నిన్న ఒక గుర్తు.. నేడు ఒక కల.. రేపు.. ఒక ఆశ . యుగ యుగాలే కాలగర్భంలో.. కలిసిపోతుంటే.. మనిషి ఎంత.. మనిషి తన తరతరాల జ్ఞానాన్ని.. విజ్ఞానాన్ని.. అక్షర రూపంలో.. నిక్షిప్తం చేసుకుని.. కాలం సాగిపోతూనే ఉంది.. కాలంతో .. కవిత్వం పరుగు తీస్తుంది.. కవిత్వంతో.. తరతరాలు.. పరుగులు తీయాలి.. ఈ..నవ కవితా పథంలో. . నేను.. వాస్తవికతకి.. దర్పణం ఈ.. కవిత.
అక్షరశిఖరం
సదృశ్యమైన రూపంతో..
మనల్ని.. ఊరిస్తూ..ఉంటాడు..
అతనొక అక్షర తరంగం..
భావ కెరటాలతో.. మనల్నిముంచెత్తి ..
తనలో మమేకం చేసుకుంటాడు..
అతనొక.. అక్షర సవ్యసాచి.
లోపాలని. వాస్తవాలని పాఠకులపై..
అస్త్రాలుగా .. సంధిస్తాడు
అతనొక అక్షర పిపాసి
తను వ్రాయకుండా..
మనలని చదవనీయకుండా
ఉండనీయ లేడు..
సామాజిక రుగ్మతలని
ఔపాసన పట్టిన అతని కలం
అప్రతిహతంగా. నడక సాగిస్తూనే ఉంటుంది..
అతని అక్షరం ప్రవర్ధమానంగా..
బహుమతుల పల్లకి పై..
ఊరేగుతూనే ఉంటుంది..
అతను మాత్రం ఎన్నటికి వర్ధమాన రచయితగా..
మిగిలిపోతూనే ఉంటాడు...
రోజు కోక ఉత్తమ కథ,
కవిత మద్యం సీసాకి అమ్ముడై..
ఆర్తిగా.. అతనిని హత్తుకుని
సేద తీరుస్తూనే ఉంటుంది..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి