22, నవంబర్ 2011, మంగళవారం

విషాదం - నిషాదం


విషాదం  - నిషాదం

జీవితం మొత్తాన్ని ..
ఓ..విషాద మేఘం కమ్మి వేసినా..
ఒకానొక హృదయ రాగాలాపనకి
మేఘం  కరిగి ప్రవహించి
ఆ హృదయాన్ని చిత్తడి చేస్తుంది. .

హృదయం ..మోడు రెండు ఒకటే !
అడ్డుగోడలని  బ్రద్దలించుకుని మొలకెత్త డానికో  ..
మోడుని చిగిర్చడానికో
తగిన సమయం రావాలంతే!జీవితం అంటే..ఓ..విషాదం ..ఓ..నిషాదం కదా!

2 వ్యాఖ్యలు:

subha చెప్పారు...

మేఘం కరిగి ప్రవహించి
ఆ హృదయాన్ని చిత్తడి చేస్తుంది.

ఈ ఒక్క మాటకే మది మబ్బుగా మారి వానై కురిసిందండీ..

Shabbu చెప్పారు...

వహ్ వా,,,,, క్యా బాత్ హై