నాకిష్టమైన పాట ...ఇంకొకటి మీతో.. పంచుకుంటున్నాను. పైన లింక్లో.. ఇచ్చిన పాటని వింటూ ఇది చూడండీ!!!
అయినా ఈ పాట నాకు ఎందుకు.. ఇష్టమో..చెపుతాను ఫ్రెండ్స్.
మేఘసందేశం ... మీకు తెలుసు కదా... దాసరి గారి అపూర్వ దృశ్యకావ్యం..
ఆ సినిమా.. నాకు ఎంత నచ్చిందో చెప్పలేను. వివాహితుడైన ఒక పురుషుడి జీవితంలోకి.. అనుకోని సంఘటనల్లో .. వేరొక స్త్రీ ప్రవేశించడం అందు మూలంగా అతను... కుటుంబం కి దూరం కావడం,అందుకు బార్య సహకరించడం అంతా... ఆసక్తికరం.
అక్కినేని గారి నటనా వైదుష్యం జయసుధ సహజ నటన, జయప్రద...అపూర్వ నటనా సామర్ద్యం.ఎప్పటికి.. ఈ... చిత్రాన్ని తెలుగు సిని కిరీటంలో... మకుటామయంగా భాసిల్లేటట్లు చేసాయి.
జయప్రద నా అభిమాన నటి... అని చెప్పేస్తే చాలా.. తక్కువ అండీ! ఎంత వీరాభిమానిని అంటే 80 లలో... దిన పత్రికలలోనూ,మాస పత్రికలలోనూ, వార పత్రికలలోనూ... ఆమె స్తిల్ల్స్ కనబడితే చాలు దానిని నొక్కేయడం.. శ్రద్ధగా... కత్తిరించి లాంగ్ నోట్ బుక్ లో అతికించి... ఆల్బం చేయడం. దానిని అందరికి.. చూపించి మురిసిపోవడం అదొక పెద్ద ప్రక్రియ. ఒకనాడు.
అవ్వన్నీ నాకు దూరం అయిపోయాయి.ఆ కధ ఇప్పుడు వద్దులెండి, మరోసారి చెపుతాను. అంత ఇష్టమైన జయప్రదపై..చిత్రీకరించిన పాట అండీ ఈ పాట...
ముందు తెలిసెనా ప్రభూ... ఈ మందిరం ఇటుల ఉంచేనా !
మందమతిని.. నీవు వచ్చు మధుర క్షణమేధో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ.!
అందంగా నీ కన్నులకు విందులుగా వాకిటనే (2 )..
సుందర మందార కుంద సుమ దళములు పరువనా
దారిపొడవునా తడిచిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలు
ఎంత భావుకత... అందుకే కృష్ణ శాస్త్రి... కవిత్వమంటే అందరికి పిచ్చి. ప్రేమికులకైతే... మరీ..
ఇక రెండో చరణం .
బ్రతుకంతా ఎదురు చూపు పట్టున్న రానే రావు...
ఎదురగని వేళ వచ్చి ఇట్టే మాయమవుతావు...(2 )
కధలనీయక.. నిమిషం నను వదలిపోక
నిలుపగా నిన్ను పదములు బంధింపలేను
హృదయం సంకెల జేసి... !
ఇలాటి సాహిత్యంతో ఏ మణులు,మాణిక్యాలయినా... దిగదుడుపే.
అందుకే ఈ...పాట అంటే నాకు.. చాలా ఇష్టం.
రమేష్ నాయుడు గారి స్వర కల్పన.,సుశీల గారి గళం... ఒక అనుభూతికి... ప్రాణం పోశాయి.
ఇక భావం విషయానికి వస్తే ప్రియుని రాక కోసమై ఎదురు తెన్నులు చూసే అభిసారికకి..
కబురు కాకరకాయ లేకుండా అతను హటాత్తుగా అడుగిడితే
ముందు తెలిస్తే... ఈ మందిరం ఇట్లా.. ఉంచుతానా! నేను అసలే మందమతిని నీవు వచ్చే మధుర క్షణమేదో... గుర్తించలేకపోయా, తెలిస్తే... ఇంటిని, నన్ను మరికొంత అందంగా... అలంకరించుకోనా ?
నా ఇంటి దారిని రకరకాల పూలతో... అలంకరించనా ! ఆపూల పై... నీ అడుగులే.. పడిన చాలు
నాకు ధన్యత చేకూరును అంటుంది ఆమె . వావ్... ఎంత గ్రేట్ ఫీల్...!
బృతుకంతా ఎదురు చూసిన రావు... ఎప్పుడో వచ్చి అంతలోనే మాయమైతే నిన్ను బంధించడానికి నా.. హృదయం సంకెలలు చేయడం మినహా...(ఎందుకంటే... అతను వివాహితుడు కనుక.)
అందుకే ఈ పాటంటే... ప్రాణం.
నేను వీడియో పాటని లభ్యం కాక జతపరచ లేకపోతున్నాను. వేరే విధంగా వినండీ. ప్లీజ్!! జయప్రద ఎంత అందమైన స్త్రీ నో .. ఆమె పై చిత్రీకరించిన ఈ పాట కూడా అంత అందమైన పాటండీ. ఆమెని దృష్టిలో ఉంచుకుని ఈ పాట వ్రాసి ఉంటారేమో ఆ భావకవి అన్నట్టు ఉంటుంది.
ఏమైనా... పాట పూదోటలో నేను గండు తుమ్మెదని అని చెప్పాను కదా! ఈ పాట మీరు విని భావ సంద్రంలో.. తేలియాడండి .. అందుకే ఈ పాట.
ముందు తెలిసినా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదోకాస్త ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసెనా ప్రభూ!
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
సుందర మందారకుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును
ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదుర రయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
ఎదుర రయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి
ముందు తెలిసెనా ప్రభూ! ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో
కాస్త ముందు తెలిసినా ప్రభూ!
నేను రూపొందించిన వీడియో ని ఇక్కడ చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి