23, జులై 2011, శనివారం

అసుర సంధ్య వేళ


అమరజీవి చిత్రం ..గుర్తుందా? ఆ చిత్రంలో..ఓ..వింత ప్రేమ కథ. ఆసాంతం అపార్ధాలతో..నడచి..ఆఖరికి ప్రేమించిన ప్రేయసి భర్తకి.. తన కళ్ళని దానం చేసి అమరజీవిగా నిలిచిన..ఓ..ప్రియుని కథ. చిత్రం కన్నా పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామీ "అనే పాట..నాకు బాగా నచ్చుతుంది. వేటూరి గారి .. సాహిత్యం ..చాలా ఇష్టంగా వింటాను.

ఈ పాట తరచూ కోరి మిగతా శ్రోతల వినబడని తిట్లు తింటూ ఉంటాను. ఎందుకంటే ఆరు నిమిషాల పైబడి ఉన్న పాటని ఆస్వాదించడం తెలియకుంటే..పరమ చిరాకు కల్గిస్తుంది. అర్ధమైన వారికి..ఒక రసస్వాదన.శ్రీవారికి ప్రేమలేఖ కన్నా ముందు వేటూరి గారి పద రచన .. ఓ..ప్రేమ లేఖ రూపంలో..ఈ పాట ముందు సాకీగా సాగుతుంది.

ఈ పాట ఒక వేదిక పై సాగుతూ..నాయికా నాయకుల ఊహా లోకంలో సాగుతున్నట్లు గుర్తు...ఉంది. ఒక వేళ ఏమైనా మార్పు ఉంటే.. తప్పని తప్పు సమాచారంకి..మన్నించ గలరు. . ఇక్కడ పాట నేపధ్యం కన్నా పాట సాహిత్యం,సంగీతం,భావం చెప్పదలచాను. ఈ పాట సాహిత్యం కూడా.. చాలా కష్టపడ్డా సేకరించలేక.. వింటూ..వ్రాసుకున్నాను. ఇది అంతా పాట పై మమకారమే! అదీ.. వేటూరి పాట పై..ప్రత్యేక మమకారం.

ఇక కథలో ..నాయకుడేమో.. విరాగి. ప్రేమ దోమ తెలియని సదాచార సన్యాసి. నాయిక ఏమో..అతని పై..ప్రేమ ని మక్కువగా పెంచుకుని సిగ్గు బిడియాలు విడిచి..అతనికి..తన ప్రేమని.మొహాన్ని,కోరికని..బాహాటంగా తెలియ జేస్తుంది. అతనేమో..కాదు పొమ్మంటాడు. తగదు..తగదు పాపం అంటాడు.
కావ్య లక్షణంతో..నాయికా నాయకుల మద్య జరిగిన ప్రేమ,శృంగార &వైరాగ్య భాషణంబులని.. పాటలో..చెప్పడం తెలుగు చిత్రాలలో..కొత్త కాకపోయినా.. ఈ పాట ఆసాంతం ఓ..కావ్యం చూస్తున్న భావాన్ని కల్గిస్తుంది అనడంలో ..సందేహం లేదు అనుకుంటాను.జంధ్యాల గారి దర్శకత్వంలో..ఈ చిత్రం రూపు దిద్దుకుంది. వేటూరి గారి కి..జంధ్యాల గారికి..ఆలోచనల సమతుల్యంలో..ఈ పాట..చూడ చక్కనిది. శ్రవణానంద కరమైనది కూడా.

పాట సాహిత్యం :

శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి పుంభావ భక్తి ..
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి,నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..
నీ పూజల కు పువ్వుగా, జపములకు మాలగా, పులకించి పూమాలగా..
గళమునను, స్వరమునను, ఉరమునను
ఇహములకు, పరములకు నీదాన నే !.
ధన్యనై ,జీవనవ దాన్యనై తరియించుదాన..
మన్నించవే..!మన్నించవే!! అని విన్న మించు నీ ప్రియ సేవిక ..
దేవ దేవి. .

అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామి..ఆడ ఉసురు తగల నీకు స్వామీ.! !
ముసురుకున్న మమతలతో..కొసరిన అపరాధమేమి ?
స్వామీ స్వామీ!
అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
మరులుకున్నకరిని వీడి మరలి ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవీ!

హరి హరి సుర జేష్ట్యాదులు ,కౌశిక వ్యాసాదులు
ఇగ తత్వములను దెలిపి, నియమ నిష్టలకి అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని ..నను కాదని ..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ..పడకు పెడ దారి (అసుర )

నశ్వరమది..నాటక మిది
నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసేవరకే... కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుని ముంగిట రంగ వల్లికని కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ!(అసుర)

అలిగే నట శ్రీ రంగం..తొలగే నట వైకుంటం
యాతన కేల దేహం ..ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము వీక్షణమే మరు తాహము
రంగా! రంగ రంగ శ్రీ రంగ !!
ఎటు ఓపను..ఎటులాపాను?
ఒకసారి.. అనుభవించు ఒడి చేరి..(అసుర)

ఎ పాటలో..జయ ప్రద గారు యెంత బాగా రొమాంటిక్ భావాలు ఒలికిన్చిందో.! అలాగే పాటలో.. సుశీల గారి..స్వరం ఎంత బాగా భావాలని అందించిందో.!! వినడమే తప్ప సంగీత జ్ఞానం లేని దాన్ని..వర్ణించలేను.
ఈ చిత్రం లో..మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి,(జయప్రద)ఓదార్పు కన్న చల్లనిది.. (సుమలత) పాటలు..
చాలా బాగుంటాయి.ఇక ఏ.యెన్ .ఆర్ గారి నటనా చాతుర్యం ని.. చెప్పడానికి మాటలే చాలవు.

ఇక పాట వినేయండీ!! అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామి

ఈ పాటలో నాకు ఇష్టమైన అంశాలు.. జయ ప్రద గారి నటన, వేటూరి గారి సాహిత్యం .సుశీల గారి గళం .. అంతా మధురం.
ఒక అజ్ఞాత మిత్రునికి కృతజ్ఞతలు. తప్పులు గానేను అందించిన సాహిత్యాన్ని సవరించించి నందులకు. మరీ మరీ కృతజ్ఞతలు..తో..ఈ పోస్ట్

5 కామెంట్‌లు:

ఆత్రేయ చెప్పారు...

విప్రనారాయణ కధకి కొంచం అనుకరణ ఉన్న ఆ సినిమా కధ లో
ఆ పాట కూడా రంగని భక్తుని, అయన మీద మనసుపడిన విరహిని నాయికల
మధ్య సరసోల్లాపంలా రాసినట్లు బాగుంటుంది.
అందరూ ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్ అంటూ ఉంటారు.
మీరు వైవిధ్యంగా భలే పాటలు పునశ్చరణ చేస్తున్నారు.

Unknown చెప్పారు...

chala baga rastunnaru.

మురళి చెప్పారు...

ఇదొకటీ, 'మల్లెపూల మారాణికీ..' ఒకటి.. భలే పాటలండీ..
ఆత్రేయగారూ.. మాంచి ఆసక్తికరమైన విషయం చెప్పారు మీరు...

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

అజ్ఞాత గార్కి..ధన్యవాదములు. సాహిత్యాన్ని సవరించాను. మరీ మరీ ధన్యవాదములు. స్పందించిన అందరకి ధన్యవాదములు.
ఆత్రేయ గారు..మీరు అందించిన విషయానికి ధన్యవాదములు. కొత్త ఒరవడి లోకి మారలేక మధురమైనవని గుర్తు చేసుకుంటూ..గుర్తు చేస్తూ..ఏదో.. ఇలా.. అండీ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

sailaa baala garu.. thanks..andee!
Murali gaaru.. meeku Thank you veru much.