పాతికేళ్ళ క్రితం బుల్లి తెర మనకి..బాగా పరిచయం అవుతున్న కాలంలో.. సినీ పరిశ్రమకి..చేటు చేస్తుంది అనుకున్నారు. సినిమాల గురించి మాట్లాడనిదే..గంట కూడా మనుగడ సాగించలేని..పరిస్థితుల్లో. చానల్స్ ఉన్నాయి. ఆఖరికి న్యూస్ చానల్స్ కూడా.. సినిమా కబుర్లు,విశేషాలు..ఇవే ప్రాణం. .
ఇక కొన్నిచానల్స్ కి..సీరియల్సే.. ప్రాణాధారం. వాటికి..ప్రాణాధారమైన లేడీ బాస్ లు..లేడీ ప్రతి నాయకురాలు,మంచి నీళ్ళ ప్రాయంగా..హత్యలు..కాలక్షేపపు బటానీ లు తిన్నంత ఈజీ గా. కిడ్నాప్ లు.. ఏళ్ళ తరబడి..సాగతీత..గంటల తరబడి టి.వి లకి అతుక్కుని.. శరీరాలు పెంచుకోవడం గురించి మెదడు కి..హింసా ప్రవృత్తి ని..ఇంజెక్ట్ చేసుకోవడం గురించి..పురుషులు మొత్తుకుని మొత్తుకుని.. ఇంట్లో..ఆడంగులు వినక ఇప్పుడు ..మగ వాళ్ళే రూట్ మార్చుకుంటున్నారు.
ఇక కొన్నిచానల్స్ కి..సీరియల్సే.. ప్రాణాధారం. వాటికి..ప్రాణాధారమైన లేడీ బాస్ లు..లేడీ ప్రతి నాయకురాలు,మంచి నీళ్ళ ప్రాయంగా..హత్యలు..కాలక్షేపపు బటానీ లు తిన్నంత ఈజీ గా. కిడ్నాప్ లు.. ఏళ్ళ తరబడి..సాగతీత..గంటల తరబడి టి.వి లకి అతుక్కుని.. శరీరాలు పెంచుకోవడం గురించి మెదడు కి..హింసా ప్రవృత్తి ని..ఇంజెక్ట్ చేసుకోవడం గురించి..పురుషులు మొత్తుకుని మొత్తుకుని.. ఇంట్లో..ఆడంగులు వినక ఇప్పుడు ..మగ వాళ్ళే రూట్ మార్చుకుంటున్నారు.
నిజం.. ఇప్పుడు..ప్రైం టైం లో..సిరియల్స్ దే హవా.. రిమోట్ చేతిలో ఉండాలే కానీ..నాలుగు చానల్స్ లో.. కార్యక్రమాలు వీక్షించవచ్చును కదా..! జెమిని లో..ప్రసారమవుతున్న సేరియల్స్ లో... మొగలిరేకులు సీరియల్ లో..వీలైనంత.. అన్ని రకాల పైత్యాలు ఉన్నాయి.పల్లెటూరిలో కధ మొదలై. ..ఆస్తి కోసం హత్యలు.. ప్రేమ పేరిట మోసం,కిడ్నాపులు,బ్లాకు మెయిలింగ్, వీలైనంత ఎమోషన్.,స్నేహం,అపార్ధం,కక్ష సాధింపు చర్యలు.. కథ కొనసాగింపులు..వీక్షకుల సహనం ని పరీక్షిస్తూ..సాగు..తూ..............ఉంది.
ఆఖరికి..ఇప్పుడు అండర్ వరల్డ్ డాన్,మాఫియా,రియల్టర్ హత్యలు..అన్నీ..కలిపి.. నేర ప్రపంచం మూడు వంతులు..చూపించి..ఒక వంతు.. మానవ విలువలు(?).అట..చూపిస్తూ ..ఉత్తమ సిరియల్ గా ఎంపిక అయి..జనాల ఉత్తమ అభిరుచి కి..అద్డం పట్టింది.. అట. యద్దనపూడి సులోచనగారు ఎంత ఓపికగా చూస్తున్నారో..ఎప్పుడు ముగుస్తుందా..అని.
మొగలిరేకులు..సీరియల్ ని విమర్శించడం నా అభిమతం కాదండీ..దాదాపు అన్ని సీరియల్స్ అంతే..! అలాటి సీరియల్స్ తప్ప ఇక ఏవి చూడటానికి.. చాలా మంది..ఇష్టపడటం లేదని కూడా అనలేం..కానీ.. అగ్రశ్రేణి..వీక్షకులు.. ఇవే..చూస్తూ..ఉన్నారు.
ఈ..సీరియల్స్ చూస్తూ..మద్యలో..అధికంగా..వచ్చే.. వ్యాపార ప్రకటనలు..చాలా అసమంజసంగా.. ఉంటూ..వాటి పని అవి నిశ్శబ్దంగా..చేసుకుంటూ..వస్తు వినియోగాన్ని పెంచడం..వినియోగదారులని ఎలా మోసం చేయాలో.. అంత బాగా మోసం చేస్తూ..క్షణాల్లో..వాళ్లకి..కావాల్సింది వాళ్ళు లాక్కుంటూ..వాళ్ళ ప్రభావాన్ని..మనపై..వలలా విసిరి వెళ్ళిపోతారు.
సీరియల్స్ చూడటం రెండు విధాల చేటు. ఒకటి.. రక రకాల ప్రవృత్తులని.. మెదడుకి ఎక్కించడం, గిప్ట్ ల పేరిట..ఎస్.ఏం.ఎస్.. ల వ్యాపారం, అమ్మకాలు పెరగడం కోసం యాడ్స్,వాటి ప్రసారం ద్వారా వస్తువుల ధర పెంచి..ఆర్ధిక భారం మోపడం..అని నా అభిప్రాయం.
అసలు ఈ పోస్ట్ ఉద్దేశ్యం ఇది చెప్పడం కాదు కనుక..ఈ విషయాలు..మరో పోస్ట్ లో..ముచ్చటిస్తాను.
ఒక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే..
కృష్ణా జిల్లా లో..ఒక పల్లెటూరిలో.. ఒక 80 సంవత్సరాల వ్యక్తి..ప్రతి రోజు..సీరియల్స్ చూస్తూ.. మొగలిరేకులు..సీరియల్స్ కి.వీరాభిమానిగా.. మారి పోయారు. హటాత్తుగా..ఇంట్లో..టి.వి. చెడిపోయింది.కొడుకుకి..చెబితే.. రిపేర్ కి..అవ్వక పక్కన పడేసారు.అలవాటు పడ్డ ప్రాణం ..ఊరుకుంటుందా?
పక్కింటికి వెళ్లి ఆ సమయానికి..మొగలిరేకులు చూడటానికి.కూర్చున్నారు. ఆ ఇంట్లో పిల్లలు.. బ్రేక్ సమయంలో..వేరొక చానల్ కి..వెళ్ళడం ..మారడం.. వల్ల సీరియలోల్..ఏం జరుగుతుందో తెలియక ఆ పెద్దాయన ఓ..ఆరాట పడిపోయి.. బి.పి. పెంచుకుని.. ఆ.. పక్కింటి పిల్లల పై..అరిచి..హటాత్తుగా..పడిపోతే .. ఏ హార్ట్ అటాక్ వచ్చిందో అని.. భయపడి.. హాస్పిటల్‌కి.. తీసుకు వెళ్లి.. బోలెడంత బిల్లు వదిలించుకుని..ఏం లేదనిపించుకుని.. బయట పడ్డారట. ఆ పెద్దాయన కొడుకు కి.. వెంటనే..జ్ఞానోదయం కల్గి.. కొత్త టి.వి. కొనుక్కొచ్చా రట.
ఇంతకీ.. ఈ విషయం తెలిస్తే..మంజులా నాయుడు ..పల్ల మాల సుధాకర్ గారు.. నటీ నటులు..ఎంత మురిసిపోతారో.. హై లెట్స్ లో..చూపుతారేమో!అనిపించింది. ఇది విన్నాక ..మొగలిరేకులా.. మజాకా..!? అనిపించింది..నాకు. ఆఖరిన ఒక విషయం ఏమిటంటే..!!! నిజం చెప్పొద్దు.. గుర్తు ఉంటె..నేను అప్పుడప్పుడు ఈ సీరియల్ చూస్తుంటాను.
7 కామెంట్లు:
మీరు 'మొగలి రేకులు' బాధితులేమో అనుకున్నాను.. ప్రేక్షకులే అన్నమాట :))
బాగా నవ్వుకున్నాను...
మా ఇంట్లో ఎవరూ మొగలి రేకులు సీరియల్ చూడరు; కానీ, ఎవరైనా బంధువులు వస్తే మాత్రం ఈ సీరియల్ చూడాలంటారు.. ఆలా నాకు పరిచయం ఈ సీరియల్. ఎంత చెత్తగా ఉందనిపిస్తుందో నాకు....
"సీరియల్స్ చూడటం రెండు విధాల చేటు. ఒకటి.. రక రకాల ప్రవృత్తులని.. మెదడుకి ఎక్కించడం, గిప్ట్ ల పేరిట..ఎస్.ఏం.ఎస్.. ల వ్యాపారం, అమ్మకాలు పెరగడం కోసం యాడ్స్,వాటి ప్రసారం ద్వారా వస్తువుల ధర పెంచి..ఆర్ధిక భారం మోపడం..అని నా అభిప్రాయం."
ఈయంశం మీద రాయండి...
"యద్దనపూడి సులోచనగారు ఎంత ఓపికగా చూస్తున్నారో..ఎప్పుడు ముగుస్తుందా..అని."
ఈ sentence నాకు అర్థం కాలేదండీ...
మురళి గారు.. ఏం చేస్తాం చెప్పండి. ? ఇంట్లో..నలుగురితో..నారాయణ అనకుంటే.. ఇంట్లో..చానల్స్ యుద్దాలు జరుగుతాయని.. ఇష్టం
లేకపోయినా చూస్తూ ఉంటాను. థాంక్స్ అండీ.
మొగలిరేకులు .. మూల కధ యద్దనపూడి సులోచనారాణి గారి నవల.ఆమె వ్రాసినది ఎప్పుడో..అయిపోయింది..పొడిగించి ఇంకా.. కొత్త కథ రూపొందించి..సీరియల్ సాగతీస్తున్నారు. మీరు సూచించినట్లు వ్రాస్తాను.భాస్కర్ గారు..ధన్యవాదములు.
విరిసే మొగలి రేకులు మొగలి రేకులు విరిసే .....
మీ దెబ్బకి విరియటం మానేసి విరిగిపోయుంటాయి ....
పూలు వాడి పోయుంటాయి ...!!
నేను మటుకు మొగలి రేకుల్ని Cash చేసుకుంటున్న...!!
ఆ టైం లో ఇంట్లో వాళ్లకి ఫోన్ చేస్తే వాళ్ళు ఆ ధ్యాసలో ఉంటారు కనుక మన పనులు యిట్టె అవుతాయి
ఇంతకన్నా క్లూ ఇవ్వను
బాగుంది nice
nijame.ma dad kuda nannu serial chudaddu antaru kani na manasu urukodu kada.....
కామెంట్‌ను పోస్ట్ చేయండి