23, జనవరి 2012, సోమవారం

కాటు ఏదైతేనేం ?

కాటు ఏదైతేనేం

ముప్పాతిక రోజులో అలవాటైన పనులలోనే 
పహారా కాసి కాసి అలసి పోతానేమో 
అమ్మ ఒడిలేకున్నా
ప్రియ సఖుని దండ చేయి లేకున్నా 
దూది మెత్తళ్ళ  స్పర్శలేకున్నా
ఆమె కౌగిలిలో..ఒదిగిపోతాను

ఒళ్ళంతా బహుళ  వస్త్రాల సముదాయంలో 
జాగ్రత్తగా చుట్టుకునే ఉంటాను 
దుర్భేద్యమైన వల కోట నిర్మించుకుంటాను. 
ఒణుకుతూనే  వలదనుకోలేని పవన వీచికలు 

ఇంత రక్షణలో ఇముడ్చుకున్నా 
రహస్యంగా ఐ ఎస్ ఐ ఏజంట్లా
నా రక్షిత సామ్రాజ్యంలో జొరబడి 

అవాంచిత సంగీతాన్ని కర్ణద్వయం పగిలేలా వినిపిస్తూ..
నా చుట్టూ ఎయిర్ వింగ్ విన్యాసాలతో చక్కర్లు కొడుతుంటాయి 
నిద్రిస్తున్న శత్రు స్థావరాల పై అమాంతం దండెత్తి 
కసిదీరా కాటేసి రక్త దాహం తీర్చుకోవడానికి అన్నట్లు. 

పిచికారి మందులు,నవనీతం లాంటి పూతమందులు 
దట్టమైన పొగల గాఢత,పూల పరిమళాల ఆఘ్రానణకి 
అలవాటైపోయి 

సామదాన బేధదండో పాయాలు పనికిరావన్నట్టు   
రావణాసురిడి విక్కటాహాసం ఒకటి  
సమాధానంగా నడుం బిగించి యుద్దానికి ఉపక్రమించి..
మిగిలిన  ఒకే ఒక్క రామ బాణం 
విద్యుత్ దండంతో విన్యాసాలు చేసాను
టప్ టప్ మని ఆచూకి లేకుండా నశించిన శత్రు శేషం చూసి
దోమకాటు తప్పిందని సంతోషించాను.

ప్రక్కనే..  దోమ కాటు కంటే ప్రమాద కరమైన 
ప్రేమ కాటులోచిక్కుకుని 
లవ్ మంత్రం పలవరిస్తున్న అమ్మాయిని చూసి.. 
ఏ దండం వేసి రక్షించాలా  అని .. 
మిగిలిన రాత్రంతా..ఆలోచిస్తున్నాను.


7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ప్రేమ కాటుకు మందు వుందా?

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

దోమకాటునీ ప్రేమకాటునీ భలే ఫన్నీగా పోల్చారు...

జయ చెప్పారు...

సీజన్ మార్చేయండి. దోమలు తగ్గిపోతాయి:) కవిత మాత్రం వండర్...థండర్...లవెండర్....

కాయల నాగేంద్ర చెప్పారు...

'కాటు ఏదైతేనేం ?' మీ కవిత బాగుంది. దోమ కాటు నుంచి తప్పించుకోవడానికి దోమతెర ఉపయోగించినట్లే,ప్రేమ కాటు నుంచి తప్పించుకోవడానికి మనసును మన గుప్పిట్లోకి తెచ్చుకోవాలి.
"దోమ కాటు కొంత బాధ
ప్రేమ కాటు అమిత బాధ"

PALERU చెప్పారు...

వనజ దీది...

ప్రేమ కాటు...దోమ కాటు...రెండిటిలో రెండోదే బెటరు...నా రెండవ పదం మొదటి రెండు అక్షరాలను చంపగలం కాని నా మొదటి పదం మొదటి రెండు అక్షరాలను చంపలేము....

పజిల్ బాగుందా...:):)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టే ఫలే గారు ప్రేమ కాటుకి మందు..ప్రేమలో పడకుండా ఉండటమే!
@ అవినేని భాస్కర్ గారు.. ప్రేమ కాటు-దోమ కాటు..రెండు..కష్టమే అని..నా అనుభవం కూడా. .ధన్యవాదములు.
@ జయ గారు..దేశ జనాభాలా సర్వ కాల సర్వావ్యవస్తల యందు..దోమ కాటు తప్పడం లేదు.యెం చేద్దాం చేప్పండి? కాటు వేయించుకోక తప్పదు కదా! మీ అభినందనలకి ధన్యవాదములు.
@కాయల నాగేంద్ర గారు..మీరన్నది నిజమేనని అనుభవమయ్యే ఈ కవిత వ్రాసాను. ధన్యవాదములు.
@రాఫ్సున్ భాయీ.. ప్రేమని చంపలేం. మీతో నేను యెకీభవిస్తాను.స్పందించినందులకు ధన్యవాదములు భాయీ.

శశి కళ చెప్పారు...

నిజమె...దొమ కాటుకి మందు ఉంది కాని...ప్రెమకు లెదు...ప్రేమ కాటులోచిక్కుకుని
లవ్ మంత్రం పలవరిస్తున్న అమ్మాయిని చూసి..
ఏ దండం వేసి రక్షించాలా అని .. ప్చ్...