27, డిసెంబర్ 2010, సోమవారం

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని..తరిమేవాళ్ళని హితులగా తలచి ముందు కెల్లాలని


Posted by Picasa ఐ యామ్ అల్ల్వేస్ విత్ యు..
ఇలా.. మీతో.. అనేవారు ఉంటారు కదా!
ఇప్పుడు..ఈ పాట ఏమంటుందో చూడండీ !

చీకటితో వెలుగే చెప్పెను .. నేనున్నానని.. ఎంతో.. స్పూర్తికరమైన పాట.

నా.. లైఫ్ టైం.. ఫేవరేట్ సాంగ్..
చంద్రబోస్.. సాహిత్యం..
చాలా.. లైట్ లైట్.. వర్డ్స్ తో.. అనంత మైన అర్ధాన్ని.. చెప్పిన పాట.

నాకు.. చాలా.. నచ్చిన పాట.

ఎమ్. ఎమ్. కీరవాణి.. స్వీయ సంగీతంలో సునీత తో.. కలసి పాడిన పాట.

కథా.. పరంగా.. మొదటి చరణం .. ఎవరైనా ఎదురు దెబ్బలు.. తింటూ.. ఎదగాలని.. స్ఫూర్తి కల్గిస్తూ.. సాగితే.. ఆ.. వ్యక్తే.. రెండో చరణంలో.. ఇంకొకరికి.. వోధార్పునిస్తూ .. నేనున్నానని .. అండగా.. నిలబడటం.. వ్యక్తి పరిణితికి.. చిహ్నంగా.. నిలుస్తూ.. మనిషికి.. ఇంతకన్నా.. ఇంకా.. ఏమి కావాలి అనిపిస్తుంది..

ఎవరు వింటున్నా.. వారి మనసుకి.. అలాటి అండ -దండ ఉంటే బాగుండును అనిపించే..పాట.

చీకటితో.. వెలుగే చెప్పెను.. నేనున్నానని..
ఓటమితో.. గెలుపే.. చెప్పెను నేనున్నానని..
నేనున్నానని .. నీకేంకాదని.. నిన్నటిరాతని మార్చేస్తానని.. (చీ)

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని..
తరిమేవాళ్ళని హితులగా తలచి ముందు కెల్లాలని..

కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని..
కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి... కాంతిని పంచాలని..

గుండెతో.. ధైర్యం చెప్పెను..
చూపుతో మార్గం చెప్పెను..
అడుగుతో గమ్యం చెప్పెను..
నేనున్నాని . నేనున్నాని . నీకేంకాదని ..
నిన్నటి రాతని మార్చేస్తావని..

ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని..
అందరు ఉన్నా ఆప్తుడు నీవై.. చేరువయ్యావని..
జన్మలకేరుగని అనురాగాన్ని పంచుతున్నావని..
జన్మలుచాలని.. అనుబంధాన్ని.. పెంచుతున్నావని.. ..

శ్వాసతో.. శ్వాసే చెప్పెను..
మనసుతో.. మనసే.. చెప్పెను..
ప్రశ్నతో.. బదులే చెప్పెను..
నేనున్నానని.. నేనున్నానని.. నీకేంకాదని..
నిన్నటి రాతని మార్చేస్తానని.. (చీ)..

వండర్ ఫుల్ .. సాంగ్ కదా.. ప్లూట్ & కీరవాణి.. వయోలిన్.. వాయిద్యం.. మనసుని దోచేస్తుంది..
ఎంతయినా.. మరకతమణి.. స్పెషల్ కదా.. ! ఎన్ని సార్లు విన్నా.. వినాలనిపించదు..

కానీ.. విన్నప్పుడల్లా.. అబ్బ.. ఎంత మంచి పాట అన్పించక మానదు.. మీరూ.. వినండీ..

ఇంతకు.. ముందు.. ఎందరో...... ఈ పాట గురించి.. వాళ్ళ ఫీలింగ్ పంచుకుని ఉండొచ్చు..

నేను.. ఏమైనా.. కొత్తగా.. చెప్పానా! మీరే చెప్పండి...ప్లీజ్!




1 కామెంట్‌:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ..
నాకు కూడా ఈ పాట చాలా ఇష్టమండీ.. ఈ పోస్ట్ ఈ రోజే చూశాను

"తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని..
తరిమేవాళ్ళని హితులగా తలచి ముందు కెల్లాలని..

కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని..
కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి... కాంతి పంచాలని.."

ఈ లైన్స్ మరీ మరీ ఇష్టం

నేను కూడా ఈ పాటను గురించి నా బ్లాగ్ లో రాశాను , చూడండి..

http://raji-rajiworld.blogspot.in/2011/05/blog-post_22.html