద పోరాటం చేసి.. సమాజానికి మంచి చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను.
మన భారతీయ సమాజంలో మొబైల్ విప్లవం మొదలైన మొదటి దశకంలో ఉన్నాం.
ఈ పదేళ్ళలో .. ఒకోకరికి రెండు లేదా మూడు మొబైల్ పోన్లు. సాధారణ పౌరులకి కూడా మొబైల్ ఫోన్ ఉండటం సర్వ సాధారణమైన రోజులివి.
పదిహేను ఏళ్ళ పిల్లల దగ్గర నుండి..బామ్మల వరకు ఫోన్ లు ఉంటున్నాయి.
ఫ్రీ గా లభిస్తున్న లేదా అతి తక్కువ ఖర్చుతో లభిస్తున్న ఎస్.ఎమ్.ఎస్ సౌకర్యం ఉంది.
,బస్సు స్టాప్ లోను ,రైళ్ళ లోను తరగతి గదుల్లోను ,ఇంట్లోను టక టక మని కదిలే వేళ్ళకదలికల వెనుక...
మొబైల్ ఫోన్ ల నుండి నిరంతరం ప్రవహించే ఎస్.ఎమ్.ఎస్ లు,గంటల తరబడి మాటలులో ఆరోగ్య కరమైన వాతావరణం ఉందా !
ఉద్యోగస్తుల మధ్య మెయిల్స్ లో నడిచే ప్రేమ వ్యవహారాలు....వీటన్నిటిలోనూ మానసిక వ్యభిచారం కనబడలేదా!?
సినిమాల్లోవస్త్ర ధారణా లో, పాటల సాహిత్యంలో, డైలాగ్ లలో, పత్రికలలో ప్రచురించే చిత్రాలలో,ఇంకా చెప్పాలంటే..నడివీధుల్లో.. వ్యాపార ప్రకటనలకి చీరలు చుట్టి నిలువెత్తు ప్రదర్శనలు అంతా అశ్లీలతే! మరి అక్కడ పోరాటం చేయాలి కదా!?
అలాంటి చోట నోరు విప్పని ,నోరు విప్పడానికి ప్రయత్నం చేయని వారు ఒక నవల లో ఒక పాత్ర గురించి పోలిక చెప్పి వ్యక్తిగతంగా నన్ను మీరు ఎలాంటి వారో అర్ధం చేసుకోవచ్చు..అని అంటే ...
నేను మౌనంగా ఊరుకుంటే.. మరి ఆ మౌనం ఏ అర్ధాలకు దారి తీస్తుంది. నా ఆభిజాత్యం దెబ్బ తినలేదా!? అయినా రచనల లోని పాత్రల ఔచిత్యం పట్ల సానుకూల దోరణి..ప్రదర్శిస్తే .. వ్యక్తిగతాలకి కూడా అవే లక్షణాలు అపాదిస్తాయా!? రచనలు వేరు ..రచయితల వ్యక్తిగత జీవితాలు వేరు. రచయితల వ్యక్తిగత జీవితాలు రచనలలో..గోచరిస్తూ ఉండాలనే నిబందనలు ఉన్నయా!? రచయిత తన ఇష్ట ప్రకారం పాత్రలుని సృస్టిస్తారు. ఆ పాత్రలు సమాజంలో మనకి కనబడవచ్చును లేకపోవచ్చును కూడా! ప్రపంచంలో ఎన్నో కథలు. ఆ కథలో ఊహా జనిత కథ .."తన్హాయి"
శ్రీ శ్రీ కవిత్వాన్ని మనం అందరం మెచ్చుకుంటాం.ఆకాశానికి ఎత్తేస్తాము ఆయన రచనల ప్రభావం మన మనసుల మీద చూపే ప్రభావం చాలా గొప్పది. . శ్రీ శ్రీ వ్యక్తి గత జీవితం గురించి మనం ఏ రచనలలోను ప్రతిబింబిచలేదని అనుకున్నామా!? ఎందుకు రచనలకి..వ్యక్తిగత జీవితాలకి ముడిపెట్టడం. ?
అయినా "కల్హార" పాత్ర సమాజానికి చెడ్డ సందేశం ఇవ్వలేదు.మానసిక భావప్రకంపనలకి లోనైనవారు లేదా వ్యక్తీ గత బలహీనతలు తో.గడప దాటాలనుకునేవారికి ఒక వివేకవంతురాలైన స్త్రీ ఎలా నిలబడిందో అన్న దానికి నిదర్శనంగా నాకు కనిపించింది. కారణాలు ఏవైనా గడప దాటని స్త్రీ పాత్రలలో "కల్హార" ని చూడండి అని చెపుతాను నేను.
నేను మరో రాజేశ్వరి చచ్చిపోయింది..అనే " నీరజ "నిజ జీవిత కథ గురించి చెప్పినప్పుడు.. రాజేశ్వరి తొందరపాటు చర్యలో వివేకం ,విచక్షణ లోపించాయని బాధపడ్డాను.
"మానవి" గురించి చెప్పినప్పుడు.. ఓ..మానవి గా స్పందించాను. ఓ.."కల్హార " గురించి చెప్పినప్పుడు.. మనసు తనానికి-వివాహ బంధానికి మధ్య నలిగిన .. ఓ.. స్త్రీ అంతరంగాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసాను.అక్కడ వివాహ బంధానికే ప్రాముఖ్యత నిచ్చిన ప్రయత్నాన్ని..
"అవగాహన,సర్దుబాటు,రాజీపడటం,సమాజం లో గౌరవం ఈ నాలిగింటి కోసమే ఆ రెండు జంటలు .. మరో రెండు హృదయపు శకలాల పై నిలబడి ఉన్నాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం" అంటూ విలువని చేకూర్చే యత్నమే చేసాను.
తన్హాయి..భారతీయ సమాజానికి ఏ చెడ్డ సందేశం ఇస్తుందో..అన్నది చెప్పే ముందు..ఈ లోతైన విషయాలని ఆలోచించారా!?
"తన్హాయి" నవలని ఇష్ట పడినవారికి,నా సమీక్షలో అంశాలు నచ్చినవారు వేరొక చోట షేర్ చేసుకుంటే.. వారిని విచక్షణా రహితమైన ప్రశ్నలు వేసి..,ఇంకొకరిని తెగ నాడి..
ఏం మూట గట్టుకోవాలనుకున్నారో.. వారి భావజాలం ఏమిటో..నాకు బోధపడలేదు.
ఈ సమీక్ష వ్రాసినందుకు గాను నేను ఈ మాత్రం సమాధానం చెప్పాలనుకున్నాను. "విహంగ" లో సభ్యతగా ఉండదు కాబట్టి..నా స్పందనని నా బ్లాగ్ లో చెప్పడం భావ్యం గా అనిపించింది.
తన్హాయి సమీక్ష పోస్ట్ ని షేర్ చేయడమే తప్ప చర్చలో జోక్యంచేసుకోకపోయినా వారికి కల్గిన ఇబ్బందికి క్షమాపణలు చెపుతూ ("పరవళ్ళు" బ్లాగర్ భాస్కర్ గార్కి,)
పై ఎవరి అభిప్రాయం వారిది.. ఇందులో.. వివాదాలు కి ఎందుకు తెరదీయడం ?
ఇటువంటి నవలలని ప్రోత్సహించడం ద్వారా భారతీయ స్త్రీ అదుపు తప్పుతోంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ !!
ఇలాటి అభిప్రాయాలకి చోటు ఇవ్వకుండా.. నచ్చితే చదవడం వీలయితే అభినందించడం, బాగా నచ్చితే..ఓ..సమీక్ష వ్రాయాలని అనుకోవడం..వ్రాయగల్గితే వ్రాయడం లేకుంటే అవతల పడేయడం చేస్తే బాగుంటుందేమో!
3 కామెంట్‌లు:
టెక్నాలజీ మీరు చెప్పినంత వేగంగా మారలేదు కానీ టెక్నాలజీ మారినంతమాత్రాన భావజాలం మారిపోదు. ప్రేమ వ్యవహారాలు మెయిల్స్‌లో నడిపినా, పల్లెటూర్లలో పొలంగట్ల మీద నడిపినా ఆలోచన విధానంలో తేడా ఏమీ రాదు.
రచయితలు/రచయిత్రులు సృష్టించే పాత్రలకీ వాళ్ళ వ్యక్తిగత జీవితానికీ సంబంధం ఏమిటో అర్థం కాదు నాకు. ఒక రైటర్ కనుక ఒక వంద/వెయ్యి కథలు రాస్తే ప్రతీదాన్లో ఒక పాత్ర తనదే అయి ఉండాలన్న నియమం ఏదైనా ఉందా? Ridiculous!
క్రిష్ణవేణి
ప్రవీణ్ గారు..మీరు చెపిన కోణం లోనే "తన్హాయి " నవలని చూడండి అని నేను చెప్పేది. థాంక్ యు!
@కృష్ణవేణి చారి గారు.. సాహిత్యం లో సమాజం లోని మార్పులని సృజించే అవకాశం ఉందని,పాత్రలు సృష్టించినవి అని .. అలాటి పాత్రలు నిజ జీవితం లో కనబడపోవచ్చును,కనబడను వచ్చును.. అనేది ఆలోచన చేయకుండా..అజ్ఞానం తో అవివేకంతో ..స్పందించే వాళ్ళు ఉన్నంత కాలం.. రచనలు వివాదాస్పదమే అవుతాయి.
మీ స్పందనకి నా ధన్యవాదములు. ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి