7, నవంబర్ 2011, సోమవారం

ఎల్లలెరుగని మానవత్వం


మనిషి లోని మానవత్వం  మృ గ్యమవుతున్నది అని మనం కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు అనిపించక తప్పదు. ఇటీ వల కాలంలో.. నడుస్తున్న రైళ్ళలో కేవలం ఆడపిల్లలని అది పసి కందులని  నిర్దాక్షిన్యంగా వదిలి వెళ్లిన వార్తలని చూసాము. ఏ చీకటి తప్పులకో బలవంతంగా మోసి ఆనక  ఆ చీకట్లోనే మురుగు కాలువలు,చెత్తకుండీల పాల్జేసిన  తల్లులని చూస్తున్నాము.తల్లి తనం అనేది అపహాస్యం అవుతున్న తరుణంలో.. అమ్మతనానికి అర్ధం చెపుతున్న అనేక మాతృ మూర్తులని చూస్తున్నాం. అలాగే మథర్ బాటలో నడిచే ఒక స్త్రీ మూర్తి ని ఇక్కడ చూడండి. స్పూర్తివంతంగా ఉంది.వారు మనకి స్వయంగా తెలియకపోవచ్చు. కానీ వారి బాట స్పూర్తికరం కదా.. అందుకే ఈ విషయం అందరితో..పంచుకుంటూ..   



1 కామెంట్‌:

buddhamurali చెప్పారు...

లోకల్ పోలీసు లకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే కనీసం ఒకటి రెండు రోజులైనా గస్తీ ఏర్పాటు చేస్తారు. పూర్తిగా వదిలేయడం కన్నా అది కొంత నయం