15, జులై 2012, ఆదివారం

డైరీ లో కొన్ని పేజీలు 

చినుకు పడితే సంబరం.
చినుకుపై మనసు పడితే
మనపై చినుకు పడితే
మనసంతా ఆనందపు చిత్తడి చిత్తడి...

అందుకే  చినుకు పడినప్పుడు కవిత్వం ..పుట్టుకొస్తుంది.

ఆ కవిత్వం వ్రాసున్న రోజులు గుర్తుకు వస్తాయి.

అలా వ్రాసుకున్న కవితలు..

డైరీ లో కొన్ని పేజీలు ...
చూడు ఈ వర్షం ఎలా  కురిసిందో
వీధులన్నీ ఎలా ఉన్నాయంటే
ఆలోచనల సముద్రం వలే ఉన్నాయి
మూసి ఉన్న గాజు కిటికీ తలుపు మీద
వర్షపు చినుకు ఆనవాలు
నువ్వు వచ్చి ఉంటావేమో 
అందులో నీ పరి ఛాయా కనబడుతుంది
ఇది అసలే వర్షా కాలం
మనసు విప్పి చెప్పేది నీతో మాత్రమే
కేవలం నీతో మాత్రమే
వర్షం నిండుగా కురుస్తుంది నా ప్రేమలా  
కోరుకుంటే ఆకాశం నుండి కురిపించ వచ్చు
కుదిరితే నీ సొగసు వర్షం కురిపించవచ్చురాతిరి ఎలా గడిచిందో ఎవరికీ చెప్పకు
కలలో ఉన్న విషయం ఎవరి చెప్పకు
ఓ మేఘం ఎలా వచ్చిందో
మరొక మేఘంతో ఎలా డీ కొందో
ఈ వర్షం ఎలా కురిసిందో ఎవరికీ చెప్పకు


ఇవండీ.. ఒకప్పటి చినుకు తడికి ..వెల్లువెత్తిన భావ పరంపర.
అలాగే ఒక బరువైన పాట.. వినేయండి..

10 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

It rained so nice

సాయి చెప్పారు...

బాగుంది అండీ

the tree చెప్పారు...

bhaagundandi mee kavitha, dairy lo inka.

రాజి చెప్పారు...

వనజవనమాలి గారూ..
మీ డైరీలో రాసుకున్న కవిత చాలా బాగుందండీ..
"మూసి వున్న గాజుకిటికీ తలుపు మీద వర్షపు చినుకుల ఆనవాలు"

దీనికి తగిన ఫోటో నా బ్లాగ్ లో వుంది చూడండి
మా ఇంట్లో కిటికీ అది ...

మీ కవితలో ఈ లైన్ చదవగానే నాకు ఆ ఫొటో గుర్తొచ్చింది...

http://raji-rajiworld.blogspot.in/2010/07/blog-post_07.html

oddula ravisekhar చెప్పారు...

వర్షం నిండుగా కురుస్తుంది నీ ప్రేమలా!మంచి కవితా ప్రయోగం.డైరీ లోని పేజీ పెట్టాలనుకున్న మీ ఐడియా విభిన్నం.

జలతారువెన్నెల చెప్పారు...

Sweet! So sweet!! vanaja gaaru...chaalaa baagundi!

అజ్ఞాత చెప్పారు...

wonderful

శ్రీ చెప్పారు...

chaalaa chakkani bhaavaalu vanaja gaaroo!
@sri

వనజవనమాలి చెప్పారు...

పురాణ పండ ఫణి గారు.. చినుకు పైత్యం నచ్చినందుకు సంతోషం :) ధన్యవాదములు.
@సాయి..గారు థాంక్ యు వేరి మచ్.
@ది ట్రీ భాస్కర్ గారు.. మీ లాంటి మంచి కవికి ఈ చిన్న చినుకు సవ్వడి నచ్చినందుకు ధన్యవాదములు.
@ రాజీ గారు..మీ బ్లాగ్ లో పిక్ చూసి వచ్చాను. ఎంత బావుందో! అయినా.. మనలో ఎక్కడో కొద్ది గా అయినా రసజ్ఞత ఉంది..అందుకే ఇలా స్పందిస్తూ ఉంటాము. థాంక్ యు వెరీమచ్..రాజీ ..గారు.

వనజవనమాలి చెప్పారు...

ఒద్దుల రవి శేఖర్ గారు.. మీ స్పందనకి నా ధన్యవాదములు .నా ఈ పోస్ట్ కొంచెం విభిన్నమైన ఆలోచనే! కానీ నేను ఒకటి అనుకుంటాను అండీ.. ఈ బ్లాగ్ వ్రాసుకోవడం కూడా..90 % డైరీ వ్రాసుకోవడం లాంటిదే అని నా అభిప్రాయం. చిను సడి నచ్చినందుకు ధన్యవాదములు.
@జలతారు వెన్నెల .. సో స్వీట్.. మీ వాఖ్య అండీ!! రోజు మీ వాఖ్యలు పటిక గుళికలు లాంటివి. థాంక్ యు వెరీ మచ్ !!
@కష్టేఫలె ..గారు.. ధన్యవాదములు.
@ శ్రీ గారు.. చాలా చాలా సంతోషం అండీ. థాంక్ యూ వెరీ మచ్!!