31, డిసెంబర్ 2010, శుక్రవారం

శుభాకాంక్షలు

ఆత్మ దీపో భవ 
 ఈ..ఏడాది  ఆఖరున మీ అందరి మధ్యన విరిసిన  సుమాన్ని  నేను

 ఎన్నో ఆశలతో ఎన్నోఆకాంక్షల తో
ఎంతో నేర్చుకోవాలన్న తపనతో
ఎన్నోఆలోచలని పంచుకోవాలన్న ఆరాటంతో
పరుగులు తీస్తున్నఈ పయనంలో.

 మీ అందరి సలహాలు సూచనలు తీసుకుని
 వనజవనమాలి ఎదిగి ఒదగాలని   ఆకాంక్షించుతూ

ప్రతి ఒక్కరు ఆత్మదీపోభవగా ఎదగాలని కోరుకుంటూ..

కాలం కౌగిలిలో   మనమందరం బందీలం
క్షణమైనా మనఃస్పూర్తిగా శ్వాసించి
ఆశించి భాసించి మానవత్వ పరిమళా లని
మన ముద్రలని   సింధువులో  బిందువుగా
మిగిల్చి  వెళ్లేందుకు కృషి  చేసేందుకే

ఈ కాలం మనకి రేపుని ఇచ్చిందని భావించాలని మనవి చేస్తూ

మిత్రులారా! మీ అందరికి హృదయపూర్వక నూతన సంవత్చర  శుభాకాంక్షలు