7, డిసెంబర్ 2010, మంగళవారం

ప్రేమ చిరునామా

Posted by Picasaప్రేమా ..ఓ' ప్రేమా!!
 ఏదీ    నీ .. చిరునామా.!!!
 మనోవేదనే నీకు ప్రతి రూపమా.!
 అనుభూతిలో  కనిపించే అంతరంగమా!
 మౌనంగా  కుమలడమే నీ.. ఉనికికి సాక్ష్యమా!
 కాలమే కదా.. నీకు ఎన్నడూ .మిగిలే నేస్తం..
అందుకే చిరంజీవివి అయినావు కదా!
ఇలలో నీకు  సాటి కలదా.?
శ్వాస బ్రహ్మ  సృష్టి అయితే..
ప్రతి శ్వాసలో.. మమేకం అవుతావు.
విశ్వామిత్రుని  ప్రతి సృష్టిలో  తేలియాడిస్తావు..
తెలియని ఆవేదనని రగిలిస్తావు..
పొగమంచు వలె కమ్మేస్తావు. .
తెలియని ఆ అనుభూతిలోనే ..
మనసంతా అక్రమిస్తావు..
కనిపించని రూపంతో.. కనిపించే రూపాలలో..
ఎన్నో మార్పులకు శ్రీకారం  చుడతావు ..
బడబాగ్నిలా  దహించి వేస్తావు..
ఏ కొందరికో అర్ధమవుతావు...
అర్ధమైన ఏ కొందరికో..
హృదయంలో.. బందీవి.. అవుతావు...
నిన్ను గెలిపించి,ఓడించి తాము గెలుస్తారు..
ఎందరో..చరిత్రహీనులై ..
పర్యాయపదమైన బ్రాంతిలో..
చిత్తు  చిత్తుగా ఓడి.. కాలగర్భంలో..
తమ  యాత్రని . ముగిస్తారు.
అయినా.. నీ.. జైత్రయాత్ర
సాగుతూనే ఉంటుంది.. అప్రతిహతంగా..