3, నవంబర్ 2011, గురువారం

అందమైన అబద్దం అందరికి నచ్చుతుంది

అందమైన అబద్దం చాలా బాగుంటుంది. నిజ జీవితంలో అయితే ఏమిటి ..తెర పై ఏమిటీ..అబద్డంకి బోల్తా పడటం పెద్ద కష్టమేమి కాదు.

నేను ఒక పాట వింటూ.. ఆ పాట సాహిత్యాన్ని,సంగీతాన్ని ఆస్వాదిస్తూనే ..అబద్దం అంతా అబద్దం అనుకుంటూ ఉంటాను.

ఈ పాటలో.. ఆమెను అతడు .."రాధా! గుడిలో దేవుడిని ఏమి కోరుకున్నావ్? అని అడుగుతాడు..
అప్పుడు ఆమె చెప్పే సమాదానం .. అందరికి నచ్చుతుంది

ఈ .. పాట

నీ కౌగిలిలో తలదాచి ...
నీ చేతులలో కనుమూసి..
జన్మ జన్మకు జతగా మసలే
వరమే నన్ను పొందనీ.. (నీ కౌగిలిలో)

చల్లగా కాసే పాల వెన్నెల
నా మనసేదో వివరించు
అల్లరి చేసే ఓ..చిరు గాలి
నా కోరికనే వినిపించూ
నా కోవెలలో స్వామివి నీవై
వలపే దివ్వెగా వెలిగించు (నీ కౌగిలిలో )

అందుకు అతడి సమాధానం అంతా అబద్దం.. ఎందుకంటె హీరో గారు అప్పటికే వివాహితుడు ..ఓ..బిడ్డ తండ్రి కూడా.. అయినా కూడా ఏమంటున్నాడో చూడండీ !

నింగి సాక్షి నేల సాక్షి
నిను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన
నాలో నీవే సగ పాలు
వేడుకలోను వేదనలోను
పాలు తేనెగా ఉందాం ... (నీ కౌగిలో) ..

సరే ఇన్ని అబద్దాలు చెప్పి .. నా .. ఆ సినిమాని అభిమానించి ఆదరించి దిగ్విజయం చేసిన ప్రేక్షకులకి జోహార్లు అనుకుంటాను. "కార్తీక దీపం " చిత్రం ని నాకొక పదకొండు ఏళ్ళు అనుకుంటాను అప్పుడు అమ్మతో కలసి చూసి ..ఛీ నాకు ఈ సినిమా ఏం నచ్చలేదు అన్నాను అనుకుంటాను.

ఆడవాళ్ళ త్యాగాలు,సర్దుబాట్లు నిజ జీవితంలో కూడా తక్కువేం కాదు కదా.. అన్న అనుభవం వచ్చాక ఆ చిత్రం అసలు నచ్చదు. ఆ అందమైన అబద్దం కి "మైలవరపు గోపి "గారి సాహిత్యం యెంత అందంగా ఉంటుందో! భార్య భర్తల అనుబంధం అలా ఉండాలి కదా! అని అనిపిస్తుంది.

ఇక జానకమ్మ ,,ఆ పాట రికార్డింగ్ సమయంలో .. ఆమె భర్త గారు ప్రాణాపాయ స్థితిలో ఇంటెన్సివ్ కేర్ లో పడి ఉంటే..ఈ పాట రికార్డింగ్ కి హాజరయ్యి పాట పాడాల్సి రావడం .. ఆ సమయంలో ఆమె మానసిక స్థితి ..ఆ పాటకి జీవం పోశాయి..అని జానకమ్మ స్వయంగా చాలా సార్లు చెప్పుకున్నారు.

కొన్ని పాటలు కొన్నిసమయాలలో..జీవితాలకి అన్వయిన్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అన్నట్లు. ఇక ఈపాటలో బాలు గారి గళం ..అంటే నేను ఒప్పుకోను.శోభన్ బాబు స్వయంగా పాడినట్లు ఉంటుంది.అంతగా శోభన్ వాయిస్ ని ఒదిగింప జేసిన బాలు ఎవెర్ గ్రేట్.

పాటని చూడండీ!


ఇది నాకు నచ్చిన పాట..నచ్చని అంశం కూడా..

3 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

సత్యం గారి సంగీతం కదండీ.. ఈ పాట, "చిలకమ్మా పలికింది.." అన్న ఇంకో పాట ఇందులో నాకు బాగా నచ్చుతాయి.
రామకృష్ణ

జ్యోతిర్మయి చెప్పారు...

వనజగారూ మంచి పాటను గుర్తుచేశారు ధన్యవాదములు.

M. చెప్పారు...

ఆహా,,,, ఏమి పాట. . . . చాలా మంచి పాటని చాలా రోజుల తర్వాత గుర్తు చేసినారు. పాటలో సంగీతం కంటె ముందు వినిపించే సుశీల గారి గొంతు వినగానే,, చాలా ఆనందం కలిగింది. ఇంకో విషయం ఏమిటంటే ఈ పాట మీ బ్లాగ్ లో చూడగానే అది వింటూ మీకు ఈ కామెంట్ పెట్టా.. ఇంకో విషయం ఏమిటంటే ఈ పాట కుడా నాకు అప్పట్లో మీ ద్వారానే తెలుసుకున్నాను