16, జులై 2012, సోమవారం

మన్ మేరా గాయే

ఈ రోజు మనసంతా చాలా చికాకుగా వుంది . అవసరమైన చోట అనవసరమైన వాద ప్రతివాదనలు జరుగుతుంటాయి అలా అని అభిప్రాయ బేధాలు రాకుండా ఉండవు.

అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకునే కన్నా.. ప్రశాంతంగా మనసుకు నచ్చిన పని చేసుకుంటే బాగుండును అనుకుంటూ..ఇదిగో..ఇలా వచ్చాను .

నాకు నిబ్బరాన్ని,మానసిక ప్రశాంతతని ఇచ్చే ... నాకు నచ్చిన అత్యంత ఇష్టమైన వ్యాపకం .. ఈ పాట వినడం.
ఆ పాట సాహిత్యం.. ఇది.

చిత్రం: Banaras - A Mystic Love Story
సాహిత్యం: సమీర్


తూర్పు నుండి సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో..
ఆ కిరణాల వెలుగు సింధూరవర్ణ రంజితమైన మేఘములుగా దట్టంగా పరచుకుంటుంది.
గాలి గమనంలో మువ్వల రవళి వినిపించగా
నా నెమలి లాంటి హృదయం పాడుతుంది..
నా హృదయం పాడింది..
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

నిన్ను పూజించడానికి పళ్ళెరం నిండా పూల దండలు తెస్తాను.
గంగా జలాన్ని కలశంలో నింపి తెస్తాను
తొమ్మిది జ్యోతుల దీపాన్ని వెలిగిస్తాను
నిత్యం శివ చరణముల ముందు శిరస్సు వంచుతాను
తన్మయత్వంతో,భక్తి పారవశ్యంతో..
నా ఆణువణువూ పులకరిస్తుంది
నా హృదయం పాడింది
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

నశ్వరం కాని అభయమిచ్చే శంకరా ..
నేను నీ దర్శనాభిలాషిని
జన్మ జన్మల నుండి నీ పూజ చేయుటలో దప్పిక గొన్న దానిని
నా మీద కొంచెం దయ చూపు
నీ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు
నా ప్రాణాలు కేవలం నీ కోసమే !
నా హృదయం పాడింది ..ఓం నమః శివాయ
ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

హిందీ సాహిత్యం:
(purab se jab suraj nikle sinduri ghan chhaye
pavan ke pag me nupur baje mayur mann mera gaye) – (2)
mann mera gaye, om namah shivay……….

pushp ki mala thal sajau, gangajal bhar kalash mai lau
nau jyoti ke dip jalau, charno me nit shish jhukau
bhav vibhor hoke bhakti me rom rom rang jaye
ho mann mera gaye, om namah shivay……….

abhyankar shankar avinashi, mai tere darshan ki abhilashi
janmo ki puja ki pyasi, (mujhpe karna kripa jara si -2)
tere siva mere prano ko aur koyi naa bhaye
ho o o o mann mera gaye, om namah shivay

ఇక్కడ పాట వినండి . ...

మన్ మేరా గాయే

ఇక్కడ చూడండి .(శివ మహాదేవుని చరణార విందములకు శిరసా ప్రణమిల్లుతూ )

4 వ్యాఖ్యలు:

the tree చెప్పారు...

మీ పాట బావుందండి, నాకైతే హింది రాదు,
ఏ సినిమాలోదండి, ఈ పాట.

వనజవనమాలి చెప్పారు...

the tree bhaskar gaaru.. eepaata ee chitram ..lo paata

movie: Banaras - A Mystic Love Story

paata nacchinanduku Thank you very much!!

జలతారువెన్నెల చెప్పారు...

Nice song vanajagaaru

వనజవనమాలి చెప్పారు...

శ్రీ గారు.. ఈ పాట నేను రోజు వింటాను.. శ్రేయ ఘోషల్ గళం భక్తిరసభావంలో తేలియాడిస్తుంది.. మీకు నచ్చినందుకు సంతోషం ధన్యవాదములు.