29, డిసెంబర్ 2010, బుధవారం

మువ్వన్నెల మీద ఆన మన బంధం మీద ఆన



పైనున్న  ఈ పిక్. చూస్తుంటే మీ మనసుకి ఏమనిపిస్తుందీ!? 

 అరె  మీరు చెప్పినా  నాకు తెలియదు కదా ! ఫ్రెండ్స్  నేనే.. చెప్పేస్తానులే..ఎంత బాగుంది. ప్రేమ స్నేహం కలయికల్.. తో ఈ..పిక్ అనుకుంటారు కదా!  

 నేను చెప్పబోయే పాట వింటే  మీకు అలానే అనిపిస్తుంది.
 అనిపించకపోతే అది  మీ ఇష్టం అనుకోండి.  ఒక సినిమాలో ఒక పాట హిట్ అయితే అందరు అదే పాట వింటుంటారు. కానీ.. నా చూపు వేరే అని  తర్వాత నేను వినే పాటలని బట్టి అందరూ తీర్మానించుకుని నన్నుపొగిడేసి నాకు కొమ్ములు తగిలిస్తూ ఉంటారు . పెడుతుంటారు నా.. మిత్రబృందం రేడియో వ్యాఖ్యాతలు కూడా !

నాకు బాగా నచ్చిన పాట "సుబాష్ చంద్రబోస్"  చిత్రంలో పాట ను నేను కోరుకుని వింటున్నప్పుడు ఇలాంటి ప్రక్రుతి దృశ్యాలను చూసిన ఆనందమే కల్గుతుంది . 

ఈ పాట సాహిత్యం విన్నాక సాహితీ  ప్రియులకు చంద్రబోస్  కలం వారే..వ్వా  అనిపించక మానదు.

2 వ చరణం ఆఖరిలో "బ్రహ్మ రాత మీద ఆన భరతమాత మీద ఆన మువ్వన్నెల మీద ఆన మన బంధం మీద ఆన నలుపున మనమే గెలుపున మనమే" ఎంత ఉత్కృష్టమైన భావం. 

"పచ్చబొట్టు  మీద ఆన పసుపు కొమ్ము మీద ఆన పరమాత్ముని మీద ఆన పరువాల పైన ఆన"
 ఇలాటి ఉన్నత వాగ్దానాలు వున్నాయి. ఆస్వాదిస్తే మీరు ఆ  భావంలో నుండి బయటపడటం అంత తేలిక కాదు.
ఎన్ని జనమలకైనా ఎంకి నాయుడు బావలు మీరే అవుతారు.. 

"నువ్వు లేక ఉండలేని ప్రాణాల మీద ఆన 
నేను నువ్వే నువ్వు.. నేనే."
 
అంటూ ఎంత గాఢ౦గా   చెప్పడం చాలా బావుంది.  ఇంతలా ఆకట్టుకునేలా  వ్రాయడం అంటే మాటలు కాదు.  హృదయ స్పందనకి అక్షర రూపం కల్పించే కవి కలానికే ఇది  సాద్యం కదా!. పాటల రచయిత చంద్రబోస్ గారికి చాలా చాలా అభినందనలు చెప్పాలి.  ఈ పాటకి స్వర కల్పన 'మణి శర్మ"

వింటూ అలా ప్రపంచాన్ని మర్చి పోవచ్చు. అణువు అణువు రస స్పందనతో ఊగిసలాడక మానదు..

 సాంగ్ రేటింగ్ 5 స్టార్ కి  లిమిట్ పెట్టకుండా ఉంటే నేను 10  స్టార్ రేటింగ్ ఇచ్చేదాన్ని. అంత బాగుంటుంది.

పధం కదిపి నర్తించకుండా ఉండలేరు.

పాట ప్రారంభం  ఒక అందమైన ఎత్తుగడ.

ఇన్ని మంచి గుణాలున్న ఈ పాటని మనం రోజూ వినే పాటల పొదికలో   పెట్టుకోక పోతే అస్సలు  బాగోదు అనిపించింది . రాగా లో లభ్యం . మీరు వినండీ. నేను వింటూనే ఉన్నాననుకోండి.  పాట ఏమిటో.. చెప్పా లేదు కదూ! 

జాజిరి.. జాజిరి.. మావా! ఎన్ని జనమలకైన నువ్వే నాజత మావా.

ఈ పాట విన్నాక "నలుపున మనమే " అనే శీర్షికతో ఒక కథ రాసాను. ప్రచురితం కాలేదు కానీ ..ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. 

పాట సాహిత్యం:

 ఓ మావా ఆ ఓ మావా ఆ
ఓ మై లవు ఓ మై లవు
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి
జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా

పచ్చనాకు మీద ఆన పసుపు కొమ్ము మీద ఆన
పరమాత్ముని మీద ఆన పరువాల మీద ఆన
ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా

జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా
ఓ మై లవు ఓ మై లవు

సుక్కా పొద్దు ఆరతిలో సిరుముద్దు పూజలలో నా సామివి నువ్వే వడి గుడిలో
సల్లాగాలి మేళం లో సరసాల తాళం లో నాదానివి నువ్వే గుండెలలో
హా ఉన్న సొగసు మీద ఆన లేని నడుము మీద ఆన
నువు లేక ఉండలేని ప్రాణాల మీద ఆన నేను నువ్వే నావీ నీవే మావా
ఓ భామా ఆ ఓ భామా ఆ

జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా

కుంకుమబొట్టే నలుపాయే నా కాటుక ఎరుపాయే కరగాలని నీ బిగి కౌగిలిలో
సీకటి సెట్టే సిగురైతే సిగురంతా ఎలుగైతే నిలవాలిక ఎలుగుల సీమలలో
హా బ్రహ్మరాత మీద ఆన భరతమాత మీద ఆన మువ్వన్నెల మీద ఆన
మన బంధం మీద ఆన నలుపులు మనవే గెలుపులు మనవే మావా
ఓ భామా ఆ ఓ భామా ఆ

జాజిరి జాజిరి జాజిరి జాజిరి భామా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత భామా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎన్ని జనమలకైనా నువ్వే నా జత మావా
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా


1 కామెంట్‌:

Shabbu చెప్పారు...

,,,,, మాటలే కాదు, పాటల గురించి కూడా చాలా చక్కగా రాస్తారు,
సూపర్,,,,,,,, Shabbu, Knr