5, జులై 2012, గురువారం

వంకాయ విత్ బోర్నవీటా





కూరలలో రారాజు వంకాయ అంటారు కదా!

వంకాయ వంటి కూరయు పంకజ ముఖి సీత వంటి భార్యామణి.. అన్నారు కదండీ.. అని జంధ్యాల గారి సినిమాలో పాట మనందరకీ సురపరిచితమే!

ఇక వంకాయ మీద పాటలు చెప్పాలంటే.. ఆహా..ఏమి రుచి..అనరా మై మరచి.. గుర్తుకువచ్చును కదా!

సరే..ఈ వంకాయ గురించి ప్రస్తావన ఎందుకంటే.. ఈ మధ్య నా పాక శాస్త్ర ప్రావీణ్యం కి నూటికి నూరు మార్కులు పడిన వైనం గురిచి..చెప్పడం అన్నమాట.

అలా అని నేను పాకశాస్త్ర ప్రావీణ్యంలో దిట్ట అనుకునేరు. నాకు వంట చేయడం అంటేనే మహా చిరాకు. కాని ఒక్క రోజు కూడా తప్పించుకోను వీలు కాదు. ఏం చేస్తాం..?


ఈ మధ్య మా అత్తమ్మ కి అనారోగ్యంగా ఉన్నప్పుడు.. ఆమె కోరిక ప్రకారం వంకాయ కూర వండాలని ప్రయత్నం మొదలెట్టాను. అది రాత్రి ఎనిమిది గంటల సమయం

వంకాయ మామిడి కాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాని ఆవిడ.."నో" చెప్పేశారు.

వంకాయ +దోసకాయ,..అన్నాను.."నో" అన్నారు.

వంకాయ పులుసు అన్నాను ..తల ఊపారు. అమ్మయ్య బతికి పోయాను అనుకుని ..వంటకి ఉపక్రమించాను.

వంకాయలు ఓ..పావు కిలో , ఉల్లిపాయలు. రెండు,నాలుగు పచ్చి మిర్చి..కలిపి తాలింపు వేసి .. పది నిమిషాలు సన్నటి మంట పై కూర మగ్గనిచ్చి. తర్వాత చింతపండు పులుసు పోసి.. అలా తిరిగానో లేదో..టక్కున కరంట్ పోయింది.

అయ్యో! అనుకుని.. కాండిల్ కూడా వెలిగించాకుండానే..కారం వేసాను.

కొంచెం బెల్లం ముక్క కూడా వేసి కాసేపు ఉడికి పులుసు చిక్క పడేవరకు ఉంచి స్టవ్ ఆపేసి బయట పడ్డాను.
భోజనాలు సమయం అప్పుడు.. వంకాయ కూర రుచి చూస్తే చాలా బాగుంది.

ఓస్.. ఇది కూడా విచిత్రంగా చెప్పాలా అనుకోకండి.

మా అత్తమ్మ.. నేను చేసిన వంకాయ కూరని చాలా ఇష్టంగా తింటున్నారు. చాలా బాగుంది అని కితాబు ఇచ్చారు. అమ్మయ్య..! అనుకుని ఊపిరి పీల్చుకున్నాను కూడా.

సరే.. నేను రుచి చూడాలని..కొంచెం వేసుకుని తిన్న తర్వాత కాని నాకు అర్ధం కాలేదు. కారం రుచి కాకుండా..నాకు ఏదో.. డిఫరెంట్ రుచి తెలుస్తుంది. నేను వేసిన కారంకి ..ఆ వంకాయ పులుసు..చాలా స్పైసీగా ఉండాలి. అలా కాకుండా..ఎంత బెల్లం ముక్క వేస్తే మాత్రం..ఇలా చాక్లెట్ ఫ్లేవర్ రావడం ఏమిటి? అనుకున్నాను.

ఏమన్నా సందేహం వేలిబుచ్చాలన్నా.. అంతా బాగోదు కదా! నా వంట ప్రావీణ్యం ని కించ పరచుకున్నట్లు కాదు..అనుకుని..సైలెంట్గా తినేసి.. సింక్లో ప్లేట్లు పడేసి చేతులు కడుక్కుని బయటపడ్డాను.

ఎంత ఆలోచించినా..ఆ పులుసుకి చాక్లెట్ ఫ్లేవర్ ఏమిటో..అర్ధం కాలేదు.

కరంటు రాగానే..ఏ మాత్రం ఆలస్యం చేయకుండా..వంట ఇంట్లోకి వెళ్లి చూసాను. ఎందుకో అనుమానం వచ్చి కారం బాటిల్ లో నుండి.. స్పూన్ తో..కారం తీసి పరిక్షీంచిన తర్వాత తెలిసింది. అది కారం కాదు "బోర్నవీటా" అని.

ఆ రోజు సాయంత్రమే.. బోర్నవీటా తీసుకుని వచ్చి..ఓపెన్ చేసి కారం బాటిల్ ప్రక్కనే పెట్టారని.
కారం పోసే బాటిల్ కూడా.. క్రితం ఖాళీ అయిన బోర్నవీటా బాటిల్ లోనే కారం పోసి పెడుతుంటారు కాబట్టి నేను చీకటిలో పొరబడి.. బోర్నవీటా ని కారం అనుకుని వేసి.. వంకాయ పులుసు చేసాను అని.

మొత్తానికి ఎవరికీ అసలు కారమే వేయలేదు అని అనుమానమే రాలేదు.

మా కోడలు వంట బ్రహ్మాండంగా చేస్తుని అన్న కితాబు కూడా వచ్చేసింది.

రుచికరమైన వంకాయ పులుసు..తయారీ విధానం లోని అసలు సిసలైన కిటుకు "బోర్నవీటా" అని నేను అసలు చెప్పనేలేదు.

ఏదో..మన బ్లాగరీ మణులు, బ్లాగర్ మహాశయులు పాకశాస్త్రం లో తలమునకలై ఉంటూ..ఉంటారు కదా!

అప్పుడప్పుడు.. వంకాయ పులుసు విత్ బోర్నవీటా తో చేసి టేస్ట్ చేసి.. బాగుంటే..నాకు ఓ..కామెంట్ కితాబు ఇస్తారని ఆశ + నాకు ఒక బ్లాగ్ పోస్ట్ కి కంటెంట్ దొరికింది అన్న సంతోషం తో.. ఇలా వచ్చాను.

ఇంతకీ.. ఈ అనుభవం తర్వాత వంకాయ పులుసు ఎప్పుడు చేసినా సరే.. ఓ..రెండు స్పూన్ లు.. "బోర్నవీటా " ని యాడ్ చేయడం మానలేదు.

ఈ రహస్యం మా అత్తమ్మకి ..చెప్పకండే..ప్లీజ్!!

24 కామెంట్‌లు:

హరే కృష్ణ చెప్పారు...

హ హ్హ :))
గుత్తి బోర్నవంకాయ బావుంది
ఏమిటో అత్తలకే ఈ రివెంజ్ కష్టాలన్నీ :P

అజ్ఞాత చెప్పారు...

అద్భుతాలన్నీ కాకతాళీయంగా కనుక్కున్నవే.. కొత్త వంటకం కూడా అద్భుతమేనన్న మాట.. :-)

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

వంకాయ పులుసులో బోర్నవీటా వేసిన కోడలు కేకమ్మో
అది తిని మెచ్చుకున్న అత్త అదుర్సోయమ్మో....:)) బాగుంది వనజా గారు...వంకాయ, బోర్నవిటాల ప్రయోగం!

సుభ/subha చెప్పారు...

భలే రెచిపీ చెప్పారండీ బాబూ.. మళ్ళీ ఇంకెప్పుడూ మిమ్మల్ని వంట గురించి అడిగితే చూడండి.. నేను పరుగు ఇక్కడి నుంచి :) :) :) :) :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హరే కృష్ణ.. అభిమానం తో.. అత్తమ్మకి ఏది చేసి పెట్టినా అమృతం ఏమో! ఆ వంకాక పులుసు బాగున్నా, బాగోకున్న ఆవిడ ఉలే నాకు మిన్న. మళ్ళీ ఇంకోసారి చేసిపెట్టాలి కదా! :)
@ హమ్మా.. సుభ గారు ..వచ్చేసారా!? థాంక్ యు! ఇంకెప్పుడు రెసిపీ గురించి అడగకండి. ఇదిగో..నా పైత్యం ఇలాగే ఉంటుంది. :))
@ నిరంతరమూ వసంతమూ సురేష్ గారు.. బోలెడు థాంక్ యూ..లు. మీరు ప్రయత్నం చేయండి,చేయించండి మరి. వంకాయ బోర్నవీటా.. కేక..అండీ!!
@mhsgreamspet ..రామ కృష్ణ గారు. అవునండీ! అద్భుతం.. థాంక్ యు:))

Raj చెప్పారు...

ఇలాంటి క్రొత్త వంటకాలన్నీ ముందుగా ఎన్నడూ ఇంటిని వదిలిపోని అతిథులకి పెట్టాలి.. హ అహః హహ..

జలతారు వెన్నెల చెప్పారు...

అసలు ముందు ఒకటి చెప్పనా వనజ గారు!! మీకు పులుసులు పెట్టుకోవడమే రాదండి.
మీకు అంటే క్రిష్ణా జిల్ల వాళ్ళకి. అన్నిటిలోను బెల్లం, చింతపండు వేసేస్తే పులుసు అనుకుంటారు. గొదావరి జిల్లలో పులుసు ఎప్పుడన్నా తిన్నారా? అమోఘం గా ఉంటాయి.. సరే, ఇంక వంకాయ, బోర్నవిటా ...ఉండండి..ఈ రోజే చేసేసి మా ఇంట్లో ఉన్న క్రిష్ణా జిల్ల -ఇద్దరి మీద పగ తీర్చేసుకుంటాను. :))
అసలు combination ఎంటండి బాబు... కాని try చేస్తానండి.

శ్రీలలిత చెప్పారు...

ఆవిష్కరణలన్నీ ఇలా అకస్మాత్తు గానే జరుగుతాయి. అందుకోండి వీరతాడు..

Zilebi చెప్పారు...

వంకాబోర్న్స్ అని ఒక కొత్త బ్రాండు మొదలెట్టేయ్యండి మరి!

వంకా బోర్న్స్ పేటెంట్ కి వెంటనే అప్ప్లై చెయ్యాలి !

చీర్స్
జిలేబి.

శ్రీ చెప్పారు...

పోస్ట్ లో శీర్షిక చూసి బోర్నవీటా తో వంకాయలు ఫ్రీ లాంటి ఆర్టికల్ అనుకున్నాను
:-)
తీరా ఓపెన్ చేస్తే తెలిసింది బోర్నవీటా తో వంకాయ పులుసు అని...
:-))...:-))
@శ్రీ

Jai Gottimukkala చెప్పారు...

రా-వన్ సినిమాలో షారుఖ్ నూడుల్స్-పెరుగు తినడం చూసాం. మళ్ళీ మీ బ్లాగులో మరో మహత్తరమయిన ప్రయోగం దొరకడం మా అదృష్టం.

ఈ మధ్య టీవీలలో "మా ఇంటి వంట" లాంటి ప్రోగ్రామ్సులో వచ్చే వంటలు బాలేవని మా ఇంటిలో ఒకటే గొడవ. మీ ప్రయోగాన్ని టీవీ లోకానికి పరిచయం చేయవలిసిందిగా నా బోటి అభిమానుల మనవి.

అజ్ఞాత చెప్పారు...

నిన్న రాత్రి మా ఆవిడ చేసిన మహాద్భుతమైన (వాఆఆ.... :( ) వంకాయకూర కిక్కురు అనకుండా తినేశాను. అంత వీరాభిమానిని ఆ శాకానికి. దాని పేరు చెప్పి ఏది పెట్టినా తినేస్తానని మా ఆవిడ కితాబు, ఈ బోర్నవిటా రెసిపీ అర్జెంటుగా ఆమెకి చెప్పేయాలి.

చిన్న కరెక్షన్... పంచ ముఖ సీత కాదు... పంకజ ముఖి సీత... తామర పూవు వలె వికసించిన ముఖం కలిగినదట.

Alapati Ramesh Babu చెప్పారు...

భలే భలే కేటరింగ్ వాడికి కొత్త రుచి. మరి మన విజయవాడ లో వేలం వెర్రి. ఈ మధ్య కోకో కోలా బిర్యాని అని కూడా చేసారు. మీరు పొరపాటు గా చేసిన కొత్త రకం వంటకు తెర తీసారు. బోర్నవిటా వాడికి తెలిస్తే వాడు ప్రచార౦ కు వాడుకుంటారు.

కాయల నాగేంద్ర చెప్పారు...

మీ 'వంకాయ విత్ బోర్నవిటా' కూర కబుర్లు బాగున్నాయండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజ్..గారు.. అంతా రుచికరంగా ఉన్న వంకాయ కూర ని పెడితే.. ఇల్లు వదలరండీ! మీరు మాత్రం ఈ వంట చేసి పెట్టకండి.:) థాంక్ యు.
@ అమ్మో..! జలతారు వెన్నెల గారు. మా కృష్ణా జిల్లా వాళ్ళంటే .మీకు ఎంత కోపం !? వంకాయ విత్ బోర్న వీటా చేసేయండి. మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతా మంచి వాళ్ళు మా వాళ్ళు. సరేనా!?
ధన్యవాదములు.
@శ్రీ లలిత గారు..మీ ప్రశంసకి బోలెడు థాంక్ యూలు. త్వరగా మీరు వంటకం చేసేయండీ!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జిలేబీ గారు.. సుస్వాగతం. బాగున్నారా?
మీరన్నట్లు పేటెంట్ హక్కు తీసుకోవాల్సిందే! భలే గుర్తు చేసారు గా.. ధన్యవాదములు.
మీరు లేక బ్లాగులు చిన్నపోయినవి.. వచ్చేసారు కదా! థాంక్ యు!! థాంక్ యు!!
@శ్రీ గారు..అసలే పరాయి రాష్ట్రంలో ఉన్నారు. వంకాయ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. త్వరగా చేసేయండి. లేదా చేయండని రిక్వెస్ట్ చేయండి.
ఎలా ఉందొ..చెప్పాలి మరి.
@జై గొట్టిముక్కల గారు..మీ అభిమానానికి ధన్యవాదములు. అసలే ఇంట్లో వంట చేయడమంటే చిరాకు. పైగా పట్టు చీరలు,నగలు నటరా..ధరించి టీవి షో కి వంట చేయడమే ! నా వల్ల కాదండీ! ఎవరినన్నా పంపుదాం లెండి. థాంక్ యూ!!

kasi చెప్పారు...

హ హ హ...
చాల బాగుంది
బోర్న్విట విత్ వంకాయ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పురాణ పండ ఫణి గారు..చాలా సంతోషం అండీ! వంకాయ విత్ బోర్న వీటా ని తయారు చేయించి ఇష్టంగా రుచి చూడండి. బాగుండక పొతే నన్ను తిట్టుకోవద్దు.
మీరు చెప్పిన తప్పు ని సవరించాను. ధన్యవాదములు.
@ఆలపాటి రమేష్ బాబు గారు.. :) ధన్యవాదములు. జనానికి ఏదో వేలం వెర్రి కావాలి. ఇది అలా అవుతుందేమో! మీ నోటి వాక్యం వల్ల. అప్పుడు క్రెడిట్ మన విజయవాడ కి ఇచ్చేడ్డామండీ!!
@కాయల నాగేంద్ర గారు.. ధన్యవాదములు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

కొత్త వంటకం చాలా బాగుందండీ దీన్ని వంటల బ్లాగ్లో పెట్టేయమంటారా???
మీ అనుమతితో :):)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు.. బాగున్నారా? చాలా రోజుల తర్వాత..చాలా సంతోషం.
తప్పకుండా..వంటల బ్లాగ్లో ..వంకాయ విత్ బోర్న్ వీత జత చేయండి ప్లీజ్!!
థాంక్ యూ!!
@ కాశీ గారు..థాంక్ యు వేరి మచ్.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఏంటోనండి మీరెంత చెప్పినా ఈ కూర బాగుంటుందంటే నామనసొప్పుకోవడంలేదు :) పులుసులైనాసరే అసలు కూరల్లో తీపి వేస్తేనే నాకు నచ్చదులెండి బహుశా అందుకేనేమో :)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వేణు శ్రీకాంత్ గారు.. పులుసులు తీపిగా ఉంటే కొంత మందికి నచ్చదు. పర్వాలేదండీ! వంకాయ విత్ బోర్న వీటాని బెల్లం కలపకుండా వండి తినండి. :) థాంక్ యు!!

రామ్ చెప్పారు...

assalu bellam gurinchi evvaru pattinchukoledhu. Bellam + Vankaaya + బోర్నవీటా. ayyo baaboie meeru inkaa kaasepu vudakanisthe adhi vonjaaya paayasam ayyedhi. edhi emi inaa okkasaari chesi maa vallaku pettali. Thanks a bunch వనజవనమాలి gaaru.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Ram gaaru Thank you very much!!

vankaaya paayasam .Recipe baaguntundanukuntunnaanu.:))