24, జులై 2012, మంగళవారం

500 వ పోస్ట్

ఈ నాటి ఈ పోస్ట్ కి ఒక ప్రత్యేకత ఉంది. నేను బ్లాగ్ ప్రారంభించి ఖచ్చితంగా ఇరువది నెలల 3 రోజులు.


నేను వేసిన పోస్ట్ 500 .అవును అక్షరాలా 500 వ పోస్ట్.


ఈ పోస్ట్ ప్రతేకత అంటూ ఏమి లేదు. కాని మా అబ్బాయికి ఒక మంచి విషయం ని షేర్ చేసుకుంటూ పోస్ట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ..


ప్రపంచంలో నాకు అతి ముఖ్యమైనది ఏమైనా ఉంది అంటే అది.. "నాకొడుకు ".


నేను చెప్పే ఏ మంచి విషయాన్ని అయినా నా నుండి మా అబ్బాయి నేర్చుకోవాలని నేను మనసారా కోరుకుంటాను.అయితే దురదృష్టవశాత్తు చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలని పిల్లలు పెడచెవిన పెడతారు. వాళ్లకి వేరే రోల్ మోడల్స్ ఉంటారు. మనం వేరే పిల్లలకి రోల్ మోడల్ అవుతాము అన్నమాట.:)


ఈరోజు ఈ పోస్ట్ నాకొక తీపి జ్ఞాపకంగా మిగలాలని కోరుకుంటూ..

లేఖా రూపంలో .. ఈ పోస్ట్.

చిన్ని..! బంగారం !!ఎలా ఉన్నావు నాన్నా!

నిరుడు ఈ రోజుల్లో నా కంటి ముందు నిండుగా తిరుగుతూ ఉన్నావ్? ఈ సంవత్సరం ఇక్కడికి రావడం వీలు పడదు అని తెలిసిన దగ్గర నుండి.. నా మనసులో మబ్బులు ముసురుకున్నట్లు దిగులు పట్టుకుంటుంది.

బలమే జీవనం, బలహీనతే మరణం అన్నది ఈ జాతికి వివేకానందుడు అందించిన సందేశం కదా!

బలాన్ని కూడా గట్టుకుని.. ఏదో కొత్త వ్యాపకాలలో తలదూర్చి తీరిక లేని పనులలో తలమునకలైపోతున్నాను.

జీవితం లో శూన్యం నిండు కున్నట్లు అనిపించగానే .. నాకు నేనే కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుని.. వాటిని అందుకోవడానికి సదా ప్రయత్నం చేస్తుంటాను. ఆ బాటలోనే ఉన్నానిప్పుడు.


ఎవరు ఎప్పుడూ కూడా నిరాసక్తతగా జీవితాన్ని జీవించకూడదు. మనం ఒక క్రొత్త పని చేయాలని మొదలెట్టినప్పుడు ఎన్నో అవాంతరాలు ఏర్పడుతుంటాయి.


వాటికి భయపడి పారి పోతామా? అనుకుంటున్నాను.


నీవు కూడా అలాంటి లక్ష్యాలతో..ముందుకు సాగుతావని మనసారా దీవిస్తూ.. నేకొక స్పూర్తికరమైన ముచ్చట చెపుతూ..


నా ఫ్రెండ్ వైషూ నీకు తెలుసు కదా నాన్నా! అదే నువ్వు వైషు అక్క అంటావే.. ఆమె.


ఇప్పుడు 30 ప్లస్ లో భారత నాట్యం నేర్చుకుంటుంది. మూడవ కాలం రావడం లేదని తెగ ఇబ్బంది పడుతూ చెపుతుంది.


నాట్యం నేర్చుకోవాలని ఉత్సాహంగా మొదలుపెట్టి మధ్యలో వెనుకంజ వేయడం ఏమిటీ ? అని కోప్పడ్డాను.


తను ఈ రోజు కూడా క్లాసు కి వెళ్లి కొంత ప్రాక్టీస్ చేసిన తర్వాత.. బాగానే చేయగల్గానని చెప్పింది.

సాధన చేయడం వల్ల ఏదైనా సాదించ వచ్చు కదా!

వైషు అక్కకి ఒక స్పూర్తికరమైన విషయం చెప్పాను. ఆ విషయం ఏమిటంటే..


గరుడ పక్షి కి సంబంధించి నేను ఒక వ్యాసం చదివాను.


ఆ వ్యాసం చదివిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది.


ఆ విషయం ఏమిటో..చెపుతాను..విసుక్కోకుండా
, ఓపికగా చదువు. .

ఇందులో..నిజా నిజాలు నాకు తెలియవు.. కాని ఆసక్తిగా ఉంది. స్పూర్తి గాను ఉంది. అందుకే ఇలా షేర్ చేస్తున్నాను.గరుడ పక్షి జీవనగమనం విచిత్రమైన సంఘర్షణ లతో,సవాళ్ళతో కూడుకుని ఉంటుంది.


పక్షి జాతిలో ఈ గ్రద్దల జీవన కాలం చాలా ఎక్కువ.దాదాపు డెబ్బై ఏళ్ళ పాటు ఇవి జీవిస్తాయి అట. అయితే ఇన్నేళ్ళు బతకడానికి ఈ పక్షి కొన్ని సాహసవంతమైన కార్యాలకు కూడా సిద్ద పడాల్సి ఉంటుంది..


గద్దకు నలబై ఏళ్ళు వచ్చే సరికి దాని ముక్కు, గోళ్ళు .రెక్కలు ఇతర శరీర అవయవాలు అన్నీ అననుకూలంగా పరిణమిస్తాయి.


పదునైన కొక్కెం లా ఉండే ముక్కుమొండిగా మారుతుంది.


గోళ్ళు వేటాడి వేటాడి వంగిపోతాయి.


అదే విధంగా పొడవుగా ఎదిగిన రెక్కలు భారమై,ఎగరడానికి వీలు కాకుండా మారతాయి.


ఈ దశలో గరుడ పక్షి ముందు రెండే రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి చనిపోవడం,రెండవది తిరిగి ఆయా శరీరాంగాలని పునర్జీవిన్ప చేసుకోవడం !


ఈ దశలో ఆ పక్షి పర్వతాలపై తానూ నిర్మించుకున్న గూటిలోకి చేరి పోతుంది.


దాదాపు అయిదు నెలలపాటు శారీరకంగా ఎన్నో బాధలకి ఓర్చి,తనని తానూ జీవన పోరాటానికి సంసిద్దపరచుకుంటుంది.


ముందు మొద్దు బారిన ముక్కుని పదునుగా మారే వరకు రాళ్ళపై రాపిడి చేస్తూనే ఉంటుంది.

తర్వాత రాపిడితో మొన దేలిన ముక్కుతో..వంగిపోయిన తన గోళ్ళను బలవంతంగా పీకేసుకుంటుంది.కొత్త గోళ్ళు వచ్చేవరకు వేచి చూస్తుంది .

ఈ దశ దాటిన తర్వాత కొత్త గోళ్ళతో,మొనదేలిన ముక్కుతో.పాట రెక్కలను పీకేసుకుంటుంది.

కొంత కాలానికి ఏర్పడిన కొత్త శరీర భాగాలతో..ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఎగిరిపోతుంది.మరో ముప్పై ఏళ్ళు జీవిస్తుంది.

ఈ కథని నేను "రామకృష్ణ ప్రభ " లో చదివాను. ఆశ్చర్యకరమైన ఈ పక్షి జీవన సంఘర్షణని మనిషి కూడా ఆదర్శంగా తీసుకోవాలి.


యువతరం పుస్తకాలు చదవడం ఆనే అలవాటు లేకపోవడం వల్ల లేక చదవడానికి దూరం కావడం వల్ల ఇలాటి స్పూరికరమైన విషయాలు తెలుసుకోలేకపోతున్నారు అనిపించింది. తప్పకుండా ఇలాటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం కదా!


ప్రతి ఒక్కరు తమ మనుగడలో ఇంకా అనివార్యమైన కొన్ని మార్పులకు సిద్దం కావాలి.

గతించిన వైఫల్యాలను,పరాజయాలను పక్కన నెట్టి కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కొనడానికి ప్రతి క్షణం అప్రమత్తంగా మెలగాలి.

విద్యార్ధి దశలో కానీ,ఉద్యోగ నిర్వహణలో కాని మనందరికీ కొన్ని సంఘర్షణలు. సాహసాలు తప్పవు. చావో,రేవో..అన్న పరిస్థితి లో చావు నుండి తప్పించుకుని రేవుకు చేరుకోవాలంటే మేధస్సుకు పదను పెట్టక తప్పదు


మనలో చాలా మంది..కాలం చెల్లిన (out dated ) విధానాలను,అలవాట్లను,పద్దతులను పట్టుకుని వేలాడుతూ ఉంటారు.


