27, డిసెంబర్ 2010, సోమవారం

విదేశాలకి వెళ్లి..మన బ్లాగ్ ఫ్రెండ్  వెలిబుచ్చిన అభిప్రాయం  చూసాను.. చాలా.. మంది తల్లితండ్రులకు  విదేశాలకి వెళ్లి.. డబ్బు సంపాదించడమే.. ద్యేయం కాదు..  వారి వారి కాలంలో.. చేయలేని  పనులు, రాని అవకాశాలు వారి బిడ్డలకి.. లభిస్తున్నాయి. అందుకు సంతోషమే కదా !   అందరు చదువు   విలువ తెలుసుకుని చదువుకుని వ్యక్తి అభివృద్దితో పాటు.. దేశ అబివ్రుద్దిని కోరుకోవడం తప్పుకాదు కదా !  అలా.. నడుచుకోమని సాక్షాత్ మాజీ ప్రధాని  గారే సలహా.. ఇచ్చారు కూడా. 

 మన దేశంలో.. సాధించిన  అభివృద్ధి కన్నా.. విదేశాలలో..  మన నైపుణ్యాన్ని.. అమ్మి.. వారికి మంచి.. అభివృద్ధిని సాధించిపెట్టి.. మాతృదేశ విజయకేతనంని  ఎగురవేస్తుంటే.. మనం గొప్పగా.. చప్పట్లు కొట్టుకోవడంలేదూ ! ఈ.. దేశంలో.. అబివృద్ధి.. కుంటు పడుతూ  ఉందంటే  కారణం.  కుల మత బేధాలు..ఓటు  బ్యాంకు రాజకీయాలు, వేళ్ళూనుకున్న  అవినీతి అని తెలియడం లేదు?  అవినీతిని నిర్మూలించడం ఎవరివల్ల సాద్యం..!?

  వేలంవెర్రి చదువులు వల్ల తగ్గిన  ఉపాధి అవకాశాలు. నిరుద్యోగం తో  నిరాశ నిసృహలతో.. యువత  కొట్టు మిట్టాడుతూ.. విదేశాలకు  పయనమవుతున్నారు. పట్టభద్రులైన.. కొంత మంది యువకులు వారి వారి నైపుణ్యం తో.. పరిశ్రమలని.. స్థాపించి.. మరికొంతమందికి.. ఉపాధి అవకాశాలు.. కల్పించాలనే ఉత్సాహం    ఉన్నా  కూడా ..  వారికి.. తగిన  రీతిలో.. ప్రోత్సాహం లబించడం లేదు.. అడుగడుగునా.. నిరాశ.  పరిశ్రమల స్థాపనకి  లభించే  అనుమతి నుండి  కేటాయించే..  భూమి దగ్గరనుండి..  కరంటు,నీరు.. యంత్రసామాగ్రి.  వరకు.. అడుగడుగునా ఆంక్షలు.  అధికారుల లంచగొండితనం తో  విసిగి వేసారిన యువత ఇక్కడ ఏం చేయాలో తోచక  విదేశాలకి పయనం అవుతున్నారు.   విదేశాలలో.. చదువుకోవడానికి  మాత్రం  అడగగానే లక్షలకి లక్షలు లోనులు ఇచ్చే.. బ్యాంక్లు.. పరిశ్రమల స్థాపనికి.. ఎన్నో రూల్స్.. పెట్టడం గమనించవచ్చు.

ప్రభుత్వాలు.. విదేశి సంస్థలకి.. ఆహ్వానం  పలకడం,. కార్పోరేటులకి .. కొంగు  బంగారంగా.. మారడం..  వీటన్నిటి మద్య యువత  ఏమి   చేయాలి?    పరాయిచోట ..  అదిక చాకిరి  చేస్తూ.. విదేశీ ద్రవ్యంతో.. స్వదేశంలో.. అభివృద్ధి.. చెందామను కుంటున్నారు.  పిల్లలని.. అక్కడికి పంపిన తల్లిదండ్రులు.. కంటి మీద కునుకు లేకుండ.. వారి క్షేమం కోసం  నిత్యం  ఆరాటపడుతున్నారు..

 ఈ.. దేశంలో.. బ్రతకడం ఎంత కష్టతరం  అయిందో.. మండే.. నిత్యావసర ధరలు.. చూస్తే.. అర్ధమవడంలేదూ ..!  విద్యావిధానాలు  మారాలి, ఉపాధి  అవకాశాలు  పెరగాలి.  చిత్త  శుద్ధి  లేని  ప్రభుత్వాలని.. ఎన్నుకుని.. ప్రజలు.. పాట్లు పడుతూ..  దేశ మాత ని.. కీర్తించుకుంటూ.. గుడ్డెద్దు చేలోపడి మేస్తూ.. వెళ్ళినట్లు..  పిల్లల..  అభివృద్ధి కాంచుతూ.. త్రుప్తిపడటం మినహా..  ఈ.. వ్యవస్థని ప్రక్షాళన చేయడం  ఎవరి తరం.. చెప్పండి!   ప్రపంచమే.. ఓ.. కుటీరం.. విశ్వజనీయ భావన పెంపొందించు కున్నామని  తృప్తి పడుతూ..  సంతోషంగా ఉందామని..  చాలా అసహ్యంగా  మొన్ననే.. జోక్.. చేసుకున్నాం  కూడా ! క్షమించాలి..  ఫ్రెండ్స్..  అంత కన్నా ఏం చేయాలో తెలియక .  మాత్రమే !

2 వ్యాఖ్యలు:

madhu చెప్పారు...

Post Chala buagundhi...Mee avagahana Perfect...Meelanati vaallu blogs dwara samaja maarpu ku margalu soochistu jana jagruthaniki ... krushi cheyyali.

తెలుగుకళ చెప్పారు...

వనజ గారికి బ్లాగ్ లోకానికి స్వాగతం !
మంచి భావుకత, సామాజిక అవగాహన, బాధ్యత గల మహిళలు కోకొల్లలుగా ఉన్న ఈ అందమైన లోకంలోకి తెల్లంచు నల్లచీర కట్టిన తెలుగు ఆడపడుచులాగా (మీ బ్లాగ్ డిజైన్ సుమండీ...) ౨౦౧౦ చివర్లో వచ్చారు.
మీ సాహిత్యాభిలాష .. సంగీతపిపాస తీర్చుకునేందుకు ... బ్లాగరులను చక్కని టపాలతో అలరించేందుకు...... ౨౦౧౧ గొప్ప వేదిక కావాలని, నిరంతరాయంగా మీ బ్లాగ్ప్రయాణం కొనసాగాలని ఆకాంక్షిస్తూ.... నూతన సంవత్సర శుభాకాంక్షలతో.......
తెలుగుకళ - పద్మకళ