10, జూన్ 2012, ఆదివారం

"ఎవరైనా చెప్పగలరా"

ఈ రోజు పోస్ట్ వ్రాసే మూడ్ లేదు కాని వ్రాయాలి. దీనికి కారణం ఉంది. కారణం లేకుండా వనజ వనమాలీ ఏ పని చేయదు. ఇంకొన్నాళ్ళు ఆగితే.. అప్పుడు కారణం చెపుతాను.ఈ లోపు ఎవరైనా భూతద్దం తో పరీక్షించి అసలు రహస్యాన్ని  కనుగొన్నా సరే.. సంతోషం . అది సగం బలం కూడా. 

 సరదాగా బ్లాగ్ మిత్రులకి ఓ..ప్రశ్నా పత్రం ఇచ్చి సమాధానం చెప్పమంటే.. ఎలా ఉంటుంది? ఎందుకు బాగుండదూ... ఇలాటి పోస్ట్ లే బాగా పండుతాయని నా అనుభవం చెపుతుంది. కాబట్టి.. ధైరే, సాహసే ..బ్లాగ్ టపా.. "ఎవరైనా చెప్పగలరా" ? అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయోద్దు.. ఏమిటీ పోస్ట్ రహస్యం!? సరే ఈ పోస్ట్ లో 90 %వాస్తవం అనిపించే ఓ.. సిట్యుయేషన్ లో ఏం జరుగుతుందో .. చెపుతున్నాను. జో లిఖా జాతా హై వహీ పడా జాతా హై ..అని హిందీ లో నానుడి కానీ అందుకు భిన్నంగా నేను ఇక్కడ వ్రాయడం చేశాను. ఇక చూడండి నా పైత్యం. ..


  "జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు
హృదయంలో నిండినవారికి ఇవ్వడం జరుగుతుంది అప్పుడప్పుడు

చూపుల ప్రశ్నలకు సిగ్గుపడుతూ మోము చాటు చేయొద్దు.
అదృష్టం అలాటి స్థితిలోకి తీసుకు వెళుతుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు వసంతం గవాక్షం రోజు తెరుచుకోదు ఓ..ప్రియతమా ..
ప్రళయం వస్తుంటుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు

యవ్వనపు దారిలో ఒంటరితనం ని దాటలేవు
మరొకరి అవసరం వస్తుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు జన సందోహంలో కలసి పొతే ఎక్కడా మళ్ళీ ఎవరు దొరకరు
దగ్గర కావడానికి సమయం దొరుకుతుంది అప్పుడప్పుడు
హృదయంలో నిండినవారికి నాయకుడు అయ్యే అవకాశం దొరుకుతుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు... " 

 పైన నేను చెప్పింది ఏమిటో ఎవరైనా చెప్పగలరా!? మైండ్ బ్లాంక్ చేసుకోవద్దు ..సరదాగా ట్రై చేయండి. లేకపోతే.. ఎవరైనా చెప్పగల్గితే.. మహదానందం. పైన కొటేషన్స్ లో వ్రాసిన వ్రాతలు నా వ్రాతలు మాత్రం కాదండి. ఏదో.. సరదా పడుతూ..ఇష్టమైన పని జేశాను..అంతే! అంతే!

12 కామెంట్‌లు:

శశి కళ చెప్పారు...

jeevitam lo yeppudaina swachchamaina prema dorikite vadulukovaddu.adi bhale untundi ani anukuntaanu...vanaja garu..prize nake ivvali..first javabichchaanu

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

మీ అబ్బాయి ప్రేమలో పడ్డాడా వనజా గారు?..:)
సరదాగా వ్రాయండి అన్నారు కాబట్టి అడిగాను...తప్పయితే మన్నించండి.

Best Wishes,
Suresh Peddaraju

nsmurty చెప్పారు...

వనజగారూ,
నాకు ధర్మేంద్ర, మాలాసిన్హా నటించిన చిత్రం , పేరు గుర్తులేదు గాని, అందులో మాలాసిన్హా పాడిన ...."మిల్తీ హై జిందగీ మే మొహాబ్బత్ కభీ కభీ..." అన్న పాట గుర్తుకు వస్తోంది ఇది చదివితే.
అభివాదములతో

అజ్ఞాత చెప్పారు...

:) :) :)

భాస్కర్ కె చెప్పారు...

యవ్వనపు దారిలో ఒంటరితనం ని దాటలేవు
మరొకరి అవసరం వస్తుంది అప్పుడప్పుడు
జీవితంలో ప్రేమ దొరుకుతుంది అప్పుడప్పుడు
nijame kadu.
thank you madem.

Zilebi చెప్పారు...

చాలా సీరియస్ గా
చెబ్తున్నా నండీ,

మీరై అడిగారు కాబట్టి చెబ్తున్నా నండీ.

నేను చెప్పింది ఏమిటో ఎవరైనా చెప్పగలరా!?
అని అడిగారు కాబట్టి చెబ్తున్నా నండీ.



నాకు తెలీదండీ.

చీర్స్
జిలేబి.

అజ్ఞాత చెప్పారు...

did you translate any hindi song?

Manasuna Vunnadi... చెప్పారు...

milti he zindagi me muhabbat kabhi kabhi,,hoti he dilbaron ki inayet kabhi kabhi,,sharma ke moo na pher nazar ke sawal pr,,lati he aise mor pe qismat kabhi kabhi,,tanha na kat saken ge jawani ke raste,,pesh aaye gi kisi ki zarurat kabhi kabhi,,phir kho na jayen ham kaheen dunia ki bheer me,,milti he paas aane ki mohlat kabhi kabhi,,!!SONG:MILTI HAI ZINDAGI MEIN
MUSIC:RAVI
LYRICS:SAHIR
SINGER:LATA MANGESHKAR
FILM:AANKHEN

Manasuna Vunnadi... చెప్పారు...

SONG:MILTI HAI ZINDAGI MEIN
MUSIC:RAVI
LYRICS:SAHIR
SINGER:LATA MANGESHKAR
FILM:AANKHEN

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శశి గారు.. ఎంత మంచి వారు.. నేను అందించిన వ్రాతల లోని లోతుని ఎంత బాగా క్యాచ్ చేసారు.మీకే బహుమతి సరేనా!
@నిరంతరం వసంతం లే .. సురేష్ గారు.. అబ్బాయి విషయం కాదండి. ఐ యామ్ ఇన్ లవ్ . ఎల్లప్పుడూ పాటల తో.. ఇది ఒక పాట సాహిత్యం.
మీ ఆత్మీయ స్పందనకి ధన్యవాదములు.
@..కష్టేఫలే గారు.. ధన్యవాదములు. అర్ధం చేసేసుకున్నారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ns మూర్తి గారు.. చాలా చాలా సంతోషం. మీరు అనువాదకులు. మీకు అర్ధం ని బట్టి స్పురించి ఉంటుంది.
మీరు చెప్పినది సరి అయిన జవాబు. ఈ సాహిత్యం "ఆంఖే" 1968 చిత్రం లో పాట.
@ మనసున ఉన్నది ..గారు.. మీరు చెప్పినది సరియిన జవాబు. ధన్యవాదములు.
మీరు కూడా హిందీ పాటలు బాగా వింటారనుకుంటున్నాను థాంక్ యు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పురాణపండఫణి ..గారు.. మన్నించాలి. ఎందుకంటే నేను వివరంగా చెప్పలేదు కదా !అందుకు. ఒక పాట సాహిత్యం ఇది అంటే అందరు కనిపెట్టేస్తారని .. చెప్పలేదు. సరదాకి ఇలా చిన్న టెన్షన్ క్రియేట్ చేయడం అన్నమాట. స్పందించినందుకు ధన్యవాదములు. పాట సాహిత్యం అని నేను ఉదహరిస్తే మీరు చెప్పెసేవారే!:)
@జిలేబీ ..గారు.. అన్ని విషయాలు మనకి తెలిసి ఉండాలా ఏమిటి చెప్పండి. ఏదో సరదాకి ఇలా బాగుంటుంది అని.. ఈ రూట్ లో వచ్చాను. మీ రాక నాకెంతో ఆనందం. ధన్యవాదములు.
@ ది ట్రీ భాస్కర్ గారు.. మీ కవితలే అద్భుతమైన భావ కవిత్వం.ఈ సాహిత్యం అంతే! మీ మాటే నా మాటాను. థాంక్ యు