జీవితం అన్నది ప్రవాహం లాంటిది. అది అలా సాగిపోవాలంటే ఎప్పటికప్పుడు మన అంతరంగాన్ని నూతనోత్సాహంతో,భావజాలం తో నింపుకోవాలి.


మన ఉనికి (identity ).కి భంగం కలిగే పరిస్థితులని దైర్యంగా ఎదుర్కుంటూ..ఎప్పటికప్పుడు కొత్త సమస్యలను ఎదుర్కోవాలి.


మనకు తగ్గట్టుగా పరిస్థితులు ఉండాలని ఆకాంక్షించ కుండా..మనమే పరిస్థితులకు తగ్గట్టు మారుతూ..హుందాగా ఎదగాలి.


ఏ రిస్క్ తీసుకుంటే ఏమవుతుందో..అనుకునేవారు ఎప్పటికి విజయ పథాన పయనించలేరు.


ఎదిగి ఎదగని గొంగళి పురుగు సీతాకోక చిలుకగ ఎదిగి ఎగరాలంటే సంబందిత పరిణామ దశలోని బాధలని ఒర్చుకోవాల్సిందే!


అలాగే మనిషి కూడా కొన్ని మానసిక ఒత్తిళ్లను,సవాళ్ళను ఎదురోడ్డకుండాప్రగతి సాదించ లేడు కదా!


సమాజంలో అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్తాయికి చేరిన ఎవరి జీవన ప్రస్తానమైనా పరిశీలించి చూస్తే వారంతా కూడా కఠినమైన దశలని అధిగమించి వచ్చినవారే!అనేక మార్పులకు అనుగుణంగా తమ మనుగడను నిర్దేశించు కున్న వాళ్ళే !!


ప్రస్తుతం నువ్వు ఉన్న ఫ్రస్ట్రేషన్ నుండి బయట పడాలని కోరుకుంటూ.. ఉత్సాహంగా కొత్త కోర్సులు నేర్చుకుంటూ.. నీ భావి జీవితాన్ని మరింత మెరుగులు దిద్దుకుంటావని ఆశిస్తూ..


ప్రేమతో..దీవెనలతో. మీ అమ్మ.

47 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...

దీనికోసమే వేచి వున్నామండీ !

విం బార్ ఫైవ్ హండ్రెడ్ శుభాకాంక్షల తో

చీర్స్
జిలేబి.

ఫోటాన్ చెప్పారు...

500 likes for 500th post!
Congrats Vanaja garu :)

the tree చెప్పారు...

ఐదువందల టపాలు స్ఫూర్తిని నింపుతూ విజయవంతంగా పూర్తిచేసిన మీకు శుభాభినందనలు,

అజ్ఞాత చెప్పారు...

Post good. Wish you to complete 1000 posts shortly. CONGRATULATIONS.
( The longest word with 15 letters in English )

సీత చెప్పారు...

congratulations madam :-)

జ్యోతి చెప్పారు...

అభినందనలు,
మీకూ, మీ అబ్బాయికి, మీ బ్లాగుకు కూడా.. కీప్ గోయింగ్..

సిరిసిరిమువ్వ చెప్పారు...

మీ పంచ శతకాలకి శుభాభినందనలు.

చిన్ని చెప్పారు...

" చిన్ని!బంగారం!!ఎలా ఉన్నావు నాన్నా"touching..hmm!
congratulations.

Raj చెప్పారు...

500 పోస్ట్స్ పబ్లిష్ చేసినందులకు శుభాకాంక్షలు..

Pantula gopala krishna rao చెప్పారు...

ముందుగా 500వ పోస్టు వ్రాసినందుకు ఆభినందనలు.నేను చాలా లేటుగా బ్లాగ్లోకంలోకి రావడం తో మీవి చాలా పాత పోస్టులు చదివి ఉండను. ఈ పోస్టు మీ జీవన దృక్పధాన్ని తెలియజేస్తూ పిల్లలను ఉత్తేజ పరిచేలా ఉంది. ఇటువంటి పోస్టుల అవసరం ఎంతైనా ఉంది. గరుడ పక్షి గురించి ఇంతకు ముందు నేను వినని విషయం చెప్పారు. ధన్యవాదాలు. మీనుంచి మరిన్ని మంచి పోస్టులు రావాలని కాంక్షిస్తున్నాను.

శ్యామలీయం చెప్పారు...

అభినందనలు.
గరుడపక్షి కథ చాలా స్ఫూర్తి దాయకంగా ఉంది.

20 నెలల 3 రోజులు అంటే 3 + 20 x (365.25 / 12) = 611.75 అంటే 612 కి ఒకటి రెండు రోజులు అటూఇటూగా 500 టపాలన్నమాట. చాలా బాగుంది. దాదాపు రోజుకు ఒక టపా - అపుడపుడూ రెండూ అనుకుంటాను. మంచి వేగం.

త్వరలోనే 1000 టపాల పండ్గ చేసుకోండి. శుభం.

(నా వలనైతే కాదేమో. రోజుకో‌టపా సగటు అనూహ్యం.)

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

500వ పోస్ట్ వ్రాసి బ్లాగు ప్రయాణంలో ఆ మైలురాయి దాటినందుకు అభినందనలు వనజా గారు!
మీరు చెప్పిన గరుడపక్షి కథ ఏంతో స్పూర్తిదాయకంగా వుంది. ఇవన్ని మీ అబ్బాయి కూడా చదివి తను అనుకున్న లక్షాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

కంగ్రాట్స్. చక చకా ఇంకో అయిదు వందలు రాసెయ్యండి.

జీడిపప్పు చెప్పారు...

Congrats!!

May be this is the fastest 500 landmark in telugu blogs!

మధురవాణి చెప్పారు...

Congratulations on your 500th post. Keep writing more and more! :)

రసజ్ఞ చెప్పారు...

వావ్ అప్పుడే అయిదొందలు అయ్యాయా? ఇలానే త్వరలో (రెండు నెలల్లో) సహస్రం పూర్తి చేసేయాలని కోరుకుంటూ.....

కాయల నాగేంద్ర చెప్పారు...

500 వందల పోస్ట్ లు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు. మీ బ్లాగు ఇలాగే నిరంతరం మమ్మల్ని అలరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

శ్రీ చెప్పారు...

ఇంచుమించు రోజున్నరకి ఒక పోస్ట్...
కథలు, కవితలు, వ్యాసాలూ, పాటల అనువాదాలు..
వైవిధ్యమే చెప్తోంది మీరేమిటో...
ఇలాంటి వందలు మరెన్నో మేము చదవాలి మీ బ్లాగ్ లో...
అభినందనలు వనజ గారూ!
@శ్రీ

buddha murali చెప్పారు...

వనజ వనమాలి గారు గరుడ పక్షి గురించి మీరు రాసింది చాలా బాగుంది. ప్రారంబం లో మీ కుమారుడికి రాసిన ఉత్తరం అంటే పర్సనల్ అనిపించింది మొత్తం చదివాక గారడ పక్షి గురించి మంచి విషయం చెప్పారు. నిజానికి మనిషి తనను తాను తీర్చి దిద్దుకోవడానికి గరుడ అంత కష్ట పడల్సిని అవసరం కూడా లేదు కానీ ఆలోచన ఉండాలి

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ ముందుగా మీకు అభినందనలు.
గరుడపక్షి గురించి ఈవేళ కొత్త విషయం తెలుసుకున్నాను. ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుపుతూ మీరెన్నో టపాలు వ్రాయాలని కోరుకుంటున్నాను.

Palla Kondala Rao చెప్పారు...

500 పోస్టులు పూర్తి చేసిన మీరు మరిన్ని ఉపయోగకరమైన పోస్టులిలాగే వ్రాయాలి వనజ గారు.

ఘర్షణ లేకుండా ఉత్పత్తి రాదనేది మార్క్సిస్టు సూత్రం. ప్రకృతిలో ఇలాంటి (గరుడపక్షి లాంటివి) ఉపయోగకరమైన అంశాలు స్పూర్తినిచ్చేవి చాలా ఉన్నాయి.

మీ అబ్బాయికే కాదు చాలామందికి ఉపయోగపడుతుందీ పోస్టు.

మీరు నేర్చుకుంటూ , నేర్చుకున్నది పదిమందికీ అందజేస్తున్నందుకు అభినందనలు. ఎల్లకాలమిదిలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ ... మరోసారి అభినందనలు.

