12, జులై 2012, గురువారం

నచ్చిన అంశం

మనం ప్రతి నిత్యం ఎన్నో విషయాలని ప్రత్యక్షంగా చూసి,చదివి,విని,స్వయంగా చేయడం ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాము.

ఈ మధ్య కాలంలో నేను చదవడం ద్వారా మంచి విషయం తెలుసుకున్నాను ఈ విషయం చూడండి ..
తల్లి -తండ్రి మధ్య ఉన్న వ్యత్యాసం. అలాగే విధ్యార్ధులతో గురువుకి ఉన్న అనుబందాన్ని...ఎంత బాగా వివరించి చెప్పారో!

చదవడం పట్ల ఉన్న ఆసక్తితో.. నేను ప్రతి నిత్యం ఇలాటి విషయాలు చదివేటప్పుడు అల్లా.. మా అమ్మ బాగా గుర్తుకు వస్తూ ఉంటారు. .

అమ్మ ఇచ్చిన కాఫీ త్రాగుతూ.. దొరికిన పాత పేపరో, (సరి క్రొత్త పేపర్ ఉండేది కాదు. రెండు మూడు రోజుల నాటి పేపర్ ని మా పెదనాన్న గారిని అడిగి తెచ్చుకుని చదువుకునేవాళ్ళం) లేదా ఏ వార పత్రికనో తిరగేస్తూ ఉంటే..ఆ కాఫీ చల్లారి పోయేది. అలాగే అన్నం తింటూ చదవడం మొదలెట్టాను అంటే.. చేయి ఎండి పోయి..అన్నం ఆరిపోయి..అలా కెలుకుతూనే ఉండిపోయే దాన్ని. అప్పుడు అమ్మ బాగా తిట్టేది. పెంట కుప్పలో కాగితాలు కూడా వెతుక్కోచ్చుకుని చదువుతావు అని. అలా చదివే అలవాటు మూలంగానే కాస్తంత జ్ఞానం నేర్చుకున్నాం. .. అని ఇప్పుడు అనుకుంటాను.

ఈ నాటి యువత కి ఈ అలవాటు లేనేలేదు. మొబైల్ పోన్ లలో ఇంటర్నెట్ కనెక్షన్ లభ్యం అవడం మొదలెట్టాక పేస్ బుక్ లో చాటింగ్..లో తలమునకలై ..తల్లిదండ్రులు పలకరిస్తే చాలు విసుక్కోవడం అసహనం ప్రదర్శించడం చేస్తున్నారు. అది ఎంత వరకు సమంజసమో ఆలోచించుకుంటే మంచిది.

విపరీతమైన వత్తిడితో కూడిన చదువులు చదువుతున్నారని..పిల్లలకి చిన్న పాటి పని కూడా చెప్పకుండాను ,ఇంకా చెప్పాలంటే వారికి కావలసిన అవసరాలతో పాటు.. వారు కోరిన అన్ని గొంతెమ్మ కోర్కెలని తీరుస్తున్న కుటుంబ ఆర్ధిక పరస్థితి ఏమిటో కూడా ఆలోచించడం లేదు కూడా అనిపించింది.

అలాగే నేను చదివిన ఒక మంచి వాక్యం..మన బ్లాగ్ ల లోనే చదివాను.. నాకు చాలా బాగా నచ్చింది కూడా.
ఆ వాక్యం ఏమిటో..మీరే చూడండి.

"బాహాటంగా చెయ్యలేని పనిని రహస్యంగా కూడ చెయ్యకూడదు.."

యువత కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటే బాగుండును..కదా!! ఇలాటి విషయాలని ఉత్తరాలు వ్రాసే కాలంలో చక్కగా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే దాన్ని. ఇప్పుడు కూడా వ్రాస్తాను అనుకోండి. ఇక్కడ కూడా ఇలా వ్రాస్తూ.. హాపీగా ఫీల్ అవుతున్నాను.

సరే ఈ చక్కని విషయాన్ని కూడా చూడండి.

ఈ నెల తొమ్మిదవ తేదీ నాటి ఆంద్ర జ్యోతి దిన పత్రిక జిల్లా ఎడిషన్ లో "చుక్కాని " చూడండి.
5 వ్యాఖ్యలు:

oddula ravisekhar చెప్పారు...

వనజ గారు చాలా గొప్ప పోస్ట్ .పేపర్ లోని విషయం చాలా అద్భుతం.నేను కూడా మూడవ తరగతినుండి పేపర్ చదువుతుంటాను.అలాంటివి చుక్క రామయ్య గారి ఆర్టికల్స్ చాలా బాగుంటాయి.ఇటువంటి విషయం పోస్ట్ లో వుంచినందుకు మీకు అభినందనలు.

జలతారువెన్నెల చెప్పారు...

వనజగారు, మీరు ఈ టపా వెయ్యకపోతే, నేను చదవకపోతే చాలా మిస్స్ అయ్యేదాన్ని.
చాలా చాలా థాంక్స్ అండి. Great post!!!

the tree చెప్పారు...

manchi maatalu chepparu.

రాజి చెప్పారు...

వనజవనమాలి గారు..
చదవటం నాకు కూడా చాలా ఇష్టమైన హాబీ అండీ..
మంచి విషయాన్ని చెప్పారు.

వనజవనమాలి చెప్పారు...

oddula Ravisshekhar gaaroo.. Thank you very much!!

@Jalataaru vennela gaaru..ee post meeku nacchinanduku Thank you very much!!

@The tree Bhaskar gaaru..Thank you very much.

@Raajee gaaru..Thank you very much!

మంచి విషయాలని మన ఫ్రెండ్స్ అందరికి పంచినందుకు..మీరు మెచ్చినందుకు సంతోషం.అందరకి ధన్యవాదములు.