అభిమానం అనేది వెర్రి తలలు వేస్తే మెదడు..ఆలోచించడం ఎందుకు మానేస్తుందో.. నాకు అర్ధమైన సందర్భం ఒకటి.. చెప్పదలచాను.. ఎక్కడైనా ఏమో..నాకు తెలియదు కానీ.. విజయవాడలో చదువుకునే పిల్లలకి చాల మందికి కమ్యూనిటీ పిచ్చి..బాగానే ఉంటుంది.. అది అంతా పిల్లలకి మనసు సరిగా వికశించని దశలో అయితే.. పెద్దలు అర్ధమయ్యే రీతిలో పిల్లలకి చెప్పి వారి మనసుకి కమ్మిన మబ్బుల ని పారద్రోలవచ్చు. కానీ వాళ్ళు..డిగ్రీ స్తాయిలో చదివే పిల్లలే! వారితో మనం వాదించగలమా ? నేను ఇలాగే ఒకసారి మా అబ్బాయి నుండి చాలా తీవ్రమైన..ఒత్తిడిని ఎదుర్కొన్నాను .
అసలు.. ఎనిమిది,తొమ్మిది తరగతులు..చదివేటప్పుడే.. పిల్లలు కమ్యూనిటీల వారిగా గ్రూప్‌లు కడతారని తెలిసి నేను ఆశ్చర్య పోయాను. మా అబ్బాయి.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివేటప్పుడే కొంతమంది పిల్లలతో కలసి గ్రూప్ గా ఉండేవారు. వీళ్ళది.."సి" కమ్యూనిటీ. అంటే..మీదికాదా?అని సందేహించకండి. నాకు అలాటివి నచ్చవు కనుక.. అలా అన్నాను. పిల్లలలో ఇలాటి గ్తూప్ లని ప్రోత్శ హించేది గురువులే అంటే ఆశ్చర్య పడనవసరం లేదు కూడా..!! ఈ.."సి" అనేవాళ్ళు..వేరేవాళ్ళతో గొడవపడి స్కూల్ బయట కొట్టుకున్నారు.విషయం తెలిసాకా.. తప్పు ఎవరిదైనా మా అబ్బాయి ఫ్రెండ్స్ తల్లిదండ్రులు.. మేము కలసి పిల్లలకి..తెలియకుండా మాట్లాడుకుని ఇంటర్మీడియట్ లో.. అందరిని కలవనీయకుండా వేరు వేరు కాలేజెస్ లో జాయిన్ చేసాం. అయినా అక్కడా.. అలాటి..గ్రూప్సే !
పిల్లలతో వాదిస్తే ఎడ్డెం అంటే తెడ్డం అంటారని.. ఎదిఎదగని వారి మనసులని కలుషితం కాకుండా ఉండాలని మౌనం వహించి ఊరుకున్నాం. అంటరానితనం నేరం అని పాట్య పుస్తకాలలో..వెనుక పేజీపై వేసి..మరీ.. చూపిస్తున్నారు.అది చూసి అయినా నేర్చుకోండి.. మనుషులు లో భేదాలు వద్దనే కదా.. అంటే.."అది..మీ కాలం అప్పుడు.. ఇప్పుడు కాదు.. ఎవరి కమ్యునిటీ వారికి కావాలి మీకేం తెలియదు..మీరు ఊర్కోండి.".అని.. అనడం కద్దు . రోజు..ఇలాటి వాదనలతో..తల బొప్పికట్టడం అటుంచి ఏం గొడవలు కొని తెచ్చుకుంటారో..అని భయం. ఎలాగోలా ఇంటర్ మీడియట్ హాస్టల్ చదువు కనుక గొడవలు లేకుండా పూర్తి అయింది.కొంత మంది నాన్..సి.లతో..మా అబ్బాయి..ఫ్రెండ్ షిప్ చేశాక హమ్మయ్య అనుకున్నాను..
తర్వాత ఇంజినీరింగ్ కాలేజ్ లో మళ్లీ మొదలు.
విజయవాడ లోనే.. "సి" గ్రూప్ కి..ప్రత్యేకమైన కళాశాలలో.. మా అబ్బాయి చదవడం మళ్ళీ..అక్కడా..కమ్యూనిటి ల పిచ్చి మొదలయింది. నేను అనుక్షణం భయపడుతూ..ఉండేదాన్ని. ఒక రోజు మా అబ్బాయికి గట్టిగా వార్నింగ్..ఇచ్చాను. బుద్ధిగా చదువుకునే వాళ్లకి ఇలాటివి పట్టవు..కాలక్షేపపు చదువులు,పనిపాట లేని వారికే..ఈ..పిచ్చి. అలాటి వాటిల్లో తలదూర్చావు అంటే..ఊరుకోను అన్నాక.. కొంచెం ఆలోచించడం మొదలెట్టాడు. క్లాస్ లో అందరితో..కలవడం, మాట్లాడటం,వాళ్ళ ప్రక్కన కూర్చుని..లంచ్..చేయడం,ఫ్రెండ్ షిప్ చేయడం ఇలాటివి చేస్తుండటం తో.. "సి" కమ్యూనిటీ వాళ్ళందరు.. మన కమ్యూనిటీ పరువు తీస్తున్నావు..అని మా అబ్బాయిని..వేలివేశారట. ఆ విషయం చెప్పి భాధపడినప్పుడు.. తనకి ఏది బాగుందో..ఆలోచించుకోమని చెప్పాను. కమ్యూనిటీ పేరిట అధికారం చలాయించడం..అహంకారం ప్రదర్శించడం.. మిస్ బిహేవియర్..ఆడపిల్లని ఏడిపించడం ఇవ్వన్నీ..గమనించి అవన్నీ నచ్చక తనే దూరం జరిగి తనకి నచ్చినవాళ్ళతో .. స్నేహం చేయడం ప్రాంభించాడు. అయితే అంతర్లీనంగా.. మా అబ్బాయికి.. కమ్యూనిటి పిచ్చి..ఉంది. "సి" పార్టీల పేరిట వేలకి వేలు తగలెయ్యడం, మళ్ళీ కమ్యూనిటిల్లోనే ..పేద, బైక్ ల,కార్ల కేటగిరీ లు.. బేదాలు,వాదాలు అన్నీఅక్కడే..!! వాటికి..సాక్ష్యాలు కళాశాలలే! .. ..
విజయవాడ లోనే.. "సి" గ్రూప్ కి..ప్రత్యేకమైన కళాశాలలో.. మా అబ్బాయి చదవడం మళ్ళీ..అక్కడా..కమ్యూనిటి ల పిచ్చి మొదలయింది. నేను అనుక్షణం భయపడుతూ..ఉండేదాన్ని. ఒక రోజు మా అబ్బాయికి గట్టిగా వార్నింగ్..ఇచ్చాను. బుద్ధిగా చదువుకునే వాళ్లకి ఇలాటివి పట్టవు..కాలక్షేపపు చదువులు,పనిపాట లేని వారికే..ఈ..పిచ్చి. అలాటి వాటిల్లో తలదూర్చావు అంటే..ఊరుకోను అన్నాక.. కొంచెం ఆలోచించడం మొదలెట్టాడు. క్లాస్ లో అందరితో..కలవడం, మాట్లాడటం,వాళ్ళ ప్రక్కన కూర్చుని..లంచ్..చేయడం,ఫ్రెండ్ షిప్ చేయడం ఇలాటివి చేస్తుండటం తో.. "సి" కమ్యూనిటీ వాళ్ళందరు.. మన కమ్యూనిటీ పరువు తీస్తున్నావు..అని మా అబ్బాయిని..వేలివేశారట. ఆ విషయం చెప్పి భాధపడినప్పుడు.. తనకి ఏది బాగుందో..ఆలోచించుకోమని చెప్పాను. కమ్యూనిటీ పేరిట అధికారం చలాయించడం..అహంకారం ప్రదర్శించడం.. మిస్ బిహేవియర్..ఆడపిల్లని ఏడిపించడం ఇవ్వన్నీ..గమనించి అవన్నీ నచ్చక తనే దూరం జరిగి తనకి నచ్చినవాళ్ళతో .. స్నేహం చేయడం ప్రాంభించాడు. అయితే అంతర్లీనంగా.. మా అబ్బాయికి.. కమ్యూనిటి పిచ్చి..ఉంది. "సి" పార్టీల పేరిట వేలకి వేలు తగలెయ్యడం, మళ్ళీ కమ్యూనిటిల్లోనే ..పేద, బైక్ ల,కార్ల కేటగిరీ లు.. బేదాలు,వాదాలు అన్నీఅక్కడే..!! వాటికి..సాక్ష్యాలు కళాశాలలే! .. ..
సిని హీరోల అభిమాన సంఘాలు.. వారి చిత్రాల విడుదలప్పుడు..చేసే హంగామా..కొన్ని అల్లాగే ఉన్నాయి..
మనిషి లో.. కుల మౌడ్యం అయితే మరీ పెరుకోలేదు కదా..అని ఊరుకునేదాన్ని నేను.. చిరంజీవి గార్కి..వీరాభిమానిని. ఎందుకంటే.. క్రమశిక్షణ ,కష్టపడి పట్టుదలతో ఒక రేంజ్ కి చేరుకోవడం,నటన ..డాన్స్ ..అన్నీ ఇష్టం. చిరంజీవి.పాటలు ఇంట్లో..వినవడితే టక్కున టి.వి.అయినా రేడియో..అయినా ఆఫ్..చేయడం, నాపై..చిర్రు బుర్రులాడటం.. "సిగ్గుండాలి.. మన వాళ్ళు కాని వారిని.. ఇష్టపడటానికి" అని అంటూ ఉండేవాడు.. నాకు..విపరీత మైన కోపం వచ్చేది.. అయినా..శాంతం శాంతం..అనుకుని..తమాయించుకునేదాన్ని.
ఒక రోజు..చాలా సీరియస్‌గా కాలేజి నుంచి..ఇంటికి వచ్చి.. "అమ్మా!..నువ్వు చిరంజీవి గురించి..పొగడటం ఆపేస్తావా..లేదా! "అన్నాడు.. "ఏమైంది.. నాన్నా.." అన్నాను లాలనగా.. నువ్వు రేడియోలో.. లైవ్ ప్రోగ్రాం లో.. చిరంజీవిని పోగుడుతున్నావ్.. అది.. విన్న మా ఫ్రెండ్స్..నన్ను హేళన చేస్తున్నారు.. నువ్వు..ఇక్కడ.. నందమూరి వంశస్తులని..మోసుకోస్తావు..అక్కడ మీ..మమ్మీ..చిరజీవి..ఫ్యాన్..అట ..అని గేలి చేస్తారు..అన్నాడు. "అయితే " అన్నాను..చాలా కూల్ గా. నువ్వు వెంటనే అలా పొగడటం మానేయాలి అన్నాడు. నేను..మళ్ళీ మౌనం..అప్పటికి ఆ గొడవ సర్దుమణిగింది. చిరంజీవికి..పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు..ఎఫ్.ఎమ్..లైవ్ ..లో..మాట్లాడినప్పుడు గొడవ అది. అదేమిటో..!? మా అబ్బాయి తప్ప వాళ్ళ ఫ్రెండ్స్ అందరు..రేడియో వినడం.. నేను..ఏం మాట్లాడానో.. చెప్పడం.. ఎక్కువైపోయింది..అప్పట్లో.
అమ్మో.. !ఈ పిల్లలలో.. ఇదెక్కడ దురభిమానం.. అనుకునేదాన్ని.
మనిషి లో.. కుల మౌడ్యం అయితే మరీ పెరుకోలేదు కదా..అని ఊరుకునేదాన్ని నేను.. చిరంజీవి గార్కి..వీరాభిమానిని. ఎందుకంటే.. క్రమశిక్షణ ,కష్టపడి పట్టుదలతో ఒక రేంజ్ కి చేరుకోవడం,నటన ..డాన్స్ ..అన్నీ ఇష్టం. చిరంజీవి.పాటలు ఇంట్లో..వినవడితే టక్కున టి.వి.అయినా రేడియో..అయినా ఆఫ్..చేయడం, నాపై..చిర్రు బుర్రులాడటం.. "సిగ్గుండాలి.. మన వాళ్ళు కాని వారిని.. ఇష్టపడటానికి" అని అంటూ ఉండేవాడు.. నాకు..విపరీత మైన కోపం వచ్చేది.. అయినా..శాంతం శాంతం..అనుకుని..తమాయించుకునేదాన్ని.
ఒక రోజు..చాలా సీరియస్‌గా కాలేజి నుంచి..ఇంటికి వచ్చి.. "అమ్మా!..నువ్వు చిరంజీవి గురించి..పొగడటం ఆపేస్తావా..లేదా! "అన్నాడు.. "ఏమైంది.. నాన్నా.." అన్నాను లాలనగా.. నువ్వు రేడియోలో.. లైవ్ ప్రోగ్రాం లో.. చిరంజీవిని పోగుడుతున్నావ్.. అది.. విన్న మా ఫ్రెండ్స్..నన్ను హేళన చేస్తున్నారు.. నువ్వు..ఇక్కడ.. నందమూరి వంశస్తులని..మోసుకోస్తావు..అక్కడ మీ..మమ్మీ..చిరజీవి..ఫ్యాన్..అట ..అని గేలి చేస్తారు..అన్నాడు. "అయితే " అన్నాను..చాలా కూల్ గా. నువ్వు వెంటనే అలా పొగడటం మానేయాలి అన్నాడు. నేను..మళ్ళీ మౌనం..అప్పటికి ఆ గొడవ సర్దుమణిగింది. చిరంజీవికి..పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు..ఎఫ్.ఎమ్..లైవ్ ..లో..మాట్లాడినప్పుడు గొడవ అది. అదేమిటో..!? మా అబ్బాయి తప్ప వాళ్ళ ఫ్రెండ్స్ అందరు..రేడియో వినడం.. నేను..ఏం మాట్లాడానో.. చెప్పడం.. ఎక్కువైపోయింది..అప్పట్లో.
అమ్మో.. !ఈ పిల్లలలో.. ఇదెక్కడ దురభిమానం.. అనుకునేదాన్ని.
ఒక రోజు..ఒక క్లిష్ట సమస్య రానే వచ్చింది.. టి.వి..లో చిరంజీవి.. నటించిన సినిమా వస్తుంది.. మంచి బీట్ సాంగ్ కాబట్టి....వాల్యూం పెంచి అందులో.. లీనమై..ఆనందంతో తలమునకలై..ఉన్నాను. మా అబ్బాయి బయట నుండి వచ్చి.. "అమ్మా"నీకు నేనంటే ఏమాత్రం ఇష్టం ఉన్నా వెంటనే..టివి.కట్టేయి..అన్నాడు..నాకు కోపం నాషాలాకి.. అంటింది. నీ మీద ఇష్టానికి.. చిరంజీవి సినిమా చూడటానికి..పోలిక ఏమిటి నాన్నా? ఇష్టాలు-అభిరుచులు..అవి ఒకరి కోసం రావు మారవు.ఎవరి ఇష్టం వారిది..నువ్వు ఎప్పుడు..నన్ను ఈ విషయంలో బలవంతం చేయకు..అన్నాను.. అంతేనా ..?అన్నాడు.."అవును..అంతే.". అన్నాను. తను విసురుగా వెళ్ళిపోయాడు. నా..ఆనందం అంతా..ఆవిరి అయిపోయింది. "ఏమిటి ఈ పిల్లాడు ఇలా తయారు అవుతున్నాడు..అచ్చు..వాళ్ళ నాన్నగారు..ఇంతే.. ఇంట్లోకి రాగానే టక్కున రేడియో..కట్టి పడేసేవారు.పేపర్ కానీ..పుస్తకం కానీ ఆయన లేనప్పుడే..చదవాలి.అంతా.. వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకొవాలంటే .ఎలా.? ఒకరు ఇష్ట పడినదాన్ని మనం ఇష్టపడాలి అంటే.. చచ్చేంత ప్రేమ అయినా..ఉండాలి.లేకపోతే.. మనకంటూ..ఒక సొంత ఇష్టం లేకుండా ఉండాలి,వ్యక్తిత్వం లేకుండా అయినా ఉండాలి..అని నా నిశ్చితాభిప్రాయం కూడా.
స్వతహాగా నేను.. మొండిదాన్ని కావడం మూలంగా.. ఆ అగ్ని అంత త్వరగా చల్లార లేదు. ఒక గంట తర్వాత మా అబ్బాయి దగ్గరకి..వెళ్లి కూర్చున్నాను. కదిలిస్తే కస్సు మంటున్నాడు. తను రెండు,మూడు సార్లు..కసురుకున్నా అక్కడే కూర్చుని.. తనకి..మంచిని..ఓపికగా భోదించడం ఎప్పుడూ..నా.పని.అలాగే ..కూర్చున్న నన్ను చూసి.. "చెప్పు" అన్నాడు. మళ్ళీ అడిగేదాక మాట్లాడ కూడదనుకుని బెట్టు చేశాను." చెప్పమ్మా?" అన్నాడు.." ఏం చెప్పాలి?"నా ప్రశ్న.. "ఏదో..చెప్పాలనేగా వచ్చావు.." అన్నాడు. ఇప్పుడు.. దొరికాడు.. ఇక చెప్పింది వింటాడు అని నమ్మకం కుదిరి అప్పుడు..మొదలెట్టాను..
స్వతహాగా నేను.. మొండిదాన్ని కావడం మూలంగా.. ఆ అగ్ని అంత త్వరగా చల్లార లేదు. ఒక గంట తర్వాత మా అబ్బాయి దగ్గరకి..వెళ్లి కూర్చున్నాను. కదిలిస్తే కస్సు మంటున్నాడు. తను రెండు,మూడు సార్లు..కసురుకున్నా అక్కడే కూర్చుని.. తనకి..మంచిని..ఓపికగా భోదించడం ఎప్పుడూ..నా.పని.అలాగే ..కూర్చున్న నన్ను చూసి.. "చెప్పు" అన్నాడు. మళ్ళీ అడిగేదాక మాట్లాడ కూడదనుకుని బెట్టు చేశాను." చెప్పమ్మా?" అన్నాడు.." ఏం చెప్పాలి?"నా ప్రశ్న.. "ఏదో..చెప్పాలనేగా వచ్చావు.." అన్నాడు. ఇప్పుడు.. దొరికాడు.. ఇక చెప్పింది వింటాడు అని నమ్మకం కుదిరి అప్పుడు..మొదలెట్టాను..
చిన్నీ! మన ఇంట్లో.. స్టీరియో రికార్డర్..ఎప్పుడు.. కొన్నాం?.అడిగాను.నాన్న గారు..శబరిమలై ..వెళ్ళినప్పుడు..అన్నాడు.. (ఆ వస్తువుని.. నేను నా కొడుకు వెళ్లి కొనుక్కోచ్చాం. )ఎందుకు అప్పుడే కొన్నాం.. నాన్నగారు ఉన్నప్పుడు.. ఎందుకు కొనలేదు అంటే ఆయనకీ..ఇష్టం ఉండదు కనుక. ఆయనకీ ఇష్టం లేదని..మనం ఆయన కోసం మనం పాటలు వినాలి అనే ఇష్టం ని చంపుకున్నామా..?లేదు కదా? అలాగే ఇంకో..విషయం .ఎంతో.. ప్రేస్టేజేస్ వి.ఆర్.ఎస్.సి.లో..నీకు..సి.ఎస్.ఈ లో సీట్ వస్తే.. నాకు "సి"..అంటే ఇష్టం లేదంటే..ఆ బ్రాంచ్ లోనే జాయిన్ అవమని బలవంత పెట్టానా..? అప్పుడు లక్షలకి..లక్షలు పోసి కొందామన్న ఎవరికి రాని..సీట్ ని ..నువ్వు వద్దనుకుని నీకు ఆ సబ్జక్ట్ పై..ఇష్టం లేదని వేరే బ్రాంచ్ ఎన్నుకున్నప్పుడు.. నేను నిన్ను ఆ బ్రాంచే తీసుకోమని..బలవంత పెట్టానా..! లేదు కదా? అన్నాను.. అయితే..ఏమిటట..?అని మొండిగా వాదించడం మొదలెట్టాడు.. ఇక లాభం లేదు సీరియస్ గా క్లాస్స్ తీసుకున్నాను.
ప్రతి మనిషికి..ఇష్టా ఇష్టాలు..ఉంటాయి.వాటిని మన కోసం మార్చుకోమని అడగ కూడదు.. నన్నే కాదు..ఎవరిని కూడా.. రేపు నీకు పెళ్లి అయితే భార్య వస్తుంది..ఆమెని కూడా..ఇలా ఆజ్ఞాపించకూడదు.. నీకు నచ్చని ఇష్టం లేని విషయాన్నీఎందుకు ఇతరలుకి..నచ్చకూడ ధో అని నువ్వు చెప్పలేవు కదా!నీకు ఎలాటి ఇష్టాలయితే ఉంటాయో..ఇతరులకి..అలాగే ఇష్టాలు..అభిప్రాయాలు ఉంటాయి. నీకు నచ్చకపోతే మౌనంగా ఉండు. అంతే కానీ.. వాళ్ళని.హోల్డ్ చేయాలనుకోవడం చాలా తప్పు.. అలాగే ..బ్లాక్మైలింగ్..కూడా.నీకన్న నాకు చిరంజీవి అంటే.. ఇష్టం అని..అంటే నువ్వు జీర్ణం చేసుకోలేవు.నేను అలా అనలేను కూడా ..అన్నాను. మా అబ్బాయి సైలెంట్ గా..ఉండిపోయాడు. తర్వాత ఎప్పుడు..మా అబ్బాయి..అలా మాట్లాడలేదు..కూడా. తర్వాత కొన్నాళ్ళకి.. చిరంజీవి హిట్ సాంగ్స్ అన్నీ..డౌన్లోడ్ చేసి నాకు..మెమరి కార్డు లోకి..సేవ్ చేసి గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇంజినీరింగ్ చదువు పూర్తయ్యేటప్పటికి తనకి.. ఏది మంచో ఏది చెడో..ఆలోచించే..జ్ఞానం అబ్బినందుకు నాకు..చాలా సంతోషం వేసింది. ఇప్పుడు..మా బంగారు కొండ నిజంగా..బంగారు కొండే!!
కమ్యూనిటి ల పిచ్చిలో అభిమాన హీరోల పిచ్చిలో..పడి రియలైజ్ కాలేని..పిల్లల్లో..ఒకప్పటి..నా కొడుకే కనపడతాడు నాకు.వాళ్లకి.. ఏది..సబబో..చెపుతూనే ఉంటాను నేను.
మత మౌడ్యం,కుల మౌడ్యం,దురభిమానం కళ్ళకు కమ్మిన మైకం లాటిదని..నా అభిప్రాయం. అది మనుషుల నుండి వారిని..విడదీస్తుంది.
మత మౌడ్యం,కుల మౌడ్యం,దురభిమానం కళ్ళకు కమ్మిన మైకం లాటిదని..నా అభిప్రాయం. అది మనుషుల నుండి వారిని..విడదీస్తుంది.
23 కామెంట్లు:
నిజమే. చక్కగా చెప్పారు.
meelaa aalochimchagalige tallulumdaali ee samasya pariskaaraaniki
నేను కూడా గుంటూరులోని ఇలాంటి కాలేజిలోనే చదివాను. ఎదుటివాల్లను ఇబ్బంది పెట్టనంతవరకూ ఇలాంటి వాటిలో తప్పేమిలేదని నా అభిప్రాయం. పైగా ఆ వయసులో గ్రూపులు, మిగతావాళ్లను డామినేట్ చేయడం అంటే క్రేజ్ ఉండటం సహజం. నాతోపాటు చదువుకున్న వాళ్లలో ఇలా సి గ్రూపులు కట్టి యాక్టీవుగా కాలేజిలో గొడవచేసిన వాళ్లు కొందరు, చదువయ్యి ఉద్యోగంలో చేరాక వేరే కులం వాళ్లతో స్నేహం మాత్రమే కాదు, ప్రేమించి పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు :).
వనజ గారు,
చాల బాగా చెప్పారండి.నేను ఇంకో కాలేజిలో చదివాను ఇంజినీరింగ్.ఒక్కోసారి మనం మనుషులం అనే స్పృహను మర్చిపోతున్నామేమో అనిపించేది అక్కడ.
$Vanaja ji
You have touched very sensible issue. On the flip-side think how it effects other community students at that innocent age. Really condemnable!. Glad to know that your son is realized but credit must goes to you. I bow my ahead to your feet.
$Ajnata
You are supporting just what you did that was a faux pas. But please mind that you are a human being. Time to realization.
శరత్ గారు..ధన్యవాదములు.. దుర్గేశ్వర గారు..మీకును..ధన్యవాదములు. మంచి తల్లిదండ్రులు అనిపించుకోవడం చాల కష్టం అండీ! ఒకప్పుడు మా అబ్బాయికి..ప్రధమ శత్రువును..నేనే అన్నట్లు.. ఉండేది.ఆలోచనా జ్ఞానం పెరిగేటప్పటికి అంతరాలు.. సమసిపోతాయి.పరిణితికి.. చిహ్నం.. అది. పిల్లలు మారలేదు అంటే.. సమాజం కన్నా ముందు.. తల్లిదండ్రులు..ఏమి నేర్పలేదని అర్ధం.
అజ్ఞాత గారు.. మీతో..నేను ఏకీ భవిస్తాను.. ధన్యవాదములు.
శశి..ఒక చేదు అనుభవం..చవిచూశారు.. భవిష్యత్ లో.. ఏ పిల్లలని..అలాటి జాడ్యంకి..గురికానివ్వ కుండా ఉండాలని..ఆశిద్దాం. ..
రాజేష్ & అజంత ధన్యవాదములు.పిల్లలు.. తప్పటడుగులు వేసేటప్పుడు తఃప్పు మార్గంలో..నడిచే టప్పుడు.. వారిని..రైట్ ట్రాక్ వైపు..మళ్లించడమే..తల్లిదండ్రుల భాద్యత. మీకు..మరిన్ని..ధన్యవాదములు. గాడ్ బ్లెస్స్ యు..రాజేష్. ..
బాగా రాసారండి ! కాకపొతే కొంతమంది వాళ్లకి ఉన్న ఈ దురాభిమానాన్ని కన్వీనియెంట్ గా మరిచి పోయి ఎదుటి వాళ్లకి మాత్రమే ఉంది అన్నట్లు గా ఫీల్ అవుతుంటారు . మీరు అలా కాకుండా చాలా బాగా రాసారు .
You done great job !
Thank you..sravya garu.
This topic should be discussed threadbare.
Superb!
తల్లి పాత్ర ని సమర్ధవంతం గా పోషించి మీ అబ్బాయిని మార్చారు చూడండి, అది గ్రేట్ నిజం గా . కనీసం సగం మంది తల్లి తండ్రులైనా ఇలా చెయ్యగలిగితేబాగుండు.
Thank you very much..Rishi garu..
ప్రతింట్లో మీలాంటి అమ్మలుంటే ప్రపంచమే మరోలా వుండేదమ్మా. మీకు శిరశువంచి నమస్కరిస్తున్నాను.
Thank you very much.Indian Minerva. God Bless you..
You are really great. Excellent approach.
శుభాభినందనలు.
బెజవాడలో ఇలాంటివి సర్వ సాధారణమయ్యాయి. ఇందుగలదు అందు లేదని సందేహము వలదు.. అన్న చందంగా రాజకీయం, రౌడీయిజం, అభిమానం, విద్యా, వ్యాపారం... అన్నీ రంగాల్లో తిష్ఠ వేసుక్కూర్చుంది.
>> ..రియలైజ్ కాలేని..పిల్లల్లో..ఒకప్పటి..నా కొడుకే కనపడతాడు నాకు.. వాళ్లకి.. ఏది..సబబో..చెపుతూనే ఉంటాను..
Mother is the first University for child అంటారు. అలాంటి తల్లి సంస్కారమనే జ్యోతిని వెలిగిస్తే అది ఇంట్లో, సమాజంలో వెలుగులు నింపుతుంది.
ప్రతి తల్లీ మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. మీ విశాల దృక్పథానికి ప్రణమిల్లుతున్నాను.
వనజ వనమాలి గారు చాలా బాగా రాశారు మీ పోస్ట్ నేను చదువుతుంటాను ఇది మిస్ అయ్యాను. నేను రాసిన ఒక పోస్ట్ పై ఒకరు కామెంట్ చేస్తూ మీ ఆర్టికల్ లింక్ ఇచ్చారు. మీరు చెప్పిన ఆ కాలేజీ గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది. మీ అబ్బాయి వాస్తవాలు తెలుసుకున్నారు. మీకు మీ అబ్బయికి అభినందనలు . నాకు తెలిసన ఒక జర్నలిస్ట్ బయట పార్టీ లా వాళ్ల వద్ద కనీసం టి కూడా తాగడు. ఆతను నైతిక విలువల గురించి ఎక్కడా మాట్లాడడు . మరో జర్నలిస్ట్ తన వృత్తిని అన్నింటినీ అడ్డం పెట్టుకొని భారీగా సంపాదించాడు. ఆతను యువతకు సందేశాలు ఇస్తున్నాడు. మీరు పేరు చెప్పని ఆ ఇంజనీరింగ్ కాలేజీ లో ఆతను యువతకు నైతిక విలువలు భోదించే ప్రకటన ఒకటి పత్రికలో చూసి,... ఏర్పాటు చేసింది, మాట్లాడేది, ప్రకటన ఇచ్చింది, + + అన్నీ దేనికి సంకేతాలు అని మిత్రుల ముందు చెబుతుంటే... ఆ కాలేజీ లోనే చదివిన ఒక మహిళా జర్నలిస్ట్ అయ్యో మీకు ఆ కాలేజీ గురించి తెలియనట్టుంది అక్కడ కులాల వారిగా ఉంటారు. బుధ వారం ఒక ... వారు తెల్ల డ్రెస్ మాత్రమే వేసుకొని వస్తారు , నేను అదే వర్గం కాబట్టి తెలుసు అంది. ఆమె చిన్న వయసులోనే ఉంది కానీ ఇలాంటివి తప్పు అనే స్పుహ ఉంది. పాత తరం వృద్దుల కన్నా నేటి తరం యువతలో కుల పిచ్చి అధికం కావడం ప్రమాదకరం. ఇది అన్నీ కులాల్లో ఉంది .ఎన్నికల్లో ఏపార్టీ గెలవవచ్చు, ఏది ఒడి పోవచ్చు అని నేను విశ్లేషణ చేసి చెబితే వీడు పాలన కులం వాళ్ళు ఒడి పోతారని చెప్పాడు కాబట్టి వీడు పలానా కులం అని అనుకున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అన్నీ సీట్లు యం ఐ యం గెలుస్తుందని చెప్పినప్పుడు నన్ను ముస్లిం అని అనుకుంటే మీ తెలివికి నవ్వుకుంటాను తప్ప ఎమీ అనను అన్నాను.మీరు చాలా నిస్పక్షపాతంగా రాశారు. ఈ కులం పిచ్చి అన్నీ కులాల్లో ,ముఖ్యంగా యువతలో ప్రమాదకరంగా పెరిగి పోతోంది.
