28, సెప్టెంబర్ 2026, సోమవారం

చందమామ పాటలు


చందమామ పాటలు


ఎందుకలా వొంటరిగా ఊరేగుతున్నావు 

చంద్రమా! 


నన్ను పిలవకపోతివి. హ్మ్.. 

కాసిని తారాచంద్రుల కథలు 

మరికొంత వెన్నెల కవిత్వం

కొన్ని హృద్యమైన పాటలు మోసుకుని

వచ్చేదాన్ని పరుగు పరుగున 

మబ్బుల పల్లకీ యెక్కి. 


ఏమిటో.. బెట్టు పోతున్నావ్!

సరే పో! నేను శ్రావ్యమైన చందమామ పాటలు వినాలి. 


********

చందమామ ఆటలు 


సందెవేళ అరవిరిసిన జాజిపూల

పరిమళాన్ని అరచేతుల్లో అద్దుకుని

మనోవేగంతో.. వచ్చి మెత్తగా నీ కనులు మూసి నేనెవరో కనుక్కో అంటాను.

నువ్వు నీ రెండు చేతులతో నా అరచేతులను నాసిక దగ్గరకు జరుపుకుని

నువ్వు పరిమళ వి కదా అంటావ్. 

 నేను కోపంగా.. ఆ ఇరవై తొమ్మిదవ స్త్రీ 

ఎవరూ అంటాను. 

నువ్వు ఫక్కున నవ్వి కొంటెగా.. 

 “తారా! ఎందుకంత ఉక్రోషం” అని అంటావ్! 

మబ్బులతో ఆటలాడుతున్నట్లు ఆటలు తగవు చంద్రమా! 

స్వల్పకాలిక భావోద్వేగాలు దాంపత్య జీవితాన్ని భగ్నం చేస్తాయి అంటాను.


ఆంగ్ల అనువాదం


Chandamama Paatalu / Moon Songs - Vanaja Tatineni*


Why are you parading alone like that,

Oh Moon!


You didn't call me. Hmm...

Carrying a few tales of stars and moon,

Some more moonlit poetry,

And some heart-warming songs,

I would have come running,

Riding a palanquin of clouds.


What is this... you are sulking!

Fine, go! I want to listen to melodious moon songs.


**********


 Chandamama Aatalu / Moon Games - Vanaja Tatineni*


In the evening, smearing the fragrance

Of half-bloomed jasmines on my palms,

I come swiftly and softly close your eyes

And ask you to guess who I am.

You, with both your hands, bring my palms

Close to your nose and say,

"You are the fragrant one, aren't you?"

I, angrily... "Who is that twenty-ninth woman?"

You burst out laughing naughtily...

"Tara! Why so jealous!"

Stop playing games like you play with clouds, Oh Moon!

Momentary emotions ruin married life, I say.

**********

29 వ స్త్రీ అని అడగడానికి గల వివరణ :

భారతీయ ఇతిహాసాల ప్రకారం చంద్రునికి *27 మంది భార్యలు* - దక్ష ప్రజాపతి కుమార్తెలు, అందరూ అక్కాచెల్లెళ్లు - 27 నక్షత్రాలు + అభిజిత్ కలిపి. రోజుకో నక్షత్రం దగ్గర ఉంటాడు చంద్రుడు. వాటి గమనంతోనే రెండు పక్షాలు, ఒక మాసం.

మరి *తార* అంటే? తార అంటే బృహస్పతి భార్య! చంద్రుడికి తార అంటే అమిత అనురాగం ఉన్న కథ పురాణాల్లో ఉంది. ఆ ప్రేమ కథ వల్లనే బుధుడు పుట్టాడు అంటారు.

27 మంది భార్యలు మరియు తార కలిపి 28 మంది.

#వనజతాతినేని




26, సెప్టెంబర్ 2026, శనివారం

భిన్న రూపాలు

 


ధ్వని 


ఆ మొగ్గలన్నీ వికసించడంలేదు

ఈ నవ్వులెందుకో  పండటంలేదు

ఆ పాటలన్నీ మధువును నింపుకోలేదు

నా రహస్యాలన్నీ రెక్కలు తొడగలేదు

ఆ తారలన్నీ తళుకులీనడంలేదు

నా కలలన్నింటిలో ఆ.. ఒక్క నేనే

ఓ ప్రియా! భావోన్మాదంలో 

నీవే నేనై ధ్వనిస్తున్నా

నువ్వు లేక  యేది పరిపూర్ణం కాదు.

********

నడక


మరువం లేదు మందారం లేదు 

మాట లేదు మౌనం కాదు

ప్రళయం లేదు ప్రేమ లేదు 

జ్ఞాపకం లేదు వైరాగ్యం కాదు

ఉన్నది ఒక్కటే! 

స్వాభావికమైన నడక. 

---

ఆంగ్ల అనువాదం


 Dhvani / The Resonance - Vanaja Tatineni*


Those buds are not blooming,

These smiles refuse to ripen,

Those songs have not filled with honey,

My secrets have not grown wings,

Those stars are not sparkling.

In all my dreams... it is only I.

Oh my love! In this frenzy of feelings,

It is you resonating as me.

Without you, nothing is complete.


Nadaka / The Walk - Vanaja Tatineni*


No jasmines, no hibiscus,

No words, yet not silence,

No deluge, no love,

No memories, yet not detachment.

There is only one thing!

A natural, effortless walk.


---

24, సెప్టెంబర్ 2026, గురువారం

మణి పూస


 మణి పూస   - వనజ తాతినేని. 


ఇతరుల అనుభవాలు నుండి 

 సంప్రోక్షించి

నా అనుభవాలు నుండి  వొడపోసి

 ప్రేమార్హతను నిర్ణయిస్తాను తప్ప

గాలివాటంగా వచ్చే ప్రేమను 

నేను అంగీకరించనని నీకు తెలుసుకదా! 

తొలి ప్రేమలోని గుడ్డితనం నన్నంటదు.

ముత్యాలసరం లోని మణిపూస నా ప్రేమ. 

జారిపోతే ముడివేయలేను.


***********

ఆంగ్ల అనువాదం


 Mani Poosa / The Central Gem - Vanaja Tatineni*


Sprinkling from others' experiences,

Sieving through my own experiences,

I decide who deserves my love.

You know I will never accept

A love that comes casually like a passing breeze!

The blindness of first love does not touch me.

My love is the central gem in a pearl necklace.

If it slips away, I cannot restring it.


24/09/2026. 09:30 am.


23, సెప్టెంబర్ 2026, బుధవారం

కవితా వర్షం

 


విద్య


పువ్వును మొగ్గగా వున్నప్పుడో

వడిలి పోయినప్పుడో 

నేల రాలినప్పుడో చూసి ప్రేమించలేను 

మహా అయితే.. 

ఆసక్తిగానో జాలిగానో చూస్తుంటాను


నిన్ను అలా కానేకాదు

నీ బాల్యాన్ని యవ్వనాన్ని వృద్ధాప్యాన్ని

నీ లోపాలతో సహా సర్వకాలాల్లో

నిన్ను నిన్నుగా మిన్నగా 

ప్రేమించడమే నాకు తెలిసిన విద్య. 


********


వాన 


నీ తలపుల వానలో 

తడిసి ముద్ధయ్యాను.

వాన ఎప్పుడు వచ్చి 

మిగతా వాటిని తడిపి 

వెళ్ళిందో నాకెలా తెలుసు

కవితా వర్షంలో మళ్ళీ తడుస్తున్నాను. 



ఆంగ్ల అనువాదంలో… 


 Vidya / The Art I Know*


I cannot love a flower

When it is still a bud,

Or when it has withered,

Or fallen to the ground.

At most, I look at it

With curiosity or pity.


But not you, never like that.

Your childhood, your youth, your old age,

With all your flaws, in all times,

To love you as you are,

And even more than you are,

That is the only art I know.



Vaana / Rain*


Drenched I am,

In the rain of your thoughts.

How would I know

When the real rain came,

Drenched everything else,

And left?

Again I am drenched,

Now in a shower of poems.


23/10/2026. 10:05 am

_ వనజ తాతినేని. 


కాలము - ప్రేమ

 కాలము - ప్రేమ


క్షణికమైన కోపానికి నిరంతరం 

బానిసగా నిలిచిన దౌష్ట్యానికి 

అఖండమైన గోపురాలు

నేలమట్టమైనప్పుడు


శిధిలమై సమాధిపైన యుగపు 

గర్వకారణాలైన విలువలు

క్రూరమైన కాల హస్తాన నలిగి

వికృతమవడం నే చూసినప్పుడు 


ఆకలిగొన్న సాగరుని కెరటాలు

తీరాన్ని కబళింప చూస్తుంటే

అంచులు అఖండాన్నే గెలుస్తూ

నష్టాన్ని విలువతో విలువను నష్టంతో

వృద్ధి చేస్తూ నిరంతరం పోరాటం 


పరిస్థితులు స్థానాలను మార్చుకోవడం

స్థితిక్షీణతలోకలగాపులగంగా 

కలిసిపోవడం నేను చూసినప్పుడు


నా ప్రేమను నానుండి విడదీసే

సమయం రాబోతుందని

గతాన్ని అలా నెమరువేయమని

నేర్పింది నాకు సర్వనాశనం 


కానీ.. 

కాంక్షించేదాన్నివొదులుకునే

రోజు వస్తుందనే రోదన మినహా

కోరుకునే స్వాతంత్ర్యం ఇవ్వని

ఈ వేదాంతం చావుతో సమానం 



(షేక్స్పియర్  Time And Love కి స్వేచ్ఛానువాదం)

21, సెప్టెంబర్ 2026, సోమవారం

మినీ కవితలు

 



అమూల్యం 


కోర్కెల చిట్టా చాలా పెద్దది 

ఖరీదు బహు ప్రియం

అమూల్యమైన నీ ప్రేమ

వాటిని విసిరి పడేయించింది చెత్తబుట్టలో. 


******* 

రహస్యం


దొరకని వాటిని దొరికే వాటితో

అందని వాటిని అందే వాటితో

పోల్చుకోవడం మనిషి నైజం

నిన్ను నాతో పోల్చుకున్నాను

ఓ మెట్టు దిగి అందడంలో

రహస్యం నీకు తెలుసులే! 


ఆంగ్ల అనువాదం


. Amulyam / Priceless


The list of desires is very long,

And very expensive too.

Your priceless love

Made me throw them all into the dustbin.


Rahasyam / The Secret


To compare the unattainable with the attainable,

The unreachable with the reachable,

Is human nature.

I compared you with myself.

That you come down a step to reach me,

You know the secret, don't you!