4, జులై 2012, బుధవారం

జ్ఞాన సముపార్జన డేగ-ఆవు

ఈ కాలం తల్లి దండ్రులకి ఒక ప్రశ్న..? 

 మీ పిల్లలకి ఎలాటి జ్ఞాన సముపార్జన కావాలనుకుంటున్నారు!? 
 ఆవు లాగా సంగ్రహించిన జ్ఞానాన్ని నేమరవేసుకునే విద్యావలంబన కావాలా? 
 లేక డేగ లాగా చాలా ఎత్తు నుండి పసి గట్టి తన్నుకుని వెళ్ళే విద్య కావాలా ?

 డేగ లక్ష్యం : అర్జునుడి లక్ష్యం కేవలం పక్షి కన్ను బేధించడం. అర్జునుడి లాగా డేగ కూడా.. తన ఆహార సాధనకి కృషి చేస్తుంది. ఓపికగా నిరీక్షించి తన ఆహారాన్ని సాధించుకుంటుంది. కడుపు నిండిన డేగ శాంతిస్తుంది. మళ్లీ.. ఆకలి కాగానే ఆహారాన్వేషణ మొదలు పెడుతుంది. ఈ సారి లక్ష్యం మారుతుంది. 

 ఆవు లక్ష్యం: ఆవు తన ఆహారాన్ని కనపడిన చోటల్లా సేకరించి.. ఆబగా తినేస్తుంది. అటుపిమ్మట తీరికగా.. తిన్న ఆహారాన్ని నోటిలోకి తెచ్చుకుని నెమరు వేస్తూ సారాన్ని గ్రహిస్తుంది. ఇలా తన ఆహారాన్ని ఆస్వాదిస్తుంది. 

 ఆహారాన్వేషణలో డేగ స్వభావానికి -ఆవు స్వభావానికి తేడా గమనించాము కదా! 


బిడ్డలు కూడా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు .. ఏ విధంగా అయితే ఆవు తన ఆహారాన్ని గ్రహిస్తుందో.. అటువంటి సాధన పిల్లలకు అలవడాలి. 

 కానీ నేటి విద్యావిధానం చూస్తుంటే.. డేగ లక్ష్య సాధన మాత్రమే గోచరిస్తుంది. మార్కులు, రాంకుల వేటలో.. విషయసారం లేని బట్టీ చదువులు కి అలవడిపోయి విషయ పరిజ్ఞానం కొరవడుతుంది. 

ఎలాంటి విద్య కావాలో.. నేటి తరం తల్లిదండ్రులు,పిల్లలు కూడా ఆలోచించి ఎంచుకోవాలి.

4 కామెంట్‌లు:

prasanthi చెప్పారు...

well said..

అజ్ఞాత చెప్పారు...

good comparision

పల్లా కొండల రావు చెప్పారు...

డేగ లా అయినా , ఆవులా అయినా సమాజానికి ఉపయోగపడే , సంస్కారాన్ని , మానవ విలువలను పెంచే చదువులు కావాలి. చదువు కొనడం - అమ్మడం మాని చదువు నేర్చుకోవడం - బోధించడం కావాలి.

జలతారు వెన్నెల చెప్పారు...

భలే పోలిక పెట్టారండి. పరుగు పందాలూ, ఎదో సాధించాలన్న తపనలు.
పిల్లలకి కాదండోయి! పెద్దవాల్లకే...