21, జులై 2012, శనివారం

ఓ చినుకు కవిత



ఈ చినుకు ..నేను వ్రాసినది కాదు.

ఎక్కడో..చదివాను. నాకు బాగా నచ్చింది. ఈ కవిత వ్రాసిన వారి పేరు గుర్తుకు రావడం లేదు. వెతుకుతున్నాను. కానీ చిక్కడంలేదు.

కానీ చినుకు పడినప్పుడల్లా ..ఈ అక్షర చినుకు నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది.

జాన్ హైడ్ గారు.. వాన కవితలని సేకరిస్తున్నానని చెప్పారు. ఓ..అనామిక కవితగా ఈ కవితని పరిచయం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది.

అందుకే ఈ షేరింగ్. .. (భావచౌర్యం అనుకోవద్దు ప్లీజ్ !!) నాకు ఈ కవిత వ్రాసిన వారు గుర్తుకు రాగానే..ఇక్కడ వారి పేరును పొందు పరుస్తాను.

చినుకు చినుకు రాలి సంద డాయెను
నుదుటిపై జేరి ముత్యమాయెను
అది గుండెపై జారగానే జాతరాయెను
నడుమ పై పడిన చినుకు వీణ ఆయెను
అల్లనల్లన మీటగానే వేణు వాయెను
తడిసి తడిసి తనువంతా బృంద గాన మాయెను
కనులముందు బృందావని కదలి పోయెను
అది మధురమైన జ్ఞాపకమై మిగిలి పోయెను
మరలి వచ్చే చినుకు కోసం కనులు కాయలు కాచెను.

నేను గుర్తుకు తెచ్చుకుని సుమారుగా ఈ కవితని వ్రాసాను. కానీ ఒరిజినల్గా మార్పు ఉండవచ్చేమో కూడా..
ఈ పోస్ట్ చదివి..ఈ కవిత వ్రాసిన వారు ముందుకువస్తే..వారికి నా అభినందన మందారమాల
భావ చౌర్యం గురించి రేపు ఒక పోస్ట్ వ్రాస్తాను .. వెయిట్ ప్లీజ్!!

8 కామెంట్‌లు:

భాస్కర్ కె చెప్పారు...

nice one, thanks for sharing.

శశి కళ చెప్పారు...

పోస్ట్ లో కవితగా మారి మదిలో పులకిరించెను...కేక

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి కవితను గుర్తుచేసి మాతో పంచుకున్నందుకు అభినందనలు వనజ గారు!

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

కవిత వ్రాసినవారికి అభినందనలు.షేర్ చేసిన మీకు కూడా

సి.ఉమాదేవి చెప్పారు...

కవితాచినుకులు కురిసినవేళ, వీణా,వేణునాదాల జుగల్ బందీతో మనసునే బృందావనముగ చేసి అలరించారు వనజగారు!

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ, మహా కవుల కవిత్వం గూర్చి చెప్పటమే గొప్ప అనుకుంటారు, కానీ మీరు కేవలం నచ్చిన భావాన్ని చూడటం మీ సాహితీహ్రిదయానికి అద్దం పడుతుంది, ఇది పొగడ్త కాదు నిజం. ఆ కవి ఎవరో ధన్యులు.

జ్యోతిర్మయి చెప్పారు...

మంచి కవితను పరిచయం చేశారు వనజ గారూ...

జలతారు వెన్నెల చెప్పారు...

Very nice one !