మధురమైన కలలు కనడం ఆ కలలు నిజం అయ్యేవరకు శ్రమపడటంలో ఎంత ఆనందం ఉంటుందో .. అది అనుభవంలోకి వస్తే కానీ చెప్పలేము.
నాకు ఈ పాటంటే చాలా చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే చెప్పాలంటే మాటలు చాలవు. ఆకాశమంత అంటే.. కోతలు కోస్తున్నాను అనుకుంటారేమో! నిజం .. అంత ఇష్టం.
ఈ పాట “జ్వాల” చిత్రం లో వుంది. కధానాయిక “రాధిక” పై చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఆమె జీవితం ఓ విషాద సంచిక
కానీ.. ఈ పాటలో భావం గాలివాటు బతుకులో ఎదురొచ్చిన ఆపదల్లో ఆదుకుని ఆమెకు క్రొత్త జీవితాన్ని అందిస్తే ఆ పేద మనసు.. అతనిలో కలసి కరిగేందుకు కలలు కంటూ ఆ ఆశ తోనే జీవించడం ఏ మనిషికైనా ఎంత మధురమో ఆమె మనసు విప్పి చెపుతుంది.
ఆ పేద మనసు ఏ కాన్కలు ఇవ్వలేనంటూ నీకు నేను బానిసై.. నాకు నువ్వు బాసటై సాగిపోయే వరం చాలంటుంది..
కలకూజితుం “ఎస్ .జానకి” గళ మాధుర్యం “ఇళయరాజా” సంగీతం ఈ పాటకి వన్నె తెచ్చాయి..
పదకర్త .. మైలవరపు గోపి. ఎన్నో మంచి పాటలు వ్రాసారు ఆయన. మరిన్ని పాటలు మరలా పరిచయం చేస్తానులెండి.
“అబ్బ!ఎంత మంచి రైటర్ ఈయన” అని అంటారు చూడండి.
70 లలో, 80 లలో 90 లలో ఎన్నో మంచి పాటలు ఉన్నాయి.. పంచుకునేందుకు ఎవరైనా ఉంటే తిండి.. నిద్ర .. మానేసి మరీ చెపుతాను. అన్నట్లు నేను నిద్ర తర్వాత పాటలు వినడంలోనే ఎక్కువ సమయం గడచిపోతుంది మరి.
ఈ పాట సాహిత్యం ..
ఏవేవో కలలు కన్నాను మదిలో
మౌన వేణువై విరహ వీణ నై
స్వామీ గుడికి చేరు వేళలో ..
ఏవేవో కలలు కన్నాను మదిలో
సుడి గాలులతో వెలిగే దీపం ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో ఇదే రుణానుబంధమో (2)
నీకునేను బానిసై నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరముగా
ఏవేవో కలలు కన్నాను మదిలో
నా.. కన్నులలో వెలుగై నిలిచి సిరి వెన్నెలగా బ్రతుకే మలిచి
నిట్టూర్పు గొన్న గుండెకి ఓదార్పు చూపినావు రా..
నాది పేద మనసురా.. కాన్కలీయలేనురా..
కనుల నీరే కాన్చరా..
ఎంత బాగుంటుందో.. కలలాగా.. విషాదం కదా .?.
అందులోనూ ఆనందమే నాకు. ఈ లింక్ లో ఏవేవో కలలు కన్నాను మీరు వినండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి