23, నవంబర్ 2011, బుధవారం

అసలైన బహుమతి

హృదయపూర్వకమైన బహుమతిని నేను తొలిసారిగా  అందుకున్న రోజు..

నాకు లభించిన బహుమతి లోకెల్లా విలువైన బహుమతి అందుకున్న రోజుని నేను మరువలేను. అది అతి పేద బహుమతి..ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే అతి విలువైన బహుమతి.  ప్రపంచంలో  అతి ఖరీదైన బహుమతి... ఆత్మీయమైన బహుమతి.. అసలైన బహుమతి

అది ఏమంటే...

మా అబ్బాయి ఈ మధ్య ఇంటికి వచ్చినప్పుడు  నేను వంట ఇంట్లో వంట చేసుకుంటుంటే..సడన్గా వచ్చి.. ఇలా ..అచ్చు ఇలాగే  ప్రేమగా, ఆత్మీయంగా  అతి ఖరీదైన   బహుమతి..(ముద్దు)ప్రేమగా ఇస్తూ.. 

అంటూ.. ఇదిగో ఈ గిఫ్ట్ నీకోసం .. అమ్మా!..అంటూ నాచేతికి ఓ..గిఫ్ట్ ఇచ్చాడు. అక్కడే ఉన్న మా చెల్లి ఆసక్తిగా .. చిన్ని ! మీ అమ్మ కోసం  ఏం తెచ్చావ్? 
..నాకు చూపించు అంటూ వెంట బడినా ..సరే..
..సారీ..పిన్నీ! నీకు చూపించను..అమ్మకి ఇచ్చాక చూద్దువు కానీ,,అంటూ.. నాకు అరచేతిని తెరచి  ..ఆ  చేతిలో ఈ గిఫ్ట్  ఉంచాడు.. చాలా సంతోషంగా తీసి చూసాను.. 


ఎంతో..క్యూట్ గా ఉన్న రెండు చిన్ని చిన్ని హాన్గింగ్ పీసెస్. వాటి కున్న అనంతమైన అర్ధం..నాకు అర్ధమై.. (సంతోషమో..దుఃఖమో..తెలియదు. హార్ట్ వాష్ ) కన్నీళ్లు తో..  
నేను ఇలా.. 

నా సంతోషాన్ని ప్రకటించాను. 

ఆ బహుమతితో పాటు ఇంకా చాలా బహుమతులు తెచ్చినా సరే.. ఆ విలువైన బహుమతి ముందు ఇంకేది నాకు విలువైనది కాదు.  

ఇవన్నీ మా అబ్బాయి ఇచ్చిన బహుమతులే! 


ఒక తల్లికి ప్రేమ పూర్వకముగా బిడ్డ ఇచ్చే బహుమతికన్నా వేరొక విలువైన  బహుమతి ఉంటుందా? 

4 వ్యాఖ్యలు:

Raj చెప్పారు...

మీ అబ్బాయి ఇచ్చిన ఆ గిఫ్ట్స్ అన్నీ బాగున్నాయండీ.. అందునా ఆ టెడ్డీ లు అయితే మరీ సూపర్. నిజముగా చిన్నవి అయినా కొన్ని భలే ఆత్మీయత, అనురాగం నిండి ఉంటుందా అనిపిస్తుంది..

subha చెప్పారు...

Heart touching madam..

జ్యోతిర్మయి చెప్పారు...

మీ అబ్బాయి మీకు మొదటగా ఇచ్చిన బహుమతి నాకు తెగ నచ్చేసి౦ద౦డీ...

రసజ్ఞ చెప్పారు...

మన వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చే ఏ బహుమతయినా సరే అది మనకి ఎంతో ఆనందాన్నిస్తుంది కదా! బాగున్నాయండీ మీ బహుమతులు!