24, డిసెంబర్ 2010, శుక్రవారం

సంగీత రసజ్ఞత మాత్రమే కాదు..సాహిత్య రమణీయత తోడైతే అమృతం కన్నా.. కావ్యం మధురిమ మిన్న

Posted by Picasaతెలుగు .. భక్తి.. రస చిత్రాలోలో.. మకుటాయ మయంగా.. విలసిల్లె.. చిత్రం.. అన్నమయ్య.
సంకీర్తనాచార్యుడిగా.. మనకి.. అపూర్వ పెన్నిధి..అందించిన..స్వరకర్త..పదకర్త..

ఆయన జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం.. ఒక.. ట్రెండ్ సెట్టర్..  
నాగార్జునకి .. ఒక  కలికితురాయిగా..మిగిలిన  చిత్రం.

ఈ.. చిత్రం .. విజయానికి ఎమ్  .ఎమ్ . కీరవాణి.. సంగీతం   పెద్ద  ఎస్సెట్ ..మరకత మణి ..అద్భుత  స్వరకల్పన  లోనే .. ఆ  చిత్రం  60 % ..  విజయం పొందింది.

 ఇక దర్శకేంద్రుడి ప్రతిభ  ఏలాటిదంటే.. భక్తి రస చిత్రంలో కూడా..  మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా.. దట్టించి.. భక్తి రసంలో.. శృంగార  రసాన్ని  .. ఆవిష్కృతం కావించారు.. కామి కాని మోక్షగామి.. కాదు..  అన్నదానికి  తార్కాణంగా.. మన అన్నమయ్యతో  .. మరధళ్ళతో.. సరససల్లాపాలలో  ముంచి తేలియాడించి.. ఆహా..  ధర్శకేంద్రా!  ఏమి చతురత.. అనిపించారు  .. ఆ.. చిత్రం అంతా.. బాగుంటుంది.

కానీ .. అందులో  .. అన్నిట్లో..నా.. చూపు మాత్రం పదహారు కళ లతో  పాట. 
అక్కడ ఏడుకొండలపై..  స్వామివారికి.. భూసురులు..  షోడపచారములతో పూజాదికాలు .. నిర్వహిస్తుంటే.. ఇక్కడ మన అన్నమయ్య  మరధళ్ళతో..  వారి.. సొగసులకి దాసోహం అయి. వారికీ.. మనసుకి ఇంపైన సేవలు.. చేస్తూ.. మురిపిస్తూ..ఉంటాడు. ఏమి వైయుక్తి కదా!.. సూపర్బ్.. అందుకే.. మనసులో..పట్టం కట్టేసి.. మురిపించి.. మైమరపించింది.  

జీవితంలో.. రక్తి-అనురక్తి.. కలిగి  ఉంటేనే.. భక్తికి.. ముక్తికి. కూడా.. సులభ మార్గం లభిస్తుందని.. చెప్పడం కద్దు కావచ్చు.  అందుకే నా..ఓటు  .. ఈ.. పాటకే.. 

శ్రీ పద్మావతి భూదేవి   సమేతస్య శ్రీ మద్వేంకట నాయకస్య 
నిత్య షోడోపచార   పూజాం కరిష్యే ఆవాహయామి.. 

పదహారు కళలకు  ..  ప్రాణాలైన.. 
నా..ప్రణవ ప్రణయ దేవతలకు.. ఆవాహనం..

ఓం ఆసనం సమర్ప యామి 

పరువాలు హోయలకు పయ్యధలైన  
నా..  ఊహల లలనలకు.. ఊరువుల ఆసనం. 

ఓం..స్నానం సమర్పయామి

చిత్తడి చిరు చెమటలతో.. చిందులోలికే పద్మిని భామనిలకు    
 పన్నీటి  .. స్నానం.

ఓం..గంధం సమర్పయామి  

ఘలం ఘలన నడల వలన అలసిన 
నీ గగన జఘన సొబగులకు  .. శీతల గంధం..  

ఓం..నైవేద్యం సమర్పయామి

రతి వేద వేధ్యులైన రమణులకు.. 
అనుభవైక వేద్యమైన  నైవేద్యం. 

ఓం తాంబూలం సమర్పయామి

నీ..తహతహలకు  తపనలకు.. తాకిళ్ళకు .. 
ఈ.. కొసరు  కొసరు ..తాంబూలం  ..

ఓం సాష్టాంగ వందనం సమర్పయామి 

అనంగ రంగ   భంగిమలకు.. సర్వాంగ చుంబనాల.. వందనం..   

ఆవాహనం,ఆసనం, స్నానం, గంధం, నైవేద్యం, తాంబూలం, వందనం..భక్తికి..రక్తికి.. కూడా. 

నా.. అభిమాన సంగీత దర్శకుడి..స్వర ఝరిలో .. భావ పరంపరలో..తడిసిపోయే  పాట.. మనో.. గళం మధురలు ఊరు. 
సంగీత రసజ్ఞత మాత్రమే కాదు..సాహిత్య రమణీయత తోడైతే ..అమృతం ఎందుకు...!?  అమృతం కన్నా.. కావ్యం .. మధురిమ మిన్న అని తెలిస్తే..
దేవతలు,రాక్షసులు యుద్దాలు మానేసి..కావ్య అమృతాలు  సేవించేవారని.. చతురోక్తి.. నిజం  అయ్యేదేమో మరి.. 

ఇక సరి సరి.. ఈ.. అర్ధ వివరణకి. మరి ..సెలవు.  కవికి..వందనం ..  స్వామి  ..చరణారవింధం..కి..  ఆత్మాభివందనం. ఈ.. సారి.. నవ్య దృష్టితో.. మీరూ..వినండి..   Permalink 


అలాగే చూడండీ..!

1 వ్యాఖ్య:

Avineni Bhaskar / అవినేని భాస్కర్ చెప్పారు...

//మృతం కన్నా.. కావ్యం .. మధురిమ మిన్న అని తెలిస్తే.. దేవతలు,రాక్షసులు యుద్దాలు మానేసి..కావ్య అమృతాలు సేవించేవారని//

వాస్తవమే!

కీరవాణి గారి గురించి మీరన్నది ౧౦౦% నిజం. ఈ చిత్ర విజయంలోనూ, అన్నమయ్యని తెలుగువారికి దగ్గర చెయ్యడంలోనూ కీరవాణి గారి బాగస్వాంయం చాలానే ఉంది.

ఇక్కడ చెప్పిన ఈ గీతం జేకేబి గారు రచించారు.