Manasa Chatrathi చెప్పారు...

Hearty Congratulations, Vanaja Garu.

yaramana చెప్పారు...

500 పోస్టులు పూర్తి చేసుకున్న మీకు అభినందనలు.

తెలుగు బ్లాగర్లలో మీ టపాలు విశిష్టమైనవి.

మీ ఆలోచనలు.. బెజవాడ బాబాయ్ హోటల్ నేతి ఇడ్లీల్లా కమ్మగా ఉంటాయి. నాకు ఇష్టం.

మీ టపాలకి పుస్తక రూపం ఇచ్చే ఆలోచనేమైనా చేస్తున్నారా?

సుభ/subha చెప్పారు...

ముందుగా 500 టపాలు పూర్తిచేసినందుకు అభినందనలండీ.. నిజంగానే ఈ టపా నాకు ప్రత్యేకంగా అనిపించింది.. మీరు మీ అబ్బాయికి చెప్పారేమో కానీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా వ్రాసారు. గరుడ పక్షి కథ చాలా స్పూర్తిదాయకంగా ఉంది.మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలండీ..

Tejaswi చెప్పారు...

గరుడపక్షి గురించి నాలాంటి చాలామందికి తెలియని మంచి స్ఫూర్తిదాయక అంశంచెప్పి మీ 500వ పోస్టుకు ఒక ఘనత కూడా కట్టబెట్టారు. శుభాభినందనలు!

oddula ravisekhar చెప్పారు...

మీ బ్లాగు ప్రయాణం అనితర సాధ్యం.500 post లంటే మాటలు కాదు.మీకు అభినందనలు.ఈ పోస్ట్ కూడా చాలా స్పూర్తిదాయకంగా వుంది.మీరు మరిన్ని మంచి పోస్ట్ లు వ్రాస్తూ ఉండాలని ఆశిస్తుంటాం.

వనజవనమాలి చెప్పారు...

జిలేబీ గారు .. మీ వ్యాఖ్యకి,అభిమానానికి ధన్యవాదములు. విం బార్ తో శుభ్రంగా కడిగేసానని.మీరు చెప్పిన తర్వాత . ఇప్పుడు అనుకుంటున్నాను అండీ థాంక్ యు!!

వనజవనమాలి చెప్పారు...

పోటాన్ గారు.. మీ అభినందనలకి నా హృదయపూర్వక ధన్యవాదములు.
@ ది ట్రీ భాస్కర్ గారు మీకు మనసైన ధన్యవాదములు. మీ వడి కూడా నా ఒరవడిని తలపిస్తుంది. మీరు అలాగే వ్రాయగలరు కూడా.

వనజవనమాలి చెప్పారు...

కష్టే ఫలే ..గారు మీ నుండి ఇంత పెద్ద గొప్ప అభినందనలు అందుకోవడమే నాకు నిజమైన సంతోషం. హృదయ పూర్వక ధన్యవాదములు.
@ సీత గారు.. మేడం అనకండి. మీ అభిమానానికి కృతజ్ఞతలు. ధన్యవాదములు. మీ బ్లాగ్ కూడా నిత్య నూతనంగా వర్ధిల్లాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ.. ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

జ్యోతి గారు.. బ్లాగరుల స్పూర్తికి ఆద్యులు మీరు. మా అభినందనకి ధన్యవాదములు. నిఖిల్ తరపున కూడా మీకు ధన్యవాదములు.
సిరిసిరిమువ్వ గారు.. మీ అభినందనకి హృదయపూర్వక ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

చిన్ని..గారు.. అమ్మాయిని గుర్తు చేసుకున్నారు కదూ.. మీకొక ఆసక్తి కరమైన విషయం ఏమంటే.. నేను ఈ పోస్ట్ ని మా వరండాలో కూర్చుని వ్రాస్తున్నాను.
కరక్ట్ గా మా అబ్బాయి గురించి వ్రాస్తుండగా.. నాకు "అమ్మా అమ్మా..అని వినిపించింది. నేను వెంటనే వెనక్కి తిరిగి చూసాను. మా అబ్బాయి వయసు అబ్బాయి మా ఇంటిముందు బైక్ ఆపుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు సంభాషణ ప్రారంభంలో.. వాళ్ళ అమ్మని పిలుస్తూ..ఆ పలుకులు.
ఏ తల్లికైనా..బిడ్డ గురించి ఆలోచనలో ఉంటే.. అలాగే అనిపిస్తుంది. వినిపిస్తుంది. అది తల్లి-బిడ్దల అనుబంధం.
@ రాజ్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. మీ బ్లాగ్ స్పూర్తితో..నేను ఇలా వ్రాయడం మొదలు పెట్టాను. నాకు మీరు స్పూర్తికరం. అన్నట్లు నేను మిమ్మల్ని బాట్ చేయబోతున్నానండోయ్ :)

వనజవనమాలి చెప్పారు...

పంతుల గోపాల కృష్ణారావు గారు.. మీ అభినందనలకి హృదయపూర్వక ధన్యవాదములు అండీ! ఏదో నాకు తెలిసిన నాలుగు విషయాలని ఉత్సాహంగా వ్రాస్తున్నాను. మీలాంటి పెద్దల ముందు.. హనుమంతుని ముందు కుప్పిగంతులు ..ఈ పోస్ట్లు. ఇక ముందు కూడా వ్రాయడానికి ప్రయత్నిస్తాను. మీ బ్లాగ్ తప్పనిసరిగా చూస్తాను.సాహిత్య విషయాల పట్ల నాకు ఆసక్తి ఎక్కువ. ధన్యవాదములు.
@శ్యామలీయం గారు.. మీరు ఇచ్చిన లెక్కకి ధన్యవాదములు. సగటున ఇలా వ్రాసున్నాను. మరింత కాలం వ్రాయాలనే ఆకాన్ష అయితే ఉంది. దైవ కృప ఉంటే సాధ్యం అవుతుందని నా నమ్మిక అండీ! మీ అభినందనకి మనఃస్పూర్తిగా ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

నిరంతరమూ వసంతము సురేష్ గారు.. మీ అభినందనలకి ధన్యవాదములు. సహృదయంతో..నా పోస్ట్ లు అన్నీ చదివి నాకు ఓపికగా వ్యాఖ్య వ్రాయడం అంటే.. నేను వ్రాసే విషయాలు పట్ల ఎంత ఆసక్తి ఉందొ..! అనుడుకు హృదయపూర్వక ధన్యవాదములు. థాంక్ యు సో మచ్ ..సురేష్ గారు.
@ కృష్ణ గారు.. మరీ మరీ ధన్యవాదములు. మీ అభినందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

నిరంతరమూ వసంతము సురేష్ గారు.. మీ అభినందనలకి ధన్యవాదములు. సహృదయంతో..నా పోస్ట్ లు అన్నీ చదివి నాకు ఓపికగా వ్యాఖ్య వ్రాయడం అంటే.. నేను వ్రాసే విషయాలు పట్ల ఎంత ఆసక్తి ఉందొ..! అనుడుకు హృదయపూర్వక ధన్యవాదములు. థాంక్ యు సో మచ్ ..సురేష్ గారు.
@ కృష్ణ గారు.. మరీ మరీ ధన్యవాదములు. మీ అభినందనకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

జీడి పప్పు గారు మీ అభినందనలకి ధన్యవాదములు. మీరు ఏర్చి కూర్చిన వంద బ్లాగులలో నా బ్లాగ్ ని జత పరచి నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ల్యాండ్ మార్క్ అంటారా? :)) థాంక్ యు వెరీ మచ్.
@మధురవాణి గారు.. మీ అభినందనలకి మనసైన ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

అమ్మాయి..రసజ్ఞ .. మీరు గణితంలో ఘనా పాఠి . ఇంకో రెండు నెలల్లో సహస్రం ఎలా పూర్తీ చేయగలను తల్లీ! ఏదో నా మీద అభిమానం తో మీకు అలా అనిపిస్తుందేమో.! నాకు అంత అపరితమైన జ్ఞానసంపద లేదు తల్లీ! మీ అభినందనలకి చాలా చాలా సంతోషం. ఇంకొక వారంలో ఇంకో వార్తతో వస్తానుఅనుకుంటున్నాను. వేచి చూడుము.ధన్యవాదములు. శుభాస్సీస్సులు తల్లీ!(అభిమానంతో)
@కాయల నాగేంద్ర గారు.. మీ అభిమానానికి ధన్యురాలిని. మీ అభినందనలకి ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

శ్రీ గారు.. (శ్రీనివాస్) మీ విశ్లేషణకి చాలా చాలా సంతోషం. మీ అభిమానపూర్వక అభినందనల పరంపరకి.. హృదయపూర్వక ధన్యవాదములు
బుద్దా మురళీ . గారు.. మీ అభినందనకి నా హృదయపూర్వక ధన్యవాదములు. మొట్ట మొదట మీరు ఇచ్చిన ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలు నా ఈ పోస్ట్ లకు ఊపిరి అంటే.. మీరు నమ్మరేమో! కాని ఇది వాస్తవం సర్.
వెన్నుతట్టి ప్రోత్సహించిన మిమ్మల్ని ఎప్పటికి మరువలేను. మీ బ్లాగ్ మీరు చెప్పే విషయాలు..నాకు చాలా నేర్పాయి. ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

జ్యోతిర్మయి గారు మీ అభినందనలకి చాలా సంతోషం. మీరు వంద పోస్ట్ లకి దగ్గరలో ఉన్నారు. నేను ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను. :)మీ అభిమానపూర్వక అభినందనల పరంపరకి.. హృదయపూర్వక ధన్యవాదములు
@పల్లా కొండలరావు గారు మీరు ఇచ్చిన ప్రోత్సాహకరమైన వ్యాఖ్యలు కి మూడుగా నా హృదయ పూర్వక ధన్యవాదములు. బ్లాగర్స్ వరల్డ్ లో.. సెలెక్టివ్ బ్లాగ్ గా నా బ్లాగ్ ని పరిచయం చేసినందులకు మరిన్ని ధన్యవాదములు చెప్పడం నా విధి కూడా నా ఈ పోస్ట్ లకు ఊపిరి మీ ప్రోత్సాహం కూడా. మంచి పోస్ట్ లు వ్రాసినప్పుడు మీరు అందించిన వ్యాఖ్యలు..మళ్ళీ మళ్ళీ నేను వ్రాసేదానికి ఉరికోల్పాయి.
వెన్నుతట్టి ప్రోత్సహించిన మరీ మరీ ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

మానసా..మీ అభిమానానికి ధన్యవాదములు. చాలా విషయాలలో మీరు నాకు స్పూర్తి.అందుకే ఒక కథలో ఒక మంచి మనిషికి "మానస " అని పేరు పెట్టాను. అప్పుడు కనుల ముందు మీరే ఉన్నారు. మనలాంటి వాళ్ళు కలసి మంచి పనులకి శ్రీకారం చుట్టాలని నా ఆశ. థాంక్ యు మానస.
@yramana గారు మీ ప్రశంస కి నాకు చాలా సంతోషం. ఆ ఆలోచనలని ఆచరణలో కొన్ని అయినా చోటు చేసుకుంటాయి అని ఆనందంగా భాద్యతగా తెలియజేస్తున్నాను.
నా బ్లాగ్ ని పుస్తక రూపంలో తెచ్చే ఆలోచన అయితే ఉంది ..అది ఎప్పటికి సాధ్యపడుతుందో..చెప్పలేను.
మీ అభినందనలకి హృదయపూర్వక ధన్యవాదములు.

వనజవనమాలి చెప్పారు...

సుభ గారు ..బాగున్నారా? మీ అభినందనలకి హృదయపూర్వక ధన్యవాదములు. "మీ సుభాకాంక్షలు " ఎప్పుడు నాతోనే ఉంటాయి థాంక్ యు!!
@Tejaswi ..గారు.. బాగున్నారా అండీ !!
మీ అభినందనలకి ధన్యవాదములు. మీ అభిమాన పూర్వక వ్యాఖ్యలు కూడా ఈ నాటి ఈ అయిదు వందల పోస్ట్ లకి ప్రోత్సాహమే నండీ! థాంక్ యు వెరీ మచ్!!

ఉష చెప్పారు...

అభినందనలు. రాసి కన్నా వాసి ముఖ్యం, అది మీ పోస్టుల్లో తప్పక ప్రతిఫలిస్తుంది. రాసుకోవడం మనలో ప్రోది చేసుకున్న ఆలోచనలు, మనం చదివినవి, విన్నవి, చూసినవి మనకి మననం కావడానికే. ఈ మీ రాతలు మీకు మరింత పుష్టికరమైన భావి జీవితానికి విత్తులు. స్ఫూర్తికి కి ఉత్ప్రేరకాలు కావాలని అభిలషిస్తూ...

ప్రకృతిలోని జీవం ఎప్పటికీ రసహృదయులకి అక్షయమే. ఈ గరుడ కథ మునుపు విన్నాను, అలాగే వలస పక్షుల గమనపు విధానం (అలిసిన/దెబ్బ తిన్న పక్షికి సాయపడుతూ, అసలు గుంపు ఎగిరే వరస క్రమం మొత్తం గా వాటి రెక్క వేగం పక్క పక్షికి ఊపు/ఊతమిచ్చే రీతి వగైరా) ఇలా ప్రతి జంతు, పక్షి ఇచ్చే సందేశాలు మా పిల్లలకి చెప్తుంటాను. అందుకే ఈ క్రింది మాట.

రోల్ మోడల్ అంటూ ఏ ఒక్కరి పాత్రా లేదూ ఒక సమూహం ప్రభావం పూర్తిగా ఒక వ్యక్తిత్వం సంతరించుకోవడం లో ఉండదని నా అభిప్రాయం. మనమో లేక పిల్లలే చుట్టూ గమనించిన ఉదాహరణల జాడలు, నీడలు తిరిగి మనలో మనం గమనిస్తామేమో. ఎక్కువగా మనం ఇష్టపడేది మనకు నచ్చిన గుణాలు గలవారిని/లేదూ మనం ఎలా ఉండాలనుకున్నామో వారిని, మనకు నచ్చనిది మన బలహీనతలు, లోపాలు అద్దంలో బొమ్మలా మనకు ప్రతిబింబించేవారు కావచ్చు. ఎంత అద్భుతమైన అనుభవం ఒకలా ఆలోచిస్తే పిల్లల్ని పెంచడం. ఒక అణువు ఒక ఉనికి గా పరిణామం చెందడాన్ని, ఒక అస్తిత్వం, ఒక చైతన్యం సంతరించుకోవడాన్ని, చాలా దగ్గరగా పరిశీలించడం, అంతేగాక దాని దిశని కాస్తో కూస్తో నిర్దేశించగలగడం ప్రభావితం చేయగలగడం, ఎంత అద్భుతమైన అనుభవం! మీ బాబుకి మీరు, మీకు తను పరస్పరం మాటల్లో వ్యక్తం కాలేనన్ని అనుభూతులు, అనుభవాలు పంచుకోవాలని అభినందిస్తూ...

వనజవనమాలి చెప్పారు...

ఒద్దుల రవిశేఖర్ గారు మీ అభినందనలకి హృదయపూర్వక ధన్యవాదములు.
మీరు అందించే వ్యాఖ్యలు కూడా నాకు ఉత్సాహం ని అందిస్తాయి. థాంక్ యు వేరి మచ్ సర్!.

వనజవనమాలి చెప్పారు...

మరువం ఉష గారు మీ విశ్లేషణాత్మకమైన మీ అభిప్రాయానికి మీ అభినందనలకి హృదయపూర్వక ధన్యవాదములు.
మీరు ఉదాహరించిన ప్రతి మాట తోనూ నేను ఏకీభవిస్తాను. ధన్యవాదములు ఉషగారు.థాంక్ యూ సోమచ్!!

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మంచి స్పూర్థిదాయకమైన టపా.500కు అభినందనలు మరియు మీకు,మీ అబ్బాయికి శుభాకాంక్షలు!

జలతారువెన్నెల చెప్పారు...

ముందుగా మీరు ఐదు వందల పోస్ట్స్ రాసినందుకు అందుకోండి నా అభినందనలు.
రెండు మీరు గరుడ పక్షి గురించి చెప్పినది నాకు కూడా తెలీదు.
మూడు మా అమ్మాయికి కూడా చదివి వినిపిస్తాను.
నిఖిల్ కి నా ఆశీస్సులు. మీకు మరి ఒక్కసారి అభినందనలు వనజ గారు.

రాజి చెప్పారు...

Congratulations వనజవనమాలి గారు..
500 పోస్ట్ లు పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు!

గరుడపక్షి కథ స్పూర్తిదాయకంగా ఉంది.
మంచి విషయాలు చెప్పినందుకు థాంక్సండీ..

Manasa Chatrathi చెప్పారు...

Hi Vanaja Garu,

sorry for the delay)
Thank you for all your kind words. I feel honoured.

Thanks again and wish you all the very best.

Best Regrds