7, డిసెంబర్ 2010, మంగళవారం

నేను ఎవరిని

Posted by Picasa నేను .. ఎవరిని
ఎంత .. సంక్లిష్టత. .
ఎంత ... అయిష్టత...
మస్తిష్కంని.. మదించి
హృదయంతరాళ్ళలో
శోధన మొదలిడి
ఎవరికి వారు
విశ్లేషించుకోవాల్సిన స్థితి
ఆత్మ సమీక్ష రాసుకోవాల్సిన పరిస్థితి
సహజ ప్రసవాలు..
అనాగరికం అయినచోట
తిది.. వార.. నక్షత్రాలతో..సహా..
మంచి..మాత్రమే ఎంచుకుని
భూమి మీదకి వచ్చిన
మానవ వారసుడిని...
సముద్రాలని  మించిన  అలజడితో
అశాంతితో .. మృగ తృష్ణతో
అలమటిస్తున్న ఆశలజీవిని ..
ఎన్నో లోటులను  ..
భర్తీ చేసుకుంటూ..
దివారాత్రాలు..
రుద్రకులై.. పరిశ్రమిస్తూ..
దేహాల్ని, దెండాలని    
ఉతికి.. ఆరేసుకోవాలనుకునే ..
తపనజీవిని..
వెలుగురేఖలవైపు ..
పయనిస్తామనుకుంటూ..
చీకటి గుహల్లోకి..
పయనించే..  తిరోగామిని..
ఎక్కడో.. చిరునామా ..
మిగిలి ఉందనుకున్న ..
మానవత్వపు  ఉనికిని..