బుద్ధా మురళి గారు.. మీ స్పందనకి ..చాలా సంతోషం.ఇలాటి అనుభవాలు ఇంకా ఉన్నాయి. కులం,మతం పేరిట మనుషులని విడదీసి చూసే నాగరిక సమాజంలో..మనం బ్రతకడం చాలా భాధాకరం. కుల పిచ్చి తో..విద్వేషాలు వెళ్ళ
గక్కుతున్న గురువుల వలన విద్యార్ధులు యెంత మానసిక క్షోభకి గురి అవుతున్నారో..మరలా కొన్ని పోస్ట్ లలో వివరిస్తాను. మా అబ్బాయి..చాలా మానసిక వికాసం తో..మెలుగుతున్నాడు.కన్న తల్లిగా..అది నాకు చాలా ఆనందం. మీకు.. నా ధన్యవాదములు.ఇంకొక విషయం ఏమంటే.. ఇంటి పేరు చెప్పటానికి కూడా.. నేను ఇష్టపడటం లేదు. అది ఇతరుల నుండి నన్ను నెట్టేస్తుంది..అనుకుంటున్నాను నేను.
"చిరంజీవి.గార్కి..వీరాభిమానిని. ఎందుకంటే.. క్రమశిక్షణ ,కష్టపడి పట్టుదలతో .. ఒక రేంజ్ కి చేరుకోవడం ,నటన ..డాన్స్ ..అన్నీ ఇష్టం."
మీరు చిరంజీవి అభిమాని కాబట్టి, అతనిలొ మీకు అన్ని మంచివి కనిపించాయి.
కాని ఇతరులకు అలాంటి భావాలు కలగన్నక్కర లేదు.
మీ అబ్బాయికి కాని, అతని స్నేహితులకు కాని చిరంజీవి నిజ స్వరూపము తెలిసివుండి మీతొ అలా ప్రవర్తించివుండ వచ్చు. ఈ కొణములొ ఒకసారి ఆలొసించి చూడండి. మీ అబ్బాయి, మీ భర్త బయట వారితొ interaction చేసి తమకు కలిగిన చాలా అనుభవాల తరువాత, వాళ్ళు అలా ప్రవర్తించి వుండవచ్చు.
సినిమాలలొ నటించినంత వరకు, చిరంజీవి, ఊహాజనిత సినీ ప్రపంచంలొ ఒక అత్యద్భుత character గల వ్యక్తిగా project చేయబడ్డాడు. దీనిని marketing అంటారు. అలానే ఇప్పుడు సొనియా ఒక దేశ మాతగా, త్యాగ మయిగా కీర్తించ బడుతుంది. ఆమే వెసుకున్న ముసుగు వేనుక అంతా కరప్షనే మరియు దిగజారుడు తనమే.
ఒక్కసారిగా ఆ సినీ మయా తెర తొలిగి పొగానే, అతని నిజ స్వరూపము బయట పడింది. ఇన్ని రొజులు అతను ముసుగును తొడుక్కుని అభిమానులను బ్రమ పెట్టాడు.
అతను రాజకీయాలలొకి వచ్చిన తరువాత అతని నిజ నైజము బయటకు వచ్చింది.
- పెద్ద కుల పిచ్చి వాడు
- పెద్ద లంచ గొండి
- లంచ గొడులతొ కలసి పని చేయడము
- ఆడ వారి పై నొరు పార వేసుకొవడము (రొజా మరియు అమల)
- నిబద్దత లేని తనము
- నిలకడ లేని తనము
- ఇతరులను చీప్ గా ట్రీట్ చేయడము
- చెప్పేది ఒకటి చేసేది ఒకటి
- ఇతరులకు చెప్పిన నీతులను తను పాటించక పొవడము
- సొంత కూతురు కాపురము పాడు చేయడము
- అస్రిత పక్ష పాతి (పార్టి లొ ముఖ్య పొష్ట్ లు తన వారికి ఇవ్వడము)
- కారేక్టర్ లేని తనము (సొనియాకి గులాము)
-
-
పైన చెప్పినవి అన్ని ముందు నుంచి వున్నవే. కాక పొతే అవి అన్ని ముసుగులొ కప్పి వేయ బడ్డాయి.
ఇతరుల ఆలొచన అలా ఎందుకు వున్నది అని ఆలొసిస్తే కొత్త కొణాలు తెలుస్తాయి.
కుల ధురభిమానము పూర్తిగా పొవాలి అని మాత్రము మీతొ అంగీకరిస్తున్నాను.
అజ్ఞాత గారు నేను మీ అభిప్రాయం తో.. ఏకీభవిస్తాను. చిరంజీవి గారు ఇప్పుడు నా దృష్టిలో..జీరో. తెర పై కనిపించే రూపాల లోనే సెలబ్రిటీ ల మనస్తతాన్ని..నేను అంగీకరించను. ఆఖరికి..యెన్.టి.ఆర్ తో సహా ఎవరిని కూడా.. అలా అని వ్యక్తి స్వేచ్చని ఇంకొక వ్యక్తి..అణగద్రోక్క చూడదు కదా? తల్లి-కొడుకు,భార్య-భర్త మద్య కోణంలో కాదండీ..నేను ఆర్గ్యూ చేసింది.. ఆలోచనల్లో,ఇష్టాలలో..ఇంకొకరి..బలవంతపు ధోరణి ప్రదర్శించడం వద్దని. అంతే!చాలా శ్రద్దగా వివరించారు..ధన్యవాదములు.
Uff....My God....Amma chaduvukunte....Kutumbam anthaa Chaduvukunnatte......
Mam...When I was a kid I used to think that all are of same caste and when I completed 10th class I came to understand the difference between castes becaz of some special reservations but I have gud frends in all castes at that time...
When I entered +2 I was slowly understanding these things....
basically I like BALAYYA BABU....and becaz of that few of my class mates treated me as their caste fellow but actually I was Politically Enemy to that purticular caste :)....
at that time I donno all these but realising the things....
I have studied my Btech in KLCE...it is better collegage when compared with the collage in which ur SON has studied...but becaz of Guntur-Vijaywada Culture....THE SAME GROUPISM is thr in Our college also....
but thanks to our Pricipal...No Student openly dare to talk about groupism in college but...out side the college every thing is same....
Becaz of that AGE FACTOR and EGO...I too participated in My CASTE Programes but interestingly I have more and Gud freinds in my Politically Opposite caste :)
after completing my Btech....I realised one thing....
Yevari Kulam vaalla ki Goppa....Kulaabhimaanam vundatam lo Thappu ledu....kaani...DURABHIMAANAM vundakudadu.....
this holds gud not only for CASTE...for everything...religion...region...Film Star..Politician...every thing....
P.S:naaku ippati ki BEST FRENDS....maaku Opposite Caste vaalle vunnaaru....Political gaa We differ each other...We debate on each topic....but...end of day...We r frends......help each other....
చాలా ఇళ్ళలో జరిగే విషయాలు చాలా నేచురల్‌గా చూస్తున్నట్టు చెప్పారు. ఏదైనా విషయాన్ని స్వతంత్ర వివేచనతో విశ్లేషించాలి, మంద మనస్తత్వంతో కాదు - అనే ముద్ర ఒక తల్లిగా కొడుకుపై వేశారు, నైస్! వెంటనే రిజల్ట్స్ కనిపించకపోయినా, రాను రాను ఆ విత్తు పెరిగి పెద్దదయి కొన్నేళ్ళయ్యక అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఆలోచనలను వెంటాడుతూ, సన్మార్గంవైపే దిశానిర్దేశనం చేస్తుందని ఆశిద్దాం ఆపై ఆ పిల్లల అదృష్టం. కేవలం నలుగురి మెప్పుకోసం సాగిన కృత్రిమ కథనాల్లా కాక, వున్నదున్నట్లు మీ సంఘర్షణను, ఆలోచనలను, అనుభవాన్ని పంచుకున్నారు అనే అరుదైన ఫీలింగ్ కలిగించారు, ధన్యవాదాలు.
SNKR గారు.. మా కమ్యూనిటీ వాళ్ళు పెట్టిన సమావేశామో..లేదా ఆత్మీయ కలయికలో,లేదా వన భోజనాలో..లాంటివి నేను వ్యతిరేకిస్తాను.
కుటుంబం అంటే మంచికో,చెడుకో,కలుస్తుంటాము.ప్రత్యేకించి అలా కలయికల ఏర్పాటులో ఏమి ఉండవు అంది. గొప్పగా ఎదిగాం అన్న దానిని చూపించడానికి పడే తాపత్రయం తప్ప.
అలాగే కులం పేరిట నడిచే గ్రూప్ చాటింగ్ లు ని నేను వ్యతిరేకిస్తాను. కులం పేరా,మతం పేరా మనకి మనమే సమాజం నుంచి వేలివేసుకుని.. ఇతరుల పట్ల ద్వేషం,చిన్న చూపు చాపడం నాకు నచ్చదు. నేను ఇలాగే ఉంటాను. నా కొడుకుకి అదే నేర్పాలనుకున్నాను, నేర్పాను. ఆచరణలో అది చూస్తే సంతోషిస్తాను. అంతవరకూ నేను చేయగలను . మరి కొంతమందికి చెప్పగలను. అంతే..నండీ. మీ స్పందనకి అభిప్రాయానికి ధన్యవాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి