7, డిసెంబర్ 2010, మంగళవారం

స్వప్న లోకం

                                                                                                                                                                                                                                                                                                            
స్వప్న లోకం

స్తబ్దత లోను అతి నిశ్శబ్ద భావ సంచనల రూపమా
 చేతనతో నన్ను నేను దర్శించుకునేలా చేసే మాయా దర్పణ సౌధమా 
అనిశ్చిత  జీవితాల అంతులేని సందిగ్ధతల క్లిష్ట  రూపమా

జీవనకాసారంలో నేడు - రేపు మధ్య సంధిగా నిలిచిన మగతలో..
మరో లోకాన్ని చూపిన నేస్తమా 


అచేతనావస్థలో.. గత స్మృతులను  రేపిన స్వప్నమా
లౌకిక స్వప్నాలతో అలౌకిక ఆనందం మిగిల్చిన తేజమా..

కోటి ఊహలతో మనోరధంపై ఊరేగానో
కోర్కెల  రెక్కలు గట్టుకుని అంబరాన
స్వేచ్ఛా విహంగమై  విహరించానో

కలతలెన్నో మరిపించావు..
కలవరము కల్గించావు
నీలో నేను కరగని నాడు
నేనొక విగత జీవినో నిశాచరినో
అందుకే   అయ్యావు  నువ్వే నాలోకం
నాదైన లోకం స్వప్నలోకం

స్వప్న సౌధంలో  నివశిస్తూ అందరు
స్వప్న సాకారానికి  ప్రయత్నిస్తూ  కొందఱు 
జీవితమంతా  స్వాప్నికమై సాగుతూ  మరి కొందఱు 
స్వప్నం  బ్రాంతిగా భావించిన  ఎందఱో 

ఇందరికి ఉందిక్కడ  లిఖించలేని చిరునామా
ఓ జీవితకాల  నమూనా !


3 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

మీరిన్ని మంచి కవితలు రాసారా..
ఈ కవిత కూడా చాలా బాగుందండి వనజగారు. అన్ని చదువుతాను వీలు చూసుకుని!

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీరు professional అండి.అంటే నా ఉద్దేశం అత్యున్నత ప్రమాణాలతో వ్రాస్తారు .నా స్వప్నం కంటే మీ స్వప్నలోకం ఇంకా బాగుంది.మీ కల చూసినతర్వాత మరల నాకు వ్రాద్దామనిపిస్తుంది. "అనిచ్చిత జీవితాల అంతులేని సందిగ్ధతల క్లిష్ట రూపమా.."మంచి ప్రయోగం .మీ మిత్రమండలి చూశాను.మీ బ్లాగులన్ని చదివాను.మంచిప్రయోగాలు చేస్తున్నారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Thank you very much.. Vennela.

@ THANK YOU VERY MUCH... Ravi shekar gaaru.