26, జులై 2012, గురువారం

కన్నుల లోగిలిలో ...




స్నేహం గురించి ఒక పోస్ట్ వ్రాయాలని అనుకుని నా ఫ్రెండ్ ని స్నేహం గురించి ఏమైనా చెప్పు ..ఆన్నాను.

తను ఇలా చెప్పింది.

वादा करते हैं दोस्ती निभाएंगे
कोशिश यहही रहेगी तुझे न सतायेंगे
ज़रूरत पड़े तोह दिल से पुकारना
मर भी रहे होंगे तो मोहलत लेकर आयेंगे

నాకు అర్ధం కాలేదు. బాగా ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకో..అని చీవాట్లు పెట్టింది.

నిశ్చయంగా నా స్నేహాన్ని నిలబెట్టుకుంటానని ప్రమాణం చేస్తున్నా..
నిరంతరం అందుకై ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది
నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టను..
అవసరం వచ్చినప్పుడు నీ హృదయంతో పిలిచావంటే
మరణానికి చేరువలో ఉన్నా కూడా దానిని వాయిదా వేసి వస్తాను నీకోసం..
అని విడమర్చి చెప్పింది.

ఇంకేం చెప్పను!? కన్ను నాదైతే అందులో చిప్పిల్లే నీరు తాను..

అందుకేనేమో.."సిరివెన్నెల " కలం జాలువార్చిన స్నేహభావం ..చప్పున గుర్తొచ్చింది.
ఆ పాట ...



ఆ ..... ఆ .. ఆ .. ఆ .. ఆ ..
లా -ల -ల . లా -ల -ల . లా ...
ఆ ..అ .ఆ ..
లా -ల -ల . లా -ల -ల . లా ..
కన్నుల లోగిలిలో ... ఓ .ఓ .ఓ .ఓ .
వెన్నెల విరిసింది .. ..
చల్లని జాబిలితో ..
స్నేహం కుదిరింది .. ..
చెలిమి తోడుంటే .
చా ..లమ్మ ..
లేనిదీ ఏముంది .. ..
ఆశ చిటికేస్తే .
చా ..లమ్మ ..
అందనిదేముందీ .....
కన్నుల లోగిలిలో ...
వెన్నెల విరిసింది .. ..
చల్లని జాబిలితో ..
స్నేహం కుదిరింది .. ..

గున్నమావి గొంతులో ..
తేనె తీపి నింపుతూ ..
కోయిలమ్మ చేరుకున్నదీ ..
ఎండా మావి దారిలో ..
పంచదార వాగులా ..
కొత్త పాట . సాగుతున్నది ..
ఒంటరైన గుండెల్లో ..
ఆనందాల అందెలతో ..
ఆడే సంధడిది ..
అల్లిబిల్లి కాంతులతో
ఏకాంతాల చీకటిని ..
తరిమే బంధమిది ...
కలతెరగని . కళలను
చూడు ..
కంటికి కావలి .నేనుంటా ..
కళ తరగని . వెలుగులు
నేడు ..
ఇంటికి తోరణ .మనుకుంటా ..

కన్నుల లోగిలిలో ...
వెన్నెల విరిసింది .. ..
చల్లని జాబిలితో ..
స్నేహం కుదిరింది .. ..

పంచుకున్న ఊసులు .
పెంచుకున్న ఆశలు .
తుళ్ళి తుళ్ళి ఆడుతున్నవి ..

కంచే లేని ఊహలే .
పంచ వన్నె గువ్వల i.
వెండి అంచు తాకుతున్నవి ..

కొత్త జల్లు కురిసిందీ ...
బ్రతుకే చిగురు తొడిగేలా ...
వరమై ఈ వేళా..

వానవిల్లు విరిసింది ..
మిన్ను .. మన్ను . కలిసేలా ..
ఎగసే .. ఈ వేళా ..

అణువణువును . తడిపిన ఈ
తడి
అమృతవర్షిని . అనుకోనా ..

అడుగడుగునా . పచ్చని బాటను
పరిచిన వనమును .
చూస్తున్నా ..

కన్నుల లోగిలిలో ...
వెన్నెల విరిసింది .. ..
చల్లని జాబిలితో ..
స్నేహం కుదిరింది .. ..
చెలిమి తోడుంటే .
చా లమ్మ ..
లేనిదీ ఏముంది .. ..
ఆశ చిటికేస్తే . చా ..లమ్మ ..
అందనిదేముందీ ....
... ఇంతకన్నా స్నేహం గురించి నేను చెప్పగలనా!?

8 వ్యాఖ్యలు:

సీత చెప్పారు...

super.........!!
స్నేహం నిజంగా ఎంత మధురం......!!
పాట చాలా బాగుంది:)

సాయి చెప్పారు...

చాలా బాగుంది వనజమాలి గారు...

meraj fathima చెప్పారు...

paata baagundi me sneham laage medam

జలతారువెన్నెల చెప్పారు...

మంచి సాహిత్యం వనజ గారు. బాగుంది పాట.

సి.ఉమాదేవి చెప్పారు...

స్నేహానికన్న ఏముంది జగాన మిన్న?ఈ ప్రపంచంలో మంచి అంటువ్యాధి కన్నీరే.మీకంట చిప్పిలిన కన్నీరు అందరి కళ్లను తెలియకుండానే తడుపుతుంది.

రాజి చెప్పారు...

"వనజవనమాలి" గారూ..
రాజా సినిమాలో అన్ని పాటలూ బాగుంటాయి.
ముఖ్యంగా ఈ పాట మీరు స్నేహం గురించి చెప్తూ పరిచయం చేశారు కదా.. అందుకే చాలా బాగుంది..

వనజవనమాలి చెప్పారు...

seeta gaaru.. Thank you very much!!

@ Sai..gaaru Thank you!!

@merej fathima gaaru..Thank you very much!!

వనజవనమాలి చెప్పారు...

Jalataaru vennela gaaru.. Thank you very much!

@c.uma devi gaaru Thank you very much!!

Rajee garu Thank you very much.!!