30, డిసెంబర్ 2010, గురువారం

చాలా..పాటలు మనలోని కాల్పనిక భావనలకి..రూపాలేమో!కొన్ని పాటలు వినడానికి బాగుంటాయి.. కొన్ని పాటలు.. చూడటానికి.. బాగుంటాయి..వినడానికి,చూడటానికి    సాహిత్యపరంగా  కూడా మేలేన్నికగల పాట.. నువ్వు వస్తావని.. చిత్రంలో..  కొమ్మ కొమ్మ.. విన్నారమ్మా  ..కోయిల వస్తుంది.. అనే..పాట.

 ఆపాట.. నాకు ఇష్టమైన పాటలలో.. టాప్ ౩ గా.. చెప్పుకుంటాను..
ఈ..పాట.. సాహిత్యం.  ఈ.ఎస్.  మూర్తి.
సంగీతం.. ఎస్.ఎ .రాజ్ కుమార్.
ఎందుకో.. చెప్పలేను.. ఈ..పాటంటే.. చాలా చాలా చాలా ఇష్టం.
నేను తెలిసిన వారందరికీ ఈ పాట వినగానే నేనే గుర్తుకు వస్తానని చెపుతారు..
ఈ..పాట వస్తున్నా ఏదైనా.. ఛానల్ లో మూవీ.. వస్తున్నా నాకు  కాల్ చేసి మరీ.. చెపుతారు.
ఈ..పాట సాహిత్యం.. కారణం కావచ్చు..

నా.. అంతరాలలో దాగి ఉన్న భావాన్ని..బలంగా  సూచిస్తుంది.. బహుశా .. అది తీరని కోరిక
కావచ్చు
చాలా పాటలు మనలోని  కాల్పనిక  భావనలకి..రూపాలేమో.!
అందుకే.. పాటలు మనలని.. ఆకర్షిస్తాయి. కాసేపైనా మనని  కలల్లో.. విహరింపజేస్తాయి అనుకుంటాను నేను..

ఇక పాట విషయానికి వస్తే..  ప్రకృతిలోని.. వస్తువులతోనే.. పాట సాహిత్యం ఆసాంతం.. సాగుతుంది.. బహుశా.. రచయిత.. భావకవిత్వ ప్రేమికుడేమో.!.

ఇక ఎస్. ఏ రాజ్ కుమార్  సంగీతం.. బాగా అలరిస్తుంది.. ఇళయరాజా.- కీరవాణి ల తర్వాత  మణిశర్మతో..  దీటుగా.. స్వరాలు.. అందించిన..ఘనత. కానీ.. అన్ని పాటలకి. ఎక్కడో   ట్యూన్స్ కలుస్తుంటాయి..
అది అప్రస్తుతమనుకోండి. పాట  సాహిత్యం..ఇదిగోండి...

కొమ్మ.. కొమ్మా.. విన్నారమ్మ.. కోయిల వస్తుంది..
వస్తూ.. వస్తూ.. తనతో.. వెన్నెల వెలుగులు తెస్తుంది..
ఏమమ్మా.. మరుమల్లి.. తోరణాలు కడతావా..
చిలకమ్మా.. యిదురేగి.. స్వాగతాలు చెబుతావా..
పూల పొదరిల్లె .. రా..రమ్మంది..
విన్నానమ్మా ! తీయని వేణువు రమ్మని పిలుపులని..
చూసానమ్మా.. స్వాగతమంటూ.. తెరచిన తలుపుల్ని.. (కొ)
పగలు రాత్రి అంటూ.. తేడా లేనేలేని..
పసిపాప నవ్వులని చూడని..
తోడు..నీడ నువ్వై.. నాతో.. నడిచే.. నీతో..
ఏనాటి రుణముందో..అడగనీ..
చేదు చేదు కలలన్నీ..కరిగి తేనె వరదవని..
కానుకైన  స్నేహాన్ని గుండెలోన దాచుకుని.
ప్రతి జన్మకి.. ఈ..నేస్తమే.. కావాలని..
కోరుకుంటానమ్మ దేవుళ్ళని   (కొ)

ఇదిగో.. నిన్నే..అంటూ.. ప్రేమే.. ఎదురై వస్తే..
ఏ ..పూలు.. తేవాలి పూజకి..
నీతో..జతగా.. ఉండే వరమే..నువ్వే ఇస్తే..
ఇంకేమి కావాలి జన్మకి..
మచ్చ లేని చంద్రుడిని మాటరాక చూస్తున్నా..
వరుసకాని బంధువుని  చొరవచేసి.. అంటున్నా..
ఇంకెప్పుడు ఒంటరినని.. అనరాదని..
నీకు సొంతం అంటే.. నేనేనని.. (కొ)

ఇదండీ.. సాహిత్యం..

నాగార్జున సిమ్రాన్ జంట.. కళ్ళల్లో.. కాపురం పెట్టేస్తుంది.. చూసినంత సేపు.. కూడా.. ఈ..పాటలో.. హంపీ.. మండపాన్ని.. చూడవచ్చు..ఇంకొక మాట చెప్పడం మరచాను. జెమిని మ్యూజిక్  చానల్ కి.. నేను.. ఎప్పుడు కాల్ చేసినా.. ఆ రోజు ఆ పాట ప్లే.. అవ్వకుండా..ఉంటె కనుక  రెడీగా  ఉంటారు..ప్లే చేసేందుకు కి. నాకు ఈ పాట  అంటే ..అంత ఇష్టమని  పేరు పడిపోయిన్దండీ.. అందుకే.. నా టేస్ట్  పై నమ్మకం కల్గితే.. మీరు వినండి.. లేక పోతే.. వదిలేయండి.. ప్లీజ్!  అలాటి స్నేహం తోడు ఉండాలని కోరుకొండీ.! వోదార్పుగా ,నిబ్బరంగా.. ఉంటారు.. ఇది నిజం.. సుమండీ..!