ఈ రోజు ఉదయం మాములుగా న్యూస్ పేపర్ ఓపెన్ చేసాను. అప్పుడప్పుడు వ్యాపార సంస్థల పరిచయాలతో కూడిన ప్రకటనా పత్రములు (పాంప్లెట్ ) దర్శనమిస్తూ ఉంటాయి కదా ! ఆ మాదిరే ఒక పాంప్లెట్ దర్శనమిచ్చింది. ఆ పాంప్లెట్ చూడటం తోనే నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయినాయి. దరహాసం ముంచుకొచ్చింది.
పాఠశాలల పునః ప్రారంభం అయి పదిహేనురోజులు కావస్తుంది.
ఈసారి ప్రభుత్వ పాఠశాల ల ఫలితాలు కూడా ప్రేవేట్ పాఠశాలల ఫలితాలతో పోటీ పడుతున్నాయి.
ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ప్రభుత్వ పాఠశాల లు కూడా ప్రకటనల ద్వారా ఇంటింటికి ప్రచారం చేసుకోవలసి వచ్చింది. అందుకే నేను ఆ పాంప్లెట్ ని చూసి అలా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
ఆ పాఠశాల ఫలితాలు చూడండి.
ఈపాఠశాల నుండి కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ నారాయణ, టి.క్రాంతికుమార్, రమాదేవి (ఈనాడు రామోజీరావు గారి భార్య) పరిటాల ఓంకార్.. ఇలా చాలా మంది ఈ పాఠశాల నుండి వెళ్ళినవారే!
ఆ పాఠశాల మా వూరి పాఠశాల .. కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల
ప్రభుత్వ పాఠశాల లు కూడా ఉత్తమ ఫలితాలు అందిస్తూ.. విద్యార్ధులని (తల్లిదండ్రులని ) ఆకర్షించుకోవడానికి ఇలా ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇంటింటికి పరిచయం చేసుకోవడం కించిత్ బాధాకరం అయినప్పటికీ ఆంగ్ల మాధ్యమ విద్య పట్ల ఆకర్షణ కల్గిన తల్లిదండ్రులకు ఫలితాలని తెలియజేసి పైసా ఖర్చు లేకుండా మీ పిల్లలకి చదువు ని అందించే ప్రభుత్వ పాఠశాల లని ఉపయోగించుకోండి. ప్రభుత్వం ప్రజలకి అందించే సేవలని వృధా కానీయకండి. పాఠశాలలు నిర్వహించే సొమ్ము కూడా ప్రజలదే అని చెప్పడం కూడా నేమో!
ఏమైనా మా వూరికి గర్వకారణమైన ఈ పాఠశాల గురించి నేను చెప్పడం కన్నా ఫలితాలు తో పాటు మిగిలిన ప్రత్యేకతలు చూడండి.
మా అత్తమ్మ, మావారు,ఇంకా మా కుటుంబంలో ఇంకో ఇద్దరు ఈ పాఠశాల విద్యార్ధులే !
7 కామెంట్లు:
thappadam ledandi govt schools ki,
memu thiruguthutamu pilla kosam,
aadapillalane ekkuva cherustharu,
mana schools lo, dabbulatho pani thakkuva kabatti.
neenu kooda ee school student nee.. chaalaa thanx malli maa school nu guruthu chesinanduku..
ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం పాలనా బాధ్యతలనుండి కావాలనే తప్పుకుని ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇస్తోంది.
కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క కావాలన్నట్లు, చాలా లోతైన కుట్రతో ప్రభుత్వమే ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యపరుస్తోంది.
అయినా ప్రభుత్వ పాఠశాలలలో కంటే మెరుగైన ఉపాధ్యాయులు కానీ - విద్య గానీ ప్రైవేట్ పాఠ శాలల్లో లేదనేది ఫలితాలు ఋజువు చేస్తున్నాయి.
తల్లి దండ్రులు అనవసర + తెలియని కొన్ని మోజులు పెంచుకుని భ్రమలతో ప్రైవేట్ పాఠ శాలల వెంట పడుతున్నారు.
అలాగని ప్రభుత్వ పాఠశాలలో లోపాలు లేవని కాదు.
రానున్న రోజులలో విద్యను మరింత ప్రైవేటీకరణ చేయడానికే ప్రభుత్వ చర్యలుంటాయనడం లో సందేహం లేదు.
The credit goes to the teachers and the students. Good information shared
Good to know ,Thanks for sharing :))
ఘనమైన చరిత్ర గల మీ వూరి పాఠశాలను మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు వనజా గారు!
ది ట్రీ ..భాస్కర్ గారు.. థాంక్ యు!!
@అనిత గారు.. దూరంగా ఉన్న మీరు మన ఊరిని తలచుకున్నారు అంటే.. మన హైస్కూల్ జ్ఞాపకాలే కదా! చాలా సంతోషం. థాంక్ యు వేరి మచ్!!
@ కొండలరావు గారు.. మీరు చెప్పిన విషయాలు నిజం అవుతాయని అనిపిస్తుంది.
సాక్షాత్తు మంత్రి గారే ఓ..కార్పోరేట్ కాలేజెస్ మధ్య రాజీలు కుదిర్చినట్లు వినికిడి.ధన్యవాదములు.
@కష్టేఫలె గారు ధన్యవాదములు.
@శేఖర్ గారు..థాంక్ యు వేరి మచ్!!
@నిరంతరమూ వసంతమూ సురేష్ గారు.. థాంక్ యు వేరిమచ్